పోస్ట్‌లు

నవంబర్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

బెజ‌వాడ మూవీ రివ్యూ..

చిత్రం
అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా వివేక్ కృష్ణ ద‌ర్శక‌త్వంలో రాంగోప‌ల్ వ‌ర్మ నిర్మించిన చిత్రం బెజ‌వాడ. ఈ చిత్రం రేపు డిసెంబ‌ర్ 1న ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది. క‌థా ప‌రంగా నాగ‌చైత‌న్యని పూర్తి మాస్ క్యారెక్టర్‌లో చూపించ‌డానికి ద‌ర్శకుడు చాల క‌ష్టప‌డ్డాడు. ఈ సినిమా స్టిల్స్‌, ట్రయ‌ల్స్ చూస్తుంటే కూడా నాగ‌చైత‌న్య ప‌క్కా మాస్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడ‌ని తెలుస్తుంది. గ‌తంలో నాగార్జున హీరోగా రాంగోపాల్‌వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన శివ చిత్రానికి ఈ చిత్రానికి పోలిక అస‌లే లేద‌ని రాము చెబుతున్నా ప్రేక్షకులు మాత్రం శివ చిత్రంతో ఈ చిత్రాన్ని పోల్చుకుంటూనే ఉన్నారు. రాంగోపాల్‌వ‌ర్మ చిత్రం అంటేనే వివాదాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంద‌ని అంద‌రికీ తెలుసు.. ఈ చిత్రం కూడో ఎన్నో వివాదాల న‌డుమ విడుద‌ల‌కు సిద్దమ‌యింది. ముఖ్యంగా  ఈ సినిమా బెజ‌వాడ వాసుల‌ని ఎవరిని ఉద్దేశించి తీసింది కాదని వర్మ ఇప్పటికే ప్రక‌టించినా ఈ సినిమా దేవినేని సోదరుల చరిత్రేనని విజయవాడలో బ్యానర్లు ప్రత్యక్షమవడం కలకలం రేపుతుంది. దేవినేని సోదరుల చరిత్ర విషయంపై  నగరంలో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. సినిమా విడుదలకు స

చ‌ట్టాల‌ను క‌ఠిన‌త‌రం చేయాలి..

చిత్రం
చట్టాల అమలులో రాజకీయ జోక్యం అనవసరమని, చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం గోల్కొండ హాల్‌లో డోన్ట్ డ్రింక్ డ్రైవ్ లోగోను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బార్‌లు, పబ్‌లు వేళలను కుదించాలని ఆయన అన్నారు. 2004-2009 వరకు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని డీఎల్ అన్నారు. తప్పు చేసిన వారు మంత్రి అయినా, అధికారి అయినా ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమే అని డీఎల్ పేర్కొన్నారు.

స్టార్ డైరెక్టర్ శంక‌ర్‌తో మ‌హేష్‌

చిత్రం
యమా దూకుడు మీదున్న హీరో మహేష్‌బాబు.. సంచలన దర్శకుడు శంకర్ ఓ భారీ సినిమా నిర్మించనున్నట్లు ఓ ప్రత్యేక వార్త. శంకర్ సంచలన చిత్రం జెంటిల్‌మేన్ .. ఒకప్పుడు ఎంత చరిత్ర సృష్టించిందో తెలిసిందే. దూకుడు సంచలనాలతో జోరు మీదున్న మహేష్‌బాబు కొత్త చిత్రం బిజినెస్‌మాన్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని సినీ వర్గాల అంచనా. రోబోతో ఎన్నో.. రికార్డులకు తెర తీసిన.. దర్శకుడు శంకర్. కొత్త చిత్రం అంటే ఎన్నో అంచనాలు వుంటాయ. కౌబాయ్ గెటప్‌లో హాలీవుడ్ స్థాయలో ఈ చిత్రం వుంటుందని అంటున్నారు.

చిల్లర `పెద్దన్న’ల దోపిడీ -1

చిత్రం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతోన్న వేళ ఇది.  కీలకమైన ఆర్థిక బిల్లుల విషయం తేల్చుకోవాల్సిన సమయం ఇది. సరిగా ఇదే ముహూర్తానికి కేంద్ర ప్రభుత్వం రిటైల్ ఎఫ్.డిఐలకు తలుపులు బార్లా తెరిచింది. దీంతో విపక్షంలోనేకాదు, స్వపక్షంలోని నేతలు కూడా మండిపడే వింత పరిస్థితి ఏర్పడింది. ఇటు పార్లమెంట్ సభాకార్యక్రమాలను స్తంభింపజేస్తూ, అటు తీవ్ర ఆందోళనలకు దారితీస్తున్న రిటైల్ ఎఫ్.డి.ఐల లోగుట్టు కథ ఇదే… కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో ఇకపై చిల్లరకొట్టు చిట్టెమ్మల స్థానంలో విదేశీ పెద్దన్నలు రాజ్యమేలొచ్చు. దీంతో బతుకుతెరువుకోసం రిటైల్ షాపులు నడుపుకునేవారికి గడ్డురోజులు రావచ్చు.  మన రిటైల్ వ్యాపారం విదేశీ కంపెనీల గుప్పెట్లో చిక్కుకుపోవచ్చు.  ఇవన్నీ కేవలం భయాలేనా, లేక వాస్తవరూపందాల్చే పరిస్థితులా ? కేంద్ర ప్రభుత్వం మాత్రం విదేశీ పెట్టుబడులతో మన రిటైల్ కు స్వర్ణయుగం రాబోతుందంటూ ఊరిస్తోంది. ఏది నిజం ? మరేది భ్రాంతి ?? దేశంలో రిటైల్ వ్యాపారం రంగు, రూపు, రుచి, వాసన మారిపోయే పరిస్థితి ఏర్పడింది.  రిటైల్ రం

