పోస్ట్‌లు

సెప్టెంబర్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆర్‌.టి.సి. స‌మ్మె విర‌మ‌ణ‌..?

చిత్రం
సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసే దిశగా ఆర్టీసి జెఎసి, తెలంగాణ ఎన్‌ఎంయు నాయకులు అడుగులు వేస్తున్నారా? తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పండుగ దసరాను దృష్టిలో ఉంచుకుని..ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండటానికే జెఎసి నాయకులు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలోని ప్రతి గడపలోనూ కుటుంబ సభ్యులందరితో సంతోషంగా జరుపుకొనే దసరా ఉత్సవాలకు ఆర్టీసి సమ్మె గండి కొట్టిందనే విమర్శలకు తావివ్వకుండా, ఆర్టీసి ఉద్యోగులు తమ ఆనందాన్ని హరించి వేశారనే అపవాదును మూటగట్టుకోకుండా ఉండటానికి కనీసం తాత్కాలికం గానైనా సమ్మెను వాయిదా వేయాలనే దిశగా ఆర్టీసి జెఎసి నాయకులు యోచిస్తున్నట్టు తెలిసింది. వచ్చేనెల 2వ తేదీన సమ్మెను విరమించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయాన్ని తెలంగాణ జెఎసి కన్వీనర్‌ కోదండరామిరెడ్డి దృష్టికి తీసు కెళ్లగా..తొలుత ఆయన ఇందుకు అంగీకరించలేదని, అయితే ఆర్టీసి జెఎసి నాయకులు నచ్చజెప్పడంతో అయిష్టంగానే తల ఊపినట్టు తెలుస్తోంది.

సచిన్ సొంతింటి క‌ల నెర‌వేరింది..

చిత్రం
ఏన్నో ఏళ్లుగా కలలు కన్న ఇంట్లోకి సచిన్ టెండూల్కర్ బుధవారం గృహప్రవేశం చేశాడు. ఇంతకుముందు స్పోర్ట్స్ కోటా కింద వచ్చిన ఫ్లాట్‌లో నివసించి న టెండూల్కర్.. బాంద్రా శివారుల్లోని పెర్రీ క్రాస్ రోడ్ వద్ద ఆరు వేల గజాల స్థలంలో తనకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకున్నాడు. ‘సొంత ఇంటి విషయంలో ప్రతి ఒక్కరు ఎన్నో కలలు కంటారు. నేను కూడా అంతే. నా కలను నిజం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. అయితే మొన్నటి దాకా నివసించిన స్పోర్ట్స్ కోటా ఇంటిని వెంటనే ఖాళీ చేశాను. ఎందుకంటే ఆ ఇల్లు మరో క్రీడాకారుడికి ఉపయోగపడతుం ది’అని సచిన్ అన్నాడు. ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లకముందే జూన్ 11న గృహ శాంతి, వాస్తు పూజలు చేసినట్టు తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత తొలిసారిగా తన తల్లిని తీసుకొని కొత్త ఇంటికి వచ్చాడు. పిల్లలకు ఇంకా ఇల్లు చూపించలేదని సచిన్ చెప్పా డు. తన కలల కోటను కోసం సచిన్ మొత్తం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. బం గ్లా చుట్టూ ఫెన్సింగ్‌తో కూడిన ఎత్తయిన గోడ నిర్మించాడు. సీసీ కెమెరాలు, సెన్సర్లను కూడా అమర్చాడు. భూ మట్టానికి పైన మూడు అంతస్తులు, కింద రెండు సెల్లార్‌లు ఉన

శంక‌ర‌రావుపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజ‌మేనా..?

చిత్రం
తనపై కక్ష తో ఒక నిరాధార వార్తను ప్రసారం చేశా రని,వీడియో మానిప్యులేషన్ ద్వారా ఆ కధనాన్ని ప్రసారం చేశారని, రాజకీయ కుట్ర ఉందని,ఆ ఛానల్ ఎవరిది?దాని వెనుక ఎవరుఉన్నారో అందరికి తెలుసు.. అయినా నా అవినీతి వ్యతిరేక పోరాటం ఆగదు అని మంత్రి శంకరరావు అన్నారు. కార్పొరేటర్ టిక్కెట్ ఇవ్వడానికి గాను లక్షల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణపై ఆయన సంక్షిప్తంగా వివరణ ఇచ్చారు.మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెంటనే ధాంక్యు అంటూ వెళ్లిపోయారు.ఆ వార్త కధనంపై విచారణ చేసుకోవచ్చనికాని, దానిపై ఫిర్యాదు చేస్తానని కాని ఆయన అనలేదు. మామూలుగా అయితే అరగంటకు పైగా మీడియాతో మాట్లాడకుండా ఉండని శంకరరావు ఈ వార్త విషయంలోమాత్రం ముక్తసరిగా మాట్లాడి సరిపెట్టుకున్నారు.పైగా సంబందం లేని విషయాలు సుదీర్ఘంగా మాట్టాడడానికి ప్రయత్నించారు. తన ట్రాక్ రికార్డు అందరికి తెలుసని, తాను ఏ ఏ దేశాలు తిరిగింది తదితర వివరాలు చెప్పారు.మొత్తం శంకరరావు ఆత్మరక్షణలో పడినట్లే ఉంది.

సిఎం, బొత్సల మ‌ధ్య అంతరం..

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి,పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య మరో కుంపటి రగిలింది.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పుడు నివేదికలు పంపుతూ తెలంగాణాను అడ్డుకుంటున్నారని తెలంగాణ నేతలు ఆరోపిస్తుంటే అలాంటివేమీ పంపలేదని ఆయన వివరణ ఇవ్వవలసి వచ్చింది. అయితే ఈసారి మరో నివేదిక కిరణ్ , బొత్స ల మద్య అంతరం పెంచుతోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.కోస్తాలో బొత్స సత్యనారాయణ, మెగాస్టార్ చిరంజీవిలను మరీ ఎక్కువగా ప్రొజెక్టు చేస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కిరణ్ పార్టీ హైకమాండ్ కు ఒక నివేదిక పంపారన్న సమాచారం గుప్పుమంది. వీరిద్దరు కలిస్తే ఒక బలం అనుకుంటుంటే కిరణ్ ఇలాంటి నివేదిక ఎలా పంపుతారని అడిగేవారికి కూడా అందులో ఒక సమాధానం ఉంది.కోస్తాలో బొత్స, చిరంజీవిల సామాజికవర్గానికి , ఎస్.సి వర్గాలకు మద్య వైరుధ్యాలు ఉన్నాయని, వీరికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఎస్.సి.లు పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉందని కిరణ్ నివేదికలో ప్రస్తావించారని అంటున్నారు.అలాగే కొన్ని చోట్ల ఈ సామాజికవర్గానికి బిసిలకు అంతగా పొసగదని కూడా పేర్కొన్నారని అంటున్నారు.ఇది కావాలని బొత్స ఇమ

సిఎం, బొత్సల మ‌ధ్య అంతరం..

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి,పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య మరో కుంపటి రగిలింది.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పుడు నివేదికలు పంపుతూ తెలంగాణాను అడ్డుకుంటున్నారని తెలంగాణ నేతలు ఆరోపిస్తుంటే అలాంటివేమీ పంపలేదని ఆయన వివరణ ఇవ్వవలసి వచ్చింది. అయితే ఈసారి మరో నివేదిక కిరణ్ , బొత్స ల మద్య అంతరం పెంచుతోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.కోస్తాలో బొత్స సత్యనారాయణ, మెగాస్టార్ చిరంజీవిలను మరీ ఎక్కువగా ప్రొజెక్టు చేస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కిరణ్ పార్టీ హైకమాండ్ కు ఒక నివేదిక పంపారన్న సమాచారం గుప్పుమంది. వీరిద్దరు కలిస్తే ఒక బలం అనుకుంటుంటే కిరణ్ ఇలాంటి నివేదిక ఎలా పంపుతారని అడిగేవారికి కూడా అందులో ఒక సమాధానం ఉంది.కోస్తాలో బొత్స, చిరంజీవిల సామాజికవర్గానికి , ఎస్.సి వర్గాలకు మద్య వైరుధ్యాలు ఉన్నాయని, వీరికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఎస్.సి.లు పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉందని కిరణ్ నివేదికలో ప్రస్తావించారని అంటున్నారు.అలాగే కొన్ని చోట్ల ఈ సామాజిక

దూకుడుకి ధీటుగా ఊస‌ర‌వెల్లి

చిత్రం
ఇటీవలి కాలంలో రెండు సినిమాలు టాలీవుడ్ లో అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అవి… దూకుడు, ఊసరవెల్లి. అందరూ ఎంతగానో ఎదురుచూసిన ‘దూకుడు’ రిలీజ్ అయిపోవడం… హిట్ అవ్వడం జరిగిపోయాయి. ఇక ‘ఊసరవెల్లి’ వంతు వుంది. ‘దూకుడు’ హిట్ అవ్వడంతో ‘ఊసరవెల్లి’ మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి. పైగా, ఇంతకు ముందు వచ్చిన ఎన్టీఆర్ సినిమా ‘శక్తి’ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఎన్టీఆర్ కు ఓ హిట్ కచ్చితంగా అవసరం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ‘దూకుడు’ చిత్రం విడుదలై మాంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళు తోంది. ఈ క్రమంలో ‘ఊసరవెల్లి’ చిత్రం ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. కానీ ఈ సినిమాపై నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందనే భావాన్ని వ్యక్తపరుస్తున్నట్టు సమాచారం.  కాగా అక్టోబర్ 6న విజయదశమి సందర్భంగా ఊసరవెల్లి రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డీటీయస్ వర్క్ జరుగుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఆడియో మంచి హిట్ అయిందనీ, త్వరలో ప్లాటినం డిస్క్ ఫంక్

