పోస్ట్‌లు

మే, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

మీడియా తగలబడింది.. నిజం..! (తమాషాకీ)

చిత్రం
మీడియా ఉత్సాహం పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఎలాక్ట్రానిక్ మీడియా ప్రవేశంతో పరిస్థితులు మరింత దిగజారినట్టున్నాయి. ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందు తామే ఇవ్వాలన్న పోటీతో.. ఏ విజువల్ చూపించాలో, ఏది ఆపేయాలో వాటికి అర్థం కానట్టుంది. 31-05-11 మంగళవారం నాడు వరంగల్ జిల్లాలో ఓ యువతిపై.. ఓ యువకుడు అత్యాచారం చేయబోయాడు. అడ్డుకున్న యువతిపై సుత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన గ్రామస్థులు… ఆ యువకుడిని సజీవదహనం చేశారు. ఇది ఎంతవరకూ కరెక్ట్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం న్యాయమేనా..? ఇది ఒక కోణం. మరో కోణం.. అన్యాయాన్ని టీవీఛానెళ్లు పనిగట్టుకుని మరీ ఎక్కువగా చూపాయన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే వ్యక్తి సజీవదహనాన్ని ఎంత బ్లాక్ అండ్ వైట్ లో చూపినా… దాని ప్రభావం వీక్షకులపై కచ్చితంగా ఉంటుంది. అదీ క్లోజప్ లో చూపేసరికీ చాలామందికి వెన్ను జలదరిస్తుంది. టీవీ అనేది మాస్ మీడియా. పిల్లల నుంచి వృద్దుల వరకూ అందరూ చూసే ప్రసారమాధ్యమమిది. అలాంటి ఘనత వహించిన మీడియా ఎంత జాగురకతతో వ్యవహరించాలి. ఎంత బాధ్యతగా మెసులుకోవాలి. సమాజంలో తప్పొప్పులు ఎత్తిచూపే ఛానెళ్లు.. తమ తప్పు

రాణా షూటింగ్‌లో ర‌జ‌నీ..

చిత్రం
రజనీకాంత్ రానా సినిమాలో నటిస్తారని ఆయన అల్లుడు ధనుష్ ప్రకటించారు. సింగపూర్ లో విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్ ను పరామర్శించి వచ్చిన ధనుష్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం బాగా ఉందని, రజనీ పై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమా రానా ను పూర్తి చేయాలనుకుంటున్నారని ప్రకటించారు. ఆ తరువాత సినిమాలు చేయాలా వద్దా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధనుష్ ప్రకటించారు.

యోగా సిడిలో అనుష్క నటిస్తోందా?

చిత్రం
ఆరోగ్యసమస్యలకు ఏకైక పరిష్కార మార్గంగా యోగా ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆధునాతన కాలంలో పాతకాలంలో చేసిన యోగాయే ఇప్పుడు మన మనశ్శాంతి,శారీరక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా కనిపించని ఫలితం యోగాలో ఉంటుందని చాలామంది చెప్తుంటారు కూడా. అందుకే దీన్ని మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. అందులో భాగంగా యువతను ఆకట్టుకోవడానికి గతంలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టితో యోగా సిడియే చేయించి, యూత్ లో మంచి ప్రచారం కల్పించారు. ఆ తరువాత తెలుగులో ఓ సినిమాలో ఇలియానా కూడా యోగా సీన్ చేసి యువతను ఆ దిశగా ప్రోత్సహించిందనే చెప్పుకోవాలి. తాజాగా తెలుగులో ప్రముఖ హీరోయిన్, యోగా టీచర్ అయిన అనుష్కను యోగా సీడీలో నటించమని ఓ సంస్థ వారు కోరారట.దానికి ఆమె నో చెప్పిందని సమాచారం. యోగా అనేది మహా సముద్రం..అందులో నేను చిన్ననీటి బొట్టుఅంత కూడా నేర్చుకోలేదు. నాకు నేర్పించిన గురువు భరత్ ఠాకూర్( భూమిక భర్త) లాంటి వారు చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్లను ట్రై చేయండి. నాకు ఎంత డబ్బు ఇచ్చినా యోగా వంటి వాటి జో

డేరింగ్ డాషింగ్ హీరో.. (పార్ట్ -2)

చిత్రం
సూప‌ర్‌స్టార్‌, న‌ట‌శేఖ‌ర కృష్ణ‌… మూడు శ‌త‌కాల చిత్రాల‌లో న‌టించినా ఇంకా న‌ట‌న మీద ఆయ‌న‌కు ప్రేమ పోలేదు. అందుకే అడ‌పా ద‌డ‌పా కొన్ని చిత్రాల్లో ఇప్ప‌టికీ న‌టిస్తూనే ఉంటారు. కృష్ణ న‌ట‌జీవితం ఎలా సాగిందంటే.. కెరీర్ మొద‌ట్లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసినా ‘తేనెమనసులు’ (1964) చిత్రంలో కథానాయకుల్లో ఒకరిగా నటించి ప్రేక్షకులకు బాగా తెలిశారు. ఆయ‌న న‌టించిన రెండ‌వ చిత్రం క‌న్నెమ‌న‌సులు.. అప్ప‌ట్లో ఇంగ్లీష్‌లో వ‌చ్చే జేమ్స్‌బాండ్ చిత్రాలు కృష్ణ‌కి ఎంత‌గానో న‌చ్చేవి. అందుకే జేమ్స్‌బాండ్ క‌థాంశంతో కూడిన చిత్రాల్లో ఆయ‌న గూఢ‌చారిగా త‌న మూడ‌వ చిత్రం  ‘గూఢచారి 116 లో న‌టించి తెలుగు చిత్రాల‌ని ఓ మ‌లుపు తిప్పిన ఘ‌న‌త కృష్ణ‌దే.. కుటుంబ క‌థా చిత్రాల‌లో క‌నిపించే హీరో పాత్ర‌లే ఎక్కువ‌గా ఉండేవి. జేమ్స్‌బాండ్ పాత్ర‌తో స‌రికొత్త హీరోయిజాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. ఆ త‌ర్వాత‌ పూర్తి గ్రామీణ వాతావరణంలో ‘సాక్షి’ చిత్రం తయారైనా కొత్తదనాన్ని కోరుకొనే ప్రేక్షకులను ఆ సినిమా ఎంతో నచ్చింది. నిజజీవితంలో కృష్ణ వ్యక్తిత్వం, మంచితనం, నిజాయితీ, నిబద్దత, అమాయకత్వం.

రోశయ్య ఏమి సాధించినట్లో..?

చిత్రం
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ యాత్ర ఏమి సాధించిందో తెలియదు కాని, ఆయన చెబుతున్నదాని ప్రకారం ఆయనకు గవర్నర్ పదవి రావడం లేదు. అసలు సోనియాగాంధీ ఆ ప్రస్తావన తేలేదంటున్నారు. ఒక్కోసారి రోశయ్య అతి రహస్యం బట్టబయలు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.తను ఏమి చెప్పనని అంటుంటారు. ఢిల్లీ పర్యటనలో అదే చెప్పారు.అయితే అందరికి తెలిసిన పిసిసి పునర్వ్యస్థీకరణ అంశం మాత్రం ప్రస్తావించారు. త్వరలో కొత్త పిసిసి అద్యక్షుడు వస్తారని మాత్రం చెప్పారు. మరిన్ని వివరాలు కోరితే ఆయన తన శైలిలో అన్ని మీకు చెప్పదలిస్తే, మిమ్మల్ని కూడా సోనియా వద్దకు తీసుకువెళ్లి అక్కడే మాట్లాడేవాడేనని అసహనం వ్యక్తం చేశారు.రోశయ్య కు నిజంగానే గవర్నర్ పదవి గురించి ఏమి చెప్పలేదా? అయితే కేవలం పార్టీ రాష్ట్ర వ్యవహారాలపైనే మాట్లాడడానికి పిలిపించారా? అయితే కచ్చితంగా ఈయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై ఫిర్యాదుచేసి ఉంటారు. ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా కిరణ్ కు సంబందించి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తు న్నట్లు ప్రచారం జరుగుతోంది.కాగా గవర్నర్ పదవి గురించి హామీ వచ్చిందని అనుకుంటున్నప్పటికీ ఆ విషయం బయటపెట్టడం

నా గుండె మాడిపోయింది..

చిత్రం
`నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా… నా మూగవేదన వినాలనుకుంటున్నారా…అయితే, ఒక్క నిమిషం ఆగి నా మాటలు వినండి. మీరెంతో బిజీగా ఉంటారని నాకు తెలుసు…అందుకే ఎక్కువ సేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను మీ హృదయాన్ని. నా గుండె చప్పుడు మీకు వినబడటంలేదా…అవును, ఎందుకు వినబడుతుంది…మీరు జల్సాగా పెట్టెలుపెట్టెలు సిగరెట్లు కాలుస్తుంటే, నేను లోపల హాయిగా ఎలా ఉండగలను. ఈరోజు (మే 31)  నో టొబాకో అవగాహనా  దినోత్సవం జరుపుకుంటున్న వేళ మీతో కాసేపు ముచ్చటిద్దామని ఇలా వచ్చాను. మీరు స్మోకరా…?  అంత సూటిగా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి. సరదాగా, స్టైల్‌గా సిగరెట్లు తాగుతుంటే  మీకు బాగానే ఉండవచ్చు. కానీ నాకు మాత్రం కాదు. అది నాకెంతో బాధ కలిగిస్తుంటుంది. గుండె  వేగంగా కొట్టుకుంటుంది. చివరకు నేను మృత్యువాత పడతాను. అదృశ్యమవుతాను. మీరు తాగుతున్న పొగతో నా గుండె మాడిపోయింది. నల్లబడిపోయాను. ఇంకా ఇలాగే మీరు సిగరెట్లు, చుట్టలు తాగుతుంటే…ఆపైన నా చప్పుడు వినబడదు…ప్లీజ్ ఈరోజే సిగరెట్లు తాగనంటూ ప్రమాణం చేయండి. ఆ ప్రమాణాన్ని త్రికరణశుద్ధిగా పాటించండి. సో…ఐ విష్ యు ఆల్ ద బెస్ట్…’

సుష్మకు అవమానం

చిత్రం
బీజేపీ జాతీయ నాయకురాలు.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన సుష్మాస్వరాజ్‌కు.. రాష్ట్రంలో అవమానం జరిగింది. కరీంనగర్‌ ర్యాలీ కోసం హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకు న్నప్పుడు.. సుష్మాస్వరాజ్‌కు ప్రభుత్వ పరంగా అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. జాతీయ స్థాయిలో కేబినేట్‌ స్థాయి హోదా కలిగిన నాయకురాలైనా.. ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు. ప్రోటోకాల్‌ పరంగా ఆమెను పేయింగ్‌ గెస్ట్‌గా మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు ప్రోటోకాల్‌ వెహికిల్‌ కావాలంటే.. కిలోమీటర్‌కు వెయ్యి రూపాయలు చెల్లించాలని సూచించింది. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. తన వాహనంలోనే ఆమెను లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌కు తీసుకెళ్లారు. అనుకోని ఈ సంఘటనతో సుష్మతో పాటు ఇటు పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. - తూర్లపాటి నాగభూషణరావు 98852 92208

చిరంజీవి అల్లుడు లొంగిపోతాడా?

చిత్రం
వరకట్నం వేధింపుల కేసులో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్ కోర్టు ముందు లొంగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అంతకంటే అతగాడికి మరో ప్రత్యామ్నాయ మార్గం కనబడటంలేదు. . ముందస్తు బెయిల్ కోసం శిరీష్ భరద్వాజ్ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడమే కాకుండా సంబంధిత కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. కట్నం వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నజి.ఆర్‌.శిరీష్‌ భరద్వాజ్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైదరాబాద్‌లోని సంబంధిత కోర్టు ముందు నిర్దేశిత గడువులోగా లొంగిపోవాలని స్పష్టం చేసింది. జస్టిస్‌ జి.ఎస్‌.సింఘ్వీ, జస్టిస్‌ చంద్రమౌళి ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ తీర్పునిచ్చింది. వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలూ కోరుకుంటున్న దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని శిరీష్‌ న్యాయవాది పలుమార్లు చేసిన అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించలేదు. చట్టం ప్రకారం సంబంధిత న్యాయస్థానమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. కోర్టు ముందు శిరీష్‌ లొం

భారత రత్న ఎన్టీఆర్ కి రాకుండా అడ్డుపడింది బాబేనా..?

చిత్రం
ఎన్టీఆర్ కి భారత రత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేసి చంద్ర బాబు విమర్శల పాలయ్యారు. ఎన్టీఆర్ కుమార్తె కేంద్ర మంత్రి పురంధరేశ్వరి  బాబు పై విరుచుకు పడ్డారు. అధికారం లో వుండగా బాబు గారికి భారత రత్న విషయం గుర్తుకు రాలేదా అని  ఆమె దుయ్య బట్టారు .ఎన్డీయే నే తన చెప్పు చేతల్లో ఉంచుకున్న బాబు ఆనాడు ఇదే డిమాండ్ చేసి వుంటే తప్పక భారత రత్న ఎన్టీఆర్ కి దక్కేదన్నారు .కనీసం పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం కూడా బాబు పెట్టించలేక పోయారని పురంధరేశ్వరి విమర్శించారు. ఈ విమర్శలకు  జవాబు చెప్పడం  చంద్ర బాబు కి కష్టమే .ఆయన హయాం లో ఎన్టీఆర్ గురించి పట్టించుకోని మాట వాస్తవమే .అది అందరికి తెల్సిన విషయమే. ఎన్టీఆర్ కి భారత రత్న ప్రకటిస్తే ఆయన తరపున లక్ష్మీపార్వతి కి ఇస్తారు. ఆమె ఆ అవార్డ్ అందుకో  కూడదనే అప్పట్లో బాబు  ఎన్టీఆర్ పేరును సిఫారసు చేయలేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది.

భారీ సెట్టింగులు లేన‌ట్టేనా..?

చిత్రం
గుణ‌శేఖ‌ర్ సినిమా అంటేనే భారీ సెట్టింగుల‌కి పేరు. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే ఏదో ఒక భారీ సెట్టింగుని మామూలు ప్రేక్ష‌కులు సైతం ఎక్స్‌పెక్గ‌ట్ చేస్తారు. అయితే ఈసారి ర‌వితేజ‌తో చేస్తున్న నిప్పు చిత్రంలో మాత్రం భారీ సెట్టుంగులు లేవంటున్నారు. కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో భారీ సెట్టింగులు వేసి సినిమాకి నిండుద‌నం తీసుకురావాల‌న్న ఆలోచ‌న గుణ‌శేఖ‌ర్‌కి ఉంటుంది. ఆయ‌న భారీ సెట్టింగుల‌తో రూపొందించిన చూడాల‌ని ఉంది. ఒక్క‌డు చిత్రాలు ఘ‌న విజ‌యాలు సాధించ‌గా ఆ త‌ర్వాత వ‌చ్చిన అర్జున్‌, వ‌రుడు చిత్రాలు ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసాయి. ఈ చిత్రాలు ప‌రాజ‌యం పాల‌వ‌డంతో ఆ భారీ సెట్టింగులకు పెట్టిన ఖ‌ర్చు కూడా వృధా అయిన‌ట్టే.. అందుకే వ‌రుడు త‌ర్వాత గుణ‌శేఖ‌ర్‌తో సినిమాలు తీయాలంటేనే నిర్మాత‌లు బెంబేలెత్తిపోయారు. ఈ స‌మ‌యంలో త‌న స్నేహితుడు స‌హ ద‌ర్శ‌కుడు వైవిఎస్‌. చౌద‌రి నిర్మాత‌గా నిప్పు ప్రారంభ‌మ‌యింది. ద‌ర్శ‌క‌నిర్మాత‌గా అపార‌మ‌యిన అనుభ‌వం ఉన్న వై.వి.ఎస్‌. చౌద‌రి సూచ‌న మేర‌కు గుణ‌శేఖ‌ర్ భారీ సెట్టింగుల జోలికి వెళ్ళ‌కుండా నిప్పు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సో.. గుణ‌శేఖ‌ర్‌లో వ‌చ్చిన ఈ మార్పుతో ఆయ‌న‌కి

డేరింగ్ డాషింగ్ హీరో.. (పార్ట్ -1)

