30, జూన్ 2011, గురువారం

మెగాస్టార్ చిత్రంలో బిగ్‌బి గెస్ట్ రోల్‌..?


ఇక‌పై పాలిటిక్స్‌లోనే కొన‌సాగుతాన‌ని సినిమాల‌కి దూరంగా ఉంటాన‌ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌క‌టించిన త‌ర్వాత అభిమానుల నిర‌స‌న‌ల‌తోనూ, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కోరిక‌తోనూ సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన చిరంజీవి. తాను సినిమా చేయాలంటే మీరొక స‌హాయం చేయాల‌ని బిగ్ బి అమితాబ్‌ని కోరారు.. అమితాబ్ ఏమిట‌ని..?  ప్ర‌శ్నించ‌గానే తాను న‌టించ‌బోయే చిత్రంలో మీరు గెస్ట్ రోల్ చేయాల‌ని చిరంజీవి బిగ్ బిని కోరా రు.. చిరంజీవి అన‌డం ఆల‌స్యం ఏమాత్రం సంకోచించ‌కుండా తాను న‌టించ‌డానికి సిద్ద‌మేన‌ని అమితాబ్ ఎంతో సంతోషంగా చెప్పారు. సో.. ఇప్పుడు చిరంజీవి కొత్త చిత్రానికి క‌థ‌ని రూపొందించే వారు అమితాబ్‌కి కూడా ఒక మంచి రోల్‌ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది.. అన్నీ కుదిరితే టాలీవుడ్ మెగాస్టార్‌, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ క‌ల‌యిక‌తో ఓ సంచ‌ల‌న తెలుగు చిత్రాన్ని మ‌నం చూస్తామ‌న్న‌మాట‌..!

ప్ర‌పంచంలోనే అతిపెద్ద పొడ‌వైన బ్రిడ్జి..!


 చైనాలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద పొడ‌వైన బ్రిడ్జి ప్రారంభ‌మైంది. మూడు ప్ర‌దేశాల‌ను క‌లుపుతూ వెళ్లే ఈ బ్రిడ్జి ఒక బ్రిడ్జి 26.1,  మైళ్ళ పొడ‌వుంటే మ‌రో బ్రిడ్జి 23.87 మైళ్ళ పొడ‌వుంది అంటే దాదాపు 38.42 కిలోమీట‌ర్ల పొడ‌వున్న ఈ సంయుక్త‌ బ్రిడ్జిని ఉత్త‌ర‌చైనాలోని జియాజౌ బే స‌ముద్రంపై ఈబ్రిడ్జిని నిర్మించారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద పొడ‌వైన బ్రిడ్జి త‌మ‌దేశంలో ఉండ‌టంతో చైనావాసులు తెగ సంబ‌ర‌ప‌డిపోతు న్నారు. ఈమ‌ధ్యే ఈ బ్రిడ్జిని ప్రారంభించి రాక‌పోక‌ల‌కు అనుమ‌తి నిచ్చారు. చుట్టూ ఉన్న స‌ముద్రాన్ని చూస్తు మ‌ధ్య‌లో బ్రిడ్జిమీద‌నుండి ర‌య్యుమ‌ని వెళుతుంటే అదొక అద్భుత‌మైన అనుభ‌వ‌మ‌ని చైనా వాసులు ఆనందంతో చెబుతున్నారు.

శృంగారం సుఖంగా సాగాలంటే..? పార్ట్ – 1


 శృంగారంలో సుగంధానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వాత్స్యాయనుడి కాలం నుంచీ ఇదే చెబుతూ వస్తున్నారు. శృంగార సమయంలో సుగంధానికి ఉన్న ప్రాముఖ్యాన్ని వాత్స్యాయనుడు గుర్తించాడు. తన కామసూత్రాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాడు. అప్పుడు ఆయన చెప్పిన సూత్రాలలో ముఖ్యమైనవి …
పడకగది సమీపంలో సువాసనలు వెదజల్లే పూల వృక్షాలను పెంచుకోవడం …
పడకగదిలో అత్తరు వంటి సుగంధ ద్రవ్యాలను అందుబాటులో ఉంచుకోవడం …
సరైనసమయంలో వాటినివాడి ఎదుటివారికి మత్తెక్కించి, మైమరిచేట్టు చేయడం …
ఇప్పటి సెక్సాలజిస్ట్ లూ చెప్పేదిదే. దీనినే ఇంకొంచెం విపులీకరిస్తూ ఏకంగా ఒక శాస్త్రమే వచ్చేసింది- “ఆరోమా థెరపీ’ పేరుతొ. ఆరోమా థెరపీలో సూచించిన ప్రకారం చేస్తే కొన్ని వ్యాధులను నయం చేయవచ్చునని చెబుతారు. వ్యాధులను నయం చేసే సంగతి ఎలా ఉన్నా, సెక్స్ సమయంలో మాత్రం ఒక దివ్యౌషధం వలే పనిచేస్తుందనే చెప్పాలి.

చిరంజీవి అభిమానుల‌కు శుభ‌వార్త‌..


 చిరంజీవి అభిమాల‌కు శుభ‌వార్త‌.. చిరంజీవి 150వ సినిమాలో న‌టించ‌బోతున్నారు.. అభిమానులు చేసిన స్వ‌చ్ఛంధ నిర‌స‌న‌కి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న త‌రుణంలో బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా చిరంజీవి సినిమా చేయాల‌ని కోర‌డంతో చిరంజీవి కాద‌న‌లేక‌పోయారు. వారి కోరిక‌ని మ‌న్నించి తాను సినిమా చేయ‌బో తున్నాన‌ని ప్ర‌క‌టించారు. దాంతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. పూరీ జ‌గ‌న్నాథ్‌, రాంగోపాల్‌వ‌ర్మ లాంటి మెగా డైరెక్ట‌ర్లు చిరంజీవి న‌టించ‌బోయే సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌ డానికి, ఆయ‌ న‌కి త‌గ్గ‌ట్టుగా క‌థ‌ని రెడీ చేయ‌డానికి అప్పుడే రెడీ అయిపోయారు. సో.. మ‌రి కొద్ది రోజుల్లోనే పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా చిరంజీవిని న్యూస్ టీవీల్లో కాకుండా మెగాస్టార్‌గా థియేట‌ర్లో చూడ‌బోతున్నాం.. బెస్టాఫ్ ల‌క్ మెగాస్టార్‌..

వైఎస్ బాట‌లోనే కిర‌ణ్‌కుమార్‌రెడ్డి..!


సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వివరాలును మీడియాతో పంచుకున్నారు. 14ఎఫ్ రద్దు కోసం కేంద్రానికి కోరామని ప్రకటించారు. దీంతో 14ఎఫ్ పై జరుగుతున్న రగడకు బ్రేకులు పడినట్లే. అలాగే తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుం టుందని, సరైన సమయంలో సరైన నిర్ణయం వస్తుందని సీఎం చెప్పుకొచ్చారు( గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం). తెలంగాణపై నిర్ణయానికి టైం వచ్చిందో లేదో కేంద్రమే చెప్తుందని చెప్పారు. త్వరలో జరుగబోతున్న దీక్షలపై ప్రశ్నించగా వాటిని వారు దీక్షలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని చెప్పారు. ఆరునెలలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను అలాగే ఈ సమస్యను కూడా ఎదుర్కొంటానని తెలిపారు. గతంలో వైఎస్ చేసిన మాదిరే కిరణ్ కూడా మాట్లాడారంటే తెలంగాణపై కేంద్రనిర్ణయంలో కొంతజాప్యం తప్పదన్నట్లుగా కనిపిస్తోంది.

