కిరణ్ కు ఎంత ధైర్యం వచ్చేసింది!


అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంలోనేకాదు. వచ్చే ఎన్నికలలోకూడా కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని కిరణ్ చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబును చూసి జాలిపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తనను అసమర్ధుడని వ్యాఖ్యానించడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.మొత్తం మీద కిరణ్ కు గట్టి విశ్వాసం వచ్చినట్లుంది.ఇప్పట్లో తన ప్రభుత్వం పడిపోదని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, జగన్ ల మధ్య అవిశ్వాస తీర్మానం వివాదంగా మారడం ఆయన ఆనందం కలిగిస్తోంది. చంద్రబాబు స్వయంగా జగన్ ను గవర్నర్ వద్ద ఆయనను బలపరిచే ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలని కోరడం, తనవద్ద అంతమంది బలం లేదని జగన్ చెప్పడంతోకిరణ్ కు పూర్తి నమ్మకం వచ్చినట్లు అనుకోవాలి.నిజంగానే ఏ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు సిద్దపడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలంటే మళ్లీ కోట్లు ఖర్చు పెట్టాలి. మూడేళ్ల పదవీకాలం వదులుకోవాలి. తిరిగి టిక్కెట్ వస్తుందో రాదో తెలియదు. తర్వాత గెలుస్తామో లేదో తెలియదు. అందువల్ల కిరణ్ ధైర్యంగా అవిశ్వాసానికి సవాలు విసిరినట్లు కనిపిస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!