31, ఆగస్టు 2018, శుక్రవారం

లండన్ టవర్ బ్రిడ్జ్ యుకె టూర్ కి వెళ్ళిన ప్రతివారూ చూస్తుంటారు. దానికో ప్రత్యేకత ఉంది...
https://www.youtube.com/watch?v=aoLDHOfTic4

18, జనవరి 2016, సోమవారం

14, జనవరి 2016, గురువారం

పెద్ద పండుగలోని పరమార్థం..

ఏటా మకర సంక్రాంతిని పెద్దపండుగగా జరుపుకుంటాము. మరోసారి సంక్రాంతి వచ్చింది. మరి ఈ పెద్ద పండుగలోని పరమార్థాన్ని కూడా ఇంకోసారి గుర్తుచేసుకుందాం..

భోగి : గృహం భోగంగా ఉండటమే భోగి. పంట చేతికి వచ్చే కాలం కావడంతో ఇంటినిండా నవధాన్యాలు సంవృద్ధిగా ఉంటాయి. ఇళ్లు కళకళలాడుతుంటుంది. ఇదే నిజమైన భోగి.
దక్షిణాయనం : భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణాన్ని బట్టి రెండు ఆయనాలుంటాయి. వాటిలో ఒకటి దక్షిణాయనం, రెండోది ఉత్తరాయనం. ఈ రెంటికీ సంధికాలం భోగి. అంటే దక్షిణాయానానికి చివరి రోజు భోగి. తెల్లవారితే ఉత్తరాయణం. కొత్త క్రాంతి వచ్చేస్తుంది.
సూర్యారాధన : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేరోజు కావడంతో మకర సంక్రమణం అంటాము. అందుకే సంక్రాంతి రోజున సూర్యారాధన తప్పకుండాచేయాలి.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...20, డిసెంబర్ 2015, ఆదివారం

లౌక్యం తెలియని లోకేశ్

ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు తన సుపుత్రుడు లోకేశ్ కి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను పూర్తిగా అప్పజెప్పి పప్పులో కాలేశారా ? రాజకీయ లౌక్యం అంతగా తెలియని లోకేశ్ మాట పార్టీ నాయకులు వినే పరిస్థితి ఉన్నదా ?

  తాజా పరిస్థితులు చూస్తుంటే ఇవన్నీ కేవలం భయం, అనుమానం మాత్రమేనని కొట్టిపారేయలేం. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో చంద్రబాబు తన శక్తుయుక్తులు ధారబోసి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకువచ్చారు. అధికారం చేజిక్కడంతో  ఏపీలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకున్నమాట వాస్తవమే. ఒకప్పుడు తెలుగుదేశం జెండా ఎగరని గ్రామాల్లో ఇప్పుడు పచ్చజెండాలు రెపరెపలాడుతున్నాయి. వైఎస్సార్ ఫోటోలకు బదులుగా చంద్రబాబు ఫోటోలు కనిపించే స్థితి చాలా గ్రామాల్లో వచ్చింది. అధికార పార్టీలో ఉంటే ఎంతోకొంత లాభం పొందవచ్చన్న ప్రాధమిక సూత్రమే ఇందుకు కారణం కావచ్చు. లేదా,  నవ్యంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడంపట్ల చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకం కూడా కావచ్చు. రాజకీయ వాతావరణం నెమ్మదిగా మారుతోంది. అప్పటివరకు ఇతర పార్టీలను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వలసలు ప్రారంభించారు. దీంతో  తెలుగుదేశానికి ఏపీ కంచుకోటగా మారుతోంది.
(పూర్తి వ్యాసం కోసం లింక్ నొక్కండి)

