పోస్ట్‌లు

2015లోని పోస్ట్‌లను చూపుతోంది

లౌక్యం తెలియని లోకేశ్

చిత్రం
ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు తన సుపుత్రుడు లోకేశ్ కి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను పూర్తిగా అప్పజెప్పి పప్పులో కాలేశారా ? రాజకీయ లౌక్యం అంతగా తెలియని లోకేశ్ మాట పార్టీ నాయకులు వినే పరిస్థితి ఉన్నదా ?   తాజా పరిస్థితులు చూస్తుంటే ఇవన్నీ కేవలం భయం, అనుమానం మాత్రమేనని కొట్టిపారేయలేం. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో చంద్రబాబు తన శక్తుయుక్తులు ధారబోసి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకువచ్చారు. అధికారం చేజిక్కడంతో  ఏపీలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకున్నమాట వాస్తవమే. ఒకప్పుడు తెలుగుదేశం జెండా ఎగరని గ్రామాల్లో ఇప్పుడు పచ్చజెండాలు రెపరెపలాడుతున్నాయి. వైఎస్సార్ ఫోటోలకు బదులుగా చంద్రబాబు ఫోటోలు కనిపించే స్థితి చాలా గ్రామాల్లో వచ్చింది. అధికార పార్టీలో ఉంటే ఎంతోకొంత లాభం పొందవచ్చన్న ప్రాధమిక సూత్రమే ఇందుకు కారణం కావచ్చు. లేదా,  నవ్యంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడంపట్ల చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకం కూడా కావచ్చు. రాజకీయ వాతావరణం నెమ్మదిగా మారుతోంది. అప్పటివరకు ఇతర పార్టీలను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వలసలు ప్రారంభించారు. దీంతో  తెలుగుదేశాని

జగన్ ని `పిల్లకాకి'గా భావిస్తున్న బాబు

చిత్రం
విశ్లేషణ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సునిశిత రాజకీయ దృష్టిలో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి `ఓ పిల్లకాకి’ ? ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు హావభావాలను నిశితంగా గమనిస్తున్నవారికి అలానే అనిపిస్తుంది మరి. అసెంబ్లీలో చంద్రబాబుని ఎలాగైనా ముప్పతిప్పలు పెట్టాలన్న జగన్ ఎంతగా తపనపడుతున్నా, బాబు హావభావాల ముందు అదంతా వీగిపోతోంది.నిజంగానే జగన్ ని బాబు రాజకీయ పిల్లకాకిగానే భావిస్తున్నారా ? మరింత లోతుగా ఈ విషయంపై విశ్లేషణ కొనసాగిద్దాం… ప్రస్తుత అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగన్ చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడటానికి తగిన సాక్ష్యాధారాలతోనే సభకు వస్తున్నారు. ఇంతగా ఆయన శ్రమపడుతున్నప్పటికీ, బాబు దృష్టిలో జగన్ `ఎదిగీఎదగని నాయకుడి’గానే కనిపిస్తున్నారు. కాల్ మనీ వ్యవహారంలో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలన్న ఉద్దేశంతో జగన్ అస్త్రశస్త్రాలతో సహా సభకు వచ్చారు. అయితే, జగన్ సభలో వ్యవహరించిన తీరు బాబుకు ఒకానొక సందర్భంలో నవ్వుపుట్టించింది. జగన్ వంక ఎగతాళిగా చూస్తూ, `నీకేం తెలుసు’ అన్నట్లుగా మాట్లాడారు. జగన్ లో రాజకీయ అపరిపక్వత కని

సెటైర్: చంద్రబాబు జాతకం చెప్పిన సోదమ్మి

చిత్రం
చంద్రబాబు జాతకం ఎలా ఉంటుందో, ఆయన అమరావతి నిర్మాణం ఎలా సాగిస్తారో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఓ సాధారణ మహిళ వీధిలో పోతున్న సోదమ్మిని పిలిచింది. అంతే, సోదమ్మి- బాబు జాతకం చెప్పడం ప్రారంభించింది. ఇంతకీ ఏం చెప్పింది...? తెలుసుకోవాలంటే ఈ సెటైర్ చదవాల్సిందే... https://www.telugu360.com/te/satire-sodammi-babu-jatakam/

పాక్ లో హిందూ ఆలయ పునరుద్ధరణ

చిత్రం
అది పాకిస్తాన్ లోని శివాలయం. పాండవులు రహస్య జీవనం సాగిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా లింగప్రతిష్ఠ చేశాడు. అంతేకాదు, మహాదేవుడు తన పత్ని సతీదేవితో కొంతకాలం ఇక్కడే కాపురం చేశాడని అంటారు. అలాంటి ఆలయం దేశ విభజన తర్వాత శిథిలమైంది. కానీ హిందూత్వ పునాదులు చెదరిపోలేదు. అక్కడ ఆలయ పునరుద్ధరణ జరుగుతూనే ఉంది. ఇరుదేశాల మధ్య శాంతి చేకూరాలని భక్త బృందాలు ప్రార్థిస్తూనే ఉన్నాయి.   https://www.telugu360.com/te/hindu-temple-in-pak/