చిత్రం
సూప‌ర్ స్టార్ కృష్ణ‌.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌రుచుకున్న హీరో. తెలుగు సినిమా రంగంలో ఎన్నో సాహ‌సాలు చేసిన న‌టుడు. మొద‌టి స్కోప్ సినిమా, మొద‌టి 70 ఎం.ఎం. సినిమాల‌ని తెలుగు తెర‌కి ప‌రిచ‌యం చేసిన న‌టుడు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. 300 పై చిలుకు చిత్రాల్లో హీరోగా న‌టించిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ఎంత ఎదిగినా ఒదిగిన‌ట్టుండాల‌నే నానుడి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కి స‌రిగ్గా స‌రిపోతుంది. విజ‌యాలు వ‌చ్చిన‌పుడు పొంగిపోవ‌డం, అప‌జ‌యాలు ఎదుర‌యిన‌పుడు కృంగిపోవ‌డం అన్న‌ది ఆయ‌న‌లో ఉండ‌దు. ప‌రిస్థితులు ఎలా ఉన్నా ఆయ‌న మాత్రం ఎంతో మామూలుగా ఉంటాడు. నంద‌మూరి తార‌క రామారావు స్టార్‌గా వెలుగొందుతున్న కాలంలో ఆయ‌న‌కి పోటీగా కృష్ణ న‌టించిన ఎన్నో చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించాయి. అంతేకాదు టెక్నిక‌ల్‌గా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ఎదుగుద‌ల‌కి కూడా కృష్ణ కృషి చేసారు. ప‌ద్మాలయా స్టూడియో స్థాపించి స్టూడియో అధినేత‌గానూ, నిర్మాత‌గానూ ఆయన ఎన్నో విజ‌యాల‌ని చ‌విచూశాడు. హీరోగా రిటైర్‌మెంట్ అయిఆ ఆయ‌న‌కి ఇప్ప‌టికీ ల‌క్ష‌లాది మంది అభిమానులున్నారు. ఇక సూప‌ర్‌స్టార్ కృష్ణ వా

సింగపూర్ ఆస్పత్రికి చేరిన రజనీ అభిమానులు

చిత్రం
 సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సింగ‌పూర్‌లోని మౌంట్ ఎలిజ‌బెత్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్లో ర‌జ‌నీకాంత్‌కి అభిమానులున్నార‌న్న‌ది నిజం చేస్తూ ర‌జ‌నీ చికిత్స పొందుతున్న హాస్పిట‌ల్‌కి ఆయ‌న అభిమానులు త‌ర‌లివ‌చ్చి ఆయ‌న‌ని చూడ‌డానికి, ప‌రామ‌ర్శించ‌డానికి తెగ ఆరాట‌ప‌డుతున్నారు. వారంద‌రినీ చూసిన ర‌జ‌నీ అభిమానంతో వారిని ప‌ల‌క‌రించారు. అయితే ర‌జ‌నీతో ఫోటోలు తీయించుకోవ‌డానికి అభిమానులు ఉత్సాహం ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ ర‌జ‌నీ భార్య ల‌త, కూతురు సౌంద‌ర్య‌లు  వారంద‌రినీ వారించారు.. మొత్తానికి సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ స్టామినా ఏంటో ఈ సంఘ‌ట‌న ద్వారా తెలిసిపోతుంది. జ‌పాన్‌లో అయితే ర‌జ‌నీకాంత్ చిత్రాలు ఏకంగా వంద‌రోజులు పండ‌గ‌నే చేసుకున్నాయంటే ర‌జ‌నీకి, భాషాభేధం లేకుండా అభిమానించేవారెంత‌మందో అర్థం అవుతుంది క‌దూ…

సీఎం గుండు ఎందుకు చేసుకున్నారు?

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నమ్మకాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఆయన ఆదివారం రాత్రి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో తలనీలాలు సమర్పించు కున్నారు. ఆయన వెంట్రుకలు లేకుండా గుండుతో కన్పిం చేసరికి అందరూ ఆసక్తిగా గమనించారు. ఈ మధ్య కాలంలో ఎప్పూడూ కిరణ్ ఈ విధంగా గుండుతో కన్పించలేదు. చిత్తూరు జిల్లా పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చే ముందు ఆయన తిరుమలను సందర్శించారు. ముఖ్యమంత్రిగా రాజకీ యంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ధోరణిలో ఇటీవల కాలంలో అనేక మార్పులు వస్తున్నాయని ఆయనకు సన్నిహితం ఉండే అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో కన్నా ఇప్పుడు సానుకూల అంశాలు పెరుగుతు న్నాయని, అందరూ చెప్పే విషయాలను వినడానికి ఆసక్తి చూపుతున్నారని, తిరుమలలో తలనీలాలు సమర్పిం చుకున్న తర్వాత ఇంకా మారవచ్చునని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఎంత మారతారో ఏమో గానీ ఓ వైపు పార్టీ, మరో వైపు జగన్, ఇంకో తెలంగాణ అంశం ఆయనకు సతమతం చేస్తున్నాయి. తాజాగా నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి ఆయనపై ఫిర్యాదు చేయడం కాస్త సంచలనంగా ఉంది. ఈ

డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌కి ప్ర‌మాదం..

చిత్రం
ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ కు సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. చెన్న‌య్ స‌మీపంలో రాజ‌శేఖ‌ర్ హీరోగా  రూపొందుతున్న మ‌హంకాళి చిత్రం షూటింగ్ జ‌రుగుతోంది.. ఈ షూటింగ్‌లోనే ఆయ‌న‌కి ప్ర‌మాదం జ‌రిగింది.. వెంటనే రాజశేఖర్ ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన కుడిచెయి, కుడి కన్నుకు గాయాలయ్యాయి. ముఖానికి కూడా గాయాలయ్యాయని అంటున్నారు. అయితే ఆయనకు ప్రమాదం లేదని, 25 రోజుల‌పాటు రెస్ట్ తీసుకోవాల‌ని డాక్టర్లు చెబుతున్నారు.  ఆయన భార్య జీవిత మ‌హంకాళి  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

నేను దుష్టశక్తిని కాను, బాబే అమావాస్య చంద్రుడు

చిత్రం
త‌న‌ను ఉద్దేశిస్తూ ఓ దుష్టశక్తి వల్లనే స్వర్గీయ ఎన్టీ రామా రావుపై తిరుగుబాటు చేశానన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, ఎన్టీ రామరావు సతీమణి లక్ష్మీపార్వతి దుమ్మెత్తిపోశారు. తన చేతకాని తనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు తనపై వ్యాఖ్యలు చేశారని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాశనమైపోయిందని ఆమె విమర్శించారు. చంద్రబాబునాయుడిని ఆమె అమావాస్య చంద్రుడిగా అభివర్ణించారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కృష్ణపక్షంలో చంద్రుడు క్షీణిస్తున్నట్లుగా క్షీణిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి వల్లనే చంద్రబాబు 1999 ఎన్నికల్లో గెలిచారని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారని ఆమె చెప్పారు. స్వర్గీయ ఎన్టీ రామారావు మృతికి చంద్రబాబే కారణమని ఆమె అన్నారు. చంద్రబాబుపై నమ్మకం లేక పార్టీ ఖాళీ అవుతోందని ఆమె అన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు.

