జగన్ అంటే అంత భయమెందుకో???

కడప లో జగన్ పై పోటీ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ  నేతలు భయపడి పోతున్నారా ? పరిస్తితి చూస్తుంటే అలాగే వుంది. జగన్ పై పోటీ చేసి గెలవ  లేమని భయమా? లేక  జగన్ కి జనం లో ఆదరణ వుందని భయమా ?ఏది ఏమైతేనేమి అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ లు కడప లో తమకు పట్టు లేదని విషయాన్నీ బయట పెట్టుకున్నాయి.  కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు చేతులెత్తిసిన మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి నే బరి లోకి దింపబోతోంది.తెలుగు దేశం పార్టీ కూడా చేతులెత్తేసిన మైసూరా రెడ్డి నే పోటీ కి నిలిపింది.కాంగ్రెస్ కంటే  టీడీపీయే ముందుగా మైసూరా పేరు ప్రకటించింది.కాంగ్రెస్ మల్ల గుల్లాలు పడి,కందుల సోదరులను బతిమలాడుకుని చివరికి వారు కాదంటే  డీఎల్ నే పోటీ కి నిలబెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి వుంది.జగన్ ను వైఎస్ ను తూర్పార పట్టడం లో చూపిన ఆసక్తి,చొరవ పోటీ విషయంలో  కాంగ్రెస్ నేతలకు కరువైందనే విమర్శలు వినబడుతున్నాయి. కాంగ్రెస్అధిష్టానాన్ని,సోనియా ను ఎదిరించిన జగన్ ను ఓడిస్తామని ఉత్తర కుమారుల్లాగా  ప్రగల్భాలు పలికిన నేతలంతా ధీటైన అభ్యర్ధిని బరి లోకి దింపడం లో విఫలమైనారు. టికెట్ ఇస్తామన్నా నేతలు వద్దు అంటున్నారంటే జగన్ ఫోబియో ఎంతుందో ఇట్టే తెలిసి పోతుంది.మొత్తం మీద ప్రాధమిక స్తాయిలోనే కాంగ్రెస్ టీడీపీ లు వెనుకంజలో వున్నాయి.దీన్ని బట్టి పోటీ ఎలా వుంటుందో ఎవరైనా అర్ధం చేసుకోవచ్చు.విశ్లేషకుల అంచనా ప్రకారం మైసూరా కానీ డీఎల్ కానీ పెద్ద గా పోటీ ఇవ్వలేరు.కాకపోతే జగన్ కు భారీ  మెజారిటీ రాకుండా అడ్డుకునే యత్నాలు చేయగలరు.గత ఎన్నికల్లో జగన్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఒక లక్షా డెబ్భయి ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యత తో గెలిచారు.ఈ సారి రెండు లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీ తో విజయం ఖాయమని జగన్ అనుచరులు అంటున్నారు. ఈ నేపధ్యం లో కాంగ్రెస్ టీడీపీ లు ఏ వ్యూహాలను అనుసరిస్తాయో చూడాలి .  
jaijainayaka     

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!