జ‌గ‌న్‌కి మ‌రో ఇద్దరు ఎమ్మెల్యేల షాక్‌

చిత్రం
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు క్రమేపి ఆ పార్టీకి దూరం అవుతున్నారు.కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి జగన్ వర్గానికి దూరం అయి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడానికి రంగం సిద్దం అయినట్లు చెబుతున్నారు.కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసినట్లు తెలిసింది.ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ గా ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అలిగిన రాంభూపాల్ రెడ్డి జగన్ కు దగ్గరయ్యారు.కాగా ఆయన సమీప బందువు గాలి జనార్ధనరెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయ్యాక జరిగిన పరిణామాలలో ఆయన మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా?లేదా అన్నది చూడాలి. కాగా కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి కూడా అదే బాటలో ఉన్నారని చెబుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే శేషారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లోకి వెళ్లి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ప్రకటించగా ఇప

బ‌ళ్లారిలో ఉపఎన్నిక పోలింగ్‌..

ఓబులాపురం మైనింగ్ కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్న గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి పుణ్య‌మా అని క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది.  బళ్లారి గ్రామీణ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారు. ఎన్నిక ల బరిలో ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నా, స్వతంత్ర అభ్యర్థి శ్రీరాములు, బీజేపీ అభ్యర్థి గాదిలింగప్ప, కాంగ్రెస్ అభ్యర్థి రాంప్రసాద్ మధ్యనే హోరాహోరీ పోటీ నెలకుంది. అయితే ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో తెలుసుకోడానికి వచ్చే నెల నాలుగో తేదీ వరకు వేచి ఉండాల్సిందే! పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. పోలీసు సిబ్బందితో పాటు పారామిలటరీ దళాలు బళ్లారిలో తిష్టవేశాయి. ఎన్నికకు 2,500 మంది పోలీసులను ప్రపభుత్వం నియమించింది. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు సమస్యాత్మకమైన 10 ప్రాంతాల్లో కేంద్ర బలగాలనూ మోహరించారు.

విండీస్ పై భార‌త్ సంచ‌ల‌న విజ‌యం

చిత్రం
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఒక వికె ట్ తేడాతో విజయం సాధించింది. 212 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మిడిల్ ఆర్డర్‌ను రోచ్, రస్సెల్ కుప్పకూల్చారు. ఓదశలో 159 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును రోహిత్ శర్మ, వినయ్ కుమార్‌లు లక్ష్యం వైపు నడిపించారు. విజయానికి 12 కావాల్సివుండగా రోహిత్ శర్మ 72 పరుగులు చేసి సమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత యాదవ్‌తో ఆరోన్ కలిసి విజయానికి కావల్సిన పరుగుల్ని ఇంకా ఏడు బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. యాదవ్ 6, ఆరోన్ 6 పరుగులుతో నాటౌట్‌గా మిగిలారు. విండీస్ బౌలర్లలో రోచ్ 3, రస్సెల్ 2, మార్టిన్, సమీ, పొలార్డ్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో బ్రావో అత్యధికంగా 60, హ్యాత్ 31 పరుగులు చేశారు. యాదవ్, ఆరోన్‌లు రెండేసి వికెట్లు, వినయ్, అశ్విన్, జడేజా, రైనాలు చెరో వికెట్ పడగొట్టారు.

రాజ‌కీయాల్లోకి యువ‌త రావాలి..

చిత్రం
యువత రాజకీయాల్లోకి రావాలని ఏఐసిసి అధ్యక్షు రాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన యువజన కాంగ్రెసు సదస్సులో సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనియా, మన్మోహన్ మాట్లాడారు. యువత రాజకీయాల్లో చురుగ్గు ఉండాలన్నారు. అవినీతి నిర్మూలనకే సమాచార హక్కు చట్టం ఉందన్నారు. ప్రజల గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెసు మాత్రమేనని, యువతకు కాంగ్రెసులో ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రజలకు ఉపకారం చేసేది, భారత్ అవసరాలు తీర్చేది కేవలం కాంగ్రెసేనని, ఆ కాంగ్రెసుకు మూలాధారం యూత్ కాంగ్రెసు అన్నారు. కాంగ్రెసుకు ఆశ, శ్వాస కార్యకర్తే అన్నారు. సమగ్ర విధానం తర్వాతే ఎఫ్‌డిఐ రూపకల్పన జరిగిందని ప్రతిపక్షాలు దీనిని అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఎఫ్‌డిఐ వల్ల చిన్న వ్యాపారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఇది రిటైల్ రంగానికి దోహద పడుతుందని, కొత్త చట్టాలు తేవాలని ప్రయత్నిస్తుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర

ఫామ్‌హౌజ్‌లో చ‌ర‌ణ్ నిశ్చితార్థం

చిత్రం
చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తేజ్, అపోలో గ్రూప్ చైర్మన్ సి. ప్రతాప్‌రెడ్డి మనవరాలు ఉపాసనల నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలోని అపోలో ఫాంహౌస్‌లో డిసెంబర్ 1న రామ్‌చరణ్ తేజ్-ఉపాసనల నిశ్చితార్థం జరుగనుంది. ఇందు కోసం 20 రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొక రోజే సమయం ఉండటంతో మిగిలిన చిన్నచిన్న పనులను ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే ఫాంహౌస్‌లో 30 ఎకరాల స్థలాన్ని చదునుచేశారు. నిశ్చితార్థ వేదికను భారీ సెట్టింగులతో ఏర్పాటు చేస్తున్నారు. రెండు వేల మంది వీఐపీలు హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు చేశారు. చరణ్ నిశ్చితార్థానికి దేశంలోని నలుమూలల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తరలిరానుండడంతో వేదిక అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర ఉండాలనే ఆలోచనతో అపోలో ఫాంహౌస్‌ను ఎంచుకున్నట్లు మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. వీఐపీలు భారీగా వస్తుండడంతో వాహనాల పార్కింగ్‌కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు

ఓఎంసీ కేసులో 2న చార్జిషీట్ దాఖలు!

చిత్రం
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో వచ్చేనెల 2వ తేదీన సీబీఐ చార్జిషీటు దాఖలు చేయనుంది. అభియోగ పత్రాలతోపాటు అనుబంధ డాక్యుమెంట్లతో కలిపి సుమారు పదివేల పేజీలతో కూడిన 20 వాల్యూమ్స్‌ను కోర్టుకు సమర్పించ నున్నారు. ఈ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేసిన తరువాత సెప్టెంబర్ ఐదో తేదీన సీబీఐ దర్యాప్తు పునఃప్రారంభమైంది. వెంటనే ఓఎంసీ యజమాని గాలి జనార్ధన్‌రెడ్డి, ఎండీ శ్రీనివాసరెడ్డిలను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్, ఐఏఎస్ అధికారిణి వై,శ్రీలక్ష్మి కూడా అరెస్టయ్యారు. వచ్చే నెల 4వ తేదీలోగా చార్జిషీటు సమర్పించాల్సి ఉంది. గడువుకు రెండు రోజులు ముందుగానే చార్జిషీటు దాఖలు చేయనున్నారు.

రామోజీరావుకి సంబంధం లేదు..

చిత్రం
శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి భూముల సేకరణలో ఎలాంటి అవకతవకలు లేవని సిబిఐ గతంలోనే నివేదిక ఇచ్చిందని, దానిని విస్మరించి శంషాబాద్ భూములను వివాదాస్పదం చేస్తూ వై.ఎస్.విజయమ్మ పిటిషన్ వేసిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు , శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ చేసిన విమర్శను, అలాగే సిబిఐ నివేదికలోని అంశాలను ఈనాడు బ్యానర్ కధనంగా ఇచ్చింది. తాను పీకలోతు బురదలో కూరుకుపోయి, ఇతరులపై కూడా అదే విధంగా బురదజల్లాలని చూస్తున్నారని కూడా ఆరోపించారు.కాగా కేశవ్ మాట్లాడుతూ శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు 1998లోనే జి.ఓ విడుదల అయితే రామోజీరావు 2001లో అంటే మూడేళ్ల తర్వాత భూములు కొనుగోలు చేశారని వెల్లడించారు. అందువల్ల శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు , రామోజీరావు భూముల కొనుగోలుకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓఎమ్సి గనుల లీజు కు సంబంధించి నోట్ ఫైల్ పై సంతకం చేసిన విషయం బయటపడిందని, దీంతో ఆమె సంకటంలో పడ్డారని అంటూ మరో కధనాన్ని ఈనాడు ఇచ్చింది.