`వాన’ముగ్గు..!వానాకాలం వచ్చేసింది. వచ్చినట్టే వచ్చిన రుతుపవనాలు వెనక్కి మళ్ళాయి. అసలు తొలకరి జల్లులు పడు తుంటే ఎవరి మనసు పులకరించదు చెప్పండి. ఓ ఔత్సాహిక పొటోగ్రాపర్ కెమేరా క్లిక్ మంది. వానజల్లులు ఆకాశం నుంచి భూమిమీద పడినవేళ అతను ఈ ఫోటో తీశాడు. ఫ్రింట్ తీసి చూసేసరికి `వాన’ ముగ్గులా కని పించింది. దేవుడు పెట్టిన చుక్కలను కలుపుతూ వానదేవుడు వేసిన ముగ్గు ఇది. వానాకాలంలో సంక్రాంతి శోభను తీసుకొచ్చిన వరుణుడికి ఇవే వందనాలు.


- తుర్లపాటి

భానుకి క‌ళ్యాణ్ ట‌చ్‌లోనే ఉన్నాడు..!


సి. క‌ళ్యాణ్‌, సినీ నిర్మాత‌గా అంద‌రికీ తెలిసిందే.. చిన్న నిర్మాత‌గా ప్రారంభ‌మ‌యిన ఆయ‌న కెరీర్ పెద్ద పెద్ద చిత్రాల‌ను తీసే స్థాయికి ఎదిగారు. ఆయ‌న ఎదుగుద‌ల కొంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. మ‌రి కొంద‌రికి అవ‌మానాన్ని క‌లిగించింది. అయితే సినిమా నిర్మాత‌గా, ఫైనాన్సియ‌ర్‌గా అదృష్టం వ‌రిస్తే ఎంత‌యినా ఎదిగే ఛాన్స్ ఈ ఫీల్డ్‌లో ఉన్నాయి కాబ‌ట్టి ఆయ‌న‌కి, మాఫియాకి లింక్ ఉంద‌న్న కోణంలో ఎవ‌రూ ఆలోచించ‌లేదు. అయితే అనూహ్యంగా సూరి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడ‌యిన భానుకి, క‌ళ్యాణ్‌కి చాలా ద‌గ్గ‌రి సంబంధా లున్నాయ‌ని తెలిసిన టాలీవుడ్ జ‌నం విస్తుపోయారు. ఆయ‌న ఎదుగుద‌ల వెనుక భాను ప్ర‌ధాన పాత్ర పోషించాడ‌ని, కొన్ని భూ సెటిల్‌మెంట్ల‌లో భాను స‌హాయంతో కోట్లాది రూపాయ‌ల‌ని క‌ళ్యాణ్ వెన‌కేసు కున్నాడ‌ని సాక్ష్యాధారాల‌తో స‌హా దొర‌క‌డం, అలాగే కొంద‌రు సినిమా వాళ్ల‌ని కూడా భానుతో బిదిరించ‌డం లాంటి ఆరోప‌ణ‌ల‌తో క‌ళ్యాణ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే క‌ళ్యాణ్‌కి, భానుకి ప్ర‌తి రోజూ కాంటాక్ట్ జ‌రుగుతుంద‌ని.. క‌ళ్యాణ్ భాను అక్కౌంట్లోకి డ‌బ్బులు కూడా ఆన్‌లైన్ ద్వారా పంపించాడ‌ని తెలియ‌డంతో క‌ళ్యాణ్‌పై ఉచ్చు మ‌రింత బిగుసుకుంటుంది.. క‌ళ్యాణ్ ద్వారా భాను ఆచూకి దొరికే అవ‌కాశాలు ఉండ‌డంతో క‌ళ్యాణ్‌ని త‌మ చేతిలోనుండి జారిపోకుండా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటున్నారు పోలీసులు. క‌ళ్యాణ్ లాగానే మ‌రో ప్ర‌ముఖ (?) నిర్మాత సింగ‌న‌మ‌ల ర‌మేష్ కూడా పోలీసు క‌స్ట‌డిలో ఉండ‌డం తెలిసిందే..మ‌రి వీరిద్ద‌రి భ‌విష్య‌త్తు ఏమిట‌న్న‌ది తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు ఆగాల్సిందే..!

ఈ హీరోల‌ క్రేజీ ప‌డిపోయిందా..?


ఒకప్పుడు క్రేజ్ ఉన్న తారలకు ఇప్పుడు అసలు డిమాండు ఉండకపోవడంతో వారు నటించిన సినిమాలను పంపిణీ చేయాలంటేనే పంపిణీదారులు భయపడుతున్నారట. ఈజాబితాలో పలువురు ప్రముఖ నటులు చేరడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో కొత్తవారితోకాని, పాత నటులలో ప్రేక్షకు లను ఆకర్షించే శక్తి కోల్పోయా రని భావిస్తున్నవారితో కాని సినిమా తీయాలంటేనే నిర్మాతలు అంతగా సుముఖత చూపడం లేదట. దీనిపై వస్తున్న కధనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి టాలివుడ్ లో టాప్ ఫైవ్ స్టార్స్ కే మార్కెట్ ఉంటోం దని సిని విశ్లేషకులు కధనాలు ఇస్తున్నారు. ప్రస్తుతం అంతగా గిరాకి లేని నటులలో శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, తరుణ్, నాని, తనిష్, ఆకాష్, నవదీప్, ఆర్యన్ రాజేష్, శివాజి, కృష్ణుడు, రాజ, నిఖిల్ వంటి నటులతో సినిమాలు తీయడానికి నిర్మాతలు వెనుకాడుతున్నారట.స్టార్ స్టేటస్ లేని నటులతో సినిమా తీస్తే, ఆ సినిమా ఆడడం కష్టం అవుతోందని, జనాన్ని హాళ్లకు రప్పించడానికి అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని ప్రముఖ పంపిణీదారుడు, పుల్లారెడ్డి చెబుతున్నారు.మరో నిర్మాత , డైరెక్టర్ సిద్దార్ధ ఈ వాదనతో అంగీక రిస్తూ, సినిమాలను ప్రసారం చేసే టెలివిజన్ ఛానళ్లు ,కాని విదేశాలలోని కొనుగోలు దారులు కాని మొదటి ఐదు స్థానాలలో ఉండే స్టార్స్ నటించిన సినిమాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నాయని చెప్పా రు.అయితే అలా మొదలైంది సినిమా సక్సె స్ అవడంతో కొందరు చిన్న బడ్జెట్ సినిమాలను తీయడానికి ముందుకు వస్తున్నారు. కాని ఇది చాలా కష్టంతో కూడుకున్నదని, జాగ్రత్తగా సినిమా తీయాల్సి ఉంటుం దని, ఆ సినిమా నిర్మాత దామోదర ప్రసాద్ అంటున్నారు.మారిపోతున్న అభిరుచులు, అలాగే పరిస్థితులు నటులకు కూడా పెద్ద పరీక్షగానే మిగులుతున్నాయి.

