బాబాకు వైద్యంలో జాప్యం జరిగిందా?
సత్యసాయిబాబాకు వైద్య చికిత్సలు అందించడంలో ఆలస్యం జరిగిందా?మీడియాలో దీనిపై కొన్ని కధనాలు రావడం ఆసక్తకరంగా ఉంది. సత్యసాయి బాబాకు గత నవంబరులో జన్మదినోత్సవం తర్వాత ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు సరైన శ్రద్ధ తీసుకోలేదని ఆ కధనాలు సూచిస్తున్నాయి. ఇది ఒక విమర్శ అయితే సాయిబాబ ఆరోగ్యం విషమించిన దశలో బాబాను సూపర్ స్పెషాలిటి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఒక ప్రత్యేక విమానంలో వైద్య బృందం బాబా చికిత్స కోసం వస్తే ట్రస్ట్ సభ్యుడు ఒకరు రాహుకాలం అంటూ గంట సేపు వారిని వైద్య సేవలు అందించనివ్వలేదని భక్తులు చెబుతున్నట్లు ఒక పత్రిక రాసింది. ట్రస్ట్ సభ్యలు మధ్య ఆధిపత్య పోరు ఆరంభమైందని కూడా రాశారు. అయితే ఇలాంటి కధనాలు రాయడం సరికాదని, ట్రస్ట్ సభ్యులంతా నిజాయితీ పరులైన రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులని, తొందరపడి, ఇలాంటి ఆధారరహిత వార్తలు రాసి భక్తుల మనోభావాలను దెబ్బతీయరాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నందున, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నందున, వాటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను చూడడానికి రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని మరో పత్రిక రాసింది.దాదాపు నూటముప్పై దేశాలలో సుమారు ఎనభైవేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయని ఒక అంచనా. ఈ నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొన్ని పత్రికలలో కధనాలు వచ్చాయి.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి