30, ఏప్రిల్ 2011, శనివారం

బర్నింగ్ కామెంట్రీ - 14 (రంకుదార్లో రాజకీయం!)

దినమంతా పనిచేస్తే వొక కూలి
మాసమంతా పనిచేస్తే మరో కూలి
ఈ కూలి డబ్బుల్లో..
శ్రామికుల చెమట వాసన వస్తుంటే
ఓక్షణంలో వేసే ఓటుకిచ్చే
కోట్లలోని నోట్ల వాసన పసిగడితే..


రోడ్డు పక్కన పైటజార్చి
కన్నుగీటే పడతి దగ్గరవచ్చే
చీప్ లిక్కర్ తో మిళితమైన మల్లెల వాసన
వస్తుంది చూడు నేస్తం!
అవును-
నేటి రాజకీయం రంకుదార్లో నడుస్తూ
అవినీతి విటుల్ని ఆకర్షిస్తూ
అడ్డంగా అక్రమంగా
వేలకోట్లు కూడబెడుతోంది..

ప్రజాస్వామ్యం నిస్సహాయంగా
గుడ్లుతేలేసి `నీతి' అనే
సెలైన్ ఎక్కించేవారికోసం
చూస్తూనే ఉంది!!

తమహక్కును అమ్ముకోకుండా
ఓటేసే మారాజులకు -
ఓటాఫ్ థాంక్స్!!
                     - నీల్ కొలికపూడి

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

 ఈ శతాబ్దం నాదీ అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీకి ఒక శతాబ్దం నిండింది. మహాకవి 101వ జయంతి (శనివారం- 30-04-11) వేడుకల సందర్భంగా ఓసారి ఆ మహాకవిని స్మరించుకుందాం...
 కవితా మహర్షి మరో శతాబ్దిలోకి తన చైతన్యకాంతులను ప్రసరింపజేస్తున్నాడు. పాత పదాలకు కొత్త అర్థం కల్పించి కవిత్వానికి దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ .
 `ఆధునిక కవిత్వం అర్థంకాలేదంటే, ఆధునిక జీవితమే అర్థం కాలేదన్నమాట' అంటూ మోడర్న్ భావాలకు పెద్దపీట వేసిన దీర్ఘదర్శి మహాకవి శ్రీశ్రీ. అందుకేనేమో `పదండిముందుకు, పదండి తోసుకు '- అంటూ మరో ప్రపంచాన్ని ముందస్తుగానే చూపించాడు శ్రీశ్రీ. `రాబోవు యుగం నా యుగం అవుతుంది' అంటూ శాసించిన మహాకవి శ్రీశ్రీ. 1930 వరకు తెలుగుసాహిత్యం తనను నడిపిస్తే, ఆ తరువాత దాన్ని తానే నడిపించానంటూ సగర్వంగా చెప్పుకున్నవాడు శ్రీశ్రీ. అనతికాలంలోనే మహాకవిగా ఎదిగి తెలుగుసాహిత్యంలో మధ్యాహ్న భానుడిలా ప్రకాశించాడు శ్రీశ్రీ.
 `శ్రీశ్రీకంటే మిన్న- ఏదైనా వుంటే, అది శ్రీశ్రీ కవితే సుమా'- అన్నంతగా శ్రీశ్రీ కవితలు జనహృదయాల్లో నాటుకుపోయాయి.
 `భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని నేను...
స్మరిస్తే పద్యం
అరిస్తే వాద్యం
ఆవల వేదికముందు అస్రనైవేద్యం...'
అంటూ `ఐ' అన్న గీతికలో శ్రీశ్రీ తననుతాను ఆవిష్కరించుకున్నా...
 `పాపం, పుణ్యం, ప్రపంచమార్గం
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ, ఏమీ ఎరుగని పూవుల్లారా
అయిదారేడుల పాపల్లారా-
' అంటూ శైశవగీతిని ఆలపించినా,
`పోనీ, పోనీ, పోతే పోనీ, సతుల్, సుతుల్, హితుల్, పోనీ...' అంటూ కళారవిని వెన్నుతట్టినా అది శ్రీశ్రీకే చెల్లింది.
 శ్రీశ్రీకి అనేక సాహిత్య ప్రక్రియల్లో ప్రవేశముంది. కానీ పాఠకులకు శ్రీశ్రీ అనగానే ఆయనలోని కవే కనిపిస్తాడు. కష్టజీవికి రెండువైపులా కాపుకాసేవాడే కవి అని నమ్మినవాడు కాబట్టి శ్రీశ్రీలోని కవే `మహాకవి' అయ్యాడు. అప్పటివరకు ఆకాశపు దారులంట హడావుడిగా పరుగెత్తే కవిత్వాన్ని భూమార్గం పట్టించి, భూకంపం పుట్టించినవాడే శ్రీశ్రీ.
 కవిగానే కాకుండా పౌరహక్కుల ఉద్యమనేతగా, భారత- చైనా మిత్రమండలికి, `అరసం', `విరసం'లకు అధ్యక్షునిగా ఉన్న శ్రీశ్రీ వామపక్షాలకూ, అన్నింటికీ మించి పేదలకు కొండంత అండగా నిలిచాడు. అందుకే తెలుగువారు ఏమారుమూలన ఉన్నా గర్వంగా చెప్పుకునే మాట...`శ్రీశ్రీ మా వాడ'నే...
(శ్రీశ్రీ లో రెండు అక్షరాలే ఉన్నాయి. కానీ, ఆయన గురించి లోతుగా అధ్యయనం చేస్తే మూడు అంశాలు కనిపిస్తాయి...ఆ వివరాలు తరువాయి భాగంలో...)
 - రచన: తుర్లపాటి నాగభూషణ రావు

మృత్యు సౌందర్యం (పార్ట్ 4- ఆఖరి భాగం)


మృతదేహాలను ఎంబామింగ్ తో కలకాలం కోరుకున్నట్టు ఉంచే ప్రక్రియ ఈనాటిది కాదు. శతాబ్దాల తరబడి ఈ పద్ధతిలో శవాలను భద్రపరుస్తున్నారు. ఎంతో మంది ప్రముఖుల భౌతిక శరీరాలను నిల్వఉంచగలిగారు.
  ఎంబామింగ్ ద్వారా మృతదేహం శుష్కించకుండా ఉంచడం ప్రముఖుల విషయంలో ఈమధ్య చాలా తరచుగానే జరుగుతోంది. 20 శతాబ్దిలో ఎంబామింగ్ ద్వారా మమ్మిఫికేషన్ చేసిన ప్రముఖ వ్యక్తుల్లో వ్లాడిమిర్ లెనిన్ కూడా ఒకరు. 1924లో ఆయన మరణానంతరం భౌతికదేహాన్ని ఎంబామింగ్ పద్ధతిలో కుళ్లకుండాచేశారు.
ఎంబామింగ్ కు గురైన ప్రముఖులు
పియస్ XII - 1876
పోప్ జాన్ XXIII- 1881
అబ్రహం లింకన్ - 1865

  అమెరికాలో ఇప్పుడు ఎంబామింగ్ పద్ధతిలో ఆత్మీయుల మృతదేహాలను వెనువెంటనే కుళ్లిపోకుండా చేయడంలో ముందంజవేశారు. అక్కడ ఏటా 2కోట్ల టన్నుల ఎంబామింగ్ ప్లూయిడ్స్, కెమికల్స్ అమ్ముడవుతున్నాయంటే, ఈ ప్రకియ అవసరం ఎంతగా గుర్తించారో అర్థంచేసుకోవచ్చు.
 ఎంబామింగ్ ప్లూయిడ్స్ ని ఎక్కించడం వల్ల బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అంటే, ఈ ఫ్లూయిడ్ ఏరకంగానూ బాక్టీరియాకు న్యూట్రియంట్ ఫ్లూయిడ్స్ గా పనిచేయవు. 
 ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఏదైనా కారణం వల్ల మరణించగానే వారి మృతదేహాలను స్వదేశాలకు తరలించాలంటే ఒక్కోసారి నెలలు పట్టవచ్చు. అలాంటప్పుడు ఎంబామింగ్ ద్వారా శరీరాలు కుళ్లకుండా సమీప బంధువులకు వాటిని చేర్చగలుగుతున్నారు. ఈ ప్రక్రియను అనుసరించడంపై ఎవ్వరూ ఎక్కడా విమర్శలకు దిగడంలేదు. దాని అవసరాన్ని, ఆవశ్యకతను మనసారా గుర్తిస్తూనే ఉన్నారు.
 జననం ఎంత సహజమో, మరణం అంతే సహజం. కానీ ఈ రెంటినీ ఒకే మోస్తరుగా జీర్ణించుకోలేకపోవడమే సామాన్యుల నైజం. ఇంతకాలం తమమధ్యనే ఉంటూ తమకు వెన్నుదండుగా ఉండే ప్రియతమ వ్యక్తులు ఉన్నట్టుండి హఠాత్తుగా కనుమరుగైనప్పుడు వారి రూపాన్ని మనసులోనేకాకుండా, కళ్లెదుట కూడా ప్రశాంత వదనంతో కనిపించాలని కోరుకోవడం తప్పేమీకాదు. ఈ తరహా మనోభావాలకు రూపకల్పం ఇస్తున్న `ఎంబామింగ్' ప్రక్రియ నిజంగానే ఓ ఊరట అనే చెప్పాలి.
- రచన: తుర్లపాటి నాగభూషణ రావు
            9885292208

అరుణాచల్ ప్రదేశ్ సీఎం డోర్జీ హెలికాప్టర్ మిస్సింగ్

  ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ అదృశ్యమైన సంఘటన జరిగి సుమారు రెండేళ్లు కాబోతున్న తరుణంలో ఇప్పుడు హఠాత్తుగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు ఎక్కిన హెలికాప్టర్ శనివారం (30-04-11) ఉదయం పదిగంటల ప్రాంతంలో అదృశ్యమైంది. దాని జాడ కనుగొనేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 2007 ఏప్రిల్ 9న డోర్జీ ఖండు ఆరవ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో జిగాంగ్ అపాంగ్ శకం ముగిసింది. ఆ తరువాత 2009 అక్టోబర్ 25న తిరిగి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మొనపా గిరిజన తెగకు చెందిన వ్యక్తి. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డోర్జీ ఖండు 1955 మార్చి 3న గ్యాంగ్ ఖార్ గ్రామంలో జన్మించారు.

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

అక్బరుద్దీన్ ఒవైసీపై కాల్పులు, కత్తిపోట్లు


హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై శనివారం (30-04-11) ఉదయం 11-15 గంటల ప్రాంతంలో దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. కత్తితో కూడా దాడి జరిపారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రాధమిక విచారణలో తేలింది. మహ్మద్ పహిల్వాన్ విరుచుకుపడినట్టు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన అక్బరుద్దీన్ ఒవైసీని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బార్కాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
 ఈ సంఘటనతో ఓల్డ్ సిటీలో హైఅలెర్ట్ ప్రకటించారు. అక్కడ 20వేల మంది పోలీసులను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా దుకాణాలను మూయించారు.

 అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్. అక్బరుద్దీన్, ఆల్ ఇండియా మజ్లీస్ ఈ ఇతెహదుల్లాముస్లిమీన్ - ఎఐఎంఐఎం- వ్యవస్థాపకులు సుల్దాన్ సలాలుద్దీన్ కుమారులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివాసముంటున్న అక్బరుద్దీన్ ప్రస్తుతం చాంద్రాయణగుట్ట స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 1971 జూన్ 14న జన్మించారు. వైద్యవిద్య (ఎంబీబీఎస్)ను మధ్యలో ఆపేసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. ఆయన భార్యపేరు సబీనా ఫర్జా. వీరికి ఇద్దరు పిల్లలు. అక్బరుద్దీన్ ఒవైసీ పుస్తక ప్రియులు. వ్యాసాలు రాయడం అంటే ఇష్టం. ప్రపంచ చరిత్ర మరీ ముఖ్యంగా ఇస్లామిక్ చరిత్రను చదవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. బాస్కెట్ బాల్, బిలియర్డ్స్ స్విమ్మింగ్ అంటే ఇష్టం.