రాజమండ్రిలో కామపిశాచులు


ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, బాలికలపై దాడులు,మానభంగాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మీడియా మహిమో..మహిళలే ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు తెచ్చి పోరాడుతున్నారో తెలియదు కానీ మొత్తానికి రాష్ట్రంలో ఇలాంటి కేసులు ఎక్కువగా బయ టకు వచ్చి కిరాతకులకు శిక్షలు పడుతున్నాయనే చెప్పుకోవాలి. ఇవాళ కూడా ఓ తొమ్మిదేళ్లబాలికపై రాజ మండ్రి రైల్వేస్టేషన్ కు సమీపంలో నలుగురు యువకులు రేప్ చేశారు. పట్టపగలే చుట్టుపక్కల జనం చూస్తుం డగా జరిగిన చర్య. స్థానికులు వచ్చి ఆ కామపిశాచులను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అందు లో ఒకరు పట్టుబడగా, మిగతా ముగ్గురు పరార్ అయ్యారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో కూడా ఉదయం బిటెక్ విద్యార్థిని రుపా ప్రేమోన్మాది వేధింపులు తాళలేక సూసైడ్ నోట్ రాసి కిరోసిన్ పోసుకొని ఆత్మ హత్య చేసుకుంది. అయితే ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఈమధ్య ఈ ప్రాంతం.. ఆ ప్రాంత మని కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుండటంతో దీనిపై అన్నిపక్షాలు స్పందించాల్సినవసరం ఉంది. కామాంధుల బారినుంచి మహిళలు, బాలికలను కాపాడాల్సినవసరం ఉంది.

పోలీస్ ప్రతిష్ట మరింత పెంచుతా-దినేష్ రెడ్డి


పోలీసు శాఖ ఔన్నత్యాన్నిపెంచుతానని కొత్త గా డిజిపిగా నియమి తులైన దినేష్ రెడ్డి అన్నారు.తనను డిజిపిగా నియమిం చడంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞత లు తెలిపారు.తాను చిత్తశుద్దితో పని చేస్తానని, పేదవాడికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నా రు. ముఖ్యమంత్రి ఆశించిన అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన అన్నారు. పోలీసు శాఖలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు ఒక ప్రత్యేకత ఉందని,దానిని కాపాడతానని,పోలీసు శాఖ పతాకం మరింత పైకి ఎగిరేలా దోహదపడతానని దినేష్ రెడ్డి తెలిపారు. దినేష్ రెడ్డి డిజిపి కాగానే పలువురుఆయనకు శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనోభావాలపై సంక్షిప్తంగా వ్యాఖ్యలు చేశారు.

అజాద్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా..?


కేంద్రంలో హోం మంత్రి బాద్యతలనుంచి చిదంబరం ను తప్పిస్తారా? కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అనేక మార్పులు,చేర్పులు చోటు చేసుకుంటాయని కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.ప్రత్యేకించి హోం మంత్రి చిదంబరం ను ఆ శాఖ నుంచి తప్పించవచ్చని, కొత్త హోం శాఖ మంత్రిగా గులాం నబీ అజాద్ ను నియమించవచ్చని కదనాలు వస్తున్నాయి. అయితే మరో కధనం ప్రకారం కీలకమైన వ్యక్తుల శాఖలె వ్వరీ మారబోవని చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రిగాఅజాద్ ను నియమించడంలో ఒక ప్రత్యేకత ఉందని, ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఇలాంటి సమయంలో ఆయనకు హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తే మరింత ప్రయోజనం ఉంటుందన్నది కొందరి వాదన. అలాగే కాశ్మీర్ లో ఉగ్రవాద సమస్య ఇటీవలికాలంలో తగ్గుముఖం పట్టడం కూడా కాస్త ఆశాజనక వాతావరణంగా ఉంది. దానిని మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి అజాద్ ఉపయోగపడవచ్చు. చత్తీస్ గడ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో ఉన్న నక్సల్స్ సమస్య తీవ్రతను తగ్గించడానికి కూడా అజాద్ సేవలను వాడుకోవాలన్నది పార్టీ ఉద్దేశంగా చెబుతున్నారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటివాటిలో, కొన్ని కార్పొరేట్ కంపెనీలకు చిదంబరం అనుకూలంగా ఉంటారన్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని కూడా మార్పులు చేర్పులు చేయవచ్చన్న కధనాలు వస్తున్నాయి. కాగా అసలు అజాద్ సేవలన్నిటిని పార్టీకి ఉపయోగించు కోవాలని,ఆంధ్రప్రదేశ్ తో సహా నాలుగైదు రాష్ట్రాల బాధ్యతలను ఆయనకు అప్పగించి పార్టీ పరిస్థితిని మెరు గుపర్చాలని పార్టీ వర్గాలు వాదిస్తున్నాయని అంటున్నారు.ఒక వేళ చిదంబరం ను హోం శాఖ నుంచి మార్చితే విదేశీ వ్యవహారాల శాఖ అప్పగించవ్చన్న ప్రచారం జరుగుతోంది.

నో నీడ్ పాలిటిక్స్‌


అని అంటున్నారు డిజిపిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అర‌వింద‌రావు..  తాను రాజకీయాలలోకి రాబోనని గురువారం పదవీ విరమణ చేసిన పోలీస్ డైరెక్టర్ జనరల్ కె.అరవిందరావు చెప్పారు.అయితే పోలీసు శాఖకు తన సేవలు అందించడానికి సదా సిద్దంగా ఉంటానని ఆయన అన్నారు. కరణం కుటుంబంలో పుట్టిన తనను అదే వృత్తిలో చేరాలని కుటుంబ సభ్యులు కోరేవారని, కాని తాను ఎమ్.ఎ. చదవడంతో ఫ్రొఫెసర్ కావాలని అనుకున్నానని, కాని ఒక లెక్చరర్ సలహాతో ఐఎ ఎస్,ఐపిఎస్ పరీక్షలకు తయారయ్యి రాశానని , అందులో ఎంపిక అయ్యాయని అన్నారు. రాజశేఖరరెడ్డి దగ్గర పనిచేయడం గురించి అడిగితే, తెల్లవారు జామున రమ్మనడం వంటివి ఆయన దగ్గర లేదని, ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వెళితే సరిపోయేదని, ఆయన కంఫర్ట్ బుల్ గా ఉండి, తమను కంఫర్ట్ గా ఉంచేవారని, ఆయన తన పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్లే అనిపిచే దని ఆయన చెప్పారు.ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులలో ఉద్రిక్త వాతావరణం ఏమీ లేదని మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తున్నదని, అక్కడ గ్రామాలలో ఎవరూ ఇబ్బంది పడడం లేదని అరవిందరావు అన్నారు. తుపాకి తో రాజ్యం వస్తుందనుకోవడం సరికాదని ఆయన చెప్పారు.ముప్పైనాలుగేళ్లపాటు పోలీసు శాఖకు సేవలం దించిన అరవిందరావును చత్తీస్ గడ్ రాష్ట్రంలో నక్సల్స్ సమస్యను అంతం చేయడానికి సలహాదారుగా తీసు కోవచ్చని చెబుతున్నారు.కొందరు డిజిపిలు రిటైరయ్యాక రాజీకీయాలలోకి వచ్చారు. కాని అంతగా రాణించలేకపోయారు.ఉదాహరణకు పేర్వారం రాములు డిజిపిగా పనిచేసి ఆ తర్వాత ఎపిపిఎస్ సి ఛైర్మన్ గా కొంత కాలం ఉన్నారు. తర్వాత టిడిపిలో చేరినా పెద్దగా రాణించలేదు. మరో డిజిపి స్వరణ్ జిత్ సేన్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేదు కాని సోనియాగాంధీ కుటుంబంతో ఉన్నఅనుబంధం రీత్యా ఈశాన్య రాష్ట్రా లకు సంబంధించి భద్రత సలహాదారుగా పదవి సంపాదించుకున్నారు. అంతకుముందు మరో డిజిపి పి.ఎస్. రామ్మోహనరావు లాబియింగ్ చేసుకుని తమిళనాడు గవర్నర్ పదవి తెచ్చుకున్నారు .కాని పూర్తికాలం ఉండలేకపోయారు.మొత్త మీద రాష్ట్ర ప్రభుత్వంలో మిగిలిన పదవులకన్నా డిజిపి పదవి చేసినవారికి ఇతర అవకాశాలు హెచ్చుగానే ఉంటాయి.