సినీ ర‌చ‌యిత కుమారుడు అరెస్టు

చిత్రం
సినిమాల్లో అవ‌కాశం ఇస్తామంటూ అమాయ‌క‌మైన యువ‌తు ల‌ను మోసం చేయ‌డం కృష్ణాన‌గ‌ర్‌, ఫిలింన‌గ‌ర్ లాంటి ఏరియాల్లో మామూలుగా జ‌రిగే తంతే.. కొంద‌రు స్వార్థప‌రులు సినిమాల్లో న‌టించాల‌న్న ల‌క్ష్యంతో వ‌చ్చిన వారిని టార్గెట్ చేసుకుని వారి బ‌ల‌హీన‌త‌ని డ‌బ్బుగా మ‌లుచుకుని ప‌బ్బం గ‌డుపుకుంటారు.. ఇక అంద‌మైన అమ్మాయిలు క‌నుక త‌గిలారంటే.. సినిమా వేషం ఇస్తామంటూ శృంగార కార్యక‌లాపాలు కూడా చేయించే దుర్మార్గులు కూడా కోకొల్లలు.. అయితే ఇలాంటి మోసాలు సినీ ఫీల్డులో ఉండే చిన్నస్థాయి వ్యక్తుల‌వ‌ల్లే ఎక్కువ‌గా జ‌రుగుతుం టాయి.. ఒక స్థాయి క‌లిగిన వ్యక్తులు ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండ‌డానికే ప్రయ‌త్నిస్తారు.. కానీ.. తాజాగా ఓ ప్రముఖ ర‌చ‌యిత కుమారుడు సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి కొంద‌రు యువ‌తుల‌ను మోసం చేయ‌డం విస్మయాన్ని క‌లిగిస్తోంది.. ప‌లు చిత్రాల‌కు క‌థ‌-మాట‌లు అందించిన  సినీ రచయిత మరుదూరి రాజా కుమారుడు సాయి కిషోర్ మ‌రో న‌లుగురితో క‌లిసి ఓ గ్రూపుగా ఏర్పడి మోసాల‌కు పాల్పడిన‌ట్టు స‌మాచారం రావ‌డంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్దనుండి 6 ల‌క్షల విలువై

రామోజీపై ఉండ‌వ‌ల్లి ఫైర్‌

చిత్రం
చాలాకాలం తర్వాత ఈనాడు అధినేత రామోజీరావు, రాజమండ్రి లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణకుమార్ ల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రామోజీకి చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉండవల్లి ఫిర్యాదు చేయడం, దానిపై ఇంతకాలంగా కేసులు జరగుతుండడం తెలిసిన సంగతే. అయితే వై.ఎస్. మరణానంతరం ఈ గొడవ కాస్త తగ్గుముఖం పట్టింది.కాగా ఉండవల్లి అరుణకుమార్ తాజాగా హైకోర్టుకు వేసిన పిటిషన్ లో రామోజీ తాను మార్గదర్శి చిట్‌ ఫండ్ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నానని పేర్కొన్నారని, , దీనిలోతప్పుడు సమాచారం ఉందని ఉండవల్లి ఆరోపించారు. దీనిపై రామోజీని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలని ఆయన కోరారు. కాగా దీనికి ప్రాతిపదికగా అంతకు ముందు మార్గదర్శి ప్రతినిది బాలాజీ రెండువేల ఎనిమిదిలో తనపై వేసిన వ్యాజ్యంలో మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారాన్ని రామోజీ నిర్వహిస్తున్నారని అనడంలో వాస్తవం లేదని పేర్కొన్నారని,ఇది రామోజీ ఆమోదంతో ఇచ్చిన ప్రమాణ పత్రంగా తెలిపారని, రెండిటి మధ్య వైరుద్యం ఉందని, కనుక చట్టపరంగా చర్య తీసుకోవాలని అరుణకుమార్ కోరారు.

వైభవంగా పంచమి తీర్థ మహోత్సవం

చిత్రం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం పంచిమ తీర్థ మహోత్సవం మంగళవారం మధ్యాహ్నం వైభవంగా జరిగింది. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు కుంభ లగ్నంలో జరిగిన చక్రస్నానానికి లక్షలాది భక్తులు తరలి వచ్చారు. బ్రహ్మోత్సవాలలో చివరిది, ముఖ్యమైన ఘట్టం పంచమి తీర్థం(చక్రస్నానం). అమ్మవారి పద్మసరోవరం(పుష్కరిణి)లో జరిగే పంచమి తీర్థం మహోత్సవం అత్యంత విశిష్టమైనది. ఈ మహోత్సవం రోజున పద్మసరోవరంలో పుణ్యస్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కార్తీక మాసం శుక్ల పక్షం, పంచమి తిథి, ఉత్తరాషాడ నక్షత్రంలో అమ్మవారు స్వర్ణకమలంలో అనంత సూర్యకాంతులతో స్వామివారిని అనుగ్రహిస్తారు. ఈ పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి అమ్మవారికి సారె (తులసి, కుంకుమ, పసుపు, పట్టుచీర, పణ్యారం, అన్నప్రసాదం)తదితర వాటిని ఏనుగులపై ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకొచ్చి ఆలయ మర్యాదలతో అందజేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన ఈ పద్మ సరోవరంలో ప్రతి ఏడాది నిర్వహించే పంచమి తీర్థం(చక్రస్నానం)కు స్వయంగా స

అమ్మ ప‌ల‌క‌నిదే ఆయ‌న ప‌ల‌క‌డు..!

