పంచాంగశ్రవణం ప్రళయాన్ని ఆపుతుందా...?

 పంచాంగశ్రవణం అంటే, అదేదో పాతచింతకాయ పచ్చడిలా భావించేవారి సంఖ్య ఈమధ్యకాలంలో మరీ ఎక్కువైంది. అయితే, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నప్పుడు, దేశాలకు దేశాలు అతలాకుతలమవుతున్నప్పుడు పంచాంగంలోని నిగూఢ అర్థాలను తెలుసుకుంటే ఈ ప్రకృతి శాంతిస్తుందన్న సంగతి చాలామంది మరచిపోతున్నారు. కాలపురుషుడుని శాంతిపజేస్తే, ఈ విశ్వంలోని గ్రహనక్షత్రాలను శాంతిపజేస్తే, 2012లో రాబోయే ప్రళయన్ని నివారించవచ్చు. ఇదేమీ మంత్రమో, మహిమోకాదు. పంచాంగంలో అసలు ఏమున్నదో తెలుసుకుంటే దాని అవసరం ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది.
1. తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగం...అని అంటారు. అంటే, తిథి, నక్షత్ర, యోగ, కరణములనే ఐదు ప్రధాన అంగాలతో కూడినదే పంచాంగం.
2. పైన చెప్పిన ఐదు అంగాలు కాలవిభాగాలే కావడం గమనార్హం.
3. తిథి : కాలస్వరూపుడైన భగవంతుడు ఉండేదాన్ని తిథి అంటారు.
4. వారం: ఒక్కొక్క గ్రహం భగవంతుని సేవిస్తూ, ప్రదక్షిణచేసే దినమే వారం.
5. నక్షత్రం : క్షత్రం (హాని) కలగకుండా రక్షించేదే నక్షత్రం. ఈ సందర్భంగా మరికాస్త వివరణ ఇవ్వాలి...2012లో గ్రహశకలమో, లేదా నక్షత్రమో...కాదంటే, ఏదో ఒక అంతరిక్ష వస్తువో ఈ భూమిని ఢీకొనబోతున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ముసురుకుంటున్నాయి. మొత్తంమీద అంతరిక్షం నుంచే ముప్పు రాబోతున్నదని అంటున్నారు. ఈ సమయంలో మనం వేటిని శాంతిపజేయాల ఓసారి ఆలోచించండి...
6. కరణం: చంద్రుడు నక్షత్రంతో కలిసిఉంన్న కాలాన్ని యోగం అంటాము. వీటిని సాధించే ప్రక్రియే కరణం. ఇక్కడ కూడా మరో విషయాన్ని ప్రస్తావించాలి....ఈ మధ్యనే చంద్రుడు భూమికి చాలా దగ్గరకు వచ్చేశాడు. అప్పుడు చంద్రుడి గురుత్వాకర్షణ పెరిగిన కారణంగా జపాన్ వంటి చోట్ల పెనుభూకంపాలు, సునామీలు చోటుచేసుకున్నాయి. యోగం బాగుండాలంటే, చంద్రడిని ప్రార్థించాల్సిందే...ఆయన్ని శాంతింపజేయాల్సిందే.
 పైన చెప్పిన ఐదు అంగాలు అంతరిక్షానికి సంబంధించినవి కావడం వల్ల పంచాంగంలోని అంశాలను శ్రద్ధగా వినడం ద్వారా, ఆకళింపు చేసుకోవడం ద్వారా రాబోయే ప్రళయాన్ని నివారించవచ్చు.
7. పంచాంగ ఫలం: తిథి శ్రవణం వల్ల సంపద చేకూరుతుంది. వారం వల్ల ఆయుర్ వృద్ధి, నక్షత్ర శ్రవణం వల్ల పాపవిముక్తి. (మానవుడు చాలాకాలం నుంచి ప్రకృతికి విరుద్ధంగా అనేక పాపాలు(తప్పులు) చేస్తున్నాడు) ఇక యోగం వల్ల రోగాలు తొలిగిపోతాయి (ప్రకృతి శాంతిస్తే, రోగాలు దూరం అవుతాయి), కరణం వల్ల కామితార్థాలు తీరతాయి. అందుకే పంచాంగ శ్రవణం వల్ల గంగాస్నాన ఫలం (గంగ శుద్ధికి, శాంతికి చిహ్నం) గోదాన ఫలం (గోవులోనే సమస్త లోకాలు, దేవతలు ఉంటారు), సర్వదాన ఫలం దక్కుతాయి.
 పంచాంగంలోని నిగూఢ అర్థాలను తెలుసుకుని శాంతచిత్తులై, శ్రద్ధగా పంచాంగ శ్రవణం చేయాలి. అప్పుడే అన్ని లోకాలు శాంతంగా ఉంటాయి. మానవాళి సుఖసంతోషాలతో వర్థిల్లుతుంది.
- తుర్లపాటి నాగభూషణరావు
   9885292208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!