రాష్ట్ర డిజిపిగా దినేష్‌రెడ్డి..!విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్న దినేష్‌రెడ్డిని రాష్ట్ర‌ప్ర‌భుత్వం డిజిపిగా నియ‌ మించింది. ఈయ‌న 1973 బ్యాచ్ ఐ.పి.ఎస్‌.ఆఫీస‌ర్‌.
నేడు డిజిపి అర‌వింద‌రావు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డంతో నెక్ట్స్ డిజిపి ఎవ‌రా అన్న‌ది స‌స్పెన్స్‌గా మారింది. అయితే ఎక్కువ‌గా కె.ఆర్‌.నంద‌న్ పేరు వినిపిస్తుంది. సీనియ‌ర్ కేట‌గిరీలో చూస్తే కె.ఆర్‌. నంద‌న్ డిజిపిగా అర్హుడు అవుతారు. అయితే ఆయ‌న డి.జి.పి.గా కొన‌సాగ‌డానికి సుముఖంగా లేన‌ని లిఖిత‌పూర్వ‌కంగా ప్ర‌భుత్వానికి ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం డి.జి.పి. కోసం మ‌రి కొన్ని పేర్త‌ని కూడా ప‌రిశీలిస్తుంది. మొత్తం అయిదు మంది అధికారుల‌ని డి.జి.పి. పోస్ట్ కోసం ప‌రిశీల‌న‌లో తీసుకుంది. ఇందులో సీనియార్టి ప్ర‌కారం కె.ఆర్‌. నంద‌న్ త‌ర్వాత గౌత‌మ్ కుమార్‌, ఉమేష్‌కుమార్‌, దినేష్‌రెడ్డి, శివశంక‌ర్ల పేర్తు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అయితే దినేష్‌రెడ్డికి ప్ర‌భుత్వ పెద్ద‌ల అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉండ‌టం, ప్ర‌భుత్వ విధేయుడిగా కూడా దినేష్‌రెడ్డి మెదులుతాడ‌న్న న‌మ్మ‌కం ఉండ‌టంతో ప్ర‌భుత్వం దినేష్‌రెడ్డిపై మొగ్గు చూపుతుంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి సి.ఎం. రాష్ట్ర డి.జి.పి.గా దినేష్‌రెడ్డిని నియ‌మించారు.

టి.కాంగ్రస్ ఎమ్.పిల అసలు రంగు ఇదా!

కాంగ్రెస్ తెలంగాణ ఎమ్.పిలు కొందరి అసలు రంగు బయటపడుతోంది.  విజయవాడ ఎమ్.పి. లగడపాటి రాజగోపాల్ పై విమర్శలకు ఉత్సాహపడే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పి లు కొందరు ఇప్పుడు తెలంగాణ కోసం రాజీనామాలు చేయబోమని అంటున్నారు. మల్కాజిగిరి ఎమ్.పి సర్వే సత్యనారాయణ గతంలో లగడపాటి రాజగోపాల్ అవుపాలు, గేదెపాలు అన్నందుకు పెద్ద వివాదం సృష్టించారు. ప్రెస్ క్లబ్ లో ఆయనకు వ్యతిరేకంగా ధర్నా కూడా చేశారు. ఆ తర్వాత రాజీ పడ్డారు అది వేరే విషయం. తెలంగాణ కోసం ఏమైనా చేస్తామని ఇంతకాల చెబుతూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణ సమస్య ఒక కీలకమైన ఘట్టానికి చేరుకున్న తరుణంలో దాటవేత ప్రకటనలు చేస్తున్నారు. ఒకపక్కన హైదరాబా దులో తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె.చంద్రశేఖరరావు మంత్రి జానారెడ్డి ఇంటి వద్ద కు వెళ్లి గంటల తరబడి చర్చలు జరుపుతూ రాజీనామాలపై రాయబారం చేస్తుంటే , సర్వే సత్యనారాయణ ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేస్తూ తాను ఎమ్.పి పదవికి రాజీనామా చేయబోవడం లేదని ప్రకటించారు. పైగా డిసెంబరు తొమ్మిది నాటికి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెబుతున్నారు. మరో ఎమ్.పి పొన్నం ప్రభాకర్ 14ఎఫ్ రద్దుపై ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు.తెలంగాణకు ముఖ్యమంత్రి సహకరించాలని అన్నారు. పొన్నం ప్రభాకర్ కు తెలియదా సి.ఎమ్. సహకరించేది లేనిది.ఇక తెలంగాణ అంశంలో మరో తీవ్రవాద ఎమ్.పిగా పేరొందిన మందా జగన్నాధం తమకు ఎవరు డెడ్ లైన్లు పెట్టరాదని, తాము త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. సర్వే సత్యనారాయణ మరో మాట కూడా అన్నారు. మరో సినీయర్ నాయకుడు వి.హనుమంతరావు కూడా రాజీనామాలకు వ్యతిరేకంగా ప్రకటన చేశారు.టిఆర్ఎస్ రాజీనామాల వల్ల తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ఎమ్.పి విజయశాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల రాజీనామాల కోసం కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు రాజీనామాలు చేసేలా లేరని మెదక్ ఎమ్.పి విజయశాంతి అన్నారు. రాబోయే రోజులలో కాబోయే మంత్రులుగా ఊహించికుంటున్న కొందరు, ఇతర కారణాలతో కొందరు గతంలో ఏమి చెప్పినా ఇప్పుడు మాత్రం తమ వైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. అయితే ఒత్తిడి పెరిగితే ఏమి చేస్తారో!

29, జూన్ 2011, బుధవారం

చిరంజీవికి మంత్రి ప‌ద‌వి ద‌క్కునా..?

ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత చిరంజీవికి కాంగ్రెసులో ఉన్నత స్థానం లభిస్తుందని ఆశించారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని కూడా భావించారు. అయితే, మంత్రి పదవి కోసం కొంత కాలం ఆగాల్సిందేనని ఎఐసిసి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పదవి కోసం అక్టోబర్ దాకా ఆగాల్సిందే నని చెబుతున్నారు. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికీ చోటు లభించకపోవచ్చునని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతోందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిర్ధరిం చారు. బుధవారం తన నివాసంలో సంపాదకుల బృందంతో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. తెలంగాణ, వైయస్ జగన్‌ను నిలువరించడం అనే రెండు అంశాలపై దృష్టి పెట్టినందున రాష్ట్రం నుంచి ఇప్పుడు ఎవరినీ మంత్రివర్గంలోకి తీసుకోకపోవడమే మంచిదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
పునర్వ్య వస్థీకరణ ఎప్పటిలోగా పూర్తవుతుందని ప్రశ్నించినప్పుడు ”నేను ఊహించలేను” అని సమాధానమి చ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో జులై నెల లోనే  పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని సంపాదకులు భావిస్తున్నారు. పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పు లు ఉండవని కూడా చెబుతున్నారు. ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ఒకటి కంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వారికి భారం తగ్గించి, వారి అదనపు శాఖకు కొత్తగా మంత్రిని నియమిస్తారని చెబుతున్నారు. ఏఐసీసీ వర్గాలు మాత్రం మంత్రివర్గం నుంచి కొందరిని తొలగించవచ్చని అంటున్నాయి.
మంత్రిపదవి కోల్పోయే వారిలో డి.కె.హండిక్‌, మురళీదేవ్‌రా, కాంతిలాల్‌ భూరియాలు ఉండొచ్చని చెబుతున్నాయి. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారిస్తారని భావిస్తున్నారు. మంత్రిగా స్వతంత్ర బాధ్యతలు నిర్వహిస్తున్న బేణీ ప్రసార్‌ వర్మకు పూర్తిస్థాయి కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి లభించే అవకాశం ఉంది. అలాగే సినీనటుడు రాజ్‌బబ్బర్‌కు తొలిసారి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కవచ్చంటున్నారు.