సూపర్ స్టార్ రజనీకాంత్ కు అస్వస్థత

  రక్తపోటుతో సూపర్ స్టార్ రజనీకాంత్ బాధపడుతున్నారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రజనీ చికిత్సపొందుతున్నట్టు శుక్రవారం (29-04-11) సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో వార్తలు వచ్చాయి. యోగ పట్ల అపార నమ్మకం ఉన్న రజనీకాంత్ ఆరోగ్యం సరిగాలేదని తెలియగానే ఆయన అభిమానులు కలవరపడ్డారు.
 రజనీకాంత్ సినిమాల్లోనేకాదు, నిజజీవితంలో కూడా తనదైన స్టైల్ తోనే గడుపుతారు. జీవిత సత్యాలపై రజనీకి ప్రత్యేకమైన అవగాహన ఉంది. జీవితమే ఒక స్వప్నమురా...జరుగుతున్నదంతా నిజంకాదు...ఒక కలలాంటిదని రజనీ అంటుంటారు. రజనీ ఒక దశలో హరిద్వార్ సాధువుకు చేరువయ్యారు ఆయన బోధనలతో సత్యాన్వేషణ సాగిస్తున్నారు. దేవుడి గురించి అన్వేషణ చేసి మహావతర్ బాబాజీ బోధనలు విన్నారు. పిల్లలు, జ్ఞానులు తప్ప ఆనందం పొందిన వాడెవ్వడూలేరని రజనీ అంటుంటారు.
 ఆరోగ్యాన్ని సరిగా చూసుకోవడంలోనూ రజనీ ప్రత్యక శ్రద్ధ కనబరుస్తుంటారు. ఆధ్యాత్మిక ధోరణితో ఆరోగ్యమని ఆయన అంటుంటారు. ఇప్పుడు బిపీతో బాధపడుతున్న రజనీకాంత్ త్వరగా కోలుకోవాలనీ మరిన్ని అత్యద్భుత చిత్రాలను అందివ్వాలని కోరుకుంటున్నాం.
- టిఎన్నార్

మృత్యు సౌందర్యం (పార్ట్ 2)

శవాలు కుళ్ళిపోకుండా ఉండాలని
ఎందుకు కోరుకుంటున్నారు? 
అలా అనుకోవడం మంచిదేనా...??


  సభ్యసమాజాలలో పుట్టినప్పటి నుంచీ ఆఖరి శ్వాస తీసుకునేవరకు ప్రతి ఘట్టానికీ కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ఆత్మసిద్ధాంతాన్ని నమ్మిన దేశాల్లో పిత్రుదేవతలకు ఆహారం పెట్టడం ఓ ఆచారంగా వస్తుంటే, ఈజిప్టు వంటి దేశాల్లో మమ్మిఫికేషన్ ఓ ఆచార ప్రక్రియగా చోటుచేసుకుంది.
రాజులు, చక్రవర్తులు..లేదా రాజవంశీకులు మరణానంతరం కూడా తమ శరీరం పదిలంగా ఉండాలని కోరుకునేవారు. బహుశా ఈ కోరిక బలంగా ఉండబట్టే మృతదేహాలను కాపాడే పద్ధతికి అంకురార్పణ జరిగి ఉంటుంది. అంతేకాదు, ప్రముఖులు తమ భౌతిక శరీరాలను ఎక్కడో ఊరిచివర శ్మశానంలో పూడ్చిపెట్టాలని అనుకోరు. తమ ఇంటికి సమీపంలోనే తమ బంధు,మిత్రులు రోజూ నడిచే ప్రాంతంలోనే సమాధి ఉండాలని కోరుకునేవారు. ఇలా చేస్తే ప్రతినిత్యం తమ ఆత్మ వారిని పలకరించడానికి వీలుచిక్కుతుందని నమ్మేవారు. ఈ ఆలోచనల కారణంగానే ఎంబామింగ్ చోటుచేసుకుంది.
 ఇక ఆధునిక కాలంలో మనిషి శరీరం లోపలి భాగాలను స్టడీ చేయడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పడే శరీర భాగాలు కుళ్లకుండా ఉండే ప్రక్రియ కూడా మొదలైంది. అంటే అనాటమీలో విజ్ఞాన సముపార్జన కోసం మొదలైన ఎంబామింగ్ ఆ తరువాత ప్రముఖుల పార్ధివదేహాలను కాపాడటంలోనూ ఉపయోగపడిందని చెప్పాలి. శరీరంలోని ధమనుల ద్వారా ఎంబామింగ్ చేసే పద్ధతి నెదర్లాండ్స్ లో 17వ శతాబ్దిలో మొదలైనట్టు చెబుతుంటారు. ఇక ప్రస్తుతం అమలుచేస్తున్న ఎంబామింగ్ పద్దతిని అమెరికా సివిల్ వార్ సమయంలో తొలిసారిగా అనుసరించారు. యుద్ధంలో మరణించిన సైనికుల డెడ్ బాడీస్ ని కుళ్ళిపోకుండా బంధువులకు చేర్చడంలో ఈ పద్ధతి అప్పట్లో పాపులర్ అయింది.
 1867లో ఫార్మల్డిహైడ్ అనే రసాయనాన్ని జర్మన్ శాస్త్రవేత్త విల్ హెమ్ వాన్ హాఫ్ మన్ తొలిసారిగా గుర్తించారు. ఈ కెమికల్ ఆవిష్కరణతో ఎంబామింగ్ మరింత సులువైంది.
  ఎంబామింగ్ కి కొన్ని దేశాల్లో చట్టబద్ధత ఉన్నప్పటికీ, మరికొన్ని దేశాల్లో దీనికి అనుమతి లేదు. వివిధ సమాజాల ఆచారవ్యవహారాలనుబట్టి చట్టబద్ధతలో మార్పులు ఏర్పడ్డాయి. ఉత్తర అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఎంబామింగ్ స్వేచ్ఛగా సాగుతుంటే, మరికొన్ని దేశాల్లో పర్మిట్లు, లైసెన్స్ లు అవసరం. చాలాచోట్ల ప్రత్యేకమైన వైద్య నిపుణులు మాత్రమే ఎంబామింగ్ చేస్తున్నారు. ఎంబామింగ్ పద్దతిలో నాలుగు విభాగాలు ఉన్నాయి.

 ఎంబామింగ్ - రకాలు


1. ధమనుల ఎంబామింగ్
2. కావిటీ ఎంబామింగ్
3. హైపోడెర్మిక్ ఎంబామింగ్
4. ఉపరితల ఎంబామింగ్

 గ్రూమింగ్ ప్రక్రియ ద్వారా కూడా డెడ్ బాడీని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. ఈ పద్దతి ద్వారా ముఖవర్చస్సు పెరుగుతుంది.
 ఈజిప్టు చరిత్ర తిరగేస్తే, మమ్మిఫికేషన్ ప్రక్రియ చాలా స్పష్టంగా కనబడుతుంటుంది. ఈజిప్టు పూర్వీకుల్లో అనేక నమ్మకాలు ఉండేవి. చివరకు వారు స్వర్గానికి కూడా నాలుగు దారులు ఏర్పాటు చేశారు.
 ఆయా దిక్కులకు నలుగురు దేవతలను ప్రతిష్ఠించారు. ఆకాశాన్నీ, భూమినీ, ఆఖరికి స్వర్గానికి కూడా దిశలను రూపొందించారు.  ఈజిప్ట్ ‘మమ్మిఫికేషన్’ జరిగే తంతులో ఈ తంతు కనిపించింది.  పురాతన ఈజిప్టియన్ల మృతదేహాల భాగాలను - నాలుగు స్థూపాల్లో భద్రపరిచి అవి కుళ్లిపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునేవారట.
(ఎంతో మంది ప్రముఖుల భౌతిక శరీరాలను ఎంబామింగ్ పద్ధతి ద్వారా ఎక్కువకాలం నిల్వఉంచగలిగారు? ఆ వివరాలు తరువాయి భాగంలో....)
- తుర్లపాటి నాగభూషణ రావు
   9885292208

జగన్ కు దూరం అయిన జీవిత రాజశేఖర్గత కొద్ది రోజులుగా ప్రముఖ సినీనటులు జీవిత, రాజశేఖర్ లు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కడప ఉప ఎన్నికలలో జగన్ పూర్తి బిజీగా ఉన్న సమయంలో ఈ ఇద్దరు నటులు జగన్ కు వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి జగన్ కు వ్యతిరేకంగా భారీ విమర్శలే చేశారు. తాము వై.ఎస్.రాజశేఖరరెడ్డి మీద గౌరవంతో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరామని, అయితే జగన్ తమ పట్ల చిన్నచూపు చూశారని , తాము అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు. విజయవాడ దీక్ష లో తమ అభిమానుల నుంచి వచ్చిన స్పందన చూసి జగన్ భయపడ్డారనిపించిందని ఆయన అన్నారు. ఆ తర్వాత ఢిల్లీ దీక్షకు పిలవలేదని ఆయన తెలిపారు.ఆ తర్వాత తమను దూరం పెట్టారని, అందుకు సంతోషిస్తున్నామని జీవిత,రాజశేఖర్ లు పేర్కొన్నారు. జగన్ సంపాదించిన ఆస్తులకు సంపాదించి వివరణ ఇవ్వాలని కూడా వారు డిమాండు చేశారు. అయితే జీవిత తనకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మహిళా అద్యక్షపదవి అడిగారని, దానిపై ఏ నిర్ణయం తీసుకోకపోవడం వారికి అసంతృప్తి కలిగిం ఉండవచ్చని జగన్ వర్గం నేతలు చెబుతున్నారు.కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు వారికి ఆకట్టుకుని ఉండవచ్చని అంటున్నారు. మరో ప్రముఖ నటి రోజాకు అధికా ప్రాముఖ్యత ఇచ్చి తమకు ఆ స్థాయిలో ఇవ్వలేదన్న అసంతృప్తితోనే జీవిత,రాజశేఖర్ లు జగన్ కు దూరం అయ్యారని అంటున్నారు.,

28, ఏప్రిల్ 2011, గురువారం

అబద్దాల విషం కక్కుతున్న టివి 9 రవిప్రకాష్: ప్రచారసభలో జగన్`టివీ9 రవిప్రకాష్ ఈ రాష్ట్రానికి పట్టిన శని..
రామోజీరావు, రాధాకృష్ణల్లాగానే ఇతగాడూ
అబద్దాలనే చెబ్తూ విషం కక్కుతున్నారు'
                                                 - కమలాపురం ప్రచారసభలో జగన్

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి, ఈనాడు అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి అధినేత వి.రాదాకృష్ణ లకు మధ్య ఎప్పటినుంచో వైరం ఉంది. అయితే రామోజీరావు, రాధాకృష్ణలకు తోడు టివి 9 సిఇఓ రవిప్రకాష్‌ ను కూడా విమర్శించడం ఆసక్తికరంగా ఉంది. కడప ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా , కమలాపురం వద్ద వివిధ గ్రామాలలో ప్రసంగిస్తూ, రామోజీరావు, రాధాకృష్ణ,టివి 9 రవిప్రకాష్ లు రాష్ట్రానికి శనిలా పట్టారని,చెప్పిన అబద్దాన్నే చెబుతూ విషం కక్కుతున్నారని జగన్ ఆరోపించారు. రామోజీరావుకు జగన్ తండ్రి రాజశేఖరరెడ్డికి మొదలైన వైరం అది రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కూడా కొనసాగుతోంది.అది ఈనాడు, సాక్షిల మద్య ఆధిక్యత కోసం పెనుగులాట, అలాగే వై.ఎస్.బతికి ఉండగా, తమను వేధించారన్న కోపం రామోజీకి ఉండడంతో సహజంగానే జగన్ తో యుద్దం నడుస్తోంది.అయితే ఆంధ్రజ్యోతిపై కూడా జగన్ కు కోపం ఉన్నా, ఆ పత్రిక పేరు రాయకుండా ఈనాడు తోకపత్రిక అని రాయిస్తుంటారు. ఇప్పుడు జగన్ శత్రుకూటమిలో టివి 9 రవిప్రకాష్ పేరు కూడా చేరడమే విశేషం.ఎందుకు రవిప్రకాష్ పై కోపం వచ్చిందని ఆరా తీస్తే కొన్ని విషయాలు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో టివీ 9 జగన్ వ్యతిరేక లైన్ తీసుకుని కధనాలు ఇస్తున్నదన్నది వీరి అభియోగం.ఉదాహరణకు కృష్ణ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ లు చాలాకాలంగా జగన్ కు దూరంగానే ఉంటున్నారు. అయితే వారు కడపకు వెళ్లడంలేదని, జగన్ కు ఝలక్ ఇచ్చారని ఒక కధనాన్ని ప్రచారం చేశారని, అలాగే ఒకసారి జగన్ కు షాక్, ఇంకోసారి ఎదురుదెబ్బ అంటూ వ్యతిరేక కధనాలనే ఇస్తున్నారని, ఇదంతా కిరణ్ కు, రవిప్రకాష్‌ కు ఉన్న సంబంధాల వల్లనే జరుగుతోందని జగన్ వర్గం ఆరోపింస్తోంది.అంతేకాక వీరికి మరో అనుమానం ఉంది.గుజరాత్ లో కూడా టివీ 9 ఛానల్ ఉంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కు రవిప్రకాష్ కు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అందువల్ల కూడా టివి ౯ కావాలని వ్యతిరేక కధనాలు ప్రసారం చేస్తున్నదని వీరి అనుమానం.ఎక్కువ కాలం వాటిని ఖండించకపోతే, జనం నమ్మే అవకాశం ఉందని, అందువల్లనే రవి ప్రకాష్‌ ను కూడా కలిపి విమర్శించారని జగన్ మద్దతుదారులు వాదిస్తున్నారు.రవిప్రకాష్‌ ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందారు.ఆయన తన ఆలోచనలతో టివి 9 ని ఈ స్థాయికి తెచ్చారు. మొదటిసారిగీ బహిరంగంగా ఒక రాజకీయ నాయకుడు టివి 9పై ఈ స్థాయిలో విమర్శలు చేశారు. రాజశేఖరరెడ్డి జీవించి ఉన్న కాలంలో ఆ రెండు పత్రికలు అంటూ విమర్శించేవారు. జగన్ కూడా అదే డైలాగుతోపాటు, ఆ టీవీ చానళ్లు అని కూడా ఇకపై విమర్శిస్తుంటారేమో...
- Source: kommineni.info

ప్రత్యేక కథనం: మీడియా హిందూ ద్వేషి?