గాయత్రీ దేవిగా దుర్గామాత‌

చిత్రం
దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ నేడు గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రుల్లో రెండోరోజు అమ్మవారు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులకు దర్శనమిస్తోంది. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. అనంత శ‌క్తిగ‌ల గాయ‌త్రీ దేవి గాయత్రీ దేవి మహా శక్తిగలది. ఆమెను వర్ణించనలవి కాదు. ఆమె తన భక్తులపై అమోఘమైన దయ చూపుతుంది. గాయత్రీ కవచానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అధిపతులు. రుగ్వేదం, యజుర్వేదం, సామ, అధర్వణవేదాలు ఆమెను కీర్తించే కీర్తనలకు ఛందస్సులుగా ఉన్నాయి. గాయత్రీ మహామంత్రాన్ని పఠించిన వారికి ఈతి బాధలు ఉండవు. సర్వ సుఖాలు కలుగుతాయి. గాయత్రీ మంత్రం ప్రతిరోజూ మూడు వేళల్లో కూడా సూర్యోపాసనను అనుసంధానం చేసి అర్ఘ్యం ఇవ్వడం అచారంగా వ స్తోంది. ప్రధానంగా మనకు అనేక గాయత్రి జపాలు వాడుకలో ఉన్నాయి. ఏ దేవత అర్చన జరిగినా

అడ్డంగా బుక్క‌యిన శంక‌ర్రావ్‌

చిత్రం
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని సామెత. రాష్ట్ర మంత్రి డాక్టర్ పి.శంకరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ పై కేవలం ఒక లేఖ రాస్తే హైకోర్టు ఛీఫ్ జస్టిస్ కక్రు తీవ్రంగా స్పందించి ఏకంగా సిబిఐ విచారణకు ఆదేశించారు.ఆయన జగన్ పై నే కాదు. ఎమ్.ఆర్.ప్రాపర్టీస్ అవకతవకల పై ఆయన రాసిన లేఖను కూడా హైకోర్టు స్వీకరించి విచారణకు ఆదేశించింది. దాంతో శంకరరావు లో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఇక తోటి మంత్రులపై ఇష్టానుసారంగా ఆరోపణలు గుప్పించారు. వాటికి ఆధారాలు ఉన్నాయో లేవో కాని హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెకటరమణ లపై అభియోగాలు మోపడమే కాకుండా వారిపై చర్య తీసుకోకపోతే అక్టోబర్ మూడున రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మరో ఐదుగురు మంత్రులపై కూడా ఆరోపణలు సిద్దం చేసుకుంటున్నానన్నారు. దీనిని కూడా హైకోర్టు సుమోటోగా స్వీకరించి అందరిని ఆశ్చర్యపరచింది. రాజకీయ నాయకులు చేసుకునే ఆరోపణలపై కూడా హైకోర్టు స్పందిస్తుందా అన్న ప్రశ్న తలెత్తింది. ఈ నేపధ్యంలో శంకరరావు కొంతకాలం క్రితం ఒక కార్పొరేటర్ టిక్కట్ ఇప్పించడానికి గాను లంచం తీసుక

ఆ రెండింటిని క‌లిపితే ప‌రిష్కారం దొరుకుతుందా..?

చిత్రం
తెలంగాణ సమస్యకు ఎలాగొలా ఒక పరిష్కారం కనుగొనాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా భావిస్తున్నారు. అయితే వారు పూర్తిగా బయటపకుండా కొన్ని రాజీమార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ఒకపక్క కేంద్రం ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతూనే మరో పక్క ఉద్యమం కొనసాగించే వ్యూహాన్ని అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిలోని కొందరు ముఖ్య నాయకులలో ఒక ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా తెలంగాణకు కలుపుకుంటే ఈ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందా అన్న ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును బాగా వ్యతిరేకిస్తున్నది ఆ రెండు జిల్లాల ప్రజలు, నాయకులన్నది ఒక అభిప్రాయం. ఎందుకంటే సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు సీమ జిల్లాలు బాగా దూరంగా ఉంటాయి. రాజధాని నగరం కోస్తాలో ఎక్కడ ఏర్పాటైనా ఈ రెండు జిల్లాలు ఒక మూలగా ఉంటాయి. అలాగని ఆంధ్ర కు రాజధానిగా ఉన్న కర్నూలు ను రాజధానిగా ఎంపిక చేస్తే మిగిలిన సీమాంధ్రకు

చిదంబ‌రానికి ప్ర‌ధాని అండ‌

చిత్రం
2 జీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంమంత్రి చిదంబరంకు మద్దతు పెరుగుతోంది. ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్ కూడా చిదంబ‌రాన్ని వెనుకేసుకొస్తున్నారు. చిదంబరంపై పూర్తి నమ్మకం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. చిదంబరంపై లీక్ అయిన లేఖపై.. మంత్రివర్గంలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. రాజకీయాలను అస్తిర పర్చేందుకు కొన్ని పక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని చెప్పుకొచ్చారు. అలాగే మధ్యంతర ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు.. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. కాగా 2 జీ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై సోమవారం సోనియాకు చిదంబరం వివరణ ఇచ్చారు. తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇదే విషయంపై సోనియాను కలిశారు. తర్వాత ప్రణబ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మూలస్థంబాల్లో చిదంబరం ఒకరని వ్యాఖ్యానించారు.

ల‌గ‌డ‌పాటి వ‌ల్లే ర‌గ‌డ‌-దానం

చిత్రం
లగడపాటి రాజ‌గోపాల్‌ అతిగా స్పందించటం వల్లే తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. తెలంగాణ‌లో స‌మ్మె ఉదృతంగా జ‌రుగుతున్న స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి ఆర్‌టిఏ ఆఫీస్‌కివెళ్ళ‌డం స‌రికాద‌ని విమ‌ర్శించారు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికే కేసీఆర్‌, కోదండరాం ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెక్రటేరియేట్‌ ముందు ఆందోళన చేయటంపై సీఎం స్పందిస్తేనే బాగుంటుందని.. తెలంగాణ సెంటిమెంట్‌ విషయంలో టీఆర్‌ఎస్‌తో కలసి కాంగ్రెస్‌ నేతలు పనిచేస్తున్నట్లుందని దానం అన్నారు.

స్వామిగౌడ్‌పై హ‌త్య‌కు కుట్ర‌..?

చిత్రం
టీఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు స్వామీగౌడ్ ను చంపే ప్రయత్నం చేశారని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోపించారు. కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న స్వామీగౌడ్ ను కేసీఆర్ తో సహా.. గద్దర్, కోదండరామ్ తదితరులు పరామర్శించారు. తర్వాత కేసీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. స్వామీగౌడ్ పై హత్యాయత్నం జరిగిందన్నారు. స్వామీగౌడ్ కు తగిలిన గాయాలను చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగానే గాయపర్చినట్లు తెలుస్తుందని కేసీఆర్ అన్నారు. ఈ ఘటనపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తామని కేసీఆర్ తెలిపారు. కాగా ఈ ఘటనకు కారకులైన డీసీపీ స్టీఫెన్ రవీంద్ర ను సస్పెండ్ చేయాలని.. ఆయనపై హత్యాయత్నం కింద కేసు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇక స్వామీగౌడ్ పై జరిగిన దాడికి నిరసనగా.. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాలన్నీ.. గాంధేయవాదంతోనే ఉండాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సమ్మె వల్ల ముఖ్యమంత్రిలో నిరాశ నిస్పృహ స్పష్టంగా కనిపిస్తుందని కోదండరామ్ వ్యాఖ్యానించారు.

స్వామిగౌడ్‌పై హ‌త్య‌కు కుట్ర‌..?

