పోస్ట్‌లు

2012లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
ప్రియమైన మిత్రులారా… వృత్తి పరంగా మార్పులు రావడం సహజమే. ఈ మధ్య అనారోగ్యం కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత నేను తిరిగి నా జర్నలిజం కెరీర్ పై దృష్టిపెట్టాను. ఈ మార్పులు సంభవిస్తున్న కాలంలోనే నా కెరీర్  మలుపు తిరిగింది.  (పైన రాసిన లేఖ, తరంగ మీడియా చైర్మన్ మోహన్ మురళీధర్ గారు రాసింది) ప్రవాసఆంధ్ర మిత్రులు అందించిన ప్రోత్సాహంతో నేను తరంగ మీడియాలో న్యూస్ అండ్ ప్రొగ్రాం డైరెక్టర్ గా చేరాను. అంతవరకు టివీ 5 న్యూస్ ఛానెల్ లో పనిచేస్తూ ఎంతో మంది మిత్రుల ఆత్మీయఅనుబంధాన్ని పెంచుకున్నాను. దీనికంటే ముందు తెలుగువన్.కామ్, అలాగే, ఆంద్రప్రభ, ఇంకా వెనక్కి వెళితే ఈనాడు (1983)లో ఎంతో మంది మిత్రులతో కలిసిపనిచేసే భాగ్యం లభించింది. అలాగే, ఆకాశవాణితో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మరువలేనిది.   ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మిత్రులే నాకున్న నిజమైన బలం. వారిందిస్తున్న ప్రోత్సాహంతోనే ఇప్పుడు నేను  రేడియో తరంగ (ఆన్ లైన్ రేడియో)లో సోమవారం నుంచీ శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచీ 9 గంటల వరకు వార్తా విశ్లేషణ కార్యక్రమాన్ని లైవ్ షోగా ఇస్తున్నాను. ఈ లింక్ లు చూడండి… http://tharangamedia.com/ http://tharangamedia.com/Archi

నారాతో జూ.ఎన్టీఆర్ వార్ ?

 జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అవుతున్నారా?  బాబు, జూ.ఎన్టీఆర్ మధ్య అంతరం పెరిగిపోతున్నదా?  ఎన్టీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా?    2009 ఎన్నికల ప్రచారంలో మామయ్య చంద్రబాబుకు ఎంతో అండగా ఉన్న యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నెమ్మదిగా దూరమవుతున్నారా? బాబాయ్ బాలకృష్ణను, మామ చంద్రబాబును ఎంతో ఇష్టపడిన జూనియర్ ఎన్టీఆర్, ప్రచారఘట్టంలోనే ప్రయాణంలో తీవ్రగాయపడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేన్ ఫెస్టోలో ఉన్న నగదు బదలీ పథకాన్ని ఆకాశానికి ఎత్తేశాడు జూనియర్ ఎన్టీఆర్.  2009 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రాకపోవడంతో కాస్తంత నిరుత్సాహపడిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సాంతం టిడిపీకి దూరంగా జరిగిపోయారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.  కాస్త ఉప్పందితేచాలు హడావుడి చేసే ఛానెళ్లు ఈ విషయంపై ఇప్పటికే ప్రత్యేక కథనాలతో ఊదరగొట్టాయి. ఎస్ఎంఎస్ పోల్స్ కూడా నిర్వహించాయి. ఈ మధ్య సంక్రాతి సంబరాలకు బాలయ్య తన వియ్యంకుడైన నారా చంద్రబాబు సొంతఊరు నారావారి పల్లెకు వెళ్లారు. ఈ పర్యటనను కేవలం ఫ్యామిలీ ఫంక్షన్ గానే చూడటంలేదనీ, అక్కడ సొంతూరులో ఎన్టీఆర్

సూర్యుడికి భూమి ద‌గ్గర‌య్యింది..