ఓ పోలీసోడో.. నా ప్ర‌శ్న‌కి జ‌వాబు జెప్పు..!


ఓ పోలీసోడో.. నా ప్ర‌శ్న‌కి జ‌వాబు జెప్పు..! అంటూ గ‌ద్ద‌ర్ సూటిగా డిజిపి అర‌వింద‌రావుకు ఓ ప్ర‌శ్న సంధిస్తున్నారు. నేడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న డిజిపి అర‌వింద‌రావుకి గ‌ద్ద‌ర్ ఒక సూటి ప్ర‌శ్న‌ని సంధించారు. త‌న‌పై హ‌త్యా య‌త్నం జ‌రిగి ప‌ద్నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయినా త‌నపై హ‌త్యాహ‌త్నం చేసిన‌టువంటి హంతుకులెవ‌రో ఇప్ప‌టి వ‌ర‌కూ తెలియ‌ద‌ని, నాపై హ‌త్యాయ‌త్నం జ‌రిపిన‌పుడు అర‌వింద‌రావు గ్రేహౌండ్స్ ఐజి ఆఫీస‌ర్‌గా ఉన్నా ర‌ని, త‌న‌పై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది ఖ‌చ్చితంగా పోలీసులేన‌ని, అర‌వింద‌రావు నేతృత్వంలోనే కోబ్రా పేరు ని పెట్టుకుని త‌న‌పై పోలీసులే హ‌త్య‌కి పాల్ప‌డ్డార‌ని గ‌ద్ద‌ర్ ఆరోపిస్తున్నాడు.. మ‌రి గ‌ద్ద‌ర్ ఆరోప‌ణ‌ల‌ని నేడు డిఐజిగా ప‌ద‌వీవిర‌మ‌ణ చేయ‌నున్న డిజిపి అర‌వింద‌రావు ఎలా స్పందిస్తారో చూడాలి..

ఫలించని కెసిఆర్ రాయబారం..!

పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ఐదు గంటల సేపు చర్చలు జరిపినా అవి ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికిప్పుడు చెప్పేది లేదని కెసిఆర్ ఆ తర్వాత మీడియాతో ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారు.దీంతో చర్చలలో ఒక అవగాహనకు రాలేకపోయారేమో నన్న భావన కలుగుతుంది. ప్రధానంగా కెసిఆర్ కాంగ్రెస్ నేతల రాజీనామల కోసం పట్టుబట్టినా దానిపై కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కేశవరావు, సుఖేందర్ రెడ్డి, వివేక్ తదితరులు తమ బాధలు చెప్పినట్లు కనిపిస్తుంది. తప్ప నేరుగా రాజీనామా చేయడానికి ఇంకా సిద్దపడకపోవడంతో ఆయన వెనుదిరిగారన్న ప్రచారం జరుగుతోంది.కాగా జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తమ పాత్ర, తదితర అంశాలపై మాట్లాడుకున్నామని అన్నారు. కాంగ్రెస్ నాయకులంతా చర్చించి తమ కార్యక్రమాన్ని నిర్వహించుకునే పనిలో ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ నేతల సమావేశం తర్వాత మళ్లీ మాట్లాడుకుందా మని అన్నారు. కేశవరావు జోక్యం చేసుకుంటూ తమది రాజీలేని పోరాటమని అన్నారు. ఎవరి సహకారం అయినా తీసుకోవాలని అనుకున్నాం . అందరు కలిసి పోరాటం చేయాలని అనుకుంటున్నాం. అందుకే కెసిఆర్ తో మాట్లాడుకున్నామని అన్నారు. రాజీనామాల గురించి అడిగినప్పుడు ఆయన ఆ సంగతి తప్ప మిగిలిన విషయాలు మాట్లాడారు.తెలంగాణపై అధిష్టానంఅనునిత్యం ఆలోచిస్తున్నదని , తమ కార్యక్రమాల ద్వారా కూడా ఆలోచింప చేస్తున్నామని జానారెడ్డి చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక లో ఉన్నఅంశాలలో దేనివైపు మొగ్గు చూపే అవకాశం ఉదన్నదానిపై చర్చించేందుకే కెసిఆర్ వచ్చారన్నారు.అధిష్టానం పెద్దలతో కలిసి మాట్లాడవలసిన అవసరం ఉందని జానారెడ్డి తెలిపారు.

ఒక గుండు, ఒక గ‌డ్డం క‌థ‌..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కిరణ్ కుమార్ రెడ్డి గుండు కొట్టించుకున్నారని, అలాగే తిరగడం లోఉద్దేశం జనం ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడానికేనని చంద్రబాబు అన్నారు. కొద్దికాలం క్రితం తిరుమల ఆలయాన్ని సందర్శించి కిరణ్ కుమార్ రెడ్డి తలనీలాలు సమర్పించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించుకుంటే ఇలా మాట్లాడతారా? అని పిసిసి అదికార ప్రతినిది తులసిరెడ్డి విమర్శించారు. కిరణ్ గుండు గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు తన పిల్లిగడ్డం గురించి ఏమి చెబుతారని ఆయన ప్రశ్నించారు. కాగా చంద్రబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి డిమాండు చేశారు.చంద్రబాబునాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే బాగుంటుంది.

సిధ్దార్థ్‌ పై ఎల‌క్ట్రానిక్ మీడియా ఫిర్యాదు


ప్రముఖ సినీ హీరో సిద్దార్ద కొద్ది రోజుల క్రితం మీడియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.,వీటిపై ఎలక్ట్రానిక్ మీడియా కు చెందిన ప్రతినిధులు తీవ్ర ఆక్షేపణ చెప్పడమేకాకుండా, ఆయనపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియే షన్ కు కూడా ఫిర్యాదు చేశారు.సిద్దార్ధ్ ట్విట్టర్ లో చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూస్ ఛానల్స్ దర్డ్ గ్రేడ్ గా మారాయని, ఒక గంటసేపు టవీని నడపడం కోసం తమ కుటుంబ సభ్యులకు కూడా అమ్ముకుంటారని, చెత్తచెదారం చూపిస్తారని, అబద్దాలు ప్రసారం చేస్తారని వ్యాఖ్యానించారు. మీడియాను ఉద్దేశించి ఆయన తొలిసారిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో కూడా ఇలాగే మాట్లాడి తమ మనో భావాలను గాయపరిచారని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.తద్వారా మీడియా గౌరవాన్ని వ్యక్తులుగా తమ వృత్తి గౌరవానికి ఆయన భంగం కలిగిస్తున్నారని మీడియా ప్రతినిదుల తరపున సంఘం ఉపాద్యక్షుడు లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై సిద్దారమీద ఫిర్యాదు చేస్తూ ఎపి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలికి కూడా ఫిర్యాదు చేశామన్నారు.దీనిని పరిశీలిస్తున్నామని నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ చెప్పారు.సిద్దార్ధ మీడియాకు క్షమాఫణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు.కాగా ఈ ఫిర్యాదును నిర్మాత దిల్ రాజుకు కూడా పంపించారు. వచ్చే సినిమాను దిల్ రాజు సిద్దార్ధతో తీస్తున్నారు. మరి దిల్ రాజు ఈయనకు క్షమాపణ చెప్పమని సలహా ఇస్తారా?

నిర్మాత సి.కళ్యాణ్ అరెస్ట్


ప్రముఖనిర్మాత సి.కళ్యాణ్ పోలీసులకు దొరికిపోయారు. మద్రాస్ లోనే కళ్యాణ్ కూడా పోలీసులకు చిక్కడం విశేషం. మూడ్రోజులక్రితం అరెస్టయిన శింగనమలరమేష్ ఇచ్చినసమాచారం మేరకు సి.కళ్యాణ్ ను సిఐడి పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలొస్తున్నాయి.
షాలిమర్,యూనివర్శల్ వీడియోస్ సంస్థలను బెదిరించినకేసులో సి.కళ్యాణ్ నిందితుడు. ఇతనుకు కూడా భానుతో సంబంధాలున్నాయన్న కథనాలు నేపథ్యంలో సూరిహత్యకేసు త్వరలోనే ఓకొలిక్కి వచ్చే అవకాశా లున్నాయని పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇతన్ని కూడా రేపు హైదరాబాద్ తరలించి,సిఐడి విచారణ చేసే అవకాశముంది. సి.కళ్యాణ్ కూడా ముందస్తుబెయిల్ కు అప్లై చేసుకున్నా కోర్టు తిరస్క రించిన నేపథ్యంలో ఇతను పోలీసులకు దొరికిపోవడం

జ‌గ‌న్ వర్గంపై వేటు లేన‌ట్టేనా..?


జగన్‌ వర్గ ఎమ్మెల్యేల పై వేటు వేసేందుకు కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.పీసీసీ పగ్గాలు చేపట్టాక   బొత్స కొంత హడావిడి చేసినా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  ఆజాద్ జోక్యం తో వెనక్కి తగ్గారు.కొంత కాలం పాటు చూసి చూడనట్టు  వ్యవహరించాలని ఆజాద్ చెప్పినట్టు సమాచారం .తొందర పడి జగన్ వర్గ ఎమ్మెల్యేల పై వేటు వేస్తె ఉపఎన్నికలు వస్తాయని , ఆ ఎన్నికల్లో గెలవక పోతే పరువు పోతుందని అధిష్టానం మధనపడుతోంది . ఒక రకంగా చెప్పాలంటే అధిష్ఠానం పరిస్థితి అడకత్తెరలో  పోకచెక్కలా తయారైంది . ఇదిలా వుంటే  ఆజాద్ ఎలాగైనా  జగన్ ను బుజ్జ్జగించి  మళ్ళీ కాంగ్రెస్ లోకి  తీసుకొచ్చేయత్నాల్లో వున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది .అందుకే  చర్యల విషయం లో వ్యూహాత్మకం గా  పార్టీ వెనకడుగు వేసిందని అంటున్నారు.  ఈ నేపధ్యం లో ఇప్పట్లో జగన్ వర్గ ఎమ్మెల్యే లపై చర్యలేవీ ఉండవని అంటున్నారు.

షిఫ్టుల వారీగా ముఖ్యమంత్రులు

తెలుగుదేశం నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లో ఛమత్కారం చాలా ఉంది.చిరంజీవి తనను ప్రజలు ముఖ్య మంత్రిగా నిజజీవితంలో చూడాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించడంపై రేవంత్ స్పందించారు. రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులను పెట్టుకుంటే బెటర్ అని వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి ముగ్గురు మూడు ఎనిమిది గంటల చొప్పున ముఖ్యమంత్రి పదవి నిర్వహిం చడం ద్వారా వారి పదవుల సమస్యలను పరిష్కరించుకో వచ్చని ఆయన అన్నారు.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి , అలాగే కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా భారీ ఎత్తున సొమ్ము సంపాదించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితిపై రేవంత్ చేసిన విమర్శ అర్ధవంతంగా ఉందనే చెప్పాలి.

నాట్స్ తెలుగు సంబరాలు

న్యూజెర్సీ: ‘నాట్స్’ వేడుకల వేదికపై వినోదం వేయి విధాల వెల్లివిరియనుంది. వైవిద్య కళా ప్రదర్శనల వివర్ణకాంతి విరజిల్ల నుంది. వేనవేల ప్రేక్షకుల కరతాళ ధ్వనుల కోలా హలం కుండపోతగా కురియనుంది. వేదిక ప్రాంగణం ప్రవాసాంధ్రుల పదఘట్టాలతో ప్రతిధ్వనించనుంది. అసంఖ్యాక అతిథులు, ఆహూతుల రాకతో అడుగడుగునా తెలుగు సంస్కృతి ఫరిడవిల్లనుంది. మొత్తంగా వినూత్న కార్యక్రమాల కలబోతగా ‘నాట్స్’ సంబరాల్లో సందడి మిన్నంటనుంది.
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) జులై 1, 2, 3 తేదీల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలదే పెద్దపీట. ఇందుకోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నిమిత్తం 450 మంది కళాకారులు అహరహం శ్రమిస్తున్నారు. న్యూజెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, పెన్సిల్వేనియాకు చెందిన నృత్య దర్శకుల బృందాలు వీరితో సాధన చేయిస్తున్నాయి.
ఈ వేడుకల్లో సినీతారలదే స్టార్ అట్రాక్షన్. వీరు ప్రవాసాభిమానులను అలరించడానికి కదం కదపడానికీ, హుషారుగా చిందేయడానికీ సిద్ధపడుతున్నారు. అలాగే కొంతమంది చిత్ర ప్రముఖులు వేడుకలో పాలు పంచుకుంటారు. యువ కథానాయకుడు రామ్‌చరణ్ తేజ, నందమూరి కళ్యాణ్‌రామ్, ప్రియమైన కథానాయిక ప్రియమణి, మత్తుకళ్ళ మధుశాలినీ, గులాబీ ట్యూటీ సాక్షి గులాటీ, ‘వినాయకుడు’ ఫేమ్ కృష్ణుడు, కామెడీ హీరో సునీల్, సంగీత దర్శకుడు తమన్, క్యారెక్టర్‌నటులు కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి సహా పలువురు వినోదం పంచడానికి సిద్ధమవుతున్నారు.
కార్యక్రమం తొలిరోజు సినీతారలతో ప్రత్యేకంగా ఎన్నారైలకు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఆవేళ కోటాశ్రీనివాసరావు కామెడీ, ఫ్లూట్ నాగరాజు ప్రదర్శన, మిమిక్రీ రమేష్ ప్రోగామ్ సెషన్స్ నిర్వహిస్తారు. అలాగే మత్తెక్కించే మధుగీతాల గాయనీమణి ఎల్‌ఆర్. ఈశ్వరి, ఘంటశాల రత్నకుమార్ పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఇక ఆ మరుసటి రెండు రోజుల్లో టాలీవుడ్ కమెడీయన్ల కామెడీ షో, పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు నృత్య ప్రదర్శన, హీరో కృష్ణుడితో పాటు సునీల్ ప్రత్యేక ప్రదర్శనలు, గజల్ శ్రీనివాస్ గీతాలు, రెండో రోజు మధ్యాహ్నం భోజన సమయంలో ప్రియమణి, రామ్‌చరణ్‌తేజతో ‘మీట్ అండ్ గ్రీట్’, హీరోయిన్ మధుశాలినీ ప్రత్యేక నృత్యగీతాలు ఉంటాయి.