చిత్రం
ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో మాటలు చెప్పడంలో , ఆకట్టుకునే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు తర్వాతే ఎవరైనా! ఆయన ప్రధానిని నిందించడానికి చప్రాసీలను వాడుకున్నారు. పార్లమెంటులో మంత్రులు ఎమ్.పిలను అక్కడి ఛప్రాసీలు నమస్తే సర్ అని అంటరు. తాను పోతుంటే మాత్రం జై తెలంగాణ సార్ అంటరు. మీది న్యాయమైన పోరాటం, తప్పక విజయం సాధిస్తారని కూడా ఒక ఛప్రాసి అన్నారని కెసిఆర్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా ఉంది. అందువల్ల ఛప్రాసికి ఉన్న జ్ఞానం కూడా ప్రధానికి లేదని కెసిఆర్ ధ్వజమెత్తారు.ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. ఎవరైనా మన రాష్ట్రానికి చెందినవారు చప్రాసీలుగా ఉంటే ఆ మాట అనవచ్చేమోకాని, మిగిలినవారికి ఈ విషయం అంతగా పడుతుందా అన్నది సందేహం. అయినప్పట్టికీ, అది జరిగి ఉంటుందన్న అభిప్రాయం కలిగేలా ఉపన్యాసం ఇవ్వడమే ఆయన గొప్పతనంగా చెప్పాలి. అయితే ఇదే సమయంలో మరోవిషయాన్ని ఆయన చెప్పారు.అమ్మ(సోనియా) పలకనిదే ఆయన పలకడు, మన ఖర్మానికి దేశం అలాంటి ప్రదానిని కన్నది అని ఆయన విమర్శించారు. అంటే తెలంగాణ ఇవ్వడం కుదరదని కొంతకాలం క్రితం ప్రధాని చేసిన వ్యాఖ్య

కణిమొళికి బెయిలు,కేవలం ఊరటే

చిత్రం
 కణిమొళికి బెయిల్ రావడం ఆమె తండ్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్ కి కొంత ఊరటకలిగిస్తే కలిగించిఉండవచ్చు. కానీ బెయిల్ దక్కినంతమాత్రాన 2జి ఉరితాడు మెడమీదనుంచి జారిపోయిందని భావిచనక్కర్లేదు. నిజానికి మొన్న దీపావళినాటికే కణిమొళికి బెయిల్ వస్తుందని పెద్దాయన ఆశించారు. కానీ ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో కణిమొళి కంటతడిపెట్టుకుంది. అయితే, 2జి కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో కస్టడీలోఉన్న నిందితులకు బెయిల్ ఇచ్చినా కీలక సాక్ష్యాలనూ, ఆధారాలను తారుమారుచేసే అవకాశం దాదాపుగా ఉండదు. సీబీఐ ఇప్పటికే దాఖలుపరిచిన అభియోగ పత్రాలు (ఛార్జ్ షీట్) ఆధారంగానే న్యాయస్థానంలో కేసు నడుస్తుంది. బహుశా ఈ కారణంగానే ఇదే కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఐదుగురు కార్పొరేట్ అధికారులకు బెయిల్ మంజూరు చేయడంతో కణిమొళి బెయిల్ కథ సుఖాంతమైఉండవచ్చు.  అయితే ఇదే కేసులో జైలులో ఉన్న అప్పటి టెలికామ్ శాఖ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురాకు మాత్రం కోర్టు బెయిలు మంజూరు చేయలేదు. 2జి స్పెక్ట్రమ్ కేసులో కనిమొళితోపాటు మరి నలుగురికి కూడా సోమవారంనాడు బెయిల్ లభించింది. బెయిల్ లభించినవారిలో కళైగ్నర్ మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కుమార్ కూడా ఉన్నారు. ఇంకా కరీం

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి అరెస్ట్

చిత్రం
ఓబుళాపురం గనుల కేటాయింపు కేసులో ఐఏఎస్ అధికారిణి  శ్రీలక్ష్మిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఓఎంసీకి గనులు ముట్టజెప్పడంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై శ్రీలక్ష్మిని అరెస్టు చేశారు. ఈ కేసులో శ్రీలక్ష్మి మూడో ముద్దాయిగా ఉన్నారు. గత కొంతకాలంగా శ్రీలక్ష్మి అరెస్టు పై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఆమె అరెస్టు ను తప్పించుకోవడం కోసం చేయని ప్రయత్నమంటూలేదు. అంతకుముందు శ్రీలక్ష్మిని సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం పిలిపించుకున్నారు. ఒకసారి9 గంటలు, మరోసారి 12 గంటలపాటు విచారణ జరిపిన తర్వాత విడిచిపెట్టారు. ఆమెకు సంబంధించిన లాకర్లలో కీలక డాక్యుమెంట్లు, బంగారాన్ని కూడా సీబీఐ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. మెడికల్ గ్రౌండ్స్ లో తనను విడిచిపెట్టాలని కోరినా ఫలితం కనిపించలేదు. ఆధారాలు బలంగాఉండటంతో ఆమె అరెస్ట్ అనివార్యమైంది. శ్రీలక్ష్మి అరెస్ట్ తో మిగతా ఐఏఎస్ ల్లో గుబులు బయలుదేరింది. శ్రీలక్ష్మి అరెస్ట్ వార్తను సీబీఐ అధికారులు ధ్రువీకరించారు.