 

ఈ మధ్యకాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను నిశితంగా గమనిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అదేమంటే, హిందూ దేవతలమీద, ఆలయాలమీద, లేదంటే హిందువుల్లో ఎక్కువ మంది ఆరాధించే వ్యక్తుల (బాబాలు, యోగులు, స్వామీజీలు) మీద పనిగట్టుకుని పరిశోధనా వ్యాసాల పేరిట రచ్చరచ్చ చేస్తున్నట్టు కనబడుతోంది. పుట్టపర్తి సత్యసాయి బాబా వారి ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు వస్తున్నప్పటి నుంచీ కొన్ని ఛానెళ్లు, ఒకటి రెండు పత్రికలు పనిగట్టుకుని పరిశోధనాత్మక కథనాలంటూ పాఠకులు లేదా వీక్షకులపై రుద్దడం ఎక్కువైంది. ఇలా ఎందుకు చేస్తున్నదంటే....
1. సదరు వార్తా పత్రిక లేదా ఛానెల్ కు అత్యధిక గుర్తింపు రావాలన్న తపన
2. మిగతావారికంటే తాము విభిన్న అంశాలను, లేదా సంచలన విషయాలను అందిస్తున్నామని చెప్పుకోవడం కోసం...
3. టిఆర్పీ రేటింగ్ రేస్ లో పరిగెత్తాలన్న తపన (టివీ ఛానెళ్లకు)
4. హిందూ వ్యతిరేక వర్గాలు (బిజినెస్ పేరిట లక్షల కోట్లు సంపాదించినవాళ్లు) పనిగట్టుకుని యాంటీ హిందూఇజం వార్తలు వచ్చేలా తమ గుప్పెట్లోని పత్రికలు లేదా ఛానెళ్లపై ఒత్తిడి తీసుకురావడం.
5. హిందూ దేవతలపైనా, లేదా మహిమాన్విత వ్యక్తులపైనా ఎంత రాసినా, ఏమి రాసినా హిందువుల్లో తిరుగుబాటురాదన్న ధీమా..
.

పైన చెప్పిన కారణాలతోనే శవాలమీద పేలాలు ఏరుకునే ఇలాంటి మీడియా సంస్థలు రెచ్చిపోతున్నాయి. అన్యమతాల ప్రార్థనా మందిరాలమీదకానీ, లేదా ఆరాధ్యనీయమైన వ్యక్తులపైన కానీ ఇంతటి ఘాటుగా రాయగల దమ్ము ఈ పత్రికలకు, ఛానెళ్లకు ఉన్నదా?...ఓసారి ఆలోచించండి...
- ఎన్నార్టీ

చిరంజీవిపై కోర్టులో కేసు


జస్టిస్ శ్రీకృష్ణ కమిటీపై కేసు పెట్టడానికి కొంతకాలం క్రితం నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణ న్యాయవాదుల సంఘానికి మరింత ఉత్సాహం వచ్చినట్లుంది.సామాజిక తెలంగాణ అని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి తర్వాత మాట మార్చారంటూ మరో కేసును ఫైల్ చేశారు.నాంపల్లి కోర్టులో కేసు వేస్తూ చిరంజీవి మాట మార్చడం వల్ల తెలంగాణాలో ఆత్మహత్యలు జరగడానికి కారణమయ్యారని వారు ఆరోపిస్తున్నారు.దీనిపై కేసును మే ఐదో తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ రకంగా ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చలేదని క్రిమినల్ కేసులు పెట్టే పరిస్థితి వస్తే రాజకీయ పార్టీలన్నీ మూతపడాల్సిందేనేమో. ఎందుకంటే ఆ పార్టీల నేతలంతా ఆ కేసులలో ఇరుక్కుని జైలులో కూర్చోవాల్సి వస్తుంది కనుక.అయితే ఇక్కడ ఒక వాస్తవం గమనించాలి. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఏదో ఒక హామీ ఇవ్వడం, ఆ తర్వాత వాటిని ఉల్లంఘించడం రివాజైపోయింది. అయితే ఇది ఇవ్వాళే మొదలు కాలేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి జరుగుతూనే ఉంది.
ఓటర్లను ఆకట్టుకోవడం కోసం రాజకీయ పార్టీలు అనేక నినాదాలు ఇస్తుంటాయి. ఉదాహరణకు ఇందిరాగాందీ గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చారు. ఎన్నికలలో ఆమె ఈ దేశం నుంచి పేదరికాన్ని తరిమేస్తామని కూడా ప్రకటించారు. మరి పేదరికం పోయిందా?చంద్రబాబు నాయుడు `1996 ఎన్నికలకు ముందు తాను గెలిస్తేనే రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్య నిషేధం వంటివి అమలు అవుతాయని, కాంగ్రెస్ గెలిస్తే అవి కుదరవని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన కోరుకున్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చింది. కాని ఎన్నికల తర్వాత బియ్యం దర ఐదున్నర అయింది. మద్య నిషేధం ఎత్తివేశారు. తెలంగాణ అంశంలో కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో చెప్పినదానికి అనుగుణంగా కట్టుబడి లేరు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్ట్లో తొమ్మిది గంటల కరెంటు సరఫరా చేస్తామని చెప్పింది. ఇంతవరకు అమలు కాలేదు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాని వారందరిమీద కేసు పెట్టే పరిస్థితి ఉంటుందా?మరి న్యాయస్థానం ఏమి చేస్తుందో చూద్దాం.ఒక వేళ చిరంజీవిమీద కేసు పెట్టమని కోర్టు కనుక ఆదేశిస్తే అది సంచలనమే అవుతుంది.
kommineni.info

ఆంధ్రజ్యోతిపై సాయిట్రస్టు కన్నెర్ర... దావాకు సిద్ధం?

సత్యసాయి ట్రస్టుకు వ్యతిరేకంగా ఒక దినపత్రిక పనికట్టుకుని కదనాలు రాసిందని, అవన్ని ఆదార రహితమైన కధనాలని , ఆ పత్రికపై తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు ప్రకటించారు.పుట్టపర్తిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయం తెలిపారు.ఇప్పటికే ఆ పత్రికకు నోటీసులు జారీ
చేశామని, సమాదానం వచ్చిన వెంటనే చట్టపరంగా పరువు నష్టం దావా వేస్తామని వారు తెలిపారు. ట్రస్టు పరువు తీసే విధంగా అనేక కధనాలు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సత్యసాయికి సంబందించిన పలు సంచలన కధనాలను ఆంద్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది.వారు పేరు ప్రకటించకపోయినప్పటికీ, ఆ పత్రికపైనే దావా వేస్తున్నరని అంటున్నారు.సత్యసాయిబాబానే ఛైర్మన్ గా కొనసాగుతారని, ఆయన పేరుతో బ్యాంకు ఖాతా కూడ లేదని ఆయన అన్నారు.కాగా చెక్ పవర్ ఎవరికి ఉండాలన్నదానిపై ఇంకా
నిర్ణయం తీసుకోలేదన్నారు. సత్యజిత్ తో తనకెలాంటి విబేధాలు లేవని రత్నాకర్ తెలిపారు. ట్రస్టు సారధి ఎవరన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
-kommineni.inf

మృత్యు సౌందర్యం (పార్ట్ 1)

మృతదేహాలపై మమకారం ఎందుకు...?
మరువలేని ఆకారాలను పదిలంగా దాచుకోవాలన్న ఆలోచన మంచిదేనా?
మట్టిలో కలిసిపోవాల్సిన మృతదేహాలను కలకాలం నిల్వఉంచాలనుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి??
మృత్యు సౌందర్యం కోసం ఎందుకు తపిస్తున్నారు??

  మృతదేహం శుష్కించకుండా ఉండాలంటే ఎంబామింగ్ పద్ధతిని ఎంచుకోవడం ఆధునిక శాస్త్రప్రక్రియగా మారిపోయింది. ప్రముఖుల అస్తమయం తరువాత అంత్యక్రియలకు ఎక్కువ సమయం వేచిఉండాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు ఈ పద్ధతిద్వారా నిర్మలమైన రూపాన్ని అందించేప్రయత్నం చేస్తున్నారు వైద్య నిపుణులు.

 మృతదేహం శుష్కించకుండా ఉండేలా సాగించే రసాయన ప్రక్రియనే ఎంబామింగ్ అంటారు. ఈ పద్ధతిలో యాంటీసెప్టిక్స్ నీ, ప్రిసర్వెటర్స్ ని ఉపయోగిస్తారు. దీంతో కణజాలం కుళ్లకుండా కొంతకాలం ఉంటుంది.
ఎంబామింగ్ కోసం కొన్ని స్రావకాలు
1 ఫార్మాల్డిహైడ్
2 మిథనాల్ - 
3 ఇథనాల్

ఇందులో ఫార్మాల్డిహైడ్ - 5-29 శాతందాకా ఉంటుంది. అలాగే, ఇథనాల్ - 9-56 శాతం దాకా ఉంటుంది.
ఎంబామింగ్ ప్రక్రియ ముఖ్యంగా మూడు లక్ష్యాలను నెరవేరుస్తుంది.
ఎంబామింగ్ - లక్ష్యాలు
- మృతదేహాన్ని తాజాగా ఉంచడం
- వీలైనంత మేరకు ప్రశాంతంగా ఉంచడం
- శుష్కించకుండా చూడటం


 ఎంబామింగ్ ఫ్లూయిడ్స్ ను మరికొన్ని రసాయనాలను మృతుడి శరీరంలోని ధమనుల ద్వారా లోపలకు ఎక్కిస్తారు. ఇవి శక్తివంతంగా పనిచేస్తున్నంతకాలం శరీరం కుళ్ళిపోకుండా ఉంటుంది.
 ఎంబామింగ్ ప్రక్రియకు మూలం ఈజిప్ట్ లోని మమ్మిఫికేషన్ అని చాలా మంది అంటుంటారు. మరణ సమయంలో జీవుడు లేదా ఆత్మ బయటకు వెళుతుందనీ, అయితే, మళ్ళీ అదే ఆత్మ శరీరంలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు పాత శరీరం పదిలంగా ఉంటే దానిలోకే ప్రవేశిస్తుందని ఈజిప్టియన్స్ నమ్ముతుంటారు. అందుకే ఈజిప్టు పూర్వీకులు మమ్మిఫికేషన్ ద్వారా ప్రముఖుల మృతదేహాలను సురక్షితంగా భద్రపరిచేవారు.
 మృతదేహాలను భద్రపరచడమన్నది ఒక్క ఈజిప్టుకే పరిమితం కాలేదు.
                                                                          మమ్మిఫికేషన్ అనుసరించే దేశాలు

ఈజిప్టు
పెరూ
చైనా
గ్రీస్
ఇటలీ

    మమ్మిఫికేషన్ - అనేది ఒక్క ఈజిప్షియనులకే పరిమితం కాలేదు. ఈజిప్టులో వున్న గ్రీకులు, రోమన్లు కూడా ఈ పద్ధతి ప్రముఖంగానే ఉంది. మమ్మీల ద్వారా తయారుచేసే చూర్ణం బలవర్ధకంగానూ, అనేక వ్యాధులు నయంచేసేదిగానూ ఉపయోగిస్తుండేవారు. ఆ తరువాత మమ్మిఫికేషన్ పై అనేక పరిశోధనలు జరిగాయి...ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 
  మమ్మిఫికేషన్ గురించి తెలుసుకోవాలన్న తపన అంతాఇంతాకాదు. ఈ ప్రక్రియ చాలాకాలం పాటు అత్యంత రహస్యంగానే ఉండిపోయింది. దీంతో మమ్మీల చుట్టూ అనేక కథలు, నమ్మకాలు పుట్టుకొచ్చాయి. ఆధునిక కాలంలోసైతం ఇది హాట్ టాపిక్కే... ఈ సబ్జెట్ పై తీసిన చిత్రాలు సూపర్ హిట్. నవలలు, కథలు లక్షల సంఖ్యలోనే వచ్చాయి.
(శవాలు కుళ్ళిపోకుండా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు?  అలా అనుకోవడం మంచిదేనా...?? ఆ వివరాలు తరువాయి భాగంలో...)
- తుర్లపాటి నాగభూషణ రావు
   9885292208

27, ఏప్రిల్ 2011, బుధవారం

బాబా ఆస్తులకు మార్కెట్ విలువ కట్టలేమా!?

