కోదండరామ్ కు షోకాజ్ నోటీస్ !


తెలంగాణ ఉద్యమాన్ని అలుపు,సొలుపులేకుండా నడుపుతున్న  కోదండరామ్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం క్రమశిక్షణ చర్య నోటీసులు జారీ చేసింది. దీంతో కోదండరామ్  దీర్ఘకాలిక (ఈఓఎల్ )సెలవు పెట్టారు.
 ఎం. కోదండరామ్ సికింద్రాబాద్ పిజీ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) కన్వీనర్ గా కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు షోకాజ్ నోటీస్ ఇచ్చేశారు. తెలంగాణ ఉద్యమంలో యాక్టీవ్ గా పాల్గొంటున్నందుకే గవర్నర్, యూనివర్శిటీ ఛాన్సలర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ ఈ నోటీస్ ఇచ్చే విషయంలో చొరవచూపరని అనుకుంటున్నారు. ఎలాంటి రాజకీయ ఉద్యమం నడిపినా, క్రీయాశీలక పాత్రపోషించినా అది సర్వీస్ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమన్న క్లాజ్ చూపుతూ కోదండరామ్ కు ఈ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. షోకాజ్ నోటీస్ అందుకోవడంతో గత్యంతరం లేని స్థితిలో కోదండరామ్ లాంగ్ లీవ్ పెట్టినట్టు అనుకుంటున్నారు. 
 ముద్దసాని కోదండరామ్ 1955లో అదిలాబాద్ లో పుట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. అంతేకాదు,  టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సలహాదారుడు.
  కోదండరామ్ శెలవుపై వెళ్లక తప్పని స్థితి కల్పించిన ఉస్మానియా యూనివర్సిటీ రేపైనా పశ్చాత్తాపపడక తప్పదని యూనివర్శిటీ విద్యార్థులు అంటున్నారు. విశ్వవిద్యాలయాలలో పని చేసేవారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా భావాలను వ్యక్తం చేయగలిగి వుండాలి. సర్వీసు నిబంధనల పేరిట ఆంక్షలు విధించడం విశ్వవిద్యాలయాల స్ఫూర్తికి విరుద్ధం. సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ గా వున్న ప్రొ. ఎన్. శ్యామ్యూల్ గారికి ఇలా నోటీసులు ఇచ్చినా అది తప్పే అవుతుందని విద్యార్థి నాయకులు అంటున్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర లేదా జై ఆంధ్ర ఉద్యమాల దృష్టితో దీనిని చూడరాదు. విశ్వనిద్యాలయాలు సమాజాన్ని ముందుకు నడిపే కేంద్రాలు కాబట్టి వాటిలో పనిచేసేవారికి ఇలాంటి విధినిషేధాలు వుండరాదన్న భావన వినవస్తోంది.
                      

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!