సాయిబాబా వీలునామా రాయలేదు


సత్యసాయి బాబ ప్రత్యేకంగా వీలునామా ఏమీ రాయలేదని సత్యసాయి బాబా ట్రస్టు సభ్యులు స్పష్టం చేశారు. బాబాకు సంబందించి ఎలాంటి వీలునామా లేదని , తమకైతే అలాంటి వీలునామా ఉన్నట్లు మా దృష్టికి రాలేదని ట్రస్టు తరపున మీడియాతో మాట్లాడిన నాగానంద్ చెప్పారు. అయితే కొందరు తమకు బాబా వీలునామా తమకు తెలుసనో, లేక, బాబా తమకు చెప్పారనో కొందరు కొన్ని విషయాలను చెబుతున్నారని, కాని వాటి ఆధారంగా ట్రస్టు పనిచేయజాలదని, వాటిని పరిగణనలోకి తీసుకోలేమని ఆయన చెప్పారు.

అయితే ,ఎవరైనా ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించ డంలో బాగంగా సలహాలు ఇవ్వవచ్చని, అవి ఆమోదయోగ్యం అయితే అమలు చేయవచ్చని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యులుగా ఉన్నవారంతా చాలా పెద్దవారని, జస్టిస్ భగవతి సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ గా చేసినవారని, ఎస్.వి.గిరి ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా పనిచేశారని, ఇలా ఆయా రంగాలకు సంబందించిన విశిష్ట వ్యక్తులు ఇందులో ఉన్నారని,వీరిలో ఎవరూ ఒక్క పైసా కూడా ట్రస్టు డబ్బు తీసుకోరని, సొంత ఖర్చుతో పనిచేస్తున్నారని నాగానంద్ తెలిపారు.సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి డైరెక్టర పదవికి డాక్టర్ సఫయా రాజీనామా చేయలేదని, ఆయన ఇప్పుడు ఎనభై ఏళ్ల వయసులో ఉన్నారని, విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారని ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ తెలిపారు.

గ్యాస్ ధర తగ్గిస్తాం-బొత్స


పెరిగిన వంట గ్యాస్ ధరలో కొంత రాష్ట్రప్రభుత్వం భరించడానికి సిద్దమవుతోంది.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాము గ్యాస్ ధర లో రాయితీ ఇవ్వాలని కోరామని అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.డీజిల్, కిరోసిన్, గ్యాస్ ధరల పెంపు అనివార్యమని, అయితే రాష్ట్రాలు తమ పన్నులను కొంత తగ్గించుకోవాలని , తద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా రాష్ట్రాలను కోరారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆ రాష్ట్రంలో సెస్ ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.మొదట రాష్ట్రంలో ఈ ధరలు తగ్గించడం కుదరదని అన్నారు. కాని ఆ తర్వాత ఒత్తిడి పెరిగిన నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పిసిసి అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణలు అదికారులతో చర్చించారు. ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు రిలీఫ్ ఇచ్చేలా చేయాలని భావించారు. తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు బొత్స వెల్లడించారు.కాగా ఆర్టీసి ఛార్జీలు సామాన్య ప్రయాణికులపై బారం పెడకుండా చూస్తామని, పల్లెవెలుగు బస్ లకు ఛార్జీలు పెంచబోమని ఆయన అన్నారు.లక్జరీ బస్ ల ఛార్జీలు పెరుగుతాయిని బొత్స తెలిపారు.

28, జూన్ 2011, మంగళవారం

జయలలితకు జైకొట్టిన చంద్రబాబు

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోపు రాజకీయ పునరేకీరణ జరిగి తృతీయ ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఉందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెప్పిన జోస్యాన్ని టీడీపీ అద్యక్షుడు చంద్రబాబునాయుడు జైకోట్టి సమర్ధించారు.   కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలతో రోజురోజుకూ దిగజారిపోతోందని, బీజేపీ పరిస్థితి మెరుగ్గా లేదని అన్నారు.
ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు బాగా పనిచేస్తున్నాయన్నారు. జాతీయ స్థాయిలో యునైటెడ్ ఫ్రంట్  ఏర్పాటుకు చొరవ చూపిస్తున్న టీడీపీ, అన్నాడిఎంకె వంటి భావసారూపత్య ఉన్న పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తృతీయ ఫ్రంట్ ఏ సమయంలోనే ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

సాయిబాబా వీలునామా రాయలేదు

సత్యసాయి బాబా ప్రత్యేకంగా వీలునామా ఏమీ రాయలేదని సత్యసాయి బాబా ట్రస్టు సభ్యులు స్పష్టం చేశారు. బాబాకు సంబందించి ఎలాంటి వీలునామా లేదని , తమకైతే అలాంటి వీలునామా ఉన్నట్లు మా దృష్టికి రాలేదని ట్రస్టు తరపున మీడియాతో మాట్లాడిన నాగానంద్ చెప్పారు. అయితే కొందరు తమకు బాబా వీలునామా తమకు తెలుసనో, లేక, బాబా తమకు చెప్పారనో కొందరు కొన్ని విషయాలను చెబుతున్నారని, కాని వాటి ఆధారంగా ట్రస్టు పనిచేయజాలదని, వాటిని పరిగణనలోకి తీసుకోలేమని ఆయన చెప్పారు.
అయితే ,ఎవరైనా ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో బాగంగా సలహాలు ఇవ్వవచ్చని, అవి ఆమోదయోగ్యం అయితే అమలు చేయవచ్చని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యులుగా ఉన్నవారంతా చాలా పెద్దవారని, జస్టిస్ భగవతి సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ గా చేసినవారని, ఎస్.వి.గిరి ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా పనిచేశారని, ఇలా ఆయా రంగాలకు సంబందించిన విశిష్ట వ్యక్తులు ఇందులో ఉన్నారని,వీరిలో ఎవరూ ఒక్క పైసా కూడా ట్రస్టు డబ్బు తీసుకోరని, సొంత ఖర్చుతో పనిచేస్తున్నారని నాగానంద్ తెలిపారు.సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి డైరెక్టర పదవికి డాక్టర్ సఫయా రాజీనామా చేయలేదని, ఆయన ఇప్పుడు ఎనభై ఏళ్ల వయసులో ఉన్నారని, విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారని ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ తెలిపారు.

మళ్లీ కాంగ్రెస్ గూటికి ముద్రగడ

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని కదనాలు వస్తున్నాయి.ఆయన ఈ మధ్యవరకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కు సన్నిహితంగా మెలిగారు. జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు ముద్రగడ కూడా వెన్నంటే ఉన్నారు.కాని ఆ తర్వాత పరిణామాలలో ముద్రగడ పద్మనాభం క్రమేపి జగన్ కు దూరం అయ్యారు.
ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ను జగన్ తన శిబిరంలోకి తీసుకోవడంపై ముద్రగడ అసంతృప్తి చెందారు.అలాగే మరోనేత జ్యోతుల నెహ్రూను పార్టీలో తీసుకున్నప్పుడు కూడా అసంతృప్తి చెందారు కాని, దొరబాబు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఆయన ఇక లాభం లేదని అనుకున్నారు.
ఈ పరిస్థితులలలో కేంద్ర మంత్రి పల్లంరాజు మెల్లగా పావులు కదుపుతూ ముద్రగడను కాంగ్రెస్ లోకి తీసుకు రావడానికి యత్నిస్తున్నారని అంటున్నారు. ఆయన కోరుకున్న చోట ఆయన లేదా, ముద్రగడ కుమారుడు గిరి పోటీచేసే విధంగా అవగాహన కుదుర్చుకోవచ్చని అంటున్నారు.కాగా ముద్రగడ ఇప్పటివరకు అనేక పార్టీలను చూసిన వ్యక్తిగా పేరొందారు. జనతా పార్టీతో ఆయన రాజకీయ జీవితం ఆరంబమైంది, ఆ తర్వాత తెలుగుదేశం లో మంత్రి అయ్యారు. తదుపరి సొంతంగా పార్టీ పెట్టడానికి ప్రయత్నంచేశారు.తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళి మంత్రిగా కొద్ది కాలం ఉన్నారు.
ఆ మీదట ఆయన భారతీయ జనతాపార్టీలో ప్రవేశించారు. తదనంతరం తెలుగుదేశంలోకి వచ్చారు. ఎమ్.పి అయ్యారు. మెల్లగా ఆ పార్టీకి దూరం అయి కాంగ్రెస్ లో చేరారు.గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ మద్దతుదారుడయ్యారు. కాని అక్కడ కూడా ఉండలేక మళ్లీ కాంగ్రెస్ లో పునఃప్రవేశం చేయవచ్చని అంటున్నారు. ముద్రగడ రాజకీయజీవితం ఏ విదంగా మలుపుతిరుగుతుందో..

