వెన్నుపోటు దారుడు బాబు అయితే మ‌రి కేసీఆర్‌..?


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కుమారుడు , సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు వెన్నుపోటు రత్న అని బిరుదు ఇస్తున్నామని, ఆయనకు వెన్నుపోటు రత్న, వెన్నుపోటు సామ్రాట్ అన్న బిరుదులు బాగా అతుకు తాయని ఆయన అన్నారు. ఆస్తులకు సంబంధించి కూడా కెటిఆర్ సవాలు విసిరారు. కెసిఆర్ బ్లాక్ మొయిల్ చేసి డబ్బు సంపాదిస్తున్నారని ఆరోరపిస్తున్నారని, దీనిపై తాను సవాలు విసురుతున్నానని, కెసిఆర్ ఆస్తులు, చంద్రబాబు ఆస్తులపై ఎలాంటి విచారణకైనా, చర్చకైనా సిద్దమని తారకరామారావు సవాలు విసిరారు. చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల వ్యక్తి ఇవ్వాళ ఇన్నివందల కోట్లు ఎలా సంపాదించారని, ఆయనకు సింగపూర్ లో కూడా హోటల్ ఉందని, డ్రైవర్ కు కూడా తెలియకుండా తన ఆస్తులను కాపాడుకోవడానికి ఆయన విదేశీ పర్యటనలు చేస్తుంటారని కెటిఆర్ విమర్శించారు. ఘాటైన పదాలు, నిందలతో కెటిఆర్ మాట్లాడారు. రాజకీయ జీవితం అంతా చంద్రబాబు వెన్నుపోట్లతోనే వచ్చారని, 1978లో ఎన్నికయ్యాక జిల్లా పరిషత్ ఎన్నికలలో వెన్నుపోటుతో రాజకీయ చేశారని, ఆ తర్వాత కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశంలోకి వచ్చారని, తదుపరి ఎన్.టి.ఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు. మొన్నటికిమొన్న తెలంగాణ తీర్మానం చేసి , రెండువేల తొమ్మిది డిసెంబరు తొమ్మిదిన తెలంగాణ ప్రకటన వస్తే, ఆ మరుసటిరోజు దానికి వ్యతిరేకంగా మాట్లాడి తెలంగాణకు వెన్నుపోటు పొడిచాడని కెటిఆర్ విమర్శించారు. ఇప్పుడు సొంత బావమరిది హరికృష్ణకు వెన్నుపోటు పొడవడానికి సిద్దమయ్యారని, కుటుంబ సభ్యులలోనే విశ్వాసం తేలేని చంద్రబాబు ప్రజలను ఏమి నమ్మిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇకపై జనం చంద్రబాబును నమ్మే ప్రస్తకి లేదని ఆయన చెప్పారు. ఈ విష‌యాల‌న్నీ బాగానే చెప్పారు కాని, చంద్రబాబు 1995లో ఎన్.టిఆర్ పై తిరుగుబాటు చేసింది వెన్నుపోటుగా తారకరామారావు చెప్పదలిస్తే, ఆయన తండ్రి పాత్రను ఏ రకంగా చెబుతారన్నది కూడ ఆసక్తికరమే. ఎందుకంటే ఆనాడు చంద్రబాబునాయుడుకి మద్దతుగా ఎన్.టి.ఆర్ పై తిరుగుబాటు చేయడంలో కెసిఆర్ కూడా అత్యంత ప్రధాన పాత్ర పోషించారు.  మరి ఆయనకు కూడా ఏదో ఒక బిరుదు ఇస్తే పోతుంది కదా?
Source : Kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!