చిక్కుల్లో ‘బెజ‌వాడు రౌడీలు’

చిత్రం
బెజ‌వాడ రౌడీలు టైటిల్‌ ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ అయి కూర్చుంది సినిమా ఇండ‌స్ట్రీలో.. రాంగోపాల్ వ‌ర్మ ఓ సినిమా తీస్తున్నాడంటే.. ఖ‌చ్చితంగా ఆ సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవ‌డం ష‌రా మామూలుగానే జ‌రుగుతుంది.. ఓ చిత్రం హింస పాలు ఎక్కువుంద‌ని, మ‌రో చిత్రంలో బూతు పాలు ఎక్కువుంద‌ని త‌దిత‌ర కార‌ణాల‌తో రాము చిత్రాలు ఎప్పుడూ వివాదం అవుతూనే ఉంటాయి. అయితే అలాంటి వివాదాలు ఎన్ని వ‌చ్చినా డోంట్ కేర్‌.. అంతా నా ఇష్టం.. అని త‌న ప‌ని తాను చేసుకుపోయేవాడు రాంగోపాల్‌వ‌ర్మ‌.. కాల క్ర‌మంలో సినిమా ఫ‌లితానికి సంబంధంలేకుండా వివాదాలు కూడా స‌ద్దుమ‌ణిగేవి… కానీ.. ఇప్పుడు బెజ‌వాడ రౌడీలు చిత్ర వివాదం మాత్రం రాంగోపాల్‌వ‌ర్మ అనుకున్నంత ఈజీగా స‌మ‌సిపోయే ఛాన్స్ క‌నిపించ‌టం లేదు.. అలాగే రామూ కూడా ఈ వివాదాన్ని ష‌రా మామూలుగా కొట్టి పారేసే అవ‌కాశం లేదు.. బెజ‌వాడ రౌడీలు అనే టైటిల్ బెజ‌వాడ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ని దెబ్బ‌తీసింద‌ని మొద‌లైన వివాదం, రామూ తేలిక‌గా కొట్టివేయ‌డంతో నిరాహార‌దీక్ష‌ల వ‌ర‌కూ వెళ్ళింది. అయినా రామూ కూడా బెజ‌వాడ‌కి చెందిన వాడే.. అత‌నొక్క‌డు రౌడీ అయినంత మాత్రాన‌ బెజ‌వాడ ప్ర‌జ

ర‌జ‌నీ ఆరోగ్యం గురించి అమితాబ్ వాక‌బు..

చిత్రం
సూప‌ర్‌స్టార్ ర‌జినీ కాంత్ గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో హాస్పిట‌ల్ పాలు కావ‌డం తెలిసిందే.. రాణా చిత్రం ప్రారంభోత్స‌వం రోజు నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ర‌జ‌నీ ఆరోగ్యం ఇంకా కోలుకోలేదు. తాజాగా ఆయ‌న మెరుగైన వైద్య‌సేవ‌ల‌కు గాను సింగ‌పూర్‌కి వెళ్ళారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. అయితే ర‌జ‌నీ ఆరోగ్యం గురించి ర‌క‌ర‌కాల పుకార్లు షికార్లు చేయ‌డంతో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ కంగారుప‌డిపోయాడ‌ట. ర‌జ‌నీకాంత్‌, అబితాబ్‌లు మంచి స్నేహితులు, వారిద్ద‌రూ క‌లిసి హ‌మ్‌, అందా ఖానూన్ త‌దిత‌ర చిత్రాల‌లో న‌టించారు. అప్ప‌టి నుండి వీరిద్ద‌రూ మంచి మిత్రుల‌య్యారు. అమితాబ్ చెన్నై వ‌స్తే త‌ప్ప‌కుండా ర‌జ‌నీకాంత్ ఇంటికి వెళ్ళి ప‌ల‌క‌రిస్తారు. ర‌జ‌నీ కుటుంబ స‌భ్యుల‌తోనూ అబితాబ్‌కి మంచి అనుబంధం ఉంది. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ ఆరోగ్యం గురించి అమితాబ్ ర‌జ‌నీ భార్య ల‌త‌కి ఫోన్ చేసి వాక‌బు చేసి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకున్నారు. అంతేకాదు మెరుగైన వైద్యంకోసం సింగ‌పూర్‌లోని మౌంట్ ఎలిజ‌బెత్ హాస్పిట‌ల్‌కి వెళ్ళ‌మ‌ని ర‌జ‌నీకి అమితాబే స‌ల‌హా ఇచ్చారంట‌.. మ

వెన్నుపోటు గుట్టువిప్పిన చంద్రబాబు..

