చిరంజీవి ఆవేదనలో నిజం ఉన్నదా....?


కాంగ్రెస్ లో కొత్త నేతగాఉన్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తమిళనాడు పర్యటన బాగానే ఉపయోగపడుతోంది. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కన్నా ఎలా అభివృద్ది చెందింది స్వయంగా చూసి దానిపై స్పందిస్తున్నారు.తమిళనాడులో అభివృద్ది స్పష్టంగా కనిపిస్తోంది. మన ఎమ్.పిలు
అసమర్ధులుగా ఉన్నారని, కేవలం సొంత పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అదే విషయమై టీవీ ఛానల్ లో ప్రజాభిప్రాయం కోరితే చిరంజీవి అబిప్రాయంతో
70శాతం ఆమోదిస్తున్నట్లు తలిపారు. నిజమే మన ఎమ్.పిలు, ముఖ్యంగా అదికార కాంగ్రెస్ ఎమ్.పిలు ప్రాంతాల వారీగా చీలిపోయి, గొడవలు పడుతూ, రాష్ట్ర అభివృద్దిని పూర్తిగా విస్మిరిస్తున్నారన్న విమర్శ ఉంది. చివరికి తెలంగాణ అంశం కారణంగా ఎమ్.పిలు తాము మాట్లాడకోబోమన్న ప్రకటన చేస్తున్నారు.రాజకీయాలలో ఉన్నవారు ఇలాంటి సంకేతాలు పంపుతూ
ప్రజల మధ్య విద్వేషాలు పెంచడానికి చూపుతున్న ఉత్సాహం రాష్ట్రానికి సంబంధించిన పనులపై చూపడం లేదు. అలాగే అనేక మంది కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల అవతారం ఎత్తి, వారి కాంట్రాక్టుల వ్యవహారాల గురించి చేస్తున్న ఆలోచన ప్రజలపై పెట్టడం లేదు.తమిళనాడులో అత్యధిక మంత్రి పదవులు పొంది రాష్ట్ర అబివృద్దికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకుంటున్నారని
కూడా చిరంజీవి తెలిపారు.గత రెండేళ్లుగా రాష్ట్రం మరీ వెనుకబడి పోవడంలో ఎమ్.పిలు తమ వంతు పాత్ర తాము పోషించారు. అంతేకాదు.అందులో చిరంజీవకి కూడా వాటా ఉంది. తెలంగాణ అంశంలో ముందు ఒక అబిప్రాయం చెప్పి, ఆ తర్వాత మార్చుకుని రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితికి ఆయన కూడా కారణభూతుడయ్యారు.తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు  అందరు కలిసి రాష్ట్రాన్ని అదోగతికి తీసుకు వెళ్తున్నారు.
-Source: Kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!