సత్యసాయి ట్రస్టు ఆస్తుల విలువెంత అన్నదానిపై కచ్చితమైన అంచనా వేయడానికి సత్యసాయిఇ ట్రస్టు సభ్యులు నిరాకరించారు. సత్యసాయి ట్రస్టు సభ్యులు శ్రీనివాసన్, భగవతి, రత్నాకర్, ఇందులాల్ షా ప్రభృతులు ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆస్తులు,తదితర వివరాలు,వాటికి ఏ అవసరాలకు వాడుతున్నది వివరంగా ప్రకటన రూపంలో ఇచ్చామని వారు తెలిపారు. అయితే వాటికి విలువ ఎంతన్నది అసందర్భమని,వాటిని వాణిజ్య అవసరాలకు వాడడం లేదని,అందువల్ల మార్కెట్ విలువను లెక్కగట్టజాలమని సభ్యులు తెలిపారు
అయితే బాబా శవపేటికకు తాము ఆర్డర్ ఇవ్వలేదని, ఒక భక్తుడు పంపించారని వారు తెలిపారు.ట్రస్టు సభ్యులలో ఎలాంటి విబేధాలు లేవని శ్రీనివాసన్ తెలిపారు.విరాళాల కోసం, నిదుల కోసం ఎప్పుడూ విజ్ఞప్తులు చేయలేదని, ఎవరికి వారు ఇచ్చేవారని, కోట్ల రూపాయల విలువైన బంగారం తరలిపోయిందని మీడయాలో వచ్చిన కదనాలు అవాస్తవమని వారు తెలిపారు.కొంతమంది కావాలని బురదచల్లారని విమర్శించారు.సత్యజిత్ ను బాబా వ్యక్తిగత సహాయకుడిగా ఎంచుకున్నారని, అంతకుమించి ప్రత్యేక హోదా ఏమీ లేదని వారు చెప్పారు.బాబా ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులంతా దర్శించుకున్నారని అన్నారు.

బాబా స‌మాధిలో విచిత్ర మూలిక‌లు

కొందరు ఋషులు, మహా పురుషులు  బ్రతికుండగానే సమాధి అయ్యారని విన్నాము. బ్రతికుండగానే  శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మహా సమాధి అయ్యారు. సమాధి అయ్యాక వంద సంవత్సారాల తరువాత తీసి చూసినా వారి శరీరము ఏ మాత్రము కుళ్ళిపోకుండా తేజస్సుతో వెలిగిపోతుంటుంది. దీనికి కారణం ఏమిటి… శరీరాన్ని మట్టిలో పాతివేసాక ఆ శరీరం కుళ్ళిపోకుండా ఎలా  ఉండగలుగుతుంది.. దీని వెనుక కారణం ఏమిటి.. ఈ ప్రశ్నలకి సమాధానం కనుగొనడానికి 17 వ శతాబ్దం లోనే శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. వారు కనుగొన్న రహస్యం ఏమిటంటే ఋషులు తాము మహా సమాధి అవడానికి ముందుగా గొయ్యిలో బస్తాల కొద్ది ఉప్పుని పోస్తారు. ఉప్పు శరీరం కుళ్ళిపోకుండా కాపాడుతుంది కాబట్టి అలా చేస్తారు. ఆ తరువాత లవంగము, యాలకులు, కస్తూరి, కుంకుమపువ్వు తదితర మొక్కలని, మరికొన్ని ములికలని వేస్తారు. ఈ మొక్కలు, మూలికలు గొయ్యిలోకి బ్యాక్టీరియాలు చేరకుండా కాపాడుతాయి. ఆ కారణం చేతనే వందలు, వేల సంవత్సరాలు అయినా కుడా సమాధి అయినవారి శరీరం ఏమాత్రం చెక్కు చెదరకుండా వుంటుంది. సాయి బాబా సమాధి లో కుడా కొన్ని విచిత్ర మూలికలు వేసారని, ఆయన శరీరం కూడా ఎన్ని సంవత్సరాలయినా తేజస్సుతో వెలిగిపోతుందని అంటున్నారు.

26, ఏప్రిల్ 2011, మంగళవారం

ప్లాస్టిక్ సర్జరీతో బాబా ఫేస్ మార్చారా!!


దాదాపుగా ఇర‌వై నాలుగు రోజులు బాబా ఐసియులో చికిత్స పొందారు.. అప్ప‌టి నుండి ఆయ‌న‌కి ఆహారం కూడా లేదు.. చికిత్స‌కై వైద్యులు అందించిన మెడిసినే ఆయ‌న‌కి ఆహార‌మ‌య్యింది.  అర‌వై కేజీల నుండి ముఫ్ఫై కేజీల‌కు బాబా బ‌రువు త‌గ్గింది. పూర్తి ఎముక‌ల గూడులా ఆయ‌న శ‌రీరం మారిపోయింది.. చివ‌రికి ఇర‌వై నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. బాబా త‌న దేహాన్ని వీడారు.. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం భ‌క్తుల ద‌ర్శ‌నార్థం ఆయ‌న భౌతిక‌కాయాన్ని కుల్వంత్ హాల్లో ఉంచారు. ఆ భౌతిక కాయాన్ని చూసిన ప్ర‌తి వారికి ఒక సందేహం వ‌చ్చి ఉంటుంది…
అదేమిటంటే…
ఇర‌వై నాలుగు రోజులు ఆహార పానీయాలు మాని, కేవ‌లం సెలైన్‌, టాబ్లెట్స్‌తోనే ఉండిన బాబా మొహం చిక్కి శ‌ల్య‌మైపోయి క‌నిపించాలి.. కానీ.. అలా కాకుండా ప్ర‌సన్న‌వ‌ద‌నంతో నిద్రిస్తున్న‌ట్టుగా ఆయ‌న మొహం క‌నిపిస్తోంది.. ఇదెలా సాధ్య‌ప‌డింది..? దాదాపు ముఫ్పై కిలోలు బ‌రువు త‌గ్గిన బాబా మొహంలో ఆ తేజ‌స్సు ఎలా వ‌చ్చింది..? ఈ అద్భుతానికి కార‌ణం ఏమిటి..? అనే సందేహాలకు డాక్ట‌ర్లు చెబుతున్న స‌మాధానం.. ప్లాస్టిక్ స‌ర్జ‌రీ.. అవును..! బాబా నిర్యాణం అనంత‌రం.. ముడ‌త‌ల‌తో వికారంగా మారిన ఆయ‌న మొహానికి ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేసారు.. పాడైపోయిన చ‌ర్మాన్ని తీసి ప్లాస్టిక్ స‌ర్జ‌రీతో ముడ‌త‌లు పోగొట్టారు. బాబా మొహంలో మున‌ప‌టి క‌ళ‌ని తీసుకురావ‌డానికి డాక్ట‌ర్లు ఎంతో కృషి చేశారు.బాబా మొహంలో తేజ‌స్సుని తీసుకువ‌చ్చారు.
ఇలా ఎందుకు చేశారు…?
బాబా అనారోగ్యంతో హాస్పిట‌ల్‌లో చేరార‌న్న వార్త‌ని విని ల‌క్ష‌లాది మంది భ‌క్తులు తీవ్ర ఆందోళ‌న‌ల‌కి గుర‌య్యారు.. ఆయ‌న కోసం ప్రార్థ‌న‌లు చేశారు. సాక్షాత్తూ భ‌గ‌వంతుడిగా కొల‌వ‌బ‌డే బాబా రూపం ప్ర‌తి భ‌క్తుడి క‌ళ్ళ‌ల్లో స్వ‌చ్ఛంగా నిలిచిపోయింది. ఈ ప‌రిస్థితిలో బాబా నిర్యాణం అనంత‌రం చిక్కి శ‌ల్య‌మైపోయిన ఆయ‌న మొహాన్ని చూసి భ‌క్తులు త‌ట్టుకోగ‌ల‌రా…? స‌రిగ్గా ఈ ఆలోచ‌న‌తోనే బాబా మొహంలో పూర్వ‌పు వైభ‌వాన్ని తీసుకురావ‌డానికి డాక్ట‌ర్లు ప్లాస్ట్‌క్ స‌ర్జ‌రీ చేశారు.
నిజ‌మే.. అశేష భ‌క్తుల మ‌నోభావాల‌ను దృష్టిలో ఉంచుకుని డాక్ట‌ర్లు తీసుకున్న ఈ నిర్ణ‌యం అభినందించ‌ద‌గిన‌దే.

సూక్ష్మశరీరంలో ఎన్ని భాగాలు...(మరణరహస్యం -పార్ట్ 4)

   స్థూల శరీరం ఉన్నట్టుగానే, సూక్ష్మ శరీరం ఉంటుందా...? అసలు సూక్ష్మ శరీర భాగాలను ఎన్ని  రకాలుగా గుర్తించవచ్చు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
  మానవుని శరీరాన్ని సూత్రబద్ధంగా విభజించినప్పుడు 24 భాగాలుగా ఉంటుందని అంటారు. జీవుడినీ, ఆత్మను కలుపుకుంటే ఈ సంఖ్య 26 అవుతుంది. అయితే, వీటిలో పది మాత్రమే భౌతికంగా కనబడుతుంటాయి. కనిపించని స్థితిలో 15 ఉంటాయి. పైకి కనిపించే వాటిని స్థూల శరీర భాగాలనీ, అలాగే, కనిపించని వాటినిసూక్ష్మ శీరీరాలను పిలుస్తుంటారు.
స్థూల శరీర భాగాలు

 1. కన్ను
 2. ముక్కు
 3. నాలుక
 4. చెవి
 5. చర్మం
 6. చేతులు
 7. కాళ్లు
 8. నోరు
 9. గుదము
 10. గుహ్యము

సూక్ష్మ శరీర భాగాలు ఇవి...
 1.  జీవుడు
 2.  మనస్సు
 3.  బుద్ధి
 4. చిత్తము
 5.  అహము
 6.  చూపు
 7.  వినికిడి
 8.  స్పర్శ
 9. రుచి
 10. వాసన
 11. వ్యాన వాయువు
 12. సమాన వాయువు
 13. ఉదాన వాయువు
 14. ప్రాణ వాయువు
 15. అపాన వాయువు

