పదిమంది జగన్లు, ఆరుగురు విజయలక్ష్మిల పోటీ

రాష్ట్ర రాజకీయాలలో ఇదొక కొత్త ధోరణి. ప్రత్యర్దులను ఓడించడానికి రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలు పన్నే మాట నిజమేకాని, ఈసారి సరికొత్త ట్రెండ్ ను ప్రవేశపెట్టాయి. బహుశా ఇది భవిష్యత్తు ఎన్నికలకు మార్గదర్శకం అవుతుందేమోననిపిస్తుంది అదేమంటే ఎవరు బలమైన ప్రత్యర్ధి అనుకుంటారో వారి పేర్లున్నవారిని వెతికి పట్టుకువచ్చి నామినేషన్లు వేయించడం గతంలో ఎన్నడూ జరగలేదు. కడప లోక్ సభ ఉప ఎన్నికలలో పోటీచేయడానికి 57 నామినేషన్లు దాఖలైతే అందులో పది పేర్లు జగన్మోహన్ రెడ్డి అని ఉన్నాయి. అలాగే పులివెందుల శాసనసబకు 39 నామినేషన్లు వేస్తే, అందులో ఆరు విజయలక్ష్మి పేరు కలిగినవారే కావడం విశేషం. ఈ తెలివితేటలు ఎవరికి వచ్చాయో కాని వారిని మెడల్ ఇవ్వవలసిందే. వారిది ఒకరకంగా అతి తెలివికింద కూడా వస్తుంది. వై.ఎస్.జగన్ ను, విజయమ్మలను ఓడించడం కోసం నేరుగా పోటీ ఇవ్వకుండా ఇలాంటి తికమక ఐడియాలతో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ద్వారా ఒక సంగతిని వారు ఒప్పుకుంటున్నవుతోంది. జగన్, విజయలక్ష్మిలు మిగిలిన పార్టీల అబ్యర్ధులకన్నా బాగా బలమైన అభ్యర్ధులని తేల్చేస్తున్నారు.ఎందుకంటే జగన్, విజయమ్మల పేర్లతోనే నామినేషన్లు పడ్డాయి కాని, రవీంద్రరెడ్డి, మైసూరారెడ్డి, వివేకానందరెడ్డిల పేర్లతో నామినేషన్లు పడలేదు.ఆ పేర్లు కలవారు వెతికితే దొరకరా. అంటే తమ ప్రత్యర్ధి గెలిచిపోతున్నాడన్న దుగ్ద ఇందులో కనిపిస్తుంది. నిజంగానే ఈ పేర్లతో వై.ఎస్.జగన్ , విజయలక్ష్మి లను ఓడించగలిగినా, మెజార్టీ తగ్గించగలిగినా వారి వ్యూహం ఫలించినట్లే అవుతుంది. కాని ఇప్పుడున్న పరిస్థితులలో అది ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేం.రాజకీయం అంటేనే ఇలా ఉంటుందన్నమాట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!