చిత్రం
తెలుగుదేశం పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి చంద్ర‌బాబు నాయుడు కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా..? మ‌హానాడు సాక్షిగా చంద్ర‌బాబు మారిపోయారా..? ఇప్ప‌టి వ‌ర‌కూ టిడిపిలో జ‌రిగిన కొన్ని లోటుపాట్ల‌ను ప్ర‌స్తావించి, కొన్ని పొర‌పాట్లు జ‌రిగాయ‌ని కూడా అంగీక‌రించిన చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్త‌న‌లో ఇంత‌టి మార్పు ఎలా వ‌చ్చింది..? ఒక వైపు తెలంగాణ ప్రాంత నాయ‌కులు జై తెలంగాణ అని అంటూండ‌డం, తెలంగాణ నినాదంతో పార్టీలోనుండి ముఖ్య‌నేత‌, సీనియ‌ర్ అయిన నాగం జ‌నార్థ‌న్‌రెడ్డి బ‌య‌టికి వెళ్ళిపోవ‌డం, అదే నినాదంతో మ‌రికొంత మంది తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా టిడిపి నుండి వెళ్ళిపోయే అవ‌కాశం ఉండ‌డం,  మ‌రోవైపు వార‌స‌త్వపు పోరులో హ‌రికృష్ణ‌తో విభేధాలు క‌ల‌గ‌డం, వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపి ఈ మ‌హానాడు వేదిక ద్వారా నారా లోకేష్‌ని రాజ‌కీయ రంగం ప్ర‌వేశించాల‌నే ఆయ‌న కోరిక నీరుగారిపోవ‌డం, పార్టీలో అంత‌ర్గ‌తంగా త‌లెత్తుతున్న విభేధాల‌ని ఎలా నివారించాలో అర్థం గాక ఆయోమయంలో ఉండ‌టం.. వెర‌సి చంద్ర‌బాబు పార్టీ భ‌విత‌వ్యం గురించి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన

వెన్నుపోటు దారుడు బాబు అయితే మ‌రి కేసీఆర్‌..?

చిత్రం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కుమారుడు , సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు వెన్నుపోటు రత్న అని బిరుదు ఇస్తున్నామని, ఆయనకు వెన్నుపోటు రత్న, వెన్నుపోటు సామ్రాట్ అన్న బిరుదులు బాగా అతుకు తాయని ఆయన అన్నారు. ఆస్తులకు సంబంధించి కూడా కెటిఆర్ సవాలు విసిరారు. కెసిఆర్ బ్లాక్ మొయిల్ చేసి డబ్బు సంపాదిస్తున్నారని ఆరోరపిస్తున్నారని, దీనిపై తాను సవాలు విసురుతున్నానని, కెసిఆర్ ఆస్తులు, చంద్రబాబు ఆస్తులపై ఎలాంటి విచారణకైనా, చర్చకైనా సిద్దమని తారకరామారావు సవాలు విసిరారు. చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల వ్యక్తి ఇవ్వాళ ఇన్నివందల కోట్లు ఎలా సంపాదించారని, ఆయనకు సింగపూర్ లో కూడా హోటల్ ఉందని, డ్రైవర్ కు కూడా తెలియకుండా తన ఆస్తులను కాపాడుకోవడానికి ఆయన విదేశీ పర్యటనలు చేస్తుంటారని కెటిఆర్ విమర్శించారు. ఘాటైన పదాలు, నిందలతో కెటిఆర్ మాట్లాడారు. రాజకీయ జీవితం అంతా చంద్రబాబు వెన్నుపోట్లతోనే వచ్చారని, 1978లో ఎన్నికయ్యాక జిల్లా పరిషత్ ఎన్నికలలో వెన్నుపోటుతో రాజకీయ చేశారని, ఆ తర్వాత కాంగ్రెస్ క

హరికి కాంగ్రెస్ గాలం?

చిత్రం
తన కుటుంబ సభ్యులు  రాజకీయాల్లోకి రారని టీడీపీ అధినేత చంద్ర బాబు  స్పష్టం చేసిన నేపధ్యం లో నంద మూరి హరికృష్ణ ఇపుడు ఏం చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. లోకేష్ ని ప్రోత్సహిస్తున్నారని, జూనియర్ ఎన్టీఆర్ ని నిర్లక్ష్యం చేస్తున్నారని,పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబానికి అప్పగించాలని పరోక్షం గా డిమాండ్ చేస్తూ బాబుని ఇబ్బంది పెట్టిన హరి కృష్ణ  ఇక మౌనం గా ఉంటారా ??మరేదైనా ఎత్తుగడ వేస్తారా అనేది తేలాల్సి వుంది., బంధువులు వేరు, రాజకీయం వేరని స్పష్టం గా  చెప్పిన బాబు  హరి బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు . అవసరమైతే బందుత్వాన్ని  కూడా వదులుకుంటా అన్న రీతిలోబాబు మాట్లాడారు. చంద్ర బాబు మాటలన్నీ సూటిగా హరి ని ఉద్దేశించి అన్నవే. ఇదిలా వుంటే  హరి కృష్ణ సొంతం గా పార్టీపెట్టె యోచనలో వున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.జూనియర్ ఎన్టీఆర్ కూడా హరికృష్ణ కు అండ గా నిలబడ తానని హామీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.కాగా హరి పార్టీ వీడి బయట కొస్తే అటు కాంగ్రెస్ ఇటు బీజీపే కూడా ఆయనకు స్వాగతం చెప్పేందుకు సిద్ధం గా వున్నాయని చెప్పుకుంటున్నారు. హరికృష్ణ సోదరి పురంధరేశ్వరి ఇప్పటి

ఆయ‌న ఇళ్లంతా స్వ‌ర్ణ‌మ‌య‌మే.. ఇదేమీ ‘ గాలి’ వార్త కాదండోయ్‌..