ఈ 25 భాగాల శరీరాన్ని నడిపించేదే ఆత్మ అని అంటుంటారు. కాలమరణంలో స్థూల, సూక్ష్మ శరీర భాగాలైన 25 భాగాలను వదిలేసి జీవుడు, ఆత్మ వెళ్లిపోతారు. కానీ, అకాల మరణంలో జీవుడు ఆత్మ వదిలేసి వెళ్ళిపోరు. అక్కడే సూక్ష్మ శరీరంతో ఉంటారు. శ్వాసపీల్చడం లేదు కనుక మరణం సంభవించినట్టు అందరూ భావించవచ్చు. కానీ నిజానికి ఇది పూర్తి మరణం కాదన్న సిద్ధాంతం ఒకటి ఉంది. బహుశా, అందుకేనేమో...మనవాళ్లు `దింపుడుకళ్లెం. ఆశతో అంత్యక్రియలకు ముందు సమీపబంధువులతో మృతిచెందాడని భావించే వ్యక్తిని తట్టిలేపుతుంటారు.
 తాత్కాలిక మరణస్థితి గురించిన ప్రస్తావన భగవద్గీతలో కూడా ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన బ్రహ్మయోగ స్థితి ఇంచుమించు తాత్కాలిక మరణంలాంటిదేనా...?
 బ్రహ్మయోగంలో చెప్పిన విషయాలు
 బాహ్యజ్ఞానేంద్రియాలు పనిచేయకపోవడం
శ్వాస స్థంభించిపోవడం
గుండె ఆగిపోవడం
 పైకి చూడటానికీ, బ్రహ్మయోగం, తాత్కాలిక మరణ స్థితి ఒకేమోస్తరుగా ఉన్నప్పటికీ, లోపల జీవుడు మాత్రం రెండు విభన్న స్థితుల్లో ఉంటాడని సిద్దాంతాలు చెబుతున్నాయి. తాత్కాలిక మరణంలో జీవుడు మరుపుతో ఉంటాడు. కానీ, అదే బ్రహ్మయోగంలో జీవునికి అంతా తెలుస్తూనే ఉంటుంది. ఈ రెండు స్థితుల్లోనూ జీవుడు తిరిగి ప్రాణములతో లేవగలిగినవాడేనని సిద్ధాంతీకరిస్తున్నారు.
 తాత్కాలిక మరణం కేవలం మనుషులకే పరిమితం కావడంలేదు. మిగతా జీవుల్లోనూ ఇలాంటి మరణం సంభవిస్తున్నదని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. కప్పలు, కీటకాలు వంటి జంతువులు తాత్కాలిక మరణం పొంది, ఆ తరువాత కొన్నాళ్లు, లేదా కొన్నేళ్లకు మళ్ళీ చేతనావస్థకు చేరుకుంటున్నాయని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది.
 మరణం అనివార్యమని అందరికీ తెలుసు. తాత్కాలిక మరణం గురించి తెలుసుకోవడం ద్వారా, ఆ ప్రక్రియను ఆచరించడంద్వారా ఆయుష్సు పెంచుకోవచ్చన్న కొత్త వాదన కూడా పుట్టుకొచ్చింది. శ్వాసను కొంతకాలం నియంత్రించడంతో ఆయుఃప్రమాణం పెరుగుతుందన్న సిద్ధాంతం బలోపేతమవుతోంది. ఈ కారణంగానే పూర్వం మనుషులు వేలాది సంవత్సరాలు జీవించిఉన్నారని చెబుతున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా, మరణరహస్యం చేధిస్తే మరిన్ని అద్భుతాలు ఆవిష్కృతమవడం ఖాయం.
- తుర్లపాటి నాగభూషణరావు
     9885292208

అన్నా హజారే ఆత్మహత్యాయత్నం!


కొన్ని వినడానికే ఆశ్చర్యంగా ఉంటే ఉండవచ్చు. కానీ ఇది నిజమే.  అవినీతికి వ్యతిరేకంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో నాలుగు రోజులపాటు నిరాహార దీక్ష చేసి ఆసేతుహిమాచలాన్ని కదలించిన ప్రఖ్యాత సంఘ సేవకుడు అన్నా హజారే కూడా గతంలో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన చేశారన్నది పచ్చి నిజం. 
  మహారాష్ట్రలోని సొంత గ్రామం రాలేగావ్ సిద్దిని దేశంలోనే అత్యంత ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దిన అన్నాహజారేకి ఇలాంటి ఆలోచన రావడం ఏమిటా అన్న భావన కలుగుతుంది. కాని ఇది నిజమే.స్వయంగా అన్నా హజారేనే ఈ విషయం వెల్లడించారు. 1962లో ఇండియా, చైనాల మధ్య యుద్దం జరిగింది.ఆ తర్వాత యువత రక్షణదళాలలో చేరాలని కేంద్రం పిలుపు ఇచ్చింది. దానికి అనుగుణంగా హజారే మిలటరీలో చేరారు.1965లో ఇండియా,పాక్ ల మధ్య యుద్దం వచ్చింది.ఆ యుద్ద సమయంలో అన్నా హజారేని దేశ సరిహద్దులోని ఖెమెరన్ ప్రాంతంలో నియమించారు. అక్కడ యుద్దం జరుగుతున్నప్పుడు అన్నా హజారే సహచరులు పందొమ్మిది మంది చనిపోయారు. హజారే తలకి గాయం అయిందికాని బతికి బయటపడ్డారు. అక్కడ సహచరుల శవాలు చూసి ఆయన మనసు కకావికలమైంది. ఆ దశలో ఆయనకు ఆత్మహత్య ఆలోచన వచ్చింది.కాని అప్పుడు వివేకానందుడు రచించిన ఒక పుస్తకం చదవడంతో జీవితంపై ఆయన అవగాహన మారిపోయింది. జీవితంలోని అర్ధం, పరమార్ధం ఏమిటో తెలుసుకున్నానని, ఆ తర్వాత దానిని అమలు చేయడం ఆరంభించానని హజారే వెల్లడించారు.దాంతో ఆయన ఆత్మహత్య ఆలోచనను మానుకుని సమాజసేవారంగంలోకి దుమికారు.ఒక్కొక్కసారి ఒక్కో ఘటన కొందరి జీవితాలను మార్చివేస్తుంది.అలాగే అన్నా హజారే జీవితంలో కూడా ఇది కీలకమైన ఘట్టం.
- Source: kommineni.info

25, ఏప్రిల్ 2011, సోమవారం

తెలంగాణ కోసం మదుయాష్కీ కల్లోలం సృష్టించబోతున్నారా?నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు మదుయాష్కీ    తాను రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వ్యక్తినన్న సంగతిని మర్చిపోతున్నారు. లేదంటే ఈ చేతకాని ప్రభుత్వాలు తనను ఏమి చేయలేవన్న ధీమాకావచ్చు. అప్పడప్పుడు ఈయన ఒక రెచ్చగొట్టే ప్రకటన చేయడం,తర్వాత తన సొంత పనికోసం ఏ అమెరికాకో వెళ్లిపోవడం, మళ్లీ వచ్చి మరో స్టేట్ మెంట్ ఇవ్వడం మామూలైందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో ఉంది. ఈయన తెలంగాణవాదాన్ని,అందులో ఈయనకు ఉన్న చిత్తశుద్దిని శంకించలేము కాని, కొన్ని ప్రకటనలు మాత్రం తీవ్ర అభ్యంతరంగా ఉంటాయి. తాజాగా చేసిన ప్రకటన ఏమిటంటే తెలంగాణ కోసం రాజీనామాలతోపాటు తెలంగాణలో కల్లోలం సృష్టించాలని సూచించారు. నిజానికి లోక్ సభ సభ్యుడిగా ఉన్న మదుయాష్కి కల్లోలం అన్న పదం వాడవచ్చా అన్న మీమాంస మనకే కాని, ఆయనకు ఏమాత్రం లేదు. తెలంగాణలో కల్లోలం సృష్టిస్తే ఎవరికి నష్టం తెలంగాణలోని సామన్య ప్రజలకే. రెక్కాడితే డొక్కాడని లక్షలమంది ప్రజలను ఈయన ఏ రకంగా ఆదుకుంటారో తెలియదు. ఈయన వరకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కాని మామూలు మనుషుల పరిస్థితి అలాకాదు. అసలు ముందుగా మధు యాష్కిగాని, ఇతర కాంగ్రెస్ ఎమ్.పిలుకాని, ఎన్నిసార్లు రాజీనామా చేస్తాం , అదిగో, ఇదిగో అంటూ వాయిదా వేశారు?ఎన్నిసార్లు రాజీనామాలు పరిష్కారం కాదు అని వాదించారు. ఇప్పుడేమో కల్లోలం సృష్టించాలని అంటున్నారు. మధు యాష్కి ముందుగా కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తే తెలంగాణ వచ్చే సంగతి తేలిపోతుంది.తెలంగాణలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో సహా రాజీనామా చేయమనండి,జనం ఏమి కల్లోలం సృష్టించనక్కర్లేదు. ఆటోమాటిక్ గా రాజకీయ కల్లోలం వచ్చి తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం కచ్చితమైన నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.మరొక్కటి చేయవచ్చు. ఢిల్లీలో పార్లమెంటులో కొన్నాళ్లపాటు నిరసన తెలిపి దేశ దృష్టిని ఆకర్షించారు. ఆ పనేదో ఎ.ఐ.సి.సి ఆఫీస్ వద్ద కూడా తరచు చేయవచ్చు.అలాంటివేమీ చేయకుండా తెలంగాణ జనజీవితాన్ని కల్లోలం చేయమని సలహా ఇవ్వడంలో రాజకీయంగా వారు బాగుండాలి. జనం ఎలాపోయినా ఫర్వాలేదన్న దృష్టి మాత్రమే కనబడుతుంది.కనుక ముందుగా మధుయాష్కి కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తే మంచిదేమో...
Source: kommineni.info

సాయిది సహజ మరణం కాదా..!!

పుట్టపర్తి సత్యసాయిబాబాది సహజ మరణం కాదంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై స్పందన ఎలా ఉంటుందన్నది పక్కనబెడితే ఎందుకు ఈ ఫిర్యాదులు చేస్తున్నారు? ఈ ఫిర్యాదులలో ఏముందన్నది తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.సమాచార హక్కు ఉద్యమ సంఘానికి రాష్ట్ర అద్యక్షుడిగా ఉంటున్న గంగాధర్ ఈ ఫిర్యాదు చేయడం విశేషం.సత్యసాయి బాబా మరణం సహజమైనదికాదని చెబుతూ గంగాదర్ హైకోర్టు, మానవ హక్కుల కమిషన్, డిజిపి, అనంతపురం ఎస్.పి, పుట్టపర్తి పోలీస్ స్టేషన్ లకు తన ఫిర్యాదు లేఖలను పంపించారు.ఈ విషయాన్ని వెల్లడిస్తూ, అందులో రాసిన వివరాలను తెలియచేశారు.
బాబాకు వచ్చిన వ్యాధులకు సంబంధించి సరైన చికిత్స జరగలేదని, దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయని ఆయన అన్నారు.బాబాకు మందులను ఓవర్ డోస్ ఇచ్చారని, అలాగే అనవసర మందులు ఇచ్చారని అనుమానాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గంగాధర్ తన లేఖలో కోరారు.గంగాదర్ వద్ద దీనికి సంబంధించిన ఆధారాలు ఏమీ ఉన్నట్లు లేవు. కేవలం పత్రికల కధనం ఆధారంగానే ఆయన ఈ లేఖ చేసినట్లున్నారు. ఇలాంటి సందర్భాలలో ఈ ఫిర్యాదులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు.

బాబా తలచుకుంటే పార్టీ టికెట్లు, పదవులు!

పుట్టపర్తి సత్యసాయి బాబా తలచుకుంటే ఏదైనా అందివ్వగలరన్న నమ్మకం బాబా భక్తుల్లో అపరిమితంగా ఉన్నదన్నది సత్యం. అందుకు కొన్ని దుష్టాంతాలు....
ఉండవల్లి: నోటి మాటతో ప్రసిద్ధి పొందిన కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తులు. 1984లో ఇందిరాగాంధీ హయాంలోనే బాబావారి నోటి నుంచి ఉండవల్లికి దీ లభించింది. `నీకు తప్పకుండా సీటు వస్తుంది' అని బాబావారు చెప్పారు. అయితే, ఆయన దివ్యవాక్కులు వెనువెంటనే నెరవేరకపోయినా, ఆ తరువాత నిజమే అయ్యాయి. డబ్బుదర్పం లేకపోయినా ఉండవల్లి రాజమండ్రి నుంచి ఎంపీ అయ్యారు. ఉండవల్లి 1975 నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. 1979 నుంచి కెవీపీకి చేరువయ్యారు. అప్పటికే వైఎస్ రాష్ట్ర కాంగ్రెస్ లో గట్టి పట్టు సంపాదించారు.
సచిన్ టెండూల్కర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సత్యసాయిబాబా భక్తులు. సచిన్ విషయంలో బాబావారి దీవెనలు ఎన్నో ఫలించాయి.
లక్ష్మణ్: రాష్ట్ర క్రికెటర్ లక్ష్మణ్ కి కూడా బాబావారి నుంచి అనేక మార్లు దీవెనలు లభించాయి. నేషనల్ క్రికెట్ టీమ్ లో సభ్యుడిగా కొనసాగుతావని బాబావారు చెప్పిన ప్రతి సందర్భంలో అది అక్షర సత్యమే అయినట్టు చెప్పుకుంటారు.
గవాస్కర్ : అలనాటి మేటి క్రికెటర్ గవాస్కర్ కి కూడా బాబా అంటే తెగని గురి. తన జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతికి బాబా వెనుక ఉండి నడిపిస్తున్నారని చెప్పుకుంటారు.
ఇలా అనేక మంది రాజకీయ నాయకులనూ, క్రీడాకారులను, ప్రముఖ వ్యాపారవేత్తలను దీవిస్తూ, వారిని ముందుకు నడిపించిన `ప్రేమ' మూర్తి సత్యసాయి బాబా.

