పోస్ట్‌లు

2013లోని పోస్ట్‌లను చూపుతోంది

గేలకు `అలా' జీవించే హక్కు లేదా?

చిత్రం
సుప్రీంకోర్టు : స్వలింగ సంపర్కం నేరమే ఢిల్లీ హైకోర్టు (2009లో) : స్వలింగ సంపర్కం నేరం కాదు. (ఈ తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసంది) సుప్రీం అభిప్రాయం : వివాదాస్పద అంశాలపై విదేశీ కోర్టుల తీర్పులను మన దేశంలో అమలు చేయడం కుదరదు. సుప్రీం : ఐపీసీ సెక్షన్ 377ను తొలగించాలని సుప్రీంకోర్టు 172వ న్యాయ కమిషన్ నివేదిక సిఫార్సు చేసినా పార్లమెంట్ ఆ పనిచేయలేదని ఈ తీర్పులోనే సుప్రీం గుర్తుచేసింది. ఐపీసి సెక్షన్ 377 : అసహ శృంగార చర్యలు, స్వలింగ సంపర్కం నేరమని, అందుకు జీవితఖైదు వరకు శిక్ష విధించవచ్చని ఈ సెక్షన్ చెబుతోంది. స్వలింగ సంపర్కులు (గేలు) : ఇది దుర్ధినం. సెక్షన్ 377ను మార్చాలి. జీవించే హక్కును ఈ తీర్పు కాలరాసింది. సోనియా :   అబ్బే ఈ తీర్పు నాకు అసంతృప్తి కలిగించింది. ప్రభుత్వం రివ్యూ పిటీషన్ కానీ, క్యురేటీవ్ పిటీషన్ గానీ వేయాలనుకుంటున్నది. పార్లమెంట్ లో కూడా ఈ అంశం చర్చకు వస్తుంది. బాలీవుడ్ :  అసంతృప్తి. ఈ తీర్పు మానవ హక్కులను ఉల్లంఘంచేదిగా ఉంది. ఇది సిగ్గుచేటు. (అమీర్ ఖాన్, జాన్ అబ్రహం)                                                              - Turlapati Nag

ఆత్రేయ మనసు తెలుసు

చిత్రం
ఆత్రేయగారితో పరిచయం ఉన్న రచయిత, ఆత్రేయ మనసు తెలిసిన రచయిత కె. ప్రభాకర్ గారు తరంగా స్టూడియోకి వచ్చి ఆ అనుభవాలను పంచుకున్నారు.  http://telugu.tharang amedia.com/manasu-kavi-aatreya-2/ 

వేపపళ్లతో వ్యాపారం, ఓ ఆట

చిత్రం
ప్రసాద్ తుర్లపాటి చక్కని విషయం గుర్తుచేశారు. జొన్న కాండం ఎండితే దాన్ని చొప్ప అంటారు. అది చాలా పెళుసుగా ఉంటుంది. ఒక కణుపు నుంచి మరో కణుపు వరకు విరగ్గోడితే, గోరుతోనే చొప్ప దంటు పై భాగాన్ని నాలుకబద్దల్లా విడగొట్టవచ్చు. అప్పుడు లోపల తెల్లటి బెండు ఉంటుంది. అదే సాప్ట్ గా ఉండే మేటిరియల్. గుండ్రటి స్తంభాల్లా ఉండే ఈ బెండునీ, నాలుకబద్దల్లా వచ్చే పై పొలుసులను వాడుతూ మేమంతా సమ్మర్ లో రావులపాడు వెళ్ళినప్పుడు చిన్నసైజు బండి, నాగలి, ఫ్యాన్ వంటి బొమ్మలు చేసేవారం. అదో సరదా. అంతేకాదండోయ్. ఎండాకాలం పండిన వేపపళ్లు చెట్టుమీద నుంచి రాలి కింద పడితే వాటిని ఏరుకుని సరదాసరదాగా మామిడిపళ్ల వ్యాపారం (వేపపళ్లతో) చేసేవాళ్లం. వేపపళ్లు కాస్తంత తియ్యగా ఉంటాయి. ఎప్పుడైనా తిన్నారా ? వేపపళ్లు తింటే పిచ్చి రాదు , ఇదీ నా గ్యారంటీ. తియ్యటి గుజ్జుతో తింటుంటే భలే గమ్మత్తుగా ఉంటాయి. కాస్తంత చేదుకూడా కలుస్తుంది. ఇలా తినడం వల్ల కడుపులోని నులిపురుగులు పోతాయని మా అమ్మ (స్వరాజ్యలక్ష్మి) చెబుతుండేవారు. ఇలా సమ్మర్ లో వేపపళ్లతో వ్యాపారం ఆట ఆడటంవల్ల మాకు బోలెడంత కాలక్షేపం. పైగా నాలెడ్జీ (వ్యాపారం ఎలా చేయాలన్న) వచ్చేసిందని నమ్మేశం. అల