జగన్, విజయమ్మలకు ఒకే గుర్తు...అదే, సీలింగ్ ఫ్యాన్



వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆశించిన విధంగానే వారికి సీలింగ్‌ ఫాన్ గుర్తు లభించింది. కడప లోక్ సభ, పులివెందుల శాసనసభ ఎన్నికలలో వీరిద్దరు ఆ పార్టీ అభ్యర్ధులుగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.కొద్దిరోజుల క్రితం జగన్ పార్టీ నేతలు సీలింగ్ ఫాన్ గుర్తును కోరబోతున్నట్లు ఈ వెబ్ సైట్ లో చెప్పడం జరిగింది. అదే ప్రకారం ఆ గుర్తే లబించింది.
ఈ గుర్తు విషయంలో కూడా కొంత సస్పెన్స్ నెలకొంది. సుప్రింకోర్టు వరకు కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కామన్ గుర్తు కోసం వెళ్లింది. అప్పట్లో ఈ విషయమై ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లవలసిందిగా సూచించింది. అదే సమయంలో రిజిస్టర్ పార్టీలకు కామన్ గుర్తు కేటాయించడంలో ఇబ్బంది ఉండదని, ఎన్నికల సంఘం అనధికారికంగా జగన్ వర్గానికి చెప్పినట్లు తెలిసింది. ఆ ధైర్యంతోనే వీరు ముందుగానే అనధికారికంగా ఈ గుర్తును ప్రచారం చేసుకుంటున్నారు. వీటికి సంబందించి కరపత్రాలు, తదితర మార్గాల ద్వారా గుర్తును ప్రచారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వై.ఎస్.జగన్, విజయమ్మలకు ఇది ఒక శుభ సూచకంగా ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!