తాత్కాలిక మరణ లక్షణాలు ఏమిటి? (మరణరహస్యాలు పార్ట్ 3)

మనిషి తాత్కాలిక మరణం పొందడమే నిజమైతే, మరి తాత్కాలిక మరణ లక్షణాలు ఏమిటీ, అప్పుడు జీవుని స్థితి ఎలా ఉంటుంది...?
యోగులు, బాబాలు, సిద్ధులు, మరికొంతమంది మహాపురుషులు ఏవో కొన్ని కారణాల కోసం తాత్కాలిక మరణం పొందినట్టు కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. చనిపోయినట్టు పడిఉండటం వేరు, నిజంగా చనిపోవడం వేరన్న వాదనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. మరి అలాంటప్పుడు తాత్కాలిక మరణం ఎలా ఉంటుంది...? దీనిపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
శరీరాన్ని శ్వాస విడిచిపోయి తిరిగి రాకపోతే , దాన్నే మరణం అంటున్నాం. కొంతమంది యోగులు, బాబాలు, మహాపురుషులు శ్వాసను నియంత్రించగలరు. అలాంటి వారు పైకి చనిపోయినట్టు పడిఉండగలరు. కానీ ఇది నిజంకాదు. వారు కోరుకున్నప్పుడు మళ్ళీ లేవగలరు.
మరణ సిద్దాంతం ప్రకారం, చివరి శ్వాసతో జీవుడు శరీరాన్ని వదిలిపోతున్నాడు. ఒక్క కాలమరణంలోనే `చివరి శ్వాస`అన్నది ఉంటుంది. అందుకే ఆఖరి శ్వాస విడిచారన్న పదం వాడుకలోకి వచ్చింది. అయితే, అకాల మరణంలో మాత్రం చివరి శ్వాస అన్నది లేకుండా యథా ప్రకారంగా శ్వాస సూక్ష్మ శరీరంలో అడుతున్నది కొందరు అంటుంటారు.
మూడో రకం మరణంలో శరీరంలోనే శ్వాస నిలిచిపోయి మనిషి చనిపోయినట్టుగా బయటకు కనబడతారు.
తాత్కాలిక మరణం - లక్షణాలు
-శ్వాస నిలిచిపోవడం
- గుండె ఆగిపోవడం
- రక్తప్రసరణ లేకపోవడం
- నాడి కొట్టుకోకపోవడం
- మెదడు ఆచైతన్యం పొందడం
- చలన రహిత స్థితి
ఈ లక్షణాలు చూడగానే జీవుడు మరణించాడనే అనుకోవడం మామూలే. కానీ, ఒక సిద్ధాంతం ప్రకారం ఇది మరణం కానే కాదు. శ్వాస లోపలే నిలిచిపోయిందే తప్ప, అది బయటకు పోలేదు. ఒక వేళ శ్వాస బయటకుపోయి, అది నిలిచిపోయిఉంటే దాన్ని ఆఖరి శ్వాస అనవచ్చు. కానీ, శ్వాస లోపలే ఉండిపోయి మరణ లక్షణాలు కనిపిస్తే, ఆ వ్యక్తి మరణించినట్టు కాదు.
ఇలాంటి మరణం పొందినప్పుడు జీవుడి స్థితి ఎలా ఉంటుంది?
తాత్కాలిక మరణం - జీవుని స్థితి
- జీవుడు నిద్రావస్థలో ఉండటం
- శ్వాస ఆడకపోవడం
- అచేత స్థితి
ఇలాంటి పరిస్థితిని చూడగానే సాధారణంగా వైద్యులు సైతం దీన్ని మరణంగానే భావిస్తారనీ, కానీ, ఇది నిజానికి తాత్కాలిక మరణమేననీ, ఇదో యోగమని చెప్పే సిద్దాంతాలు కూడా ఉన్నాయి.
తాత్కాలిక మరణం పొందినప్పుడు శరీరం చెడిపోదని కూడా కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. తాత్కాలిక మరణం సంభవించినప్పుడు ఆత్మ యొక్క చైతన్య శక్తి శరీరమంతటా పాకకుండా కేవలం తలమధ్యభాగంలో ఉన్న బ్రహ్మనాడిలో అణిగిపోతుందట. ఆత్మశక్తి పనిచేస్తూనే ఉండటం వల్ల శరీరంలోని ధాతుకణం చెడిపోదన్నదే ఈ సిద్ధాంతం.
(స్థూల శరీరం ఉన్నట్టుగానే, సూక్ష్మ శరీరం ఉంటుందా...? అసలు సూక్ష్మ శరీర భాగాలను ఎన్ని రకాలుగా గుర్తించవచ్చు? ఆ వివరాలు తారువాయి- ఆఖరి భాగంలో చదవండి)
- రచన: తుర్లపాటి నాగభూషణ రావు
9885292208

24, ఏప్రిల్ 2011, ఆదివారం

వాస్తుదోషంతోనే సత్యసాయి బాబా మరణం?

నడిచేదేవుడు సత్యసాయికి చికిత్స చేసిన గది వాస్తు దోషంతో ఉన్నదా..? అందుకే బాబావారు ఆరోగ్యం నుంచి కోలుకోలేకపోయారా...?? ఈ కారణంగానే బాబావారు బౌతికంగా భక్తులకు దూరమైపోయారా..?? ఇప్పుడు పుట్టపర్తిలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.
భగవాన్ సత్య సాయి బాబా తన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కోట్లాది భక్తులు శోక సముద్రంలో మునిగిపోయారు, సామాన్య మనుషుల నుండి, విఐపి ల వరకూ సాయి మరణానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే తానూ 96 సంవత్సరాలు బ్రతుకుతానని స్వయంగా సత్య సాయి బాబా తన భక్తులకు చెప్పారు. కాని అనూహ్యంగా పది సంవత్సారాలు ముందుగానే ఆయన తన దేహాన్ని విడిచిపెట్టారు. సాయి మాటలని నమ్మే భక్తులు తన మరణం విషయంలో సాయి మాటలు ఎలా లెక్కతప్పాయని తీవ్రంగా కలత చెందుతున్నారు. సాయి ఆకస్మిక మరణానికి కారణం ఏమిటో తెలుసుకోవాలన్న అన్వేషణలో పడిపోయారు.. ఈ అన్వేషణలో వారికి దొరికిన జవాబు, సాయి ఆకస్మిక మరణానికి కారణం ఏమిటో తెలిసిందిట.. ఆ కారణం ఏమిటంటే సాయి కి ట్రీట్ మెంట్ చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోని గదిలో వాస్తు దోషాలు వున్నాయని, ఆ వాస్తు దోషం వల్లే సాయి మృత్యువుకు చేరువయ్యారని అనుకుంటున్నారు.. దీనిలో నిజమెంతో తెలియదు. ఏది ఏమైనప్పటికీ సత్య సాయి మరణము ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటన్నది కాదనలేని సత్యం.

23, ఏప్రిల్ 2011, శనివారం

సత్యసాయి అవతార సమాప్తియావత్ భారత జాతి నిశ్చేష్టమైంది. ఉన్నట్టుండి ఎల్లెడలా నిశ్శబ్దం చోటుచేసుకుంది. నడిచే దేవుడు భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా అవతారం చాలించినట్టు సెంట్రల్ ట్రస్టు ఆదివారం ఉదయం 10.10 గంటలకు ప్రకటించగానే భక్తులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆదివారం ఉదయం నుంచే బాబావారి బంధువుల్లో కొందరు పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్ళి బాబావారిని చూసివచ్చి కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆ పరిస్థితి చూడగానే భక్తుల గుండెలు పగిలే వార్త ఏదో రాబోతున్నదన్నట్టు అందరికీ అర్థమైంది. మహిమలు ప్రదర్శించడంలోనేకాదు, సకల మానవాళికి సేవలు అందించడంతో సత్యసాయిబాబా భగవత్ స్వరూపులయ్యారు. బాబా ఈ ఉదయం 7.40 గంటలకు తుది శ్వాస విడిచారని ఉదయం 10 గంటలు దాటాక ట్రస్టు అధికారిక ప్రకటన చేసింది. బాబా వారి భౌతిక వయస్సు 85 సంవత్సరాలు.
 గత నాలుగు రోజుల నుంచీ బాబా అంతిమ ఘడియల్లో ఉన్నారని తెలుస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు ఏదో అద్భుతం జరగకపోతుందా అని భక్తులు ఆశపడ్డారు.  అయితే సత్యసాయిబాబా అవతారం చాలించాలనే నిర్ణయం తీసుకోవడంతో వైద్యపరమైన చికిత్సలేవీ పనిచేయలేదని ట్రస్టు సభ్యులు ప్రకటించారు. బాబా భౌతికంగా దూరమైనా భక్తుల హృదయాల్లో శాశ్వతంగానే నిలిచిఉంటారు.
(శ్రీ భగవాన్ సత్యసాయి బాబావారి మహిమలు, వారితో మీ అనుభవాలను మాతో పంచుకోండి. nrturlapati@gmail.com కి పోస్ట్ చేయండి...)
- ఎడిటర్

బర్నింగ్ కామెంట్రీ - 12 (రాజకీయ `చెద'రంగం!)

                                                        రాజకీయ `చెద'రంగం!


పచ్చనోట్లే ఇం`ధనం'గా
ఓట్ల కక్ష్యలో పరిభ్రమిస్తోన్న
రాజకీయ `ఉప'గ్రహాలు
కోట్లకు పడగలెత్తాయ్.
ఓటు వుండగానే `నోట్'
చక్కదిద్దుకోవాలి.
మత్తు దిగేలోపే
ఓటు చక్కబెట్టుకోవాలి.
ఎవరి నినాదం..విధానం వారిది.
ఓటుకు నోటుకు
అనుసంధానమైన
రాజకీయ `చెద'రంగంలో
ప్రజాస్వామ్యం చిత్తుగా
ఓడిపోతోంది!
మేరా ఎలక్షన్ మహాన్ !!
 - నీల్ కొలికపూడి

బాబా ఓ ఎముకల గూడు!!

 బాబా ప్రస్తుతం స్పృహలో లేరు.
 ఆయన ఎముకలగూడులా మారిపోయారు,
 ఇక ప్రకటనే తరువాయి
 దేశ అత్యున్నత వ్యక్తితోనే ప్రకటన

 ఆదివారం వెలువడనున్న ప్రకటన 


భగవాన్ సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. ఒక మెడికల్ బులిటెన్ తరువాత మరొకటి వస్తున్నా, అవే మాటలు, అవే పదాలు దొర్లుతున్నాయి. అసలు బాబా ప్రస్తుతం ఎలా ఉన్నారు...? ఈ ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం రావడంలేదు. బాబా సమీప బంధువులు బాబావారిని దగ్గర నుంచి చూసివచ్చి చెప్పిన సమచారం ప్రకారం ఆయన ఎముకుల గూడుగా మారిపోయారు. ఆ దృశ్యం తలుచుకుంటేనే భక్తుల గుండెలు పగలడం ఖాయం. మరి ఈ స్థితిలో కూడా ఎందుకీ దాపరికాలు...? ఎందుకీ కప్పదాటు వ్యవహారాలు??
 అత్యంత కీలకమైన ప్రకటన మాత్రమే ఇక వెలువడాల్సి ఉంది. అయితే, ఈ ప్రకటన ఎవరు చేత చేయించాలన్న ధర్మసందేహం ఒకటి వినవస్తోంది. భగవాన్ సత్యసాయి బాబావారి జీవితం గురించి కీలక ప్రకటన దేశ సర్వోన్నత వ్యక్తి లేదా దేశ ప్రధమ పౌరురాలు (రాష్ట్రపతి - ప్రతిభాపాటిల్) తో ఇప్పించాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కోరుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి వంటి ప్రధాన వ్యక్తి రావాలంటే కొంతలోకొంత జాప్యం తప్పదుకాబట్టి ప్రకటనలో నిరీక్షణ తప్పడంలేదని బాబా సమీప బంధువులు చెబుతున్నారు. బాబాకు వైద్యం చేస్తున్న డాక్టర్లుకానీ, లేదా రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులుకానీ ఈ కీలక ప్రకటన చేయడానికి సాహసంచేయడంలేదు. పైగా ట్రస్టు సభ్యులు కోరికను మన్నించాలని కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బహుశా ఆదివారం మధ్యాహ్నం కీలక ప్రకటన వెలువడవచ్చు.
  బాబా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే, బయట విస్తృత ఏర్పాట్లతో అధికారగణం హడావుడిపడిపోతున్నది. చివరకు ట్రస్టు సభ్యులు కూడా ఈ విషయంలో అతీతంకాదు. వారిలెక్కలు వారు చూసుకుంటున్నారు. హిందూధర్మం ప్రకారం, ఒక మనిషి చివరి శ్వాస విడిచిన తరువాతనే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరగాలి. అంతేకాని, మనిషి ఒక పక్క ప్రాణాలతో ఉండగానే (వెంటిలేటర్ సాయంతోనైనా ప్రాణంతో ఉన్నట్టే లెక్క) అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోవడం చూస్తుంటే, నిజమైన బాబా భక్తుల గుండె కరిగిపోతున్నది. వారు బోరున విలపిస్తున్నారు. తమ నడిచే దేవునికి ఇంత కష్టం వచ్చిందేమిటా...అని ఘోషిస్తున్నారు. వీటన్నింటితో సంబంధంలేనట్టుగా `చివరి' పనులు `ఘనం'గా వెలగబెట్టాలని కలికాలం భక్తులు యమ తొందరపడుతున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా....