చిత్రం
ఈరోజు సూర్యుడిని గమనించారా? రోజూ కంటే మరింత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు కదూ! ఎందుకంటే.. నేడు ‘పెరిహీలియన్ డే’ మరి. అంటే భూమి సూర్యుడికి అత్యంత సమీపదూరంలోకి వచ్చే రోజన్నమాట. ఏటా జనవరిలో మాత్రమే ఈ దృగ్విషయం చోటుచేసుకుంటుందని బుధవారం ఢిల్లీలోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రఘునందన్ కుమార్ వెల్లడించారు. ‘సాధారణంగా గ్రహాలు, గ్రహ శకలాలన్నీ సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. భూగ్రహం కూడా ఇలా కక్ష్యలో తిరుగుతూ ఏడాదికి ఒకసారి సూర్యుడికి అతిదగ్గర బిందువు (పెరిహీలియన్) వద్దకు, మరోసారి ఏటా జూలైలో అతిదూరపు బిందువు(అప్‌హీలియన్) వద్దకు చేరకుంటుంది’ అని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం 5:53 గంటలకు భూమి పెరిహీలియన్ బిందువు వద్దకు చేరుకుంటుందని, ఆ సమయంలో సూర్యుడికి, భూమికి మధ్య దూరం అతితక్కువగా 147 మిలియన్ల కిలోమీటర్లు(14.70 కోట్ల కి.మీ.) మాత్రమే ఉంటుందన్నారు. అయితే సూర్యుడు దగ్గరగా వచ్చినప్పటికీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవని, భూమి ఉష్ణోగ్రతలు సూర్యుడి దూరం మీద కాకుండా భూ అక్షం ఉన్న కోణం మీద ఆధారపడి ఉంటాయని

సాయిరెడ్డి విచార‌ణ‌ షురూ

చిత్రం
జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని గురువారం ఉదయం సీబీఐ అధికారులు చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ని దిల్ కుషా అతిథిగృహంలో సీబీఐ విచారించనుంది. విజయసాయిరెడ్డిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతిరోజు విచారణ పూర్తి అయిన వెంటనే చంచల్‌గూడ జైలుకి తరలించాలని కోర్టు తీర్పులో వెల్లడించింది.

సెంచ‌రీ.. డ‌బుల్ సెంచ‌రీ.. ట్రిబుల్ సెంచ‌రీ..

చిత్రం
ఇది మూడు ముచ్చట‌గా మూడు మ్యాచుల్లో న‌మోదు అయిన స్కోరు అనుకునేరు.. కాదు.. సిడ్నీలో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ తొలి ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. క్లార్క్ కెరీర్ లో ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ. ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో ఏడో ప్లేయర్‌గా క్లార్క్‌ నమోదయ్యాడు. క్లార్క్‌ 38 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 314 రన్స్‌ చేసి అజేయంగా నిలిస్తే, మైక్‌ హసీ 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 121 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 615 పరుగుల భారీ స్కోరు చేసింది. దాంతో ఇండియాపై 421 రన్స్‌ కీలక ఆధిక్యం ఆసీస్‌కు దక్కింది. కాగా భారీ స్కోరు ఛేధించ‌డానికి బ‌రిలోకి దిగిన టీమిండియా సెహ్వాగ్ (4) రూపంలో భారీ వికెట్‌ని కోల్పోయింది. దీంతో విజ‌యం మాట దేవుడెరుగు.. డ్రా దిశ‌గా అయినా మ‌న బ్యాట్స్‌మెన్ క‌స‌ర‌త్తు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది.

వైకుంట ఏకాద‌శి విశిష్టత‌

చిత్రం
ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి) అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటి శుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులను విశేషదాయకంగా పరిగణిస్తాము. అవి: ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి) కార్తీక శుద్ధ ఏకాదశి పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి) మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. ఒక చిన్న స్థలం ఉంటే తూర్పు దిక్కుగా నిలుచుంటే దానికి నిట్టనిలువుగా తూర్పు పశ్చిమాలు, అడ్డంగా ఉత్తర దక్షిణాలూ వుంటాయి. ఈ ఉత్త్తర దక్షిణ విభాగాన్ని ప్రాచీనులు కేవలం ప్రదేశాలకి మాత్రమే పరిమితం చేయకుండా కాలంలోనూ, శరీరంలోను కూడా ఈ విభాగాన్ని చేశారు. కాలంలో ఉత్తరం పగలు; దక్షిణం రాత్రి కుడి చేయి దక్షిణం; ఎడమ చేయి ఉత్తరం ఎక్కడైనా (ఉత్తర – దక్షిణాలలో) ఉత్తరమే పవిత్రమైనది, శ్రేష్టమైనది. దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి. రాత్రిని దక్షిణాయనం, పగటిని ఉత్తరాయణం అన్నారు. దక్షిణాయనం వెళుతుండగా చీ