చిత్రం
టీఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు స్వామీగౌడ్ ను చంపే ప్రయత్నం చేశారని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోపించారు. కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న స్వామీగౌడ్ ను కేసీఆర్ తో సహా.. గద్దర్, కోదండరామ్ తదితరులు పరామర్శించారు. తర్వాత కేసీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. స్వామీగౌడ్ పై హత్యాయత్నం జరిగిందన్నారు. స్వామీగౌడ్ కు తగిలిన గాయాలను చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగానే గాయపర్చినట్లు తెలుస్తుందని కేసీఆర్ అన్నారు. ఈ ఘటనపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తామని కేసీఆర్ తెలిపారు. కాగా ఈ ఘటనకు కారకులైన డీసీపీ స్టీఫెన్ రవీంద్ర ను సస్పెండ్ చేయాలని.. ఆయనపై హత్యాయత్నం కింద కేసు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇక స్వామీగౌడ్ పై జరిగిన దాడికి నిరసనగా.. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాలన్నీ.. గాంధేయవాదంతోనే ఉండాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సమ్మె వల్ల ముఖ్యమంత్రిలో నిరాశ నిస్పృహ స్పష్టంగా కనిపిస్తుందని కోదండరామ్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌తో అస‌దుద్దీన్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావును ఎమ్.ఐ.ఎమ్. అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అవడం రాజకీయంగా ఆసక్తికర ఘట్టంగా మారింది. రెండు రోజుల క్రితం సకల జనుల సమ్మెకు వ్యతిరేకమని, తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమని ప్రకటించిన ఒవైసీ ఆకస్మికంగా కెసిఆర్ ను కలవడం విశేషం. అయితే తెలంగాణ అంశానికి ఈ బేటీకి సంబందం లేదని, ముస్లింలకు సంబందించిన సచార్ కమిటీ నివేదిక అమలు విషయంపై అన్ని రాజకీయ పార్టీలతో ఒవైసీ కలుస్తున్నారని, అందులో భాగంగా ఆయన కెసిఆర్ ను కలిసారన్నది సమాచారం. అయితే ఈ సందర్భంగా తెలంగాణ అంశం కూడా ప్రస్తావనకు రావచ్చని భావిస్తున్నారు.

కొత్త పార్టీ యోచ‌న‌లో టి-కాంగ్రెస్ నాయ‌కులు..?

చిత్రం
తెలంగాణపై అధిష్టానంతో అమీతూమీ కోసం చివరి ఢిల్లీ పర్యటన అంటున్న టీ కాంగ్రెస్‌ నేతల భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?..సానుకూల ప్రకటన రాకపోతే పార్టీని వీడి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా? అవును ఇందుకు రంగం సిద్ధమవుతోందని చెబుతున్నారు కొందరు కీలక నేతలు… తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ అధిష్టానానికి టీ కాంగ్రెస్ నేతల మొర… డెడ్‌లైన్లు, హెచ్చరికలు జారీ చేసినా స్పందించకపోవడంతో హమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ఓ వైపు ఉద్యమం, మరో వైపు సకల జనుల సమ్మె ఉధృతం …తెలంగాణ ప్రజల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే ఆలోచనలో టీ కాంగ్రెస్ నేతలు పడ్డారు. ఇప్పుడుతున్న పరిస్థితులలో అధిష్టానంతో రాజీపడితే రాజకీయంగా పుట్టగతులుండవనే ఆలోచనలో నేతలున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఏర్పాటుపై చేసిన ప్రకటనలు ఉత్తుత్తివేనని ప్రచారం జరుగుతుండటంతో ఈ దఫా నిజంగానే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసి ఓ కీలక నిర్ణయం తీసుకునే

ద‌స‌రా కానుక‌గా తెలంగాణ ప్ర‌క‌ట‌న‌..?

చిత్రం
ప్ర‌స్తుతం తెలంగాణ జిల్లాల‌లో 15 రోజుల పాటు కొన‌సాగుతున్న స‌క‌ల జ‌నుల స‌మ్మె సెగ కేంద్ర వ‌ర‌కూ పాకింది. 15 రోజులుగా జ‌రుగుతున్న స‌మ్మె వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానాకి భారీగా గండిప‌డింది. బ‌స్సులు, రైళ్ళు, బొగ్గుగ‌నుల ప‌నులు ఇలా అన్నీ ఆగిపోవ‌డంతో ప్ర‌భుత్వం దిగివ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే తెలంగాణ‌పై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవ‌డానికి అధిష్టానం సిద్దంగా ఉంద‌ని, ఈ విష‌యంపై సోనియాగాంధీ కూడా సుముఖంగానే ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంనుండి ముఖ్య నేత‌ల‌ని ఢిలీకి పిలిపించ‌డం చూస్తుంటే ఈ ద‌స‌రా పండ‌గ‌లోపు తెలంగాణ‌పై ఓ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోనుంద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈపాటికే రాష్ట్రం నుండి సిఎం. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, కాంగ్రెస్ ముఖ్య నేత చిరంజీవిలు ఢిల్లీకి వెళ్ళారు. తెలంగాణ మంత్రులు జానారెడ్డి, కేశ‌వ‌రావు త‌దిత‌రులు ఆజాద్‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. అయితే ఆజాద్ తెలంగాణ అంశం త‌న చేతిలో లేద‌ని స్ప‌ష్టం చేయ‌డం, ఆ వెంట‌నే నేత‌లంద‌రినీ ఢిల్లీకి పిలిపించి ప్ర‌ధాని, సోనియాగాంధీ స‌మ‌క్షంలోనే ఈ స‌మ‌స్య‌కి ఓ ప‌రిష్కా

మ‌రో ‘డ‌ర్టీపిక్ష‌ర్‌’

చిత్రం
అలనాటి ఐటం సెక్సీ గర్ల్ సిల్క్ స్మిత జీవితంపై రూపొందుతున్న ‘డర్టీ పిక్చర్’పై బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఈ చిత్రంలోని స్టిల్స్‌లో విద్యాబాలన్ చేసిన హాట్ ఎక్స్‌పోజింగ్‌తో ఈ చిత్రంపై మ‌రిన్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. ఆరోజుల్లో సిల్క్‌స్మిత‌తో ప‌లువురు టాప్ హీరోలు అక్ర‌మ సంబంధం పెట్టుకున్నార‌న్న విష‌యాన్ని ఈ చిత్రంలో చూపించ‌బోతున్నార‌న్న గాసిప్స్‌తో విడుద‌ల‌కి ముందే ఈ చిత్రం సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా మ‌రో డ‌ర్టీపిక్ష‌ర్ తీయ‌డానికి మ‌రో ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ఎవ‌రో కాదు మాధుర్ బండార్క‌ర్‌. మధుర్ త్వరలో ఓ సినిమా రూపొందించ బోతున్నారని సమాచారం. భారత్ నుంచి ఇంటర్నేషనల్ ఫోర్న్ నటిగా ఎదిగిన ‘సన్నీ లియోన్ ఎకా కరెన్ మల్హోత్రా’ జీవితంపై బండార్కర్ సినిమా తీయబోతున్నాడని బాలీవుడ్ టాక్. సన్నీ లియోన్ కు ఇంటర్నేషనల్ అడల్ట్ సినిమాల మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.ఒక ఇండియన్ గర్ల్ ఇంటర్నేషనల్ ఫోర్న్ నటిగా ఎలా ఎదిగింది? అనే అంశాన్ని బేస్ చేసుకుని మధుర్ సొంతంగా ఓ కల్పిత కథను రాసుకున్నాడని, దాని ఆధారం

చిదంబరం రాజీనామా చేయబోతున్నారా?

చిత్రం
మేడమ్ సోనియాను సోమవారం (26-09-11) కేంద్ర మంత్రి చిదంబరం కలవడం, అటుపైన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా మేడమ్ తో మంతనాలు ఆడటం చూస్తుంటే, చిదంబరం పరిస్థితి ఇరుకునపడినట్టే కనిపిస్తోంది. అంతేకాదు, యూపీఏ ప్రభుత్వంలోని లుకలుకల స్థాయి ఏమిటో కూడా ఈ వ్యవహారం చాటిచెబుతున్నట్టే ఉంది. చిదంబరం తనకు అతిముఖ్యమైన సహచరుడని ప్రణబ్ చెప్పినప్పటికీ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన 2జి స్పెక్ట్రం కేసులో చిదంబరాన్ని బెంగాలీ పెదబాబు బాగానే ఇరికించినట్టే ఉన్నారు. వాలకం చూస్తుంటే కేంద్ర హోంమంత్రి చిదంబరం మెడకు ఉచ్చు  బిగిసుకున్నట్టుంది. చిదంబరం రేపోమాపో రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కుంభకోణంలో  చిదంబరం  పాత్రపై సందేహం వ్యక్తం చేస్తూ ఆర్ధిక  మంత్రిత్వ శాఖలోని ఓ ఉన్నతాధి కారి  రూపొందించిన 14 పేజీల నోట్‌ను ఆర్ధికమంత్రి ప్రణబ్‌  ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. హోం మంత్రి చిదరబరం కుంభకోణం గురించి తగిన విధంగా  పరిశీలించలేదని ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు సమాచార  హక్కు  చట్టం (ఆర్‌టిఐ) ద్వారా విడుదలయ్యాయి.  పదకొండు పేజీల డాక్యుమెంట్‌ను ఆ

