ఆందోళనకరంగా సత్యసాయి బాబా ఆరోగ్యం

  నడిచే దేవుడు శ్రీ సత్యసాయిబాబావారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు వైద్యుల బృందం సోమవారం సాయింత్రం విడుదలచేసిన మెడికల్ బులిటెన్ లో ప్రకటించారు. బాబావారి కీలక అవయవాలు సరిగా పనిచేయడంలేదని వైద్యుల బృందం తెలియజేసింది. అయితే, భక్తులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని డాక్టర్లు చెపుతున్నారు. బాబావారికి డయాలసిస్ చేశారు. కాగా, మరో పక్క ట్రస్ట్ సభ్యులు కూడా బాబావారు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి హుటాహుటిన బయలుదేరారు. మరో పక్క ప్రశాంత నిలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. బాబావారి ఆరోగ్య పరిస్థితిపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం అవసరమని ప్రశాంతనిలయంలోని డాక్టర్లు భావిస్తున్నారు. మార్చి 28 నుంచి బాబావారి ఆరోగ్యం బాగుండటంలేదు. సత్యసాయిబాబావారి ఆరోగ్యపరిస్థితి మెరుగుపడాలని ప్రపంచవ్యాప్తంగా పదికోట్లకుపైగా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నడిచేదేవుడి ఆరోగ్యపరిస్థితి మెరుగుపడాలని సాగిస్తున్న అక్షరపూజలో మీరూ భాగస్వాములుకండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!