చిరంజీవి బ్రదర్స్ చీలలేదా!!



ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి, ఆయన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య విబేధాలు వచ్చిన వార్తలను చిరంజీవి కుటుంబ సన్నిహితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. చిరంజీవి సోదరుల మద్య తగాదాలు వచ్చినట్లు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కధనాలపై చిరంజీవి మండిపడ్డారని సమాచారం ఆ పత్రిక యాజమాన్యానికి ఫోన్ చేసి చిరంజీవి తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కాగా చిరంజీవి, ఆయన పోదరుడు నాగబాబు కలిసి మంగళవారంనాడు బ్రహ్మకుమారిల సంస్థను కూడా సందర్శించారని, ఆ తర్వాత ఫామ్ హౌస్ కు కూడా వెళ్లివచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నాగబాబు ఆరంజ్ సినిమా తీసి బాగా నష్ట పోయిన మాట వాస్తవమేనని, అప్పుడు ఆయన మానసికంగా బాగా కుంగిపోయారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.ఆ తరుణంలో చిరంజీవి కుమారుడు చరణ్ తనకు బాబాయి నాగబాబు ఇచ్చిన రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చివేశారని, అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ మరో ఐదు కోట్ల సాయం అందించడమే కాకుండా, వేరే పేరుతో గబ్బర్ సింగ్ అనే సినిమా తీయడానికి సహకరిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. అన్యాయంగా, అవనసరంగా చిరంజీవి కుటుంబంలో విభేదాలు ఉన్నాయని చెప్పి కొందరు ప్రచారం చేస్తున్నారని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి.చిరంజీవి సోదరులది విడరీయలేని అనుబంధమని, ఈ వ్యవహారాలను ప్రత్యక్షంగా గమనించిన ఒక ప్రముఖుడు వ్యాఖ్యానించారు.
- kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!