https://www.telugu360.com/te/is-lokesh-real-leader/

18, డిసెంబర్ 2015, శుక్రవారం

జగన్ ని `పిల్లకాకి'గా భావిస్తున్న బాబు

విశ్లేషణ
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సునిశిత రాజకీయ దృష్టిలో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి `ఓ పిల్లకాకి’ ? ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు హావభావాలను నిశితంగా గమనిస్తున్నవారికి అలానే అనిపిస్తుంది మరి. అసెంబ్లీలో చంద్రబాబుని ఎలాగైనా ముప్పతిప్పలు పెట్టాలన్న జగన్ ఎంతగా తపనపడుతున్నా, బాబు హావభావాల ముందు అదంతా వీగిపోతోంది.నిజంగానే జగన్ ని బాబు రాజకీయ పిల్లకాకిగానే భావిస్తున్నారా ? మరింత లోతుగా ఈ విషయంపై విశ్లేషణ కొనసాగిద్దాం…
ప్రస్తుత అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగన్ చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడటానికి తగిన సాక్ష్యాధారాలతోనే సభకు వస్తున్నారు. ఇంతగా ఆయన శ్రమపడుతున్నప్పటికీ, బాబు దృష్టిలో జగన్ `ఎదిగీఎదగని నాయకుడి’గానే కనిపిస్తున్నారు. కాల్ మనీ వ్యవహారంలో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలన్న ఉద్దేశంతో జగన్ అస్త్రశస్త్రాలతో సహా సభకు వచ్చారు. అయితే, జగన్ సభలో వ్యవహరించిన తీరు బాబుకు ఒకానొక సందర్భంలో నవ్వుపుట్టించింది. జగన్ వంక ఎగతాళిగా చూస్తూ, `నీకేం తెలుసు’ అన్నట్లుగా మాట్లాడారు. జగన్ లో రాజకీయ అపరిపక్వత కనిపిస్తున్నదన్న కచ్చితాభిప్రాయం బాబులో ఉంది. జగన్ ఆయన పార్టీ సభ్యులకు శాసన సభలో హుందాగా వ్యవహరించడం చేతకావడంలేదనీ, వారింకా రాజకీయంగా ఎదగాలన్నట్లు బాబు మాట్లాడుతున్నారు. పైగా, తనకు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షనేతగా పదేళ్ల అనుభవం ఉండటాన్ని బాబు పదేపదే గుర్తుచేస్తున్నారు.
(పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి...)
  https://www.telugu360.com/te/is-jagan-immature-politician/

15, డిసెంబర్ 2015, మంగళవారం

సెటైర్: చంద్రబాబు జాతకం చెప్పిన సోదమ్మి

చంద్రబాబు జాతకం ఎలా ఉంటుందో, ఆయన అమరావతి నిర్మాణం ఎలా సాగిస్తారో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఓ సాధారణ మహిళ వీధిలో పోతున్న సోదమ్మిని పిలిచింది. అంతే, సోదమ్మి- బాబు జాతకం చెప్పడం ప్రారంభించింది. ఇంతకీ ఏం చెప్పింది...? తెలుసుకోవాలంటే ఈ సెటైర్ చదవాల్సిందే...

https://www.telugu360.com/te/satire-sodammi-babu-jatakam/

14, డిసెంబర్ 2015, సోమవారం

పాక్ లో హిందూ ఆలయ పునరుద్ధరణ

అది పాకిస్తాన్ లోని శివాలయం. పాండవులు రహస్య జీవనం సాగిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా లింగప్రతిష్ఠ చేశాడు. అంతేకాదు, మహాదేవుడు తన పత్ని సతీదేవితో కొంతకాలం ఇక్కడే కాపురం చేశాడని అంటారు. అలాంటి ఆలయం దేశ విభజన తర్వాత శిథిలమైంది. కానీ హిందూత్వ పునాదులు చెదరిపోలేదు. అక్కడ ఆలయ పునరుద్ధరణ జరుగుతూనే ఉంది. ఇరుదేశాల మధ్య శాంతి చేకూరాలని భక్త బృందాలు ప్రార్థిస్తూనే ఉన్నాయి.
  https://www.telugu360.com/te/hindu-temple-in-pak/