సాఫ్ట్వేర్ సత్తి - కామెడీ సీరియల్ - ఎపిసోడ్ 1


'హా!! అప్పుడే తెల్లారిందా!! అలారం మోగలేదే...'
'మోగలేదా!!  టివి యాంకర్ లాగా గాప్ లేకుండా మోగి, ఇప్పుడే కమర్షియల్ బ్రేక్ తీసుకుంది  ..బాటరీ డౌన్ అయ్యి... త్వరగా లే ఆఫీసుకి లేటవుతుంది' అన్నాడు మా రూం మేట్ పి.కే.
పికే - పూర్తి పేరు పవన్ కళ్యాన్ ... పేరు పవర్ స్టార్ అంత ఉన్నా... బుద్ధి ఫై-స్టార్ (five star)  అంత కుడా లేదు... వీడి గురుంచి తర్వాత డిటైల్ గా చెప్పుకుందాం... ఇప్పుడు ఆఫీసు కి రెడీ అవ్వాలి...
--------మొత్తానికి ఆఫీసుకి చేరుకున్నాం...
నా సీటు దగ్గరకి వెళ్ళానో లేదో... ఎదురుకుండా మన బాసుగాడు దర్సనం ఇచ్చాడు...
'గుడ్ మార్నింగ్ !' అన్నాను
'నిన్న నువ్వు పంపిన కోడు ఫైలయ్యింది. కరెక్టు చేసి అరగంటలో కంప్లేటు చెయ్యి' అన్నాడు మన బాసు K D చక్రవర్తి.
KD - వీడు మన బాసు... BP టాబ్లట్ కి బ్రాండ్ ఎమ్బాసడర్  గా తప్ప ప్రపంచం లో వీడు దేనికీ పనికిరాడని నా స్ట్రాంగ్ ఫీలింగ్...
ఇంతలో వెనకి నుంచి వచ్చాడు మా టెస్టర్ తంగవేలు...
తంగవేలు - వీడు తమిళ్ వాడో.. తెలుగు వాడో... వీడికీ డవుట్...  ఖర్మ కాలి వీడు నేను చేసే కోడు కి టెస్టింగ్ చేస్తాడు... మనం ఏదో అక్కడ ఇక్కడా కాపీ కొట్టి కోడు రాస్తాం... ఏదో చూసి  చూడనట్టు గా వదిలేయాలి కానీ... ఇలా ఇష్యూ లు రైజ్ చేస్తే ఎలా..
'గుడ్ మార్నింగ్ ... నేనొక ఇష్యూ రైజ్ చేసాను... వచ్చిందా' అన్నాడు తంగవేలు
(అదేమన్నా ఉత్తరమా చేరిందో లేదో అడగడానికి..) 'యా అదే చూస్తున్నా... నీ దగ్గర నుంచి నాకు కొన్ని ఇన్పుట్స్ కావాలి... కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా..'  అన్నాను
కాఫీ కోసం కాంటీన్ కి వెళ్ళాం... అక్కడ కలిసాడు B గోపాల్ ...
B గోపాల్ - వీడు మా టీం మెంబెర్... వీడి ఇంటి పేరు B కాదు... బక్క గా ఉంటాడని మేము ముద్దు గా అలా పిలుచుకుంటాం. వీడు ఎంత బక్కగా ఉంటాడంటే ... వీడిని వీడు చూసుకోవడానికి ఇంట్లో అద్దం బదులు భూతద్దం వాడుకుంటాడు.... ఇంక వీడి జుట్టు... అప్పుడే కరెంటు ప్లగ్ లో వేలు పెట్టి వచ్చినట్టు, అంతా పైకి లేచి ఉంటుంది.
నేను, తంగవేలు, B గోపాల్ కలిసి కాఫీ తాగుతున్నాం...మాటల్లో...
'ఒరేయ్ సత్తి గా నువ్వు ఎప్పుడైనా సవ్యం గా కోడ్ రాసావు రా...' అన్నాడు గోపాల్, అక్కడికి వీడేదో బిల్ గేట్స్ అయినట్టు...
'ఎన్నడా సత్తి ... నీ కోడ్ మీద ఇష్యూ రైజ్ చేయడం ఇది 91 సారి... '
(నాకు చాలా కోపం వచ్చింది...వీళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారు... వీళ్ళకి నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే.... సాధారణం గా సెకండ్ హాఫ్ లో అసిస్టెంట్ గాడు చెప్పాల్సిన హీరో ఫ్లాష్ బ్యాక్ ని ఇప్పుడు హీరో నే చెప్పాల్సి వస్తోంది... అదీ మొదటి సీనులో... ఏం చేస్తాం!!)
'నా ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే మీరు ఇలా అనరు'
'ఏంటి మనకి ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందేంటి ' నవ్వుతూ అడిగాడు గోపాల్
'ఐదు ఏళ్ల క్రితం బెజవాడ బీసంట్ రోడ్ లో సత్యనారాయణ రెడ్డి అంటే.... శత్రువుల గుండెల్లో మెషిన్ గన్....'
'అబ్బ చా!.. ఎరా సత్తి గా .... నీ పేరు సత్యనారాయణ 'రెడ్డి' ఆ ... ఫ్లాష్ బ్యాక్ లో కేస్టే (caste) మార్చేసావా ??'
'కేస్ట్ కాదు కాస్టింగే మారింది... చెప్పేది పూర్తిగా విను... ఆ సత్యనారాయణ రెడ్డి కి రైట్ హ్యాండ్ వాళ్ళ కొడుకు మా ఇంటి పక్కన ఉండే వాడు.... అలా ఉండగా ఒక రోజు ఏం జరిగిందంటే!!..........'
..... to be continued!

Click Here for Next Episode
Rajesh Turlapati

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!