గోరింటాకు సుజాత ఇక లేరు

  గోరింటాకు సినిమాతో పాపులర్ అయిన సుజాత (58) చెన్నైలోని తన సొంత నివాసంలో బుధవారం (06-04-2011) సాయంత్రం కన్నుమూశారు. కథానాయక సినిమాతో సుజాత సినీరంగ ప్రవేశం చేశారు. ఆమె వివిధ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. అయితే గోరింటాకు చిత్రంతో ఆమె గోరింటాకు సుజాతగా మారిపోయారు. ఆమె మాత్రుభాష మళయాళం. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో సుజాత నటించారు. మంచి క్యారెక్టర్ యాక్టర్ గా గుర్తింపుపొందారు. తెలుగులోని ప్రముఖ హీరోల సరసన హీరోయిన్ గా కూడా నటించారు. తెలుగులో ఆమె చివరి చిత్రం శ్రీరామదాసు.నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకున్నారు. గుప్పెడు మనసు, ఏడంతస్థుల మేడ, సర్కస్ రాముడు, గురుశిష్యులు, బంగారు కానుక, శ్రీరామదాసు, ప్రేమతరంగాలు, సూత్రధారులు, పుసుపు పారాణి వంటి పలు హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగుకు సంబంధించిన మహిళగా ఆమె గుర్తింపు పొందారు. సుజాత 1952 డిసెంబర్ 10వ తేదీన శ్రీలంకలో పుట్టారు.
  తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంకలో ఉండడంతో ఆమె 8వ తరగతి వరకు శ్రీలంకలోనే చదివింది. ఆ తర్వాత తండ్రితో పాటు కేరళకు వచ్చేశారు. దాంతో చదువు సాగలేదు. అన్న ప్రోత్సాహంతో పలు నాటకాల్లో నటించారు. ఆ నటనానుభవంతోనే ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది. 1997లో ఆమెకు సహాయనటిగా నంది అవార్డు లభించింది. తెలుగులో ఆమె తల్లి పాత్రలు కూడా వేశారు. ఆమె కలైమామణి బిరుదు కూడా అందుకున్నారు. ఆమె చెన్నైలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సుజాత ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించారు.

కామెంట్‌లు

  1. 80 లొ ఆమె లేని సినిమా అరుదేమొ. ఏమైన పొవల్సిన వయస్సు కాదు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కొరుతూ

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!