అమెరికావెళ్ళి రిలీఫ్ కానున్న మంత్రి

చిత్రం
రాష్ట్రంలో తెలంగాణ మంత్రులు చాలా చిక్కులలో ఉన్నారు. అటు పదవిని కాదనలేక, ఇటు తెలంగాణ ఆందోళనకా రులను ఔనన లేక సతమతమవుతున్నారు. అందువల్ల వీలైనప్పుడల్లా కొందరు మంత్రులు రాష్ట్రానికి దూరంగా వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. కొంతకాలం క్రితం ఆరోగ్య కారణాల రీత్యా మంత్రి జానారెడ్డి కేరళ వెళ్లి వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ఐటి, దేవాదాయ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అమెరికా వెళుతున్నారు. ఆయనకు అర్కన్సాస్ యూనివర్శిటీలో వచ్చే నెలలో సన్మానం జరగబోతోంది. ఆయన అక్కడ చాలా కాలం ఉన్నారు. ఆ తర్వాత 1989లో జనగామ నుంచి పోటీచేసి గెలుపొందారు. అప్పటి నుంచి మరో మూడుసార్లుగెలిచారు. ఈసారి అనూహ్యంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో అది పొన్నాల లక్ష్మయ్యను చికాకు పెడుతోంది. కొందరు ఉద్యమకారులు ఆయనను టార్గెట్ చేసుకుని విమర్శలు కురిపించడమే కాకుండా ఇంటివద్ద ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అంతేకాక రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో ఒక మూడు వారాల నుంచి నాలుగు వారాల పాటు అమెరికా వెళ్లి రావడానికి సిద్దమవుతున్నారు.కొంతకాలంల పాటు రాష్ట్రంలో నెలకొన్న ఈ వివాదాలకు

యువ ప్ర‌తిభావంతురాలు యామిని..

చిత్రం
కృషి ఉంటే మ‌నిషి ఋషి అవుతాడు అని అన్నారు పెద్ద‌లు. ఆ కృషితో క‌ష్ట‌ప‌డి ముందుకు సాగితే విజ‌యం మ‌న వెంట వ‌స్తుంద‌న్న‌ది స‌త్యం. అత్యంత ప్ర‌తిభా పాట‌వాలు క‌లిగిన యామిని త‌న కృషినే న‌మ్ముకుని ముందుకు సాగుతున్న‌ది. ఆమె సాధించిన విజ‌యాలు అమోఘం. అంతే కాదండోయ్‌.. ఆమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం కూడా సంపాదించింది.. ఇంత‌టి ప్ర‌తిభా పాఠ‌వాలు క‌లిగిన యామిని గురించి తెలుసుకోవాల‌నుకుంటున్నారా.. అయితే ఇక్క‌డ క్లిక్ చేయండి.. http://www.vu2yam.webs.com/

మీడియాను `ఛీ..పో..’ అన్న జెనీలియా

చిత్రం
అందాల ముద్దుగుమ్మ జెనీలియా సాఫ్ట్ గా ఉంటుందనే మనకు తెలుసు.కానీ ఇదంతా స్క్రీన్ మీదనే. అవుట్ డోర్ షూటింగ్స్ లో జెనీలియాను చూడాలి. ముక్కుమీదనే కోపం. హైదరాబాద్ లోని ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై వాక్ చేసిన జెనీలియా మీడియాతో ఎలా దూకుడుగా ప్రవర్తించిందో మీరే చూడండి.. - ఎన్.ఆర్.తుర్లపాటి 

బంద్ లతో తెలంగాణ వస్తుందా?

చిత్రం
ఈ ప్రశ్న సీమాంధ్రవాళ్లు అడిగితే తెలంగాణ ఉద్యమకారులకు కోపం రావచ్చు. కానీ అలా అడుగుతున్నది తెలంగాణ బిడ్డలే. వరుస బంద్ లు, రాస్తారొకొలు, ర్యాలీలతో జనజీవనం చిటికీమాటికీ స్తంభించిపోతుండటంతో తెలంగాణ ప్రాంత వాసులే చిరాకుపడు తున్నారు. తెలంగాణ రాజకీయ ఐకాస ఇప్పుడు కొత్త కార్యాచరణ కార్యక్రమం ప్రకటించింది. ఈనెల 28న తెలంగాణ వ్యాప్తంగా రాస్తారొకోలు చేయాలి. 30న తెలంగాణ అంతటా బంద్ పాటించాలి. అక్టోబర్ ఒకటిన కాగడాల ప్రదర్శన, అక్టోబర్ 9,10,11 తేదీల్లో మరోసారి రైల్ రోకొ ఉంటాయని ఐకాస కన్వీనర్ కోదండరాం ప్రకటించారు. దసర సెలవల్లో ఇలాంటి ఉద్యమాలు చేయడంతో నిజంగానే తెలంగాణ వస్తుందా…మొన్నటి రంజాన్ మాసంలో బంద్ లు , ఉద్యమాలకు దూరంగా ఉన్న ఐకాస ఇప్పుడు హిందువుల పండుగల వేళలో ఇబ్బందులు పెట్టడం సబబేనా, ఓసారి ఆలోచించండి. కోదండరాం వంటి మేధావులకు మైనార్టీల పండుగలంటే ఎంత భక్తో అర్థమవుతోంది. హిందువుల పండుగలప్పుడు ఇటు తెలంగాణ వారినీ, అటు ఆంధ్రవాళ్లను ఏడిపించడంలో ఆంతర్యం ఏమిటి? శరన్నవరాత్రి ఉత్సవాలు ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనేకాదు, తెలంగాణలో కూడా బాగా జరుపుకుంటారు. అలాంటప్పుడు హిందువ

దూకుడు తొలిరోజు రికార్డ్ కలెక్ష‌న్‌..

చిత్రం
ప్రిన్స్‌ మ‌హేష్‌బాబు, శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం దూకుడు. ఈ చిత్రం వ‌సూళ్ళ ప‌రంగా రికార్డ్ సృష్టిస్తోంది. సెప్టెంబ‌ర్ 23న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌యిన ఈ చ‌త్రం మొదటి రోజు రూ. 12.56 కోట్ల గ్రాస్‌ని, రూ. 10.11 కోట్ల షేర్‌ని వసూలు చేసింది. తొలిరోజు వసూళ్లలో ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. ఓవర్సీ స్‌లో రెండు రోజులకు ఒక మిలియన్ డాలర్లు వసూలు చేసి అక్కడా ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. ఇండస్ట్రీలోని అన్ని రికార్డుల్ని అధిగమించే దిశగా ‘దూకుడు’ దూసుకుపోతోంది. ఇంత సూపర్‌హిట్ చిత్రాన్ని మా సంస్థకు అందించిన సూపర్‌స్టార్ మహేశ్ గారికీ, దర్శకుడు శ్రీను వైట్ల గారికీ, ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకూ, కృష్ణ-మహేశ్ అభిమానులకూ నిర్మాత‌లు త‌మ కృత‌జ్ఞ‌త‌ల‌ని తెల‌య‌జేశారు.

ఓట‌మికి కారణం నేనే – ధోని

చిత్రం
ముంబయి ఇండియన్స్ చేతిలో అనూహ్య పరాజయానికి తానే కారణమని చెన్నయ్ సారథి ధోనీ అంగీకరించాడు. మలింగను స్టంప్ అవుట్ చేసే చాన్సును చేజేతులా జారవిడిచి జట్టు ఓటమికి బాధ్యుణ్నయ్యానని ధోనీ చెప్పుకొచ్చాడు. ముంబయి లక్ష్యఛేదన సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో జకాటి బౌలింగ్‌లో మలింగ షాట్ కొట్టేందుకు ముందుకురకగా బంతిని అందుకోవడంలో ధోనీ విఫలమయ్యాడు. అప్పటికి 18 పరుగుల వ్యక్తిగత స్కో రు మీదున్న మలింగ ఆ తర్వాత సిక్స్‌లు ఫోర్లతో విరుచుకుపడి జట్టును గెలుపు తీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ, ‘స్టంపింగ్ మిస్ చేసి మ్యాచ్‌ను మూల్యంగా చెల్లించుకున్నాం. మున్ముందు ఇలాంటి పొరబాట్లకు తావివ్వమ’ని చెప్పాడు.

సోనియా, ర‌త‌న్‌టాటా అత్యంత ప్ర‌భావ‌శీలురు..

చిత్రం
యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. ఈ ఏటి మేటి ప్రభావశీలురైన వ్యక్తుల జాబితా టాప్ 50లో నిలిచారు. బ్రిటన్‌కు చెందిన ‘న్యూ స్టేట్స్‌మన్’ పత్రిక నిర్వహించిన ఈ సర్వేలో జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు. కాగా.. సోనియాను ఈ పత్రిక ‘మేడమ్ ఇండియా’గా అభివర్ణించింది. ‘ఇటలీలో పుట్టిన సోనియా భారతదేశంలోనే అత్యంత శక్తిమంత మైన రాజకీయ నాయకుల్లో ఒకరు. 2010 సెప్టెంబర్ 10లో నాలుగోసారి ఏఐసీసీ అధ్యక్షురాలిగా ఎంపికవడం ద్వారా భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలంపాటు ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి’ అని పేర్కొంది. సోనియా ఇందిరాగాంధీ కోడలు అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అలాగే, రతన్ టాటాను ‘మెటల్ హెడ్’ అభివర్ణించిన పత్రిక… భారత దేశాన్ని అంతర్జాతీయ అధికార కేంద్రంగా మార్చుతున్న చి హ్నంగా పేర్కొంది. తన వారసుడు భారతీయుడే అయి ఉండక్కర్లేదన్న రతన్ టాటా వ్యాఖ్యల నుబట్టి ఆయనది నిజంగా అంతర్జాతీయ వ్యాపార సామ్రాజ్యం అనడానికి తిరుగులేని నిదర్శనమంది.