చిత్రం
మైనింగ్ గ‌నుల కాంట్రాక్ట‌ర్‌, బిజెపి నాయకుడు, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇళ్లంతా బంగారు మ‌య‌మే.. ఎవ‌రైనా బంగారంతో ఆభ‌ర‌ణాలు చేయించుకుంటారు, బంగారు విగ్ర‌హాలు చేయించుకుంటారు… ఇంకా చెప్పాలు బంగారు గొలుసులు, ఉంగ‌రాలు.. లాంటివి మ‌నం చూస్తాం.. కానీ గాలి జ‌నార్థ‌న్ మాత్రం వీట‌న్నింటికీ భిన్నంగా బంగారాన్ని మ‌లుచుకున్నారు. ఆయ‌న కూర్చునే కుర్చీని కూడా ఆయ‌న బంగారం తో త‌యారు చేయించారు. దాని ఖరీదు 2.2 కోట్ల రూపాయలు. అంతేకాదు ఆయ‌న పెట్టుకునే బెల్టు అక్ష‌రాలా 13.15 ల‌క్ష‌ల రూపాయ‌లు.. అదీ బంగారంతో త‌యారు చేసిన‌దే.. అంతేకాదు ఆయ‌న బంగారు పల్లెంలోనే తింటారు. గిన్నెలు, చెంచా, ఫోర్కు, కత్తి – అన్నీ బంగారానివే. వీటి విలువ రూ. 20.87 లక్షలు ఉంటాయని సమాచారం. అంతేకాదు ఆయ‌న  బంగారంతో తయారు చేసిన విగ్రహాలకు పూజలు చేస్తారు. వాటి విలువ రూ. 2.28 కోట్లు. ఇలా ఆయ‌న ఇంట్లో ఉండే చెంచాల నుండి విలువైన సామానుల‌న్నీ బంగారంతో త‌యారుచేసిన‌వే.. ఈ వివ‌రాల‌ని స్వ‌యంగా ఆయ‌నే లోకాయుక్త‌కు 2010 వ‌ర‌కు త‌మ‌కు ఉన్న ఆస్తుల విలువ స‌మాచారాన్ని నివేదించిన‌పుడు వీట‌న్నింటినీ ఆయ‌న జోడించార‌ట‌.

య‌జుర్వేదం సంప‌ద‌పై పెద్ద‌ల క‌న్ను..

చిత్రం
స‌త్య‌సాయి బాబా మందిరంలో ఆయ‌న బ్ర‌తికి ఉన్న‌ప్పుడు నివాసం ఉన్న య‌జుర్వేద మందిరంపై వివాదం ర‌గులుకుంటుంది. ఈ య‌జుర్వేద మందిరాన్ని స‌త్య‌సాయి బాబా మ‌ర‌ణానంతరం మూసి వేసారు. ఈ గ‌దిలో కోట్లాది రూపాయ‌ల విలువైన బంగారం, వ‌జ్రాలు, పెద్ద మొత్తంలో న‌గ‌దు త‌దిత‌ర‌వి నిలువ ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో ఇప్పుడు ఈ మందిరంపై కొంద‌రు పెద్ద‌ల క‌న్ను ప‌డింది. ఈ మందిరం ప్ర‌స్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. ఈ మందిరం ముందు పోలీసులు కాప‌లా కాస్తున్నారు. అయితే ఈ మందిరంలోకి పోలీసుల క‌న్నుగ‌ప్పి వెళ్ళాల‌ని ఓ సీనియ‌ర్ మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు, ఆయ‌న‌కి ట్ర‌స్టు స‌భ్యులు స‌హ‌కారం అందిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పోలీసుల‌కి తెలియ‌కుండా ఆ మందిరంలోకి ప్ర‌వేశించి కోట్లాది రూపాయ‌ల సంప‌ద‌ని దోచుకోవాల‌ని వారి వ్యూహం. అయితే స‌త్య‌సాయి మ‌ర‌ణానంతరం య‌జుర్వేద మందిరంపై మొద‌లైన వివాదాలు, అందులో కోట్లాది రూపాయ‌ల సంప‌ద ఉంద‌న్న ఊహ‌లు వెల్లువెత్తుతుండ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఆ మందిరాన్ని తెరిచి అస‌లు వాస్త‌వం ఏమిటో ప్ర‌జ‌ల‌కి తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం

లాడెన్ క‌థ‌తో హాలీవుడ్ మూవీ..

చిత్రం
అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్ చ‌నిపోయినా ఆయ‌న జీవిత వృత్తాంతాన్ని క‌థ‌గా మ‌లిచి సినిమాలు రూపొందించ‌డానికి ఆయా ద‌ర్శ‌కులు సిద్ద‌మ‌వుతున్నారు. అందులో ముందుగా ఆస్కార్‌ అవార్డు విజేత, ప్రఖ్యాత హాలీవుడ్‌ డైరెక్టర్‌  కత్రిన్‌ బిగిలో లాడెన్‌పై ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కత్రిన్‌ బిగిలో ఇరాక్‌ యుద్ధంపై రూ పొందించిన ‘ద హర్ట్‌ లాకర్‌’ చిత్రానికిగాను ఆస్కార్‌ అవార్డును గెల్చుకున్నారు. ఆయన లాడెన్‌పై ‘కిల్‌ బిన్‌ లాడెన్‌’ అనే చిత్రాన్ని రూ పొందించే పనిలో ఉన్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని యాక్షన్‌ సినిమాగా రూపొందించేందుకు డైరెక్టర్‌ బిగిలో సిద్ధమవుతున్నారు. ‘అంతర్జాతీయ ఉగ్రవాది బిన్‌ లాడెన్‌ గురించి అందరికీ తెలిసిందే. అతను అమెరికాపై దాడులు చేస్తూ అగ్రరాజ్యాన్ని వణికించాడు. చివరికి ఆ దేశంపై యుద్ధాన్నే ప్రకటించాడు. జిహాద్‌ పేరుతో మారణ హోమం సృష్టిస్తూ వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాడు. అల్‌ఖైదా ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. అగ్రరాజ్యం దాడుల బారి నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు.చివరిక

బ‌ద్రీనాథ్‌కి భారీ ఆఫ‌ర్‌..