- తుర్లపాటి

మరణంలో రకాలు...(మరణ రహస్యం పార్ట్ -2)


మరణంలో రకాలు ఉంటాయా...?
కాలమరణం అంటే ఏమిటి...?
అకాల మరణం అని దేన్ని అనవచ్చు...?
ఈ రెంటి మధ్య మరో మరణం చోటుచేసుకున్నదా....?
దాన్నే తాత్కాలిక మరణం అని పిలుస్తున్నారా?
బాబాలు, యోగులు ఈ స్థితిని అనుభవంలోకి తెచ్చుకున్నారా?

 మరణం రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి `కాల మరణం'. అంటే, ప్రతి జీవి బతికిఉండే కాలం నిర్ధుష్టంగా ఉంటుంది. దీన్ని ప్రకృతి శాసిస్తుంటుంది. ఈ కాలచక్రంలోనే ప్రతి జీవి పుట్టి, పెరిగి చివరకు గిడుతుంటాడు. అందుకే సహజమరణం పొందినవారిని `కాలధర్మం' చెందారని అంటుంటారు.
 కాల మరణం ఉన్నట్టుగానే, అకాల మరణం కూడా ఉంటుంది. ప్రతిజీవి ప్రకృతి నిర్దారించిన కాలమంతా బతికి ఉండాలన్న గ్యారెంటీలేదు. అనేక ప్రమాదాలు,  రోగాలు,రొచ్చుల కారణంగా జీవుడు అకాలమరణం పొందుతున్నాడు.


 ఈ రెండు రకాల మరణాల మధ్య మూడోరకం మరణం ఒకటి ఉంది. వినడానికి ఆశ్చర్యంగానే ఉండవచ్చు. కానీ, ఇది పచ్చినిజం. ఈ మూడోరకం మరణాన్నే తాత్కాలిక మరణం అంటున్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన పదం ఇది. అయితే, పదం కొత్తగా పుట్టుకొచ్చినా, దీని అనుభవం మాత్రం చాలా పాతదే. కాలగమనంలో అనేక మంది తాత్కాలిక మరణం అనుభూతిపొందారు. ఇది నిజం.
 ఈ తరంవారికి తాత్కాలిక మరణం గురించి తెలియకపోవచ్చు. కానీ, అలాంటిది ఏదీ లేదని కొట్టిపారేయలేం. ఎందుకంటే, గతంలో అనేక దుష్టాంతాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

(మనిషి తాత్కాలిక మరణం పొందడమే నిజమైతే, మరి తాత్కాలిక మరణ లక్షణాలు ఏమిటీ, అప్పుడు జీవుని స్థితి ఎలా ఉంటుంది...?- ఆ వివరాలు తరువాయి భాగంలో...)
- తుర్లపాటి నాగభూషణ రావు
   9885292208

జగన్ సోనియా కాలి గోటికి సరిపోడు....ఇలా అన్నది ఎవరు?

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కడప ఉపె ఎన్నికను ఎ.ఐ.సి.సి. అధ్యక్షురాలు సోనియాగాంధీకి, వై.ఎస్.రాజశేఖరరెడ్డికి మద్య పోటీగా అభివర్ణించడం కాంగ్రెస్ నేతలుకు ఏ మాత్రం జీర్ణం అవడం లేదు. అందులోను బలవంతంగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేయాల్సి వచ్చిన మంత్రి డి.ఎల్.రవీంద్ర రెడ్డికి ఈ నినాదం చిర్రెత్తిస్తోంది.అసలే ఘాటైన విమర్శలు చేసే డి.ఎల్ కు ఈ అంశం మరింత కోపం తెప్పిస్తోంది. దాంతో ఆయన జగన్ పై తన దాడిని మరింతగా పెంచారు.ఏకంగా ఈసారి సోనియాగాంధీ కాలిగోటికి కూడా వై.ఎస్.జగన్ సరిపోడని ప్రకటించారు. ఆయా ఎన్నికల సభలలో ఆయన ఈ విమర్శల దాడి చేశారు.ఇటలీ కాంగ్రెస్ అని విమర్శిస్తున్న జగన్ రెండువేల తొమ్మిదిలోజరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఎలా పోటీచేశారని ప్రశ్నించారు.ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా జగన్ స్పందించడం లేదని రవీంద్ర రెడ్డి ఆరోపించారు. ఎన్నికలలో ధన ప్రవాహం విచ్చలవిడిగా సాగుతోందని అంటూ జగన్ తన వర్గం చోటా నేతలకు గాను 81 స్పార్కియో వాహనాలను కొనుగోలు చేశారని,తన నియోజకవర్గం లోని ఖాజీపేటలో కూడా ఇద్దరికి ఈ వాహనాలు అందాయని ఆయన వెల్లడించారు.

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

బాబా ఫోటో నుంచి తేనె ! మెదక్ లో వింత

AA

మెదక్‌ పట్టణంలో ఓ వింత చోటుచేసుకుంది. ఆజంపూర్‌ వీధిలోని ఓ ఇంట్లో సత్యసాయి పోటో నుంచి తేనే కారుతుండటంతో యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. రవీందర్‌, రుక్మిణి అనే దంపతులు సాయి మందిరానికి వెళ్లి భజన చేసి వచ్చిన తర్వాత ఈ వింత చోటుచేసుకుంది. తేనేతో పాటు ఇంటినిండా సువాసనలు వెదజల్లుతుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బాబా అనారోగ్యానికి గురైన తర్వాత ఎక్కడో ఓ చోట ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

క్లినికల్లీ డెడ్ అంటే ఏమిటి? బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి??


క్లినికల్లీ డెడ్
ఇది రక్త ప్రసరణకు, శ్వాసకు సంబంధించిన పదం. గుండె క్రమబద్ధంగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు 'కార్డియాక్ అరెస్ట్' అనే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో నాడి అందదు, శ్వాస క్రియ ఉండదు, కళ్లలో కార్నియా ప్రతిబింబించదు.

బ్రెయిన్ డెడ్ అంటే..
మెదడు పనిచేయడం పూర్తిగా ఆగిపోతుంది. ఊపిరి పీల్చుకోవడంతో సహా అత్యంత ముఖ్యమైన కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి. కండరాలు పనిచేయవు. ఈఈజీ (ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రామ్) కొద్ది సేపటి పాటు సరళరేఖలా ఉంటుంది.

ఈ భూమిని రక్షించండి


మనకు మనమే డెడ్‌లైన్‌ పెట్టేసుకున్నాం.
ఈ భూమిపై మహా విలయానికి ముహూర్తం  పెట్టుకుంటున్నాం.
మనం చేసే తప్పుల కారణంగా పృధ్విపై ప్రళయం రాబోతున్నది.
కళ్లు  తెరవకుంటే జీవరాశికే పెనుముప్పు 
 తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మానవతప్పిదాలతో మండిపోతున్నది ఈ భూగోళం....
అంతర్జాతీయ పృధ్వీదినోత్సవం సందర్భంగా
మనమంతా ప్రతినబూనుదాం...
పుడమితల్లిని రక్షిద్దామని

మరణం లేని జీవి (పార్ట్ 3) - మరణం లేకపోతే మనిషి దేవుడైపోతాడా?!

 మరణం లేనంత మాత్రాన మానవుడు దేవుడు అయిపోతాడా...? కోట్లాది సంవత్సరాల కిందట మానవులు, దేవతలు కలిసే జివించారా? అదే నిజమైతే ఆ పరిస్థితి మళ్ళీ సాధించుకోగలమా...? 
   దేవతలు అమరులనీ, వారు ఈ భూమిని రక్షించడానికే ఉన్నారన్న విషయం, అన్ని మత గ్రంధాల్లో నిక్షిప్తమై ఉంది. అమృతం కోసమే దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. అమృతం తాగిన దేవతలకు అమరత్వం సిద్ధించింది. అందుకే అమరులయ్యారు. కానీ ఆ యోగం రాక్షసులకు రాలేదు. ఇక మానవులు దేవతలతో సన్నిహితంగా మెలిగినట్టు అన్ని మతాల్లో ఉంది. వీరు కూడా వేలాది సంవత్సరాలు ఎంతో ఉత్సాహంగా జీవించినా, దేవతల్లాగా అమరులు కాలేకపోయారు. ఒక వేళ అమరత్వం సాధించినా మానవులు ఎప్పటికీ దేవతలు కాలేకపోయారని అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
 అనేక కారణాల వల్ల కోల్పోయిన జీవన ప్రమాణాన్ని తిరిగి సంపాదించుకోవాలని మానవుడు ఆరాటపడుతున్నాడు. ఈ భూమి మీదనే అమరత్వం సాధించిన జంతువు ఉన్నప్పుడు, మరికొన్ని వేలాది సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు తాను ఎందుకు అమరత్వాన్ని సాధించకూడదని మనిషి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
 రామాయణ కాలంలో హనుమంతుడు  సంజీవని మొక్కను తీసుకురావడం కోసం బయలుదేరి, చివరకు దాన్ని గుర్తించలేక మొత్తం పర్వతాన్నే తీసుకువెళతాడు. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ, నేటి శాస్త్రవేత్తలు సంజీవని మొక్కను గుర్తించినట్టు చెబుతున్నారు. మృతకణాల్లో జీవలక్షణాలు తీసుకురాగల శక్తి కొన్ని మొక్కల్లో ఉన్నట్టు వారు చెబుతున్నారు.
 కొత్త కణాన్ని సృష్టించిన మానవుడు అమరత్వాన్ని సంపాదించాలని కూడా తపనపడిపోతున్నాడు. ఎప్పటికైనా మృత్యువును జయించి, వృద్ధాప్యం నుంచి తిరిగి యవ్వనాన్ని సంపాదించాలని ఆశపడుతున్నాడు.
 మరణాన్ని జయించడం సాధ్యమైతే, మనిషిలోని మృగం మేల్కొంటుంది. అప్పుడు జరిగేది అంతా వినాశనమే. ప్రకృతి ధర్మాన్ని శాసించాలని చూస్తే, దేవతగా మారడం అటుంచి, అసలు మానవత్వమే మరుగునపడే ప్రమాదం లేకపోలేదు.

 మానవ మేథస్సు పెరుగుతున్నకొద్దీ, ఈ సృష్టిలో కొత్తకొత్త విషయాలు అవగతమవుతున్నాయి. జనన-మరణాల చక్రంతో సంబంధంలేకుండా జీవితం సాగిస్తున్న ఒక రకం జెల్లీఫిష్ రేపటి మన ఆశలకు బీజంవేసింది. ఎప్పటికైనా మృత్యుంజయులు కావాలన్న మన తపన తీరే రోజు దగ్గర్లోనే ఉన్నదా...? ఏమో....ఎవరు చెప్పగలరు...కాలమే సమాధానం చెప్పాలి...
 - తుర్లపాటి నాగభూషణ రావు
     9885292208

మరణ రహస్యాలపై ప్రత్యేక కథనం (పార్ట్ -1)

 మెలకువతో ఉన్నంతవరకూ మనకు అన్నీ గుర్తుంటాయి..
 కానీ నిద్రలోకి జారుకోగానే అచేతన స్థితికి వెళ్ళిపోతుంటాం.
మరణం కూడా నిద్రలాంటిదేనా...?
అసలు మరణాన్ని స్వాగతించాలా..?.
లేక ఆపేరు వినగానే భయపడి పారిపోవాలా...?