23, జూన్ 2011, గురువారం

జ‌నం న‌డ్డి విరిచేందుకు సిద్ద‌ప‌డుతున్న కేంద్రం..!


సంవ‌త్స‌ర‌కాలంలోనే నాలుగు సార్లు పెట్రోలు ధ‌ర‌లు పెంచిన ఘ‌న‌త ద‌క్కించుకున్న కేంద్ర స‌ర్కార్ మ‌రోసారి సామాన్యుల న‌డ్డి విర‌వ‌టానికి సిద్ద‌ప‌డుతోంది.. ఈసారి కేంద్రం చూపు గ్యాస్ సిలిండ‌ర్ల‌పై ప‌డింది.. మామూలు ప‌ది రూపాయ‌లో, ఇర‌వై రూపాయ‌లో పెంచుతూ వ‌చ్చిన కేంద్రం ఈసారి ఏకంగా ఒక సిలిండ‌ర్‌పై 150 రూపాయ‌లు పెంచ‌డానికి సిద్ద‌ప‌డుతోంది.. అంతేకాదు డీజిల్‌పై కూడా లీట‌రుకు 9 రూపాయ‌లు పెంచేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది.. కిరోసిన్ లీట‌రుకు 1 రూపాయి పెంచ‌బోతోంది.. ఇప్ప‌టికే నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఆకాశానికంటడంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటూ ఇప్పుడు ఏకంగా వంట‌గ్యాస్‌పై 150 రూపాయ‌ల భారం వేయ‌డానికి సిద్ద‌ప‌డ‌డం అత్యంత అమానుషం.

స‌త్య‌సాయి ట్ర‌స్ట్ పై బిగుస్తున్న ఉచ్చు..!


ఇన్నాళ్లు యథేచ్ఛగా ప్రశాంతి నిలయంలో ఏం జరుగుతుందో తెలియకుండా అన్నీ గుట్టుగా చేసుకుంటూ వెళ్లి సత్యసాయి ట్రస్టు సభ్యులు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఓ వైపు అక్రమంగా తరలిస్తున్న డబ్బు దొరకడం, పోలీసుల విచారణ, బంధువుల ఆగ్రహావేశాలు, భక్తులకు సన్నగిల్లిన అవిశ్వాసం, ప్రజా సంఘాల నిరసన, ప్రభుత్వం నోటీసులతో వారు సతమతమవుతున్నారు. వీటికి తోడుగా తాజాగా ఆదాయపు పన్ను శాఖ కూడా సత్యసాయి ట్రస్టు ఆదాయంపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా రూ.35 లక్షల నగదు తరలింపు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన శ్రీనివాసన్, రత్నాకర్‌లు దీని నుంచి బయటపడేందుకు సతమతమ వుతున్నారు. పోలీసులు ఇప్పటికే శ్రీనివాసన్ వ్యక్తిగత డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా శ్రీనివాసన్ వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్‌కు కూడా తాఖీదులు జారీ చేశారు.
వెంకటేశ్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రశాంతి నిలయంపై ఐటీ అధికారుల దృష్టి పడడం మరో ఎత్తు. నాలుగు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. యజుర్ మందిరం నుంచి తరలిన డబ్బు, ఇతర వ్యవహారాలపై విచారణలో వెల్లడైన అంశాలను తమకు తెలియజేయాలని వీరు పోలీసులను కోరినట్లు తెలిసింది. అలాగే ట్రస్టుకు ఇటీవలి కాలంలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు పంపాల్సిందిగా కూడా ఐటి ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. కాగా ప్రశాంతి నిలయంలో డేగ కళ్లు ఉన్నాయి. అనునిత్యం 120 వరకు సిసి కెమెరాలు పని చేస్తుంటాయి. వాటి రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకుంటే కీలకమైన వివరాలు బయటపడతాయని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. సిసి కెమెరాల నిర్వహణలో ప్రశాంతి నిలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రధాన్‌దే కీలక పాత్ర. పోలీసులు ప్రధాన్‌ను ఈ కోణంలోనూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇక ప్రశాంతి నిలయంలోని వ్యవహాలపై పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. ట్రస్టు సభ్యుల వ్యవహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాబా జీవించి ఉన్నప్పుడు పుట్టపర్తిలో పవిత్రత, మనశ్సాంతి ఉండేదని ఇప్పుడు అది పోయిందని స్థానికులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబా బంధువులు కూడా ట్రస్టు సభ్యులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాబా ఆశయ సాధన కోసం నడుం బిగించాలని, ట్రస్ట్‌లోని కొందరు స్వార్థపరుల ఆటకట్టించేవరకు ఆందోళన నిర్వహించాలని వారు భావిస్తున్నారు.

ప్ర‌సంగాల‌లో మాట జారితే..!?


మైకు ఉందిక‌దా చేతిలో ఉంది క‌దాని కొంద‌రు నాయ‌కులు ఒంటిపై స్పృహ‌లేకుండా ప్ర‌సంగాలు దంచేస్తుంటారు.. అలాంటి స‌మ‌యంలో తాము చెప్పాల‌నుకున్న విష‌యంపై ప‌ట్టు కోల్పోయి దానికి వ్య‌తిరేకంగా మాట్లాడి ఇబ్బందు ల‌పాలు అయ్యే నాయకులు కూడా చాలా మందే ఉన్నారు.. అలాంటి కోవ‌లోకే వ‌స్తుంది చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే హేమ‌ల‌త‌.. అస‌లు విష‌యం ఏమిటంటే..
ఎమ్మెల్యే హేమలత చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. అందులో ఆమె తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, భవిష్యత్తు కలిగిన పార్టీ అని జోరుగా ఉపన్యాసం ఇచ్చారు. అయితే ఇక పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురించి పొగడాలను కున్నారు.కాని నోరు జారారు. అనరాని మాట ఆమె నోటనుంచి వచ్చింది. చంద్రబాబునాయుడు అవినీతిపరుడు అని ప్రసంగంలో చెప్పేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి అని చెప్పాలనుకుని హేమలత తొందరలో అవినీతిపరుడని అనడంతో సభికులంతా అవాక్కయ్యారు. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరు వెల్లబెట్టారు. కాని ఆ తర్వాత ఆమె సర్దుకుపోవడానికి ప్రయత్నించారు. అది వేరే విషయం. ఈలోగా అది అంతా రికార్డయిపోయింది. టీవీ ఛానళ్లలో ఆమె నోరుజారిన మాటలను ప్రసారం ఆసక్తికరమైన రీతిలో ప్రసారం చేశాయి. కొందరు ప్రత్యర్దులు ఆమె మనుసులో మాట అనేశారా అని విమర్శిస్తుంటే, పొరపాటున అలా వచ్చిందని, తమ నాయకుడు అత్యంత నిజాయితీపరుడని చెప్పడానికి ఎమ్మెల్యే హేమలత తంటాలు పడవలసి వస్తోంది.