జ‌గ‌న్‌కు బాస‌ట‌గా సూప‌ర్ స్టార్స్‌


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మరో శుభవార్త. ప్రముఖ సినీ నటుడు కృష్ణ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరతారని కధనాలు వస్తున్నాయి. అయితే కొన్నివర్గాల సమాచారం ప్రకారం ఆయన చేరికతోపాటు ఆయన కుమార్తె మంజుల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చని చెబుతున్నారు.ఒకటి మాత్రం కనబడుతోంది. కృష్ణ కుటుంబం కాంగ్రెస్ ను వదలి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. కృష్ణ చేరితే ఆయనతోపాటు ఆయన భార్య విజయనిర్మల, అలాగే తమ్ముడు ఆదిశేషగిరిరావు, కుమార్తె మంజుల చేరవచ్చని అంటున్నారు. ఆదిశేషగిరిరావు లేదా మంజులలో ఎవరో ఒకరు గుంటూరు జిల్లా తెనాలి నుంచి శాసనసభకు పోటీచేయాలని కుతూహంగా ఉన్నట్లు చెబుతున్నారు.బహుశా మంజులే పోటీచేయవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం చేరితే మంచి బలమే చేకూరినట్లు అవుతుంది. కృష్ణ కు సొంతంగా అభిమానబలం ఉండడమే కాక, ఆయన కుమారుడు, స్టార్ మహేష్ బాబు అబిమానులు కూడా తోడవుతారు. విశేషం ఏమిటంటే రెండువేల నాలుగులో కృష్ణ భార్య విజయనిర్మల కృష్ణా జిల్లా కైకలూరులో పోటీచేసి ఓడిపోయారు. కృష్ణ ఒకసారి 1989 లో మాత్రం ఏలూరు నుంచి లోక్ సభకు పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఓటమి చెందారు. ఆమీదట ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆయనకు చేసిన సాయానికి, ప్రత్యేకించి అప్పులలో ఉన్నప్పుడు స్టూడియో భూమి అమ్మకానికి అనుమతి ఇచ్చి కృష్ణను ఆదుకోడానికి యత్నించింది. ఆ కృతజ్ఞతతతో కృష్ణ కాంగ్రెస్ లో వై.ఎస్. మద్దతుదారుడిగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ అనుబంధం కొనాసాగింపుగా ఆయన కుటుంబం వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడైన జగన్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెలాఖరు లేదా, వచ్చే నెలలో ఏదో ఒక ముహూర్తం చూసుకుని పార్టీలో చేరవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!