బాబాను చూడనివ్వని ట్రస్ట్ సభ్యులు


ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సత్యసాయిబాబా అనారోగ్యానికి గురవడం , ఆయన ఆరోగ్యం శనివారంనాటికి మరింత క్షీణించిదన్న ప్రచారం జరగడం, కొందరైతే బాబా ఇక లేరు అన్న వదంతులు వ్యాపింపచేయడంతో పుట్టపర్తి ప్రాంతమంతా భక్తుల రోదనలతో తల్లడిల్లుతోంది. అయితే బాబా ఆరోగ్యపరిస్థితిని తెలుసుకోవడం కోసం సత్యసాయి సమీప బంధువులు, మీడియా, పోలీసులను సైతం ట్రస్ట్‌ సభ్యులు అనుమతించకపోవడం వివాదస్పదం అవుతోంది. ఇలాంటి వాటివల్లే వదంతులు వ్యాప్తిలోకి వస్తుంటాయి. బంధువులు ట్రస్ట్ సభ్యులతో తీవ్రవాగ్వాదానికి దిగిన తర్వాత వారి వరకు మాత్రమే అనుమతించారు. అయితే ట్రస్ట్‌ సభ్యులు కనుక మీడియానో లేక పోలీసులనో తీసుకెళ్లి దూరం నుంచైనా చూపించి , సంబంధిత వైద్యులతో మాట్లాడిస్తే ఇలాంటి వదంతులకు అవకాశముండదు, లేకుంటే అనవసరమైన అనుమానాలు వ్యాప్తిలోకి వస్తాయి. ఈ విషయాన్ని ట్రస్ట్ మెంబర్స్ అర్థం చేసుకోవాల్సినవసరం ఉంది.దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయండి...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!