జ‌గ‌న్‌కి కేసీఆర్ మొండి చెయ్యి

చిత్రం
తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రటించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అనుకూలంగా వ్యవహరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు పరిస్థితి తిరగబడింది. పోటీ చేయబోమని ప్రకటించిన జగన్ పట్ల తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మొదట్లో కాస్తా సానుకూలంగానే వ్యవహరించారు. దీంతో ఇరువురి మధ్య రహస్య అవగాహన కుదిరిందనే విమర్శలు వచ్చాయి. ఇంతలోనే కెసిఆర్ జగన్‌కు ఎదురు తిరిగారు. తెలంగాణలో జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేందుకు సిద్ధపడ్డారు. తెరాసకు స్నేహ హస్తం చాచిన వైయస్ జగన్ వరంగల్లు జిల్లా పరకాలలో తన వర్గం నాయకురాలు కొండా సురేఖకు పోటీ లేకుండా చూసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు తమ పార్టీ పోటీ చేయకపోవడం ద్వారా తర్వాత పరకాలలో జరిగే ఉప ఎన్నికల్లో కొండా సురేఖకు తెరాస మద్దతు పొందాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే, మహబూబ్ నగర్ శాసనసభా స్థానంలో దివంగత శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి భార్యను పోటీకి దించాలని జగన్ ప్రతిపాదించారు.

12-12-12 ర‌జ‌నీకి స్పెష‌ల్ డే

చిత్రం
సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడు తున్నారా? అయితే ఈ ఏడాది చివరి వరకూ ఆగాల్సిందే. ‘రజనీకాంత్’ పేరుతో ఆయన జీవిత చరిత్రను వివరిస్తూ సినీ నిర్మాత, విమర్శకుడు నామన్ రామచంద్రన్ రాసిన పుస్తకం రజనీ స్టైలులో 12.12.12న విడుదల కానుంది. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టినరోజు. ఆయన 62వ జన్మదినాన్ని పురస్కరించుకుని 2012, డిసెంబర్ 12న ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. రజనీకాంత్‌తో రామచంద్రన్ సంభాషించి.. సమగ్ర వివరాలతో రాసిన తొలి ప్రామాణిక పుస్తకమిది కావడం గమనార్హం. దీంతో దీనికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. రజనీ సినీ రంగ అరంగేట్రం నుంచి మొదలుకుని ఈ ఏడాది రాబోతున్న రాణా సినిమా వరకు సంబంధించిన విశేషాలతో ఈ పుస్తకం అలరించనుందని పబ్లిషర్లు అయిన పెంగ్విన్ బుక్స్ ఇండియా వారు చెబుతున్నారు. రజనీకాంత్‌కు సంబంధించి గతంలో ఎన్నడూ బయటకు రాని ఎన్నో సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయంటూ ఊరిస్తున్నారు.

విమ‌ర్శించిన నోటితోనే ప్రశంస‌లు

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలకు మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని బహిరంగంగానే తెలంగాణ ఎమ్.పిలు చెబుతున్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఒక ఎమ్.పి దీని గురించి మాట్లాడుతూ తాము గతంలో ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేసినప్పట్టికీ, పరిస్థితులను గమనంలోకి తీసుకుని తమ వైఖరిలో మార్పు చేసుకున్నామని చెప్పారు.అయితే దీనికి రహస్య ఒప్పందాలేమీ లేవని, కేవలం పార్టీ ప్రయోజనాల రీత్యా మాత్రమే తాము నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని తాము వదులుకోబోమని, అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బహిరంగంగా విమర్శించబోమని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు అంటూ తీవ్రంగా విమర్శించే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు ఇప్పుడు సడన్ గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటే అటు ముఖ్యమంత్రి వైపు నుంచి వచ్చిన చొరవ కూడా కారణమన్న వాదన కూడా ఉంది.కొందరు ఎమ్.పిల కోర్కెలను కూడా సి.ఎమ్ ఆమోదించారని అంటున్నారు. అది కాకుండా పార్టీ అధిష్టానం కూడా దీనిపై గట్టిగా చెప్పిందని మరో అభిప్రాయం ఉంది.ఏది ఏమైనా గతంలో ముఖ్యమంత్రి కిరణ్ క