హైకోర్టులో బాబు వెకేట్ పిటిషన్

చిత్రం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పిటిషన్‌పై హైకోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. విజయమ్మ తనపై రాజకీయ దురుద్దేశ్యంతోనే పిటిషన్ వేశారని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా తమ వాదనలు ఏమాత్రం వినకుండానే ప్రాథమిక విచారణకు ఆదేశించారని మా వాదనలు వినేంత వరకు విచారణను నిలుపుదల చేయాలని అందులో కోరారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, టిడిపి నేత సిఎం రమేష్, నామా నాగేశ్వర రావు కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు ఆస్తుల కేసు విషయంలో ప్రతివాదులుగా ఉన్న రామోజీరావు, సిఎం రమేష్, నామా నాగేశ్వర రావు సుప్రీం కోర్టును ఆశ్రయించడం, కేసులో ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోమని కోర్టు వారికి సూచించడంతో పాటు హైకోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు సూచన మేరకు వారు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు సుప్రీంకు వెళ్లనప్పటికీ ఆ కోర్టు సూచనల దృష్ట్యా హైకోర్టును సోమవారం ఆశ్రయించారు.

త‌ల‌లు తెగిప‌డినా.. త‌ల‌వంచం..

చిత్రం
తెలంగాణ విషయంలో తల తెగినా… తలవంచే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి తప్పా ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వాలకు పట్టవని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం న్యూ డెమోక్రసీ ధర్నా చేపట్టింది. కేసీఆర్, విజయశాంతి, జితేందర్ రెడ్డిలు మద్దతు పలుకుతూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ప్రభుత్వం తనపై వంద కేసులు పెట్టిందన్నారు. తెలంగాణ ఒప్పందాలను తుంగలోకి తొక్కారని, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ఉద్యమం గమ్యానికి చేరుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు దుబాయిలోనే తెల్లరిపోతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ వాణి వినిపించకుండా కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాలూ బాగుపడతాయన్నారు. తెలంగాణ గురించి అంతా తెలిసినా ప్రధాని మౌనంగా ఉంటున్నారని… ఆయన ప్రధానిగా ఉండటం మన కర్మ అని కేసీఆర

పాపం.. గాలికి మ‌ళ్లీ ఎదురుగాలే..!

చిత్రం
అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ వ‌ల‌లో చిక్కిన గాలి జ‌నార్థన‌రెడ్డి ఏ శుభ ఘ‌డియ‌ల్లో చంచ‌ల్‌గూడ‌ జైలుకి వెళ్ళాడో తెలియ‌దు గానీ… ఆయ‌న్ని జైలునుండి విముక్తి చేయ‌డానికి అత‌ని లాయ‌ర్లు ఎన్ని విధాలుగా ప్రయ‌త్నించినా జైలు మాత్రం ఆయ‌న్ని వ‌దిలిపెట్టడం లేదు… రెండు మాసాలుగా జైలు జీవితం గ‌డుపుతున్న గాలి ఎప్పుడు ఎప్పుడు బ‌య‌ట‌ప‌డుదామా అని ఆరాట‌ప‌డుతుంటే.. ప‌రిస్థితులు మాత్రం ఆయ‌న‌కి పూర్తి విరుద్దంగా త‌యార‌వుతున్నాయి.. ఒక ద‌శ‌లో నాకు బెయిలు ప్రసాదించండి మ‌హాప్రభో అంటూ జ‌డ్జి ఎదుట బోరున విల‌పించిన‌ప్పటికీ ఫ‌లితం లేకుండా పోయింది.. తాజాగా గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు బెయిల్ మంజూరుపై మరోసారి నిరాశే ఎదురైంది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వీరికి వచ్చే నెల 3వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించ‌డంతో గాలి హృధ‌యం మ‌ళ్లీ బ‌రువెక్కిపోయింది.. బ‌య‌ట ఉన్నప్పుడు నేను మోనార్క్ ని న‌న్ను ఎవ‌రూ ఏమీ పీక‌లేరు అన్నరేంజ్‌లో బ‌తికిన గాలి ప్రస్తుతం సుడిగాలిలో చిక్కుకున్నవాడిలా గిలా గిలా కొట్టుకుంటున్నాడు.. అందుకే మ‌రి.. ఎంత ఉన్నా ఒదిగి ఉండాల‌ని పెద్దలు ఊ

ధ‌నుష్ కొల‌వెరి మేనియా..

చిత్రం
వై దిస్ కొల‌వెరి… కొల‌వెరి కొల‌వెరిది..! అంటూ త‌మిళ హీరో ధ‌నుష్ ర‌చించి, స్వంతంగా పాడిన పాట‌ ఇది.. ఈ పాట ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన డిమాండ్ సంపాదించుకుంది.. కేర్‌లెస్‌గా.. హ‌స్కీగా.. త‌మిళం, ఇంగ్లీష్ క‌ల‌బోత‌తో సాగే ఈ పాట‌.. ఈ పాట‌కి త‌గ్గట్టుగా స్వర‌ప‌రిచిన సంగీతం అంద‌రికీ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుండ‌డం విశేషం. ఈ సాంగ్ రికార్డింగ్ విజువ‌ల్స్‌ని యూటూబ్‌లో పెట్టారు.. ఈ యూటూబ్‌ని ఏకంగా 80 ల‌క్షల‌మంది చూశారంటే ఈ పాట ఏరేంజ్‌లో దుమ్ముదులుపుతుందో అర్థమ‌వుతుంది.. ఈ సాంగ్ కి వ‌స్తున్న పాపుల‌ర్‌ని గ్రహించి జాతీయ మీడియా సైతం ఈ సాంగ్‌ని టెలికాస్ట్ చేయ‌డంతో మ‌రింత పాపులారిటీ వ‌చ్చింది.. ఇప్పుడు ఎవ‌రి నోట చూడూ ఈ సాంగే నాట్యమాడుతుందంటే ఈ సాంగ్‌కి వ‌చ్చిన పాపులార‌టి ఎలాంటిదో తెలుస్తోంది.. ధ‌నుష్ హీరోగా ఆయ‌న భార్య, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య ద‌ర్శక‌త్వంలో రూపొందుతు 3 చిత్రం కోసం ఈ సాంగ్‌ని కంపోజ్ చేశారు.. ఈ చిత్రంలోని అన్ని సాంగ్స్‌ని హీరో ధ‌నుషే రాయ‌డం మ‌రో విశేషం కాగా.. వైదిస్ కొల‌వ‌రి సాంగ్‌ని వ్రాయ‌డ‌మే కాకుండా తానే పాడి ఇంత క