చిత్రం
గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో మ‌గ‌ధీర త‌ర్వాత అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందిన చిత్రం బ‌ద్రీనాథ్‌. ఈ చిత్రం విడుద‌ల‌కి ముందే రికార్డ్ క్రియేట్ చేస్తుంది. కేర‌ళ‌లో అల్లు అర్జున్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ న‌టించిన తెలుగు చిత్రాలు మ‌ళ‌యాలంలో డ‌బ్‌చేసి కేర‌ళ‌లో విడుద‌ల చేసిన అన్ని సినిమాలూ విజ‌యం సాధించాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బ‌ద్రీనాథ్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్‌.. ఇక్క‌డ మ‌రో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రం మ‌ళ‌యాల రైట్స్ కోసం భారీ ఆఫ‌ర్ వ‌చ్చింది నిర్మాత‌కి. అక్క‌డి ర‌క్త‌క్ ఫిలిమ్స్ సంస్థ వారు ఏకంగా ఒక కోటీ ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించి ఈ చిత్రం మ‌ళ‌యాల రైట్స్ తీసుకున్నారు. ఒక డ‌బ్బింగ్ చిత్రానికి ఇంత పెద్ద మొత్తం చెల్లించ‌డం అన్న‌ది ఇప్పుడు మ‌ళ‌యాలం ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే అటు త‌మిళ భాష‌లో కూడా అల్లు అర్జున్ ప‌ట్టు సాధించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. బ‌ద్రినాథ్ చిత్రం మూడు భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ అయ్యి మూడు భా

కిరణ్ కు ఎంత ధైర్యం వచ్చేసింది!

చిత్రం
అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంలోనేకాదు. వచ్చే ఎన్నికలలోకూడా కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని కిరణ్ చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబును చూసి జాలిపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తనను అసమర్ధుడని వ్యాఖ్యానించడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.మొత్తం మీద కిరణ్ కు గట్టి విశ్వాసం వచ్చినట్లుంది.ఇప్పట్లో తన ప్రభుత్వం పడిపోదని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, జగన్ ల మధ్య అవిశ్వాస తీర్మానం వివాదంగా మారడం ఆయన ఆనందం కలిగిస్తోంది. చంద్రబాబు స్వయంగా జగన్ ను గవర్నర్ వద్ద ఆయనను బలపరిచే ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలని కోరడం, తనవద్ద అంతమంది బలం లేదని జగన్ చెప్పడంతోకిరణ్ కు పూర్తి నమ్మకం వచ్చినట్లు అనుకోవాలి.నిజంగానే ఏ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు సిద్దపడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలంటే మళ్లీ కోట్లు ఖర్చు పెట్టాలి. మూడేళ్ల పదవీకాలం వదులుకోవాలి. తిరిగి టిక్కెట్ వస్తుందో రా

నాగంతో క‌లిసి ప‌నిచేస్తా..

చిత్రం
 రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. త‌మ త‌మ స్వార్థంకోసం, త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం నాయ‌కులు గోడ మీది పిల్లిలా ఎటు దూకాలా అనిఎదురు చూస్తూనే ఉంటారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడిగా తెగ హ‌డావిడి చేసిన గోనెప్ర‌కాశ‌రావు, అక్క‌డ త‌న‌కి ఎలాంటి ప్రాధాన్యం కానీ, పార్టీ ప‌ద‌వి కానీ ద‌క్క‌క పోవ‌డంతో ఇప్పుడు త‌న రూటు మార్చుకున్నాడు. తెలుగు దేశం పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌బ‌డ్డ నాగం జ‌నార్థ‌న్ రెడ్డి తో క‌లిసి తెలంగాణ‌పై పోరాడ‌తాన‌ని చెప్పారు. తాను వ్యక్తిగతంగానే నాగం జనార్దన్ రెడ్డి కలిసినట్లు భేటీ అనంతరం గోనె ప్రకాశ రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డి, తాను పాత మిత్రులమని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి వీలుందని ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా తాను నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి సహకరిస్తానని ఆయన చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డి ఉప ప్రాంతీయ పార్టీ పెట్టవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణపై జులై 8వ తేదీన జరిగే ప్లీనరీ సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు.

మహానాడులో చేసిన‌తీర్మానాలు ఇవే..

చిత్రం
మూడోరోజు మహానాడు ముగింపు సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ ప‌లు తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్టింది. అవేమిటంటే.. భూదోపిడీపై.. * పైవేటు భూములను బలవంతంగా సేక రించడం ఆపాలి. * భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలి. * అన్యాక్రాంతమైన భూములను పేదలకు పంచాలి. * అటవీ హక్కుల చట్టం కింద గిరిజనుల అధీనంలోని భూములకు పట్టాలివ్వాలి. * సెజ్‌లు, పారిశ్రామిక సంస్థల పేరుతో బలవంతంగా సేకరించి, నిరుపయోగంగా ఉన్న భూములను వెనక్కి తిరిగి ఇచ్చేయాలి. ధరల నియంత్రణలో వైఫల్యంపై.. * పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే త గ్గించాలి. * రైతు బజార్లను సమర్థంగా నిర్వహించి, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి. షెడ్యూల్డు కులాలపై.. * జస్టిస్ పున్నయ్య సిఫారసులను యథాతథంగా అమలు చేయాలి. * దళిత మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల నివారణకు చర్యలు చేపట్టాలి. * దళితుల అభ్యున్నతికి కేంద్రం అందిస్తున్న నిధులను పూర్తిగా ఖర్చు చేయాలి. ఎస్టీల సంక్షేమంపై… * గిరిజన ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలను నిలిపేయాలి. * అటవీ హక్కుల ర క్షణ చట్టాన్ని, ఎస్టీలపై అత్యాచారాలను నిరోధించే చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. మైనార్టీల సంక్షేమంపై…