సిబిఐ పై జ‌గ‌న్ ఫైర్‌

చిత్రం
జగన్ ఆస్తుల కేసు ఎఫ్‌.ఐ.ఆర్. లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పేరు బదులుగా రాజశేఖరరెడ్డి పేరు చేర్చడాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. దీనినిబట్టే కేసు ఎలా నడుస్తుందో అర్ధం చేసుకోవచ్చని ఆయన అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎలా కోరుకుంటున్నాయో అలాగే సిబిఐ దర్యాప్తు కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా సిబిఐ మారిందని ఆయన ద్వజమెత్తారు. విజయసాయిరెడ్డిని అరెస్టు చేయడం తమకు ఆశ్చర్యం కలిగించలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తాను కాంగ్రెస్ లో ఉండి ఉంటే సిబిఐ విచారణ వచ్చి ఉండేదా అన్న ప్రశ్నను ఆయన వేశారు. కొన్ని విలువలకు కట్టుబడి పదిహేడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని ఆయన చెప్పారు. సాక్షిలో పెట్టుబడులు పెట్టడాన్ని ఎలా తప్పు పడతారని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంతకాలం పొగిడిన కాంగ్రెస్ పెద్దలు ఆయన చనిపోయాక విమర్శలు చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు.

ఆమెది తెలంగాణ కాదు..?

చిత్రం
‘టీఆర్‌ఎస్ ఎంపీ విజయశాంతి తెలంగాణకు చెందినవారా…? ఎవరన్నారు..’ అని ఫిల్మ్‌నగర్ సొసైటీ మాజీ కార్యదర్శి మురళీమోహన్ ప్రశ్నించారు. సొసైటీని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో బుధవారం సొసైటీ ప్రతినిధులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సొసైటీలో ప్లాట్ కేటాయించాలని విజయశాంతి తమను అడగలేదని మురళీమోహన్ స్పష్టం చేశారు. ఫిల్మ్‌నగర్ కాలనీలో తెలంగాణవారికి చోటేలేదని విజయశాంతి చేసిన ఆరోపణలను ప్రస్తావించగా ఆయన ఇలా స్పందించారు. విజయశాంతిది అసలు తెలంగాణ కాదని, తెలంగాణవారికి ప్లాట్లు కేటాయించలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

కొత్త వివాదంలో స‌చిన్ టెండూల్కర్‌

చిత్రం
భార‌త క్రికెట్ దేవుడు గా కొల‌వ‌బ‌డుతున్న లిటిల్ మాస్టర్ బ్లాస్టర్ స‌చిన్ టెండూల్కర్ త‌న‌కి తెలియ‌కుండానే ఒక వివాదంలో ఇరుక్కున్నారు. అస‌లు విష‌యం ఏమిటంటే… ముంబయిలోని చాందినీ చౌక్ పేరుని మార్చి, స‌చిన్ టెండూల్కర్ పేరుని పెట్టాల‌న్న నిర్ణయ‌మొక‌టు వెలుగులోకి వ‌చ్చింది.. అయితే చాందినీ చౌక్ పేరును సచిన్ టెండూల్కర్ చౌక్‌గా మార్చాలనే ప్రతిపాదనపై ప్రెస్ కౌన్సిల్ చైర్‌పర్సన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. చాందినీ చౌక్ పేరును మార్చడం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించడమేనని కట్జూ అన్నారు. చాందినీ చౌక్ పేరు మార్పుపై అభ్యంతరం తెలుపుతూ ఢిల్లీ మేయర్ రజనీ అబ్బీకు డాక్టర్ కేఎన్ కట్జూ మెమోరియల్ ట్రస్ట్ తరుపున లేఖను రాశారు. సచిన్ టెండూల్కర్ చౌక్‌గా పేరును మార్చే ప్రతిపాదన వార్తను జాతీయ దినపత్రికల్లో చూశానని.. చాందినీ చౌక్ పేరు మార్చడం అభ్యంతరకరమైందని.. దారుణమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షాజహాన్ చక్రవర్తి కాలంలో నిర్మించిన చాందినీ చౌక్ పేరు మార్చడం ప్రాచీన ఢిల్లీ నగర చరిత్రను అవమానించడమేనని ఆయన అన్నారు.

