జయలలితకు మచ్చలేదా?


తమిళనాడు మాజీముఖ్యమంత్రి,అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత ఓ సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో తాను అవినీతిపరురాలిను కాదని పేర్కొన్నారు. తాను ఏ అవినీతి కేసులో కూడా ఇరుక్కోలేదని, తన పార్టీకి కూడా ఎలాంటి మచ్చా లేదని కూడా ఆమె చెప్పారు. అయితే విశేషమేమిటంటే జయలలిత ఓడిపోయి కరుణానిధి అధికారంలోకి రాగానే అప్పట్లో ఆమెపై అవినీతి కేసు పెట్టడం, ఆమె ఇంట్లో లభించిన అనేక బంగాలు ఆభరణాల్ని బహిరంగంగా ప్రదర్శించడం అప్పట్లో కథలుకథలుగా వచ్చాయి. అయితే కరుణానిధి రాజకీయకక్షతోనే అలా చేశారని ఆమె ఆరోపించారు. కానీ ఆ సందర్బంలో ఆమె కొన్నాళ్లుపాటు జైలులో కూడా ఉన్నారు. ఇక మద్రాస్‌లోని టాన్సీ భూముల కొనుగోలు కేసులో కూడా ఆమె ఇరుక్కున్నారు. ఆ వ్యవహారంలో కోర్టు చేసిన తీర్పు ఫలితంగా ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన అనుచరుడైన పన్నీర్‌సెల్వంకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాల్సి వచ్చింది. ఆ తరువాత పైకోర్టులో స్టే పొందాక కానీ ఆమె సీఎం కాలేకపోయారు. సినీరంగంలో కూడా ప్రఖ్యాతిగాంచిన జయలలిత రాజకీయరంగంలో కూడా వెలుగొందుతున్నారు. అయితే ఈ రెండురంగాల్లో కూడా నల్లధనం ఏ రకంగా ప్రవహిస్తుందో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ జయలలిత ధైర్యంగా తన పార్టీకి మచ్చలేదని, తాను అవినీతి కేసులో ఇరుక్కోలేదని ప్రకటించడం విశేషం.
- kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!