19, ఏప్రిల్ 2011, మంగళవారం

కోర్టుకెక్కిన వైఎస్ కూతురు,అల్లుడు
  |
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వెలుగువెలిగిన వైఎస్ కుటుంబంలో ఇప్పుడు ఒక్కొక్కరు కోర్టులు, పోలీస్‌స్టేషన్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. కొంతకాలం క్రితం కడప మాజీ మేయర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బామ్మర్ధి రవీంద్రానాథ్‌రెడ్డిని ఓ కేసులో అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా పోలీసులు చుట్టూ తిరిగిన వైఎస్ కూతురు షర్మిల, అల్లుడు,ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్‌కుమార్‌లు విసిగిపోయి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటివరకు తమకు ఇచ్చిన భద్రతను కొనసాగించాలని, ప్రాణభయం ఉందని, పరిస్థితులు బాగాలేవని చెప్పినా ప్రభుత్వం భద్రత తగ్గించిందని, దయచేసి మా భద్రతను కొనసాగించాలని వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమకు కేటాయించిన ఇద్దరు భద్రతాసిబ్బందిని ఉపసంహరించుకోవడాన్ని వారు కోర్టులో సవాల్‌ చేశారు. ఈ కేసు ఇంకా విచారణకు రావాల్సి ఉంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి