బర్నింగ్ కామెంట్రీ - 11 (అమ్మాయిల వేధింపుల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్..)

అక్షర క్రమంలోనేకాదు
అమ్మాయిల్ని వేధించడంలోనూ

 
మన ఆంధ్రప్రదేశ్ ఫస్టేనట
వన్ సైడ్ లవ్వులు...ఉన్మత్త మేఘాల్లా
రాష్ట్రాన్ని కమ్మేస్తూ...రక్తపుటేరులు పారిస్తున్నాయ్

 మోకాలికీ బట్టతలకి లింకుపెట్టే
ఖాకీలున్నంతకాలం
కత్తిగాటుని..గాజులకోతతో
సరిపెట్టేస్తుంటే..శిరీషలాంటి
అబలలెందరో ప్రేమోన్మాదుల
దాడులకు బలైపోతూనే ఉంటారు
అవినీతిమీద పోరాటం చేసే
అన్నా హజారేకి ఓటేసేకన్నా
కన్నెపిల్లల్ని కాటేసే కేసుల్ని
పక్కదోవపట్టించే ఖాకీలపై
కన్నెర్రచేస్తూ ఉద్యమించండి

మేరాభాయో...బేహనో...
ఈ రక్తాక్షరాల్లో ఉన్న ఆంతర్యాన్ని గమనించండి!

                                                        -నీల్ కొలికపూడి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!