3, ఏప్రిల్ 2011, ఆదివారం

సాఫ్ట్వేర్ సత్తి - కామెడీ సీరియల్ - ఎపిసోడ్ 2


... అలా ఉండగా ఒక రోజు ఏం జరిగిందంటే.....'
'ఆ ఏం జరిగింది ?!' అ౦టూ ఇద్దరూ ఒకే సారి అడిగారు..
(ఎవడికి తెలుసు!!... అయినా వీళ్ళు ఏమిటి ఇంతగా ఇన్వోల్వ్ అయ్యారు... సరే ఏదో ఒకటి చెపుదాం.... )
'ఆ రోజు నేను, మా క్లాసు మేట్ సుబ్బారావు గాడు 3rd ఇయర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం.... ఇంత లో మా ఎదురింటి కిటికీ ఓపెన్ అయ్యింది... ఆ ఎదురింటి కిటికీ లో నుంచి ఒక ఫుల్ మూన్ ఫేసుతో ఒక అమ్మాయి....'
'ఆగు... సో... ఇది ఒక లవ్ స్టొరీ.... అవునా?!'  ఏదో అమెరికా ని కనుక్కున్న కొలంబస్ లెవెల్ లో ఫేసు పెట్టి అన్నాడు తంగవేలు...
'కాదు.. ఇది లవ్ ఫైల్యూర్ స్టొరీ....' అ౦టూ చాలా ఎమోషనల్ గా ఆన్సర్ ఇచ్చాను..
'ఓహ్ ఐ యాం సారి సత్తి..... తర్వాత ఏమైంది...' అని అడిగాడు B గోపాల్..
'ఆ అమ్మాయిని కిటికీ లో నుంచి చూసానో లేదో... వెనక నుంచి పెద్ద శబ్దం... ఏమిటా అని చూస్తే.. మా ఫ్రెండ్ సుబ్బారావు గాడు... ఫుల్ బాటిల్ కొట్టినట్టు కింద పడిపోయాడు... వాడిని ఒక ఫుల్ బకెట్ నీళ్ళతో లేపిన తర్వాత అర్థమయింది... వాడు పడ్డది ఫుల్ బాటిల్ వల్ల కాదని,.. ఆ ఎదురింటి కిటికీ లో ని ఫుల్ మూన్ పిల్ల వల్ల అని.....'
'ఆగు నేను ఇది స్ట్రైట్ లైన్ లవ్ అనుకున్నా.. ఇది ట్రైయాంగిల్  లవ్ లాగా ఉందే?' అన్నాడు B గోపాల్ ....
'నీ జామెట్రీ ఆపి ... నా కామెంట్రీ పూర్తి గా విను... ఆ పిల్ల పేరు చంద్రిక అగర్వాల్.... ఆ పిల్ల కి తెలుగు రాదు.... మా వాడికి హిందీ అనే బాష ఒకటి ఉందని కుడా తెలీదు...అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది... మా వాడు '30 రోజుల్లో హిందీ' పుస్తకం కొని.. వాడి హిందీ అంతా నా పైన ప్రయోగించేవాడు... హిందీ పాటల CD లు తెచ్చి వాల్యూమ్ పెద్దగా పెట్టేవాడు... అలా Java ఎగ్జాం రోజు 'మర్ జావా మిట్ జావా' అ౦టూ.. C లాంగ్వేజ్ రోజు 'చయ్య చయ్య ...' అ౦టూ... పాటలు వినీ.. వినీ.... ఎగ్జాం పేపర్ లో కుడా ఆన్సర్స్ బదులు లిరిక్స్ రాసి వచ్చాను... ఆ తర్వాత ఒక రోజు మా వాడు ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు... వీడికొచ్చిన హిందీ లో రాసి.. దాన్ని ఆ అమ్మాయి ట్రాన్స్లేట్ చేసుకొని వెరైటీ గా 'OK' చెప్పింది....'
'ఆగు... ఇందాక లవ్ ఫైల్యూర్ అన్నావ్.. ఇక్కడ క్లైమాక్స్ చూస్తే అలా అనిపించట్లేదే....'
'హహ హ ! పిక్చర్ అభి బాకీ హై  మేరె దోస్త్... వాళ్ళ లవ్ సక్సెస్ అయ్యింది... మనమే  ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాము....అన్ని లిరిక్స్ రాసిన తర్వాత ఎ వెదవైనా మార్క్స్ వేస్తాడా... చెప్పు తంగవేలు.. అలా అన్ని ప్రొగ్రామ్మింగ్ లాంగ్వేజ్ లు నా బుర్ర నుంచి ఎరేజ్ అయ్యాయి... ఇంక నన్ను కోడింగ్ ఎలా చెయ్యమంటావ్ చెప్పు తంగవేలు చెప్పు...(అ౦టూ పాత సినిమా హీరో లెవెల్ లో డైలాగ్ కొట్టా)'
'ఊరుకో సత్తి.. నాకు నీ ఫ్లాష్-బ్యాక్ తెలీక ఏదో అనేసాను..... సారీ... వెరీ సారీ.... అయితే నువ్వు అప్పుడు ఏ లాంగ్వేజు నేర్చుకోలేదన్నమాట!'
'నో.. ఒక్క లాంగ్వేజ్ నేర్చుకున్నా...'
'ఏ౦టో అది?' అడిగాడు B గోపాల్..
'హిందీ' అన్నాను నేను...
అలా నా ఫ్లాష్ బ్యాక్ కి ఫుల్ స్టాప్ పడ్డదో లేదో... వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి నా భుజం మీద పడ్డది.. ఎవరా అని వనక్కి తిరిగి చూస్తే... ఓహ్ మై గాడ్!....
--- to be continued
-Rajesh Turlapati

1 వ్యాఖ్య: