హరికి కాంగ్రెస్ గాలం?


తన కుటుంబ సభ్యులు  రాజకీయాల్లోకి రారని టీడీపీ అధినేత చంద్ర బాబు  స్పష్టం చేసిన నేపధ్యం లో నంద మూరి హరికృష్ణ ఇపుడు ఏం చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. లోకేష్ ని ప్రోత్సహిస్తున్నారని, జూనియర్ ఎన్టీఆర్ ని నిర్లక్ష్యం చేస్తున్నారని,పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబానికి అప్పగించాలని పరోక్షం గా డిమాండ్ చేస్తూ బాబుని ఇబ్బంది పెట్టిన హరి కృష్ణ  ఇక మౌనం గా ఉంటారా ??మరేదైనా ఎత్తుగడ వేస్తారా అనేది తేలాల్సి వుంది., బంధువులు వేరు, రాజకీయం వేరని స్పష్టం గా  చెప్పిన బాబు  హరి బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు . అవసరమైతే బందుత్వాన్ని  కూడా వదులుకుంటా అన్న రీతిలోబాబు మాట్లాడారు. చంద్ర బాబు మాటలన్నీ సూటిగా హరి ని ఉద్దేశించి అన్నవే. ఇదిలా వుంటే  హరి కృష్ణ సొంతం గా పార్టీపెట్టె యోచనలో వున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.జూనియర్ ఎన్టీఆర్ కూడా హరికృష్ణ కు అండ గా నిలబడ తానని హామీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.కాగా హరి పార్టీ వీడి బయట కొస్తే అటు కాంగ్రెస్ ఇటు బీజీపే కూడా ఆయనకు స్వాగతం చెప్పేందుకు సిద్ధం గా వున్నాయని చెప్పుకుంటున్నారు. హరికృష్ణ సోదరి పురంధరేశ్వరి ఇప్పటికే కేంద్ర మంత్రి గా ఉన్న విషయం తెల్సిందే . హరిని తమ వైపు లాక్కుని టీడీపీ ని  చీలిస్తే  బాబు మరింత బలహీన పడతారని,త ద్వారా పార్టీ  లబ్ది పొందుతుందని కాంగ్రెస్ నేతల అంచనా.
చూద్దాం ఏం జరుగుతుందో ??

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!