బాబా విగ్రహం నుంచి సుగంధపరిమళాలు

|
మనదేశంలో రకరకాల మతవిశ్వాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొందరు వాటిని మూఢనమ్మకాలుగా భావించవచ్చు. మరికొందరు అవన్నీ వాస్తవాలుగా అనుకోవచ్చు.గతంలో గణేషుడు విగ్రహం నుంచి పాలుకారుతున్నాయన్న ప్రచారం పెద్ద సంచలనంగా మారింది. అలాగే చెట్లనుంచి పాలు వస్తున్నాయని, దేవుని పటాలు నుంచి విభూది వస్తుందని ఇలా రకరకాల నమ్మకాలు వ్యాప్తిలోకి వచ్చాయి. హేతువాదులు వీటన్నింటిని కొట్టిపారేసి వాటిలోని వాస్తవాలను శాస్త్రీయత ఆధారంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ భక్తులు తమ విశ్వాసాల మేరకే పూజలు, పురస్కారాలు చేస్తుంటారు. ఆస్పత్రిలో సత్యసాయిబాబా విషమపరిస్థితిలో ఉంటే పుట్టపర్తిలో ఆయన విగ్రహం నుంచి సుగంధ పరిమళాలు వస్తున్నాయంటూ సాగుతున్న ఓ ప్రచారం రాష్ట్రంలో సాయిభక్తుల్లో కలకలం సృష్టిస్తోంది. అనేక మంది సాయిభక్తులు ఈ ఘటనను అత్యంత భక్తి శ్రద్ధలతో చూస్తూ ఇదంతా సాయిమహిమగానే చెప్పుకుంటున్నారు. కాగా న్యూస్ ఛానల్స్‌లో దీనికి సంబంధించి భక్తుల మనోభావాలతో సహా విస్తృతంగా ప్రసారాలు చేశాయి. అయితే ఈ విగ్రహారాధన హడావుడిలో సాయిబాబా ఆరోగ్యం, ట్రస్ట్ ఆస్తులకు సంబంధించి వస్తున్న వివాదాలు కాసేపు తెరమరుగై బాబా విగ్రహం నుంచి సుగంధ పరిమళాల వ్యాప్తిపైనే దృష్టి కేంద్రీకృతమైంది. ఇందులో నమ్మడం .నమ్మకపోవడమనేది ఎవరి ఇష్టం..ఎవరి అభీష్టం...ఎవరి విశ్వాసం వారిది.
-kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!