ఇన్‌ఫోసిస్ నుంచి భూమి వెనక్కి తీసుకుంటారా?



ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీగా పేరొందిన ఇన్‌ఫోసిస్ సంస్థకు కేటాయించిన 400 ఎకరాల భూమిని వెనక్కి ఇవ్వాలని కోరుతూ ఎ.పి.ఐ.ఐ.సి నోటీసులు జారీ చేసిన వైనం వివాదాస్సదం అయింది. ముఖ్యంగా రాష్ట్ర ప్ఱభుత్వంలోని ముఖ్యమైన ఇన్ఫ్ పర్మేషన్ టిక్నాలజీ శాఖకు తెలియకుండా ఇన్ ఫోసిస్ సంస్థకు నోటీసులు జారీ చేయడం వివాదాస్పదం అవుతుందని, పైగా ఐటి పరిశ్రమకు తప్పు సంకేతం పంపినట్లవుతుందని ఐటి శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎ.పి.ఐ.ఐ.సి భూ కేటాయింపులు తదితర అంశాలలో వివాదలలో కూరుకుపోయిన నేపధ్యంలో వాటిని తప్పుదారి పట్టించడానికిగాను ముందుగా మంచి కంపెనీ అయిన ఇన్‌ ఫోసిస్ కు నోటీసు ఇచ్చిందా అన్న సంశయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎంత పెద్ద సంస్థ అయినా, ఇంత భారీగా భూమి తీసుకున్నప్పుడు దానికి సంబందించిన ప్రగతిని చూపించాలని, లేకుంటే దానివల్ల ప్రయోజనం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఐటి శాఖ అదికారులు ఫిర్యాదు చేశారు.
నిజానికి ఫాబ్ సిటి, లేదా మరికొన్ని సంస్థలు అసలు పనులు మొదలు పెట్టడం గాని, ఎలాంటి కార్యకలాపాలు చేపట్టని వాటిని వదిలి ప్రముఖ సంస్థకు నోటీసు ఇవ్వడం ఏమిటన్నది ఐటి శాఖ ప్రశ్న. అయితే మన రాష్ట్రంలో అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన వేల ఎకరాల భూమి ఇప్పుడు నిరుపయోగంగా పడి ఉందని, కొన్ని చోట్ల అయితే అది ఆక్రమణలకు గురి అవుతోందని ముందు దాని సంగతి చూడాలని కొందరు సూచిస్తున్నారు. హెచ్‌.ఎమ్.టి కంపెనీకి ఇచ్చిన నాలుగు వందల ఎకరాల భూమి ఖాళీగా ఉందని, ఇప్పుడా సంస్థ మూత పడి ఉందని, అక్కడ కొంతమంది ప్లాట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారని, కాని పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగితే చాలామందికి ఉపాధి లభిస్తుందని మరికొందరు సలహా ఇస్తున్నారు.వాటన్నిటిని వదలి ఇన్‌ఫోసిస్ వంటి సంస్థకు నోటీసు ఇస్తే ఐటిరంగం నుంచి వ్యతిరేక సంకేతాలు వస్తాయా అన్నది ఓ డౌట్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!