నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వి- సీ15

శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ 15 ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ లాంచర్‌ శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. షార్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 9.22 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో ఆనందం వెల్లివిరిసింది. ఈ విజయంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌, ప్రధాని అభినందించారు.

పీఎస్‌ఎల్‌వీ సీ 15 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి 9.22 నిమిషాలకు 5 ఉపగ్రహాలను తీసుకుని రాకెట్‌ నింగికెగిసింది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మరో మూడు నెలల్లో పీఎస్‌ఎల్వీ 16ను ప్రయోగించనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ తెలిపారు. కార్టోశాట్‌ 2బీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించగా.. అల్జీరియాకు చెందిన అల్‌శాట్‌ , కెనడా, స్విట్జర్‌లాండ్‌ల నుంచి రెండు నానోశాట్లు ఇందులో ఉన్నాయి.

వీటితో పాటు కర్ణాటక... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు రూపొందించిన స్టడ్‌శాట్‌ను అంతర్జిక్షంలోకి ప్రవేశపెట్టారు. 16 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల ద్వారా ఇప్పటి వరకు 25 విదేశీ, 19 స్వదేశీ పరిజ్ఞానం గల ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. సరిహద్దుల్లో నిఘా, పట్టణీకరణ, మౌళిక సదుపాయాల మెరుగుకు ప్రస్తుత ఉపగ్రహాలు ఉపయోగపడతాయి. కార్టోశాట్‌ 2 బి రేపటి నుంచి ఛాయా చిత్రాలను అందివ్వనున్నది. ఈ రాకెట్‌ బరువు 230 టన్నులు. పీఎస్‌ఎల్వీ ప్రయోగాల్లో ఇది పదిహేడవది కాగా... పదహారు సార్లు సక్సెస్‌ సాధించాం.. ఈ విజయంతో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!