అసెంబ్లీ భ‌ద్రత‌పై స్పీక‌ర్ స‌మీక్ష

చిత్రం
డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ దినేష్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ, నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్, ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ ఆనంద్ హాజరయ్యారు. సమీక్ష అనంతరం ఏకేఖాన్ మీడియాతో మాట్లాడుతూ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలకు కూడా పటిష్ట బందోబస్తు ఉంటుందని ఏకే ఖాన్ తెలిపారు.

చంద్రబాబు, నారాలోకేష్‌ల‌కి నోటీసులు

చిత్రం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ లకు సీబీఐ సోమవారం నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులుపై సీబీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

చంద్రబాబు, నారాలోకేష్‌ల‌కి నోటీసులు

చిత్రం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ లకు సీబీఐ సోమవారం నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులుపై సీబీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

జ‌గ‌న్ అనుచ‌రుల‌పై రౌడీషీట్‌

చిత్రం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ముద్రపడిన ఇద్దరి పైన పులివెందుల పోలీసులు రౌడీషీట్ తెరిచారు. జగన్ ముఖ్య అనుచరుడిగా ముద్ర పడిన దంతులూరు కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పైన స్థానిక పోలీసులు రౌడీషీట్ తెరిచారు. దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో సిబిఐ మంగలి కృష్ణను విచారించడంతో ఆయన పేరు ప్రముఖంగా బయటకు వచ్చింది. హైదరాబాదులోని సూట్ కేసు బాంబు కేసు విషయంలోనూ ఆయనను విచారించారు. పులివెందులలో మంగలి కృష్ణతో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పైనా పలు కేసులు ఉన్నాయి. ఉప ఎన్నికల సమయంలో వీరిద్దరిని నగర కూడలిలోకి పిలిపించి పోలీసులు హెచ్చరించారని తెలుస్తోంది. ఆర్టీసి బస్టాండ్ వద్ద మూడు నెలల క్రితం జరిగిన ధర్నాకు సంబంధించి ఈ ఇద్దరి పైనా కేసులు నమోదయ్యాయి. ఉప ఎన్నికల సమయంలో మంగలి కృష్ణపై బైండోవర్ కేసు నమోదైంది. ఇవే కాకుండా ఇతర ప్రాంతాలలోనూ కృష్ణపై కేసు ఉన్నట్లుగా తెలుస్తోంది.

హెయిర్ డై ప్రాణాలుతీస్తుందా?

చిత్రం
వయసు పెరుగుతున్నా అందంగా ఉండాలనుకోవడం తప్పుకాదు. అయితే, ఇందుకోసం ఉపయోగించే ప్రాడెక్ట్స్ లో  కెమికల్స్  ప్రభావం ఏమిటో ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే, హెయిర్ డయిస్ లోని కెమికల్స్ యమడేంజర్ అని తేలిపోయింది. కాబ‌ట్టి హెయిర్ డై చేయించుకోవాల‌నుకున్న‌ప్పుడు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. జుట్టు నెరవడం ఓల్డ్ ఏజ్ కు గుర్తని ఒకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు వయసుపైబడుతున్నా జుట్టు నెరవడంలేదు. ఒక్క తెల్లవెంట్రుక కూడా కనిపించడంలేదు. ఇదేదో ప్రకృతిచేసిన మాయాజాలం అనుకుంటే పొరపాటే. కెమికల్స్ చేస్తున్న ఇంద్రజాలం. అవును, ప్రపంచమంతటా కోట్లాదిమంది వాడుతున్న హెయిర్ డైయిస్ లోని రసాయనాలే జుత్తు రంగును చిటికలో మార్చేస్తున్నాయి. అయితే,  కోట్లాది మంది వాడుతున్న కెమికల్ రసాయనాలతో తయారయ్యే హెయిర్ డయిస్ వాడటం మంచిదేనా? శరీరానికి ఎలాంటి హానీ చేయవా? అన్న ప్రశ్న‌ల‌కు హెయిర్ డ‌యిస్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌నే జ‌వాబు వ‌స్తుంది.. హెయిర్ డయిస్ ను ఉత్పత్తి చేస్తోన్న వందలాది కంపెనీలు క‌నీస భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను పాటించ‌కుండా విచ్చ