సెటైర్: మిత్రలాభం

చిత్రం
ఇక నుంచి స్నేహితుల దినోత్సవం రోజున బాపు- రమణలు; నాగిరెడ్డి-చక్రపాణిలతోపాటుగా చంద్రబాబు- కేసీఆర్ పేర్లు కూడా గుర్తుచేసుకోవాలేమో... `చంద్ర'ద్వయం  మిత్ర`లాభం', ఎవరివాటా ఎంతెంత? ఈ సెటైర్ చదవండి... https://www.telugu360.com/te/satire-mitralabham/

డోనాల్డ్ ట్రంప్ పై అపరిచితుని గురి

చిత్రం
అమెరికా అధ్యక్ష ఎన్నికలబరిలో నిలవడంకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న డోనాల్డ్ ట్రంప్ ఈమధ్య ముస్లీంలపై విరుచుకుపడితే, Anonymous (అపరిచిత హ్యాకర్ల గ్రూప్) డోనాల్డ్ ట్రంప్ మీదనే విరుచుకుపడుతోంది. ఎందుకంటే... https://www.telugu360.com/te/11525-2/

నేతాజీ మరో 20 ఏళ్లకు పైగానే క్షేమంగా ఉన్నారా ??!

చిత్రం
నేతాజీ 1945లో మరణించలేదు. మరో 20ఏళ్లకు పైగానే క్షేమంగా ఉన్నారని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం దొరికింది. 1966 తాష్కెంట్ లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రితో దిగిన గ్రూప్ ఫోటోనే నిదర్శనం. పైగా, ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్ కూడా ఇదే నిజమని తేల్చి చెప్పింది. మరి ప్రధాని మోదీకి మరో అస్త్రం దొరికినట్లేనా ? నేతాజీ మరణం వెనుక రహస్యాలు తేలితే దేశ రాజకీయ చరిత్రలో హీరోలనుకున్నవారు విలన్లుగా మారతారా? ఏమో...చూడాల్సిందే... https://www.telugu360.com/te/subhas-chandra-bose/

సల్మాన్ కి పెళ్ళికళ వచ్చేసిందా ?

చిత్రం
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఒక సీరియస్ కేసు నుంచి విముక్తి పొందినా అతణ్ణి మరో కేసు వెంబడిస్తూనే ఉంది. అయినప్పటికీ కారు ప్రమాద కేసులో నిర్దోషి అని తేలగానే సల్మాన్ పెళ్ళికి సంబంధించిన వార్తాకథనాలు మీడియాలో షికారుచేస్తున్నాయి. ఈ కథనాల్లోని నిజమెంతో ఒక్క సల్మాన్ మాత్రమే చెప్పగలడు. https://www.telugu360.com/te/salman-khan-will-marry-soon/

సెటైర్ : బల్మాన్ థాన్ నిర్దోషి

చిత్రం
అది ముంబాష్మతి రాజ్యం. రాజు గుణసేనుడు. అతనికో బావమరిది. పేరు బల్మాన్ థాన్. అతను తన రథాన్ని గుడిసెవాసులపై నడిపించినా అక్కడి న్యాయసభ బల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించింది. ఆ తర్వాత రాజుదగ్గర మంత్రి అసలు మర్మం విప్పాడు... ఈ సెటైర్ చదవండానికి ఈ లింక్ నొక్కండి... https://www.telugu360.com/te/ satire-balman-than-nirdhoshi/

ఫేస్ బుక్ 2015 రివ్యూ వీడియోలో `బాహుబలి' లేడు కానీ...

చిత్రం
సోషల్ నెట్ వర్క్ దిగ్గజం `ఫేస్ బుక్' 2015 సంవత్సరంలో జరిగిన ప్రధాన సంఘటనలను క్రోడీకరించి రెండు నిమిషాల రెండు సెకన్ల నిడివితో ఒక వీడియోని రిలీజ్ చేసింది. ప్రపంచ ప్రజలను  కదిలించి, మెప్పించిన సంఘటనలతో పాటుగా బాహుబలి చిత్రంలోని తమన్నాని ఈ వీడియోలో క్షణకాలం చూపించారు. చిత్రమేమంటే, బాహుబలి హీరో ప్రభాస్ కి బదులు తమన్నాకు ఈ చోటుదక్కడం. `అవంతిక' ఇది బాహుబలి జానపద చిత్రంలోని ఒక కథానాయక పేరు. ఆ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా  లీనమై నటించింది. తన అందచందాలను ఆరబోస్తూ ఎక్కడో కొండలు, జలపాతాల క్రింద కుగ్రామంలో నివసించే శివుడు (ప్రభాస్) అనే యువకుడ్ని  ప్రేమపూరిత ఆకర్షణతో తన దగ్గరకు తెచ్చుకుంటుంది. ఈ సన్నివేశాన్ని డైరెక్టర్ రాజమౌళి అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు. ఎత్తైన పర్వతాలు, ఆకాశగంగలా దివినుండి భువికి వడిగా జాలువారే జలపాతాలు, వాటి మధ్యలో స్వర్ణాభరణ భూషితై, తెల్లటి దుస్తులు ధరించి చెంగుచెంగున దూకుతూ, వేగంగా సాగుతూ, దేవకన్యలా కనిపించే అవంతిక.... ఇదీ సన్నివేశం.  ఈ దృశ్యాలను  సిజిఎస్ ఎఫెక్ట్స్ (కంప్యూటర్ జనరేటెడ్ ఇమాజెరీ ఎఫెక్ట్స్) తో అత్యంత సుందరంగా  రాజమౌళి తెరకెక్కించారు. ఈ `మ