9, ఏప్రిల్ 2011, శనివారం

హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు
|
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నా హజారేకి మద్దతుగా ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలోనే ఒక కీలకమైన సన్నివేశం చోటు చేసుకుంది.ఎన్.టి.ఆర్ కుమారుడు, చంద్రబాబు బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాసిన ఒక ప్రకటన ఒకటి మీడియా ప్రతినిధుల చోతుల్లోకి, అలాగే పార్టీ క్యాడరుకు అందింది. స్వయంగా హరికృష్ణ గన్ మాన్ ఈ ప్రకటన ప్రతులను అందరికి పంపిణీ చేశారు. అలా చేయడమే ఒక సంచలనం అయితే, అందులో ఉన్న విషయాలు మరింత సంచలనంగా ఉన్నాయి. అన్నా హజారేకి మద్దతు ఇస్తున్నానని తెలిపిన హరికృష్ణ తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయబోతున్నానని, అందుకోసం ప్రజల ముందుకు రాబోతున్నానని, ప్రజలంతా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.ఎన్.టి.ఆర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తిగా అభివర్ణిస్తూ, ఆయన హయాంలో అవినీతికి వ్యతిరేకంగా ఏఏ చర్యలు తీసుకుంది వివరించారు. ఎన్.టి.ఆర్ ధర్మమహామాత్రగా ఇవిరామిరెడ్డిని నియమించారని, లోకాయుక్త, ఉప లోకాయుక్తల వ్యవస్థను రూపొందించారని తెలిపారు. అయితే ఇందులో ఎక్కడాకూడా చంద్రబాబు గురించిగాని, చంద్రబాబు పాలన గురించి గాని ప్రస్తావించకపోవడం గమనించదగిన అంశం. అవినీతి అంతానికి ప్రజల భాగస్వామ్యం ఉండాలని స్విస్ బ్యాంకులోని నల్లధనాన్ని ఇండియాకు తీసుకురావాలని కూడా ఆయన కోరారు.బోఫోర్స్ నుంచి 2జి స్పెక్ట్ర మ్ స్కామ్ వరకు ఎన్నో జరిగినా ఎవరికి శిక్ష పడలేదని, చివరికి సర్వశిక్ష అభియాన్, అంగన్ వాడి వంటి వాటిలో కూడా అవినీతి జరుగుతోందని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు కార్యక్రమానికి హాజరుకాకుండా, తన ప్రకటనను మాత్రం పంపిణీ చేయించడం ద్వారా చంద్రబాబుకు హరికృష్ణ మద్యఅంతరం మరింత పెరిగిందన్న అబిప్రాయం కలగడానికి ఆస్కారం ఏర్పడింది.అంతకుముందు బాలకృష్ణ చేసిన ప్రకటనలో కూడా తనను వివాదాలలోకి లాగవద్దన్నారు తప్ప, హరికృస్ణ గురించికాని, చంద్రబాబు గురించికాని ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. ఇదంతా చూస్తుంటే టిడిపిలో ఏదో జరుగుతోందన్న భానన ఏర్పడుతోంది.ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. హరికృష్ణకు, చంద్రబాబుకు అంతరం బాగా పెరిగిపోయిందని, మధ్యవర్తులు ఎవరైనా జోక్యం చేసుకుని పరిస్థితిని సరిదిద్దితే చెప్పలేము కాని, ఇప్పటివరకు జరిగిన పరిణామాలను గమనిస్తే హరికృష్ణ తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నట్లే అర్ధం చేసుకోవాలి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి