ఒక‌ ఠాగూర్‌, ఒక మ‌గ‌ధీర‌, ఒక‌…?

మెగాస్టార్ చిరంజీవికి ఠాగూర్ బిగ్గెస్ట్ హిట్ మూవీఏ కాకుండా ఆయ‌న రాజ‌కీయ రంగంలోకి అడుగుపెట్ట‌డానికి ఈ చిత్రం చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డింది.. మ‌గ‌ధీర‌.. ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి సృష్టించిన ఈ చిత్రం చిరంజీవి త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ తేజ‌కి దిగ్విజ‌యాన్ని అందించి ఆయ‌న‌కి ఓ ప్ర‌త్యేక స్టార్‌డ‌మ్‌ని తీసుకువ‌చ్చింది.. ఆ త‌ర్వాత వ‌చ్చిన చ‌ర‌ణ్ చిత్రం ఆరేంజ్ డీలా ప‌డిపోయింది.. ఇప్పుడు ర‌చ్చ గా ర‌చ్చ‌చేయ‌డానికి వ‌స్తున్నా.. మ‌గ‌ధీర స్థాయి చిత్రం రావాలంటే ఆ స్థాయి ద‌ర్శ‌కుడే కావాలిక‌దా.. తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం రాజ‌మౌళి త‌ర్వాత వి.వి. వినాయ‌క్‌కి మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడిగా పేరుంది. ఇప్ప‌టికే బ‌న్నీ హీరోగా వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ‌ద్రినాథ్ విడుద‌ల‌కి సిద్దంగా ఉంది.. ఆ చిత్రం పోస్ట‌ర్స్ చూస్తుంటేనే ఆ సినిమా ఏ స్థాయి విజ‌యం సాధిస్తుందో అనే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. మెగాస్టార్‌కి ఠాగూర్ లాంఠి భారీ విజ‌యాన్నందించిన వినాయ‌క్, మ‌గ‌ధీర‌తో భారీ విజ‌యాన్ని సాధించిన ఆస్థాయి విజ‌యం కోసం ఎదురుచూస్తున్న రాం చ‌ర‌ణ్ తేజ కాంబినేష‌న్‌లో ఓ మెగా మూవీ రాబోతుంది. డి.వి.వి. దాన‌య్య నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం చ‌ర‌ణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ నిలుస్తుంద‌ని అల్రెడీ టాక్ వినిపిస్తోంది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!