అప్పటిదాకా మనమధ్యనే తిరగిన వ్యక్తి అచేతన స్థితికి వెళ్ళిపోతే...
శ్వాసిస్తూ, హాసిస్తూ జీవితం గడిపిన వ్యక్తి నిర్జీవిగా మారిపోతే....దాన్ని ఏమంటారు...? అదే మరణం. అయితే, మరణం అంటే ఏమిటి...ఆ స్థితిలో ఎలాంటి అనుభూతులు కలుగుతాయి. మరణాన్ని చూసి భయపడాలా...లేక స్వాగతించాలా....అసలు, మరణం అన్నది ఓ శిక్షా లేక శాశ్వత ఆనందమా...? ఏమో... మరణం ఇప్పటికీ వీడని గ్రహణమే...

మరణం అంటే శ్వాస ఆగిపోవడమని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజమేనా...కేవలం శ్వాస ఆగిపోయినంతమాత్రాన మరణస్థితి వచ్చేసినట్టేనా...?
మనిషి జీవితం పుట్టకతో ప్రారంభమవుతుంది. అలాగే, మరణంతో సమాప్తమవుతుంది. జీవుడు వేరు, శరీరం వేరు అన్నదే నిజమైతే, జీవునికి పుట్టుక కలగాలన్నా, లేదా చివరకు మరణం సంప్రాప్తమవ్వాలన్న శరీరం తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే జననమరణ సిద్దాంతం ఆవిర్భవించింది. సైన్స్ ఎంతగా కొత్తపుంతలు తొక్కుతున్నా ఇప్పటికీ మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.
అసలు మరణం అన్నది ఎలా సంభవిస్తుంది? ఇది కర్మకు సంబంధించినదా..? లేక కర్మకు అతీతమైనదా? అని కూడా ఆలోచించాలి. ఆధ్యాత్మిక వేత్తలు మాత్రం -  కర్మను బట్టిమాత్రమే మరణం సంభవిస్తుంటుందని అంటారు. అయితే, వాస్తవమేమిటంటే, ప్రతిజీవికి జనన మరణాలు సహజసిద్ధమైనవి. అంతేకాదు, చావుపుట్టుకలు కర్మకు అతీతమైనవి.

మరణం అనగానే భయపడిపోతుంటాం. అయితే, వాస్తవమేమిటంటే, మరణం జీవునికి ఏ అనుభూతిలేని స్థితిని ఇస్తుంది. ఎలాంటి అనుభవం లేని స్థితిని కర్మకు ముడిపెట్టడం ఏమేరకు సమంజసమో ఆలోచించాల్సిందే...
(మరణంలో రకాలు ఉంటాయా...?
కాలమరణం అంటే ఏమిటి...?
అకాల మరణం అని దేన్ని అనవచ్చు...?
ఈ రెంటి మధ్య మరో మరణం చోటుచేసుకున్నదా....? ఆ వివరాలు తరువాయి భాగంలో...)

- రచన: తుర్లపాటి నాగభూషణ రావు
            9885292208

21, ఏప్రిల్ 2011, గురువారం

చిరంజీవి కుమార్తే వేధిస్తోంది


ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, ఆయన కుమార్తె శ్రీజ తమను వేధిస్తున్నారని శ్రీజ అత్త సూర్య మంగళ ఆరోపిస్తున్నారు. చిరంజీవి కూతురు శ్రీజ కొంతకాలం క్రితం శిరీష్‌ భరద్వాజ అనే అతనిని ప్రేమించడం, తదుపరి అతనితో విబేదాలు రావడం, ఆ పై తనను శీరీష్ తల్లి సూర్య మంగళ వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడం తెలిసిన సంగతే. దానిపై శిరీష్, సూర్య మంగళల బెయిల్ పిటిషన్ కు దరఖాస్తు చేసుకోగా, దానిని అనమతించరాదని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది వాదించారు. ఆ పై శిరీష్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేస్తూ, శ్రీజ తల్లిదండ్రులు పలుకుబడి కలిగినవారని, అదే సమయంలో శిరీష్ తల్లిదండ్రులకు పలుకుబడి లేదని పేర్కొన్నారు.శ్రీజ, ఆమె తల్లిదండ్రులు అంటే చిరంజీవి వైపు నుంచి విపరీతమైన మానసిక వేధింపు ఎదురు కావడంతో సూర్య మంగళ ఆర్టీసి ఉద్యోగం నుంచి స్వచ్చంద పదవీ విరమణ చేశారని న్యాయవాది వివరించారు.అయితే ప్రాసిక్యూషన్ న్యాయవాది మాత్రం బెయిల్ షరతులు భర్తీ చేయనందునే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.కాగా భరద్వాజ తరపు న్యాయవాది మరో విషయం చెబుతున్నారు. ఈ నెల 30వ తేదీన శ్రీజ,శిరీష్ ల జంటకు కౌన్సెలింగ్ ఉంటుందని, , ఆనాటికి ఈ సమస్య ఒక కొలిక్కి రావచ్చని ఆయన అన్నారు.

మరణ రహస్యాలపై ప్రత్యేక కథనం...

                                                           కన్ను తెరిస్తే జననం...
                                                         కన్ను మూస్తే మరణం...
 ఈ రెంటి నడుమ సాగేదే జీవితం..
ఇది నిజమే.... అయితే, అసలు మరణం అంటే ఏమిటి...?
అది, అత్యంత భయంకరంగా ఉంటుందా...?
లేదంటే, ఓ శాశ్వతానంద క్షణమా?
మరణం చుట్టూ ముసురుకున్న ఊహలు, సిద్ధాంతాలు ఏమిటి....??
(ప్రత్యేక కథనం మొదటి భాగం రేపు)
రచన: తుర్లపాటి నాగభూషణ రావు
 9885292208

మనిషి వేలాది సంవత్సరాలు బతకొచ్చా? (మరణంలేని జీవి పార్ట్ -3)

మరణం లేదని తెలిస్తే, ఎగిరిగంతేస్తాం. అయితే, దీంతోపాటు వృద్ధాప్యం కూడా లేకుండా వందలాది సంవత్సరాలు ఉత్సాహంగా బతుకు బండిని లాగించే ఛాన్స్ వస్తే, ఆనందం అంబరాన్ని అంటుతుంది. ఇప్పుడు ఇది సాధ్యం కాకపోయినా, పురాతన కాలంలో మనిషి ఆయుఃప్రమాణం చాలా ఎక్కువేనని పురాణాలు చెబుతున్నాయి.
రాజులు, చక్రవర్తులు, మనులు, మహర్షులు ఎలా ఎందరో వేలాది సంవత్సరాలు హాయిగా జీవించారని పురాణాల్లో ఉంది.  మరణం ఎంతో భయంకరమైనది. అప్పటివరకు మనమధ్యనే ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి కట్టెలా మారిపోతే ఆ దృశ్యాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆదిమానవులు ఎన్నో విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నించారు. రాయి నుంచి నిప్పుపుట్టించగలిగారు. అదే రాయిని ఆయుధంగా మలుచుకోగలిగారు. శబ్దాల నుంచి సంగీతాన్ని పుట్టించగలిగారు. కానీ మరణం ఎందుకు వస్తుందో వారికి అర్థమయ్యేదికాదు. ఏదో పెనుభూతం తమలోని వారిని నోటికి కరుచుకుని వెళ్ళిపోతుందని అనుకునేవారు. కాసేపు చింతించేవారు, ఆ తరువాత మరచిపోయేవారు. కానీ ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది.
 కాలం మారుతున్నా, ఈ ప్రశ్నకు సమాధానం రాలేదు. అయితే, క్రీస్తు పూర్వం 22వ శతాబ్దిలోనే గిల్గమేష్ అనే సాహసికుడు మరణాన్ని జయించడంకోసం తపించినట్టు చరిత్రపుటల్లో ఉంది.


  ఒకసారి హిందూ పురాణాలు తిరగేస్తే ఎంతో మంది పుణ్యపురుషులు వేలాది సంవత్సరాలు జీవించినట్టుగా కనబడుతుంది. రావణాసురుడు వేలాది సంవత్సరాలు జీవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మకోసం రావణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడట. అయినా బ్రహ్మ ప్రత్యక్ష్యం కాకపోవడంతో రావణాసురుడు ఒక తలను నరికి అగ్నికి ఆహుతి చేశాడు. ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒక తలను నరికేసుకున్నాడు. ఇదే నిజమైతే రావణబ్రహ్మ వయస్సు ఎంతై ఉండాలి? తపస్సుకే పదివేల సంవత్సరాలు పడితే, మొత్తం జీవిత కాలమెంత? ఇది నిజమేనా...లేక అభూతకల్పనా...
  పూర్వకాలంలో మునులు, రాజులు జువ్వి ఫలాలను ఆహారంగా తీసుకుంటూ పదివేల సంవత్సరాలకు పైగానే జివించినట్టు కథలు ప్రచారంలో ఉన్నాయి. పృధూ అని పేరుగల చక్రవర్తి సముద్రగర్భంలో పదివేల సంవత్సరాల పాటు తన కుటుంబంతోపాటుగా వెళ్ళి తపస్సు చేసినట్టు పృధూ పాఖ్యానంలో ఉంది.


 విశ్వామిత్రుడు ఒక సందర్భంలో దక్షిణ దిక్కుకువెళ్ళి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడనీ, అలాగే, మరో సారి పశ్చిమ దిక్కుకు వెళ్ళి మరో పదివేల సంవత్సరాలు తపస్సు చేసాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రకంగా చూస్తే, తపస్సుకే విశ్వామిత్రుడు 20, 30 వేల సంవత్సరాలు వెచ్చిస్తే, ఆయన జీవిత కాలమెంత అయిఉండాలి...? అది నిస్సందేహంగా లక్షలాది సంవత్సరాలు అయిఉంటుందా?
  చంద్రవంశంలో జన్మించిన చక్రవర్తి నహుషుడు కూడా వేలాది సంవత్సరాలు జీవించాడు. అగస్త్య మహాముని శాపం కారణంగా పదివేల సంవత్సరాలపాటు సర్పంగా పడిఉండమని శపిస్తాడు. ఒక్క నహుషుడే కాదు, అనేక మంది పూర్వకాల చక్రవర్తులు, రాజులు వేలాది సంవత్సరాలు రాజ్యమేలినట్టు పురాణాలు చెబుతున్నాయి.
 బైబిల్ కూడా ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అబ్రహం తన వందోఏట తండ్రి అయ్యాడు. అలాంటప్పుడు ఆయన కొన్ని వందల సంవత్సరాలు జీవించినట్టుగానే భావించుకోవాలి.
ఇవన్నీ అభూత కల్పనలే అనుకున్నప్పటికీ, మన తాతముత్తాతలు నిక్షేపంగా వందేళ్లకు పైగా జీవించడం అబద్దం కాదుగా...

(మరణం లేనంత మాత్రాన అమరులు అవుతారా.... వచ్చే భాగంలో...)
- తుర్లపాటి నాగభూషణ రావు
9885292208


సన్నగిల్లిన బాబా శ్వాస

పుట్టపర్తి సాయిబాబా భౌతికంగా చివరి దశకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు అందిన సమాచారం ప్రకారం, బాబా శ్వాస మందగించింది. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. బాబావారి ప్రధాన అవయవాలు ఏవీ పనిచేయడంలేదు. ఏ క్షణంలో గుండెలు పగిలిపోయే వార్త వినాల్సి వస్తుందోనని భక్తులు కలవరపడుతున్నారు.
 కాగా, బాబావారిని, తాను ప్రత్యక్షంగా తాను చూశానని, ఆయన శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని జిల్లా కలెక్టర్ జనార్దనరెడ్డి వెల్లడించారు. పుట్టపర్తిలో తాజా పరిస్థితులను ఆయన సమీక్షించారు.సాయిబాబకు వైద్యం జరుఉగుతున్నప్పటికీ, ఆయా అవయవాలు చికిత్సకు సహకరించడం లేదని ఆయన తెలిపారు. బాబా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున మొట్టమొదటిసారిగా జిల్లా కలెక్టర్ ఈ ప్రకటన చేయడం విశేషం. మంత్రి గీతారెడ్డి అక్కడే ఉన్నప్పటికీ,ఆమె ఇతర వ్యవహారాలలో బిజీగా ఉన్నందున కలెక్టర్ ఈ ప్రకటన చేశారు. కాగా రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖులు వచ్చే విషయం ఇంకా ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు.అయితే మంత్రి రఘువీరారెడ్డి
పుట్టపర్తికి చేరుకోబోతున్నారు. సాయిబాబా విషయంలో ఏమి జరగబోతోందో, ఏమి చేయబోతున్నారో, అలాగే ట్రస్టు కార్యకలాపాలపై ఏమి జరుగుతున్నదో వివరణాత్మకమైన ప్రకటన ఏదీ రాకపోవడం మాత్రం బక్తజనానికి ఆందోళన కలిగిస్తోంది.