సత్యసాయి జీవితం మహిమాన్వితం

సత్యసాయి బాబా 1926, నవంబర్‌ 23 న పెద్ద వెంకపరాజు, ఈశ్వరమ్మ దంపతులకు అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి కుగ్రామంలో జన్మించారు. సత్యనారాయణ వ్రతం తర్వాత జన్మించిన ఈ బిడ్డకు సత్యనారాయణ రాజు ( సత్యసాయి బాబా) గా నామాకరణం చేశారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాయిద్యాలు వాటంతటికి అవే మోగాయని చెబుతున్నారు. బాబా బుక్కపట్నం గ్రామంలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. చిన్న వయస్సులోనే నాటకాలు , సంగీతం , కవిత్వం , నటన వంటి కళల్లో ప్రావీణ్య కనబర్చారు.


అక్కడ తన అన్న శేషమ రాజు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతుండుగా అప్పటి సత్యనారాయణ రాజు సైతం అక్కడే ఉరవకొండ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు. అయితే 1940 , మార్చి 8న యదావిధిగా పాఠశాలకు వెళ్ళిన సత్యనారాయణ రాజు కొద్ది సేపటికి ఇంటికి వచ్చి పుస్తకాలను పక్కన పెట్టి తాను సత్యనారాయణరాజును కాను సత్యసాయి బాబాను అంటూ ప్రకటించకున్నారు. అక్కడికి సమీపంలోని ఓ రాతి గుండు పై కూర్చుని ‘‘ మానస బజరే హరిచరణం ’’ అన్న కీర్తనను ఆలపించారు.

అక్కడ నుంచి బాబా కుటుంబీకులు పుట్టపర్తికి తీసుకురాగా బాబా మహిమలు గుర్తించిన భక్తులు రావడంతో అధికం కావడంతో 1944లో భక్తులు బాబాకు ఆశ్రమాన్ని నిర్మించారు. అయితే భక్తుల సంఖ్య పెరగడంతో 1948 లో ప్రస్తుతం వున్న ప్రశాంతి నిలయం నిర్మాణం చేపట్టారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా ఆశీస్సులు కోసం వచ్చే భక్తులు సంఖ్య పెరగడంతో ప్రశాంతి నిలయం సైతం అన్ని హంగులతో విశాలంగా తీర్చిదిద్దారు. కాగా తాను షిరిడి సాయిబాబా అవతార పురుషుడుగా ప్రకటించుకున్న సత్యసాయి బాబా తిరిగి తాను ప్రేమా సాయి బాబాగా అవతరిస్తానని 1976 లో భక్తులకు ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశంలో తెలిపారు.

సత్యసాయి బాబా ఆశీస్సుల కోసం దే శ , విదేశాలు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో బాబా కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్దకెక్కిడంతో నేడు దాదాపు 146 దేశాల్లో సత్యసాయి బాబా భక్తులు వున్నారు. నాటి కుగ్రామంగా వున్న పుట్టపర్తి నేడు అంతర్జాతీయ చిత్ర పటంలో గుర్తించబడిందంటే అ ఘనత సత్యసాయి బాబా బోధించే అధ్యాత్మిక బోధనల ప్రభావమే అనడంలో అతిశయోక్తిలేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!