గ‌వ‌ర్న‌ర్ మృగం లాంటివాడు-గ‌ద్ద‌ర్‌

చిత్రం
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్‌రావు ఉరఫ్ కిషన్‌జీ మృతదేహం వద్ద ప్రజా గాయకుడు గద్దర్, విప్లవ రచయిత వరవరరావు, వేదకుమార్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ మనిషి రక్తం తాగే మృగం లాంటివాడు గవర్నర్ నరసింహన్ అని అన్నారు. కిషన్ జీతో కలిసి తాను కూడా 40 రోజులపాటు మిలటరీ శిక్షణ పొందినట్లు తెలిపారు. గవర్నర్ కు, ప్రభుత్వానికి దమ్ముంటే తనని జైల్లో పెట్టాలన్నారు. తెలంగాణ కోసం కిషన్ జీ ఎంచుకున్న పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు. నక్సలైట్లు దేశభక్తులు అన్న మమతా బెనర్జీ, కిషన్ జీని చంపించడంతో ఆమె నైజం ఏంటో వెల్లడైందన్నారు. వరవరరావు మాట్లాడుతూ కిషన్ జీని అతి దారుణంగా హత్య చేశారన్నారు. శరీరం అంతా కుళ్లబొడిచారని చెప్పారు. శనివారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో కిషన్ జీ భౌతికకాయాన్ని కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తరలించారు. ఈరోజు ఇక్కడి చందాపల్లి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కిషన్ జీ అంతిమ యాత్ర మొదలవుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోటాపోటీ క‌థ‌నాలు

చిత్రం
మన రాష్ట్రంలో రెండు పత్రికల మధ్య యుధ్దం ఇప్పుడు ఒక పరాకాష్టకు వచ్చినట్లే. జగన్ పై సిబిఐ దర్యాప్తునకు సంబంధించిన కధనాలను ఈనాడు ప్రముఖంగా ప్రచురిస్తుంటే, ఇక చంద్రబాబు, రామోజీ తదితరులపై సిబిఐ విచారణకు సంబందించిన విశేష వార్తలను ఇవ్వడానికి సాక్షి సిద్దమైంది.నిజానికి ఈ రెండు పత్రికలు ఇప్పటికే విపరీతమైన రీతిలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో కధనాలు రాసుకున్నాయి.అలాగే ఒక పత్రిక రాసినదానికి మరో పత్రిక ఖండన కధనం రాయడం, ఎదురు మరో వ్యతిరేక కధనం ఇవ్వడం జరుగుతూ వస్తోంది. తాజాగా డెలాయిట్ ఆడిటింగ్ సంస్థ ఆడిటర్ సుదర్శన్ ఇచ్చిన సాక్ష్యం వార్తను మరోసారి ఈనాడు ప్రముఖంగా ఇస్తే, చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎమ్ జి.భారత సంస్థకు 450 ఎకరాలు ఇవ్వడానికి జీవో జారీ చేసిన విషయంపై ప్రముఖంగా బానర్ ఇచ్చింది. నిజానికి ఈ రెంటిలో కొత్త విషయం పెద్దగా లేదనే చెప్పాలి. కాని రెండు పత్రికలు కూడా తమ పాఠకులను తమ వార్తల ప్రభావంలోకి తీసుకు వెళ్లడానికి విశేషంగా యత్నిస్తున్నాయని చెప్పాలి. తీవ్ర స్థాయిలో కక్షలు పెరిగినప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాకపోతే రెంటికి సంబంధి

కెసిఆర్ కుమార్తె రాజ్యస‌భ‌కు..?

చిత్రం
తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు కుమార్తె , తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత పేరు ఇప్పుడు రాజ్యసభ పదవికి పోటీచేసేవారి జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. టిఆర్ఎస్ లో ప్రచారం సంగతి ఎలా ఉన్న ఇతర రాజకీయ పార్టీలలో ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతుండడం విశేషం. టిఆర్ఎస్ తన సంఖ్యాబలం పెంచుకోడానికి ప్రయత్నించడంలో ఒక లక్ష్యం కవితను రాజ్యసభ సభ్యురాలిగా చేయడం కూడా అని తెలుగుదేశం నేత ఒకరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం కాంగ్రెస్ మూడు సీట్లు, తెలుగుదేశం రెండు సీట్లు సులువుగానే గెలుచుకోవచ్చు. నాలుగో సీటు విషయంలో అత్యంత ఉత్కంఠ నెలకొంటుంది.అయితే కిందటిసారి శాసనమండలి ఎన్నికల మాదిరి కాంగ్రెస్ నేరుగా పోటీచేస్తుందా ? లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. కాంగ్రెస్ పోటీచేయని పక్షంలో టిఆర్ఎస్ పక్షాన ఎవరో ఒకరు పోటీచేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావనకు రావచ్చని అంటున్నారు.నిజానికి ఆమె నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేయవచ్చని కూడా ఒక ప్రచారం ఉంది. దానికి కారణం ఆమె అత్తవారిల్లు ఆ నియోజకవర్గంల