కోలుకున్న హ‌జారే..!

చిత్రం
సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. శ్వాస సంబంధిత వ్యాధితోపాటు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న హజారేని రాలేగావ్ సిద్ధి నుండి తరలించి, డిసెంబర్ 31 తేదిన పూణేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఎక్స్‌రే, బ్లడ్ టెస్ట్ రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. పూర్తి విశ్రాంతి అవసరమైనందున, సందర్శకులను ఎవరిని అనుమతించడం లేదని.. ఆదివారం నాడు హజారేను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. పటిష్ట లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాలంటూ ముంబైలో డిసెంబర్27 తేదిన చేపట్టిన దీక్ష సందర్భంగా హజారే అస్వస్థతకు గురయ్యారు.

క‌స్టడీలో అయిదురోజులు

చిత్రం
జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని ఐదురోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో విజయసాయిరెడ్డిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని సీబీఐపై పలు ఆంక్షలు విధించింది. ప్రతిరోజు విచారణ పూర్తై తర్వాత వెంటనే చంచల్‌గూడ జైలుకి తరలించాలని కోర్టు తీర్పులో వెల్లడించింది. కస్టడీ అప్పగింతపై సుదీర్ఘంగా కోర్టులో వాదనలు జరిగాయి. సీబీఐ వాదనలపై విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు.

బ‌డ్జెట్‌కి ఇంకా టైముంది..!

చిత్రం
2012-13 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను మార్చి 9 తేది తర్వాతనే ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. అయితే తేది ఖరారు కాలేదని… అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 9 తేది వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. జనవరి 30 తేది నుంచి మార్చి 3 తేది వరకు ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున బడ్జెట్‌ను వాయిదా వేసిందన్నారు. సాధారణంగా ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి తేదిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.

ఓరుగ‌ల్లులో టిఆర్ఎస్‌, టిడిపి జ‌గ‌డం..

చిత్రం
తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జెఎసి వ్యూహరచన చేస్తున్నాయి.కరీంనగర్ తో సహా తెలంగాణలోని వివిధ జిల్లాలలో ఇప్పటికే పర్యటించిన చంద్రబాబు ఇప్పుడు వరంగల్ జిల్లాలో పర్యటించడాన్ని తెలంగాణ ఉద్యమ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ నేతలు ఏమి చేసినా పెద్దగా పట్టించుకోని వీరు ఎందువల్లనో చంద్రబాబు పర్యటనను మాత్రం అడ్డుకొంటామని చెబుతుండడం కాస్త ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. దానికి తమ మీడియాలో కూడా విశేష ప్రాముఖ్యత ఇస్తున్నారు. చంద్రదండు పేరుతో కొందరు తెలంగాణవాదులను కొడుతున్నారని కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే తెలుగుదేశం సభలపై, ర్యాలీలపై రాళ్లతో దాడి చేస్తే అది నిరసన, తెలుగుదేశం వారు ఎదురుదాడి చేస్తే అది ఘాతుకంగా వీరు మాట్లాడుతుంటారు. ఎవరు ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉన్న మన దేశంలో ఇప్పటికీ ఇలాంటి మొండి వైఖరిలోని ఆంతర్యం ఏమిటో తెలియదు. కావాలంటే చంద్రబాబు పర్యటించిన చోటకల్లా, ఆయన వెళ్లిపోయిన తర్వాత వెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయ

కేసీఆర్ దీక్ష 2013లో…

చిత్రం
రాష్ట్ర మంత్రి , రాయలసీమ హక్కుల వేదిక నాయకుడుగా గుర్తింపు పొందిన టి.జి. వెంకటేష్ కు కూడా కాస్త వాచాలత్వం ఎక్కువే అని చెప్పాలి. ఏదో ఒకటి అని ఎదుటి కవ్వించడం వీరి లక్షణంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావును విమర్శించడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకోవడానికి యత్నిస్తుంటారు. ఒక కాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ఆయన మాట్లాడుతూ కెసిఆర్ కు ఒక ఉచిత సలహా ఇస్తారు. కెసిఆర్ రెండువేల పన్నెండు కాకుండా 2013 లో నిరాహార దీక్షకు దిగితే ఆయనకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఎన్నికల ముందు సంవత్సరం ఇలాంటివి చేస్తే అప్పుడు ఎన్నికలలో జనం సానుభూతి పొందవచ్చని కెసిఆర్ కు సలహా ఇస్తున్నారు. కెసిఆర్ దీక్షకు దిగినా ఏమీ కాదని, ఆయన ఆస్పత్రిలో ఉంటారని టిజి అంటున్నారు. ఏది ఏమైనా కెసిఆర్ తమను ఏమి అనకపోయినా, అనవసరంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టవలసిన అవసరం మంత్రి టిజికి ఉందా అన్నది ప్రశ్న.

మ‌హేష్ మ‌ళ్లీ తండ్రికాబోతున్నాడు

చిత్రం
న్యూ ఇయర్ సందర్భంగా ప్రిన్స్ అభిమానులకు శుభవార్త. మహేష్ బాబు మళ్లీ తండ్రి కాబోతున్నాడు. 2012లో నమ్రత రెండవ బిడ్డకి జన్మనిస్తుందని సినీ వర్గాల సమాచారం. టాప్ మీడియా సంస్థలకు సమాచారాన్ని మహేష్ దంపతులు దాచేసినప్పటికీ, కుటుంబ సభ్యులు, స్నేహితులు నమ్రతా గర్భవతి అని కొన్ని రోజుల క్రితం ధ్రువీకరించారు. మహేష్‌కు గౌతమ్ కృష్ణ 2006లో జన్మించిన సంగతి మనకు తెలిసిన విషయమే. ప్రిన్స్ అనేక సార్లు ట్విట్టర్‌లో గౌతమ్‌పై తన ప్రేమ వ్యక్తం చేశాడు. ఇంకా దూకుడులో ఒక డైలాగ్ ఉద్దేశపూర్వకంగా గౌతమ్, కృష్ణ పేర్లు గురించి చెప్పాడు. ఈ నేపథ్యంలో నమ్రత రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని.. తద్వారా మహేష్ మళ్లీ తండ్రి కాబోతున్నాననే ఆనందంలో మునిగి తేలుతున్నట్లు సమాచారం.

సైన్స్‌లో భార‌త్‌ని దాటేసింది..

చిత్రం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనకంటే చైనా ముందుకు దూసుక వెళుతోందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. మనకున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసుకుని అంతటితో తృప్తి చెందుతున్నామనీ, అయితే చైనా కొత్తకొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతూ ముందుకు దూసుక వెళుతోందని చెప్పుకొచ్చారు. సాంకేతిక రంగంలో 2017 నాటికి భారత పెట్టుబడి రెండింతలు పెరుగుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఐదు రోజుల పాటు జరిగే 99వ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2017వ సంవత్సరం నాటికి సాంకేతిక రంగంలో భారత పెట్టుబడి రెండింతలు పెరగాలి. ప్రస్తుతం సాంకేతిక రంగంలో అత్యధిక పెట్టుబడి పెట్టిన దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో చైనా ముందంజలో ఉందని ఆయన చెప్పారు. 2017 నాటికి భారత్‌లో సైన్స్ అభివృద్ధికి పెట్టుబడులను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సదస్సులో 15వేల మంది శాస్త్రవేత్తలు పాల్గొంటారు.

అంద‌రూ అరెస్టు అవుతార‌ట‌

చిత్రం
సమయం వచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సహా అందరూ అరెస్టవుతారని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఉప ఎన్నికల కోసం జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని అరెస్టు చేశారనడంలో నిజం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్‌తో బేరసారాలు ఆడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుల తీరుతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. ఉద్యమం వల్ల నాయకులు లాభపడ్డారని, ప్రజలు నష్టపోయారని ఆయన అన్నారు. ప్రజలకు నష్టం జరగకుండా ఉద్యమాలు చేస్తే ఎవరూ వ్యతిరేకించబోరని ఆయన అన్నారు. మైలవరంలో మద్యం షాపులన్నీ తెలుగుదేశం పార్టీవారివేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అనుచరులే సారా అమ్ముతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులే అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లతో అన్ని పార్టీలకు చెందినవారు ఉండవచ్చునని ఆయన అన్నారు.

