సీఎంకు తప్పిన ప్రమాదం


 చిత్తూరు జిల్లా నగరిపల్లెలోని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంట్లో పెద్దప్రమాదం తప్పింది. సీఎం తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతుండగా గ్యాస్ లీకేజీని అధికారులు గుర్తించారు. అప్పటికప్పుడు అక్కడున్నవారు అప్రమత్తమై లీకేజీని అరికట్టడంతో ప్రమాదం తప్పిందని తెలిసింది.
చిత్తూరు జిల్లాలో అభివృద్ది సమీక్షలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్న రాత్రే అతని స్వగ్రామానికి చేరుకున్నారు. అయితే ప్రమాదం తప్పిపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ముఖ్య‌మంత్రుల భ‌ద్ర‌త పై నేడు స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర రెడ్డి, అలాగే అరుణాచ‌ల్ ముఖ్య‌మంత్రి దోర్జీ ఖాండు అకాల మ‌ర‌ణాలు భ‌ద్ర‌తా వైఫ‌ల్యాల వ‌ల్ల‌నే జ‌రిగాయ‌ని స్ప‌ష్ట‌మయ్యింది. ముఖ్య‌మంత్రి స్థాయి వాళ్ళ‌కి భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో ఏమాత‌రం నిర్ల‌క్ష్యం వ‌హించిన ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ‌ని తెలిసి కూడా పోలీసులు అప్ర‌మ‌త్తం కాలేక‌పోతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!