తెలంగాణ‌లో జ‌గ‌న్ యాత్ర

చిత్రం
తెలంగాణలో మొదటిసారిగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు వై.ఎస్.జగన్ రైతు దీక్షను చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఈ నెల పదో తేదీనుంచి మూడు రోజులపాటు ఈ దీక్ష జరుగుతుందని ఆ పార్టీ నాయకుడు బాజిరెడ్డి గోవర్దన్ ప్రకటించారు. తెలంగాణ రైతులంతా దీనిని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఉద్యమం చేపట్టిన జగన్ ఆ తర్వాత తెలంగాణ జిల్లాలలో ఎక్కడా పెద్దగా పర్యటించలేదు. గతంలో వరంగల్ జిల్లాలో ఓదార్పుయాత్రను చేపట్టడానికి రైలులో మహబూబాబాద్ వెళుతుండగా , ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఆనాటి ప్రభుత్వం జగన్ ను అరెస్టు చేసి వెనక్కి తీసుకువచ్చింది. తదుపరి తెలంగాణలో పూర్తిస్థాయి ఉద్యమ కార్యక్రమానికి వెళ్లడం ఇదే మొదలు అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం విజయవంతం అయితే తెలంగాణ జిల్లాలలో జగన్ స్వేచ్చగా ఓదార్పుయాత్ర, ఇతర పర్యటనలు చేయగలుగుతారు. అందుకు ప్రాతిపదికగానే జగన్ ఈ పర్యటన చేపడుతున్నారని బావించవచ్చు.

ఈటివి ఛానెల్స్ కొనుగోలుకు టివి18 సిద్దం

చిత్రం
ఈటీవీ ఛానళ్ల కొనుగోలు లావాదేవీలను టివి18 గ్రూప్ యాజమాన్య బోర్డు ఆమోదించింది. ఈ విషయాన్ని టివి 9 ఛానల్ ప్రముఖంగా ప్రసారం చేయడం విశేషం. రామోజీరావు గత కొంతకాలంగా టీవీ ఛానళ్లను విక్రయించి ఆ బాధ్యతలనుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సోని సంస్థతో దాదాపు ఒప్పందం కుదిరిన తర్వాత అది ఏ కారణం వల్లనో ఆగిపోయింది. ఈటివి, ఈటివి రెండు ఛానల్ లో ఇరవైనాలుగు పాయింట్ ఐదు శాతం, మరికొన్ని చానళ్లలో ఏబై శాతం, మిగిలిన ఛానళ్లలో వంద శాతం వాటాను కొనుగోలు చేయడానికి టివి 18 సిద్దమైంది. దీంతో టీవీ ఛానళ్ల రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగిన రామోజీరావు దానిని వదులుకోబోతున్నారన్నమాట. మొత్తం 2100 కోట్ల రూపాయలకు ఈ లావాదేవీ కుదిరినట్లు చెబుతున్నారు.

చిరంజీవికి మంత్రిప‌ద‌వి రాదా..?

చిత్రం
మెగాస్టార్ చిరంజీవికి కేంద్రంలో పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందా?దానికి కారణం తిరుపతి గండం కారణంగా చెబుతున్నారా? కాంగ్రెస్ వర్గాలలో ఈ విషయమై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ కచ్చితంగా చిరంజీవి కేంద్రంలో మంత్రి అవుతున్నారని చెబుతుండగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీర శివారెడ్డి మాత్రం చిరంజీవి రాష్ట్ర రాజకీయాలలోనే ఉంటే బాగుంటుందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న వీరశివా ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ వ్యాఖ్య చేసి ఉంటారా అన్న సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అటు ముఖ్యమంత్రికి, ఇటు వీరశివకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. కడప జిల్లాకు చెందిన నేత,ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడం ఒక లక్ష్యంగా కనిపిస్తుంది., చిరంజీవి రాజ్యసభకు వెళితే తిరుపతి సీటు ఖాళీ అవుతంది.అప్పుడు జరిగే ఉప ఎన్నిక ప్రతిష్టాత్మక అవుతుంది. పైగా అది ముఖ్యమంత్రి సొంతదైన చిత్తూరు జిల్లా కావడంతో దాని ప్రభావం రాజకీయంగా చా