అలిగిన జూ.ఎన్టీఆర్‌..



మ‌హానాడుకి వార‌స‌త్వ సెగ త‌గులుతోంది. నిన్న ప్రారంభ‌మైన 30వ మ‌హానాడుని చంద్ర‌బాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్ర‌మంలో నంద‌మూరి హ‌రికృష్ణ పాల్గొన్న‌ప్ప‌టికీ ఆయ‌న మ‌ధ్య‌లోనే స‌భ నుంచి బ‌య‌టికి వెళ్ళిపోవ‌డంతో కార్య‌క‌ర్త‌లు ఆశ్చ‌ర్య‌పోయారు. ఆయ‌న‌లా మ‌ధ్య‌లో వెళ్ళ‌డానికి కార‌ణం ఏమిటా అని ఆరా తీస్తే.. మ‌హానాడు స‌భ ప్రాంగ‌ణంలో హ‌రికృష్ణ క‌టౌట్ ఒక్క‌డీ లేక‌పోవ‌డంతోనే ఆయ‌న‌లా వెళ్ళిపోయాడ‌ని తెలిసింది. దాంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా చంద్ర‌బాబుపై అలిగిన‌ట్లు తెలుస్తోంది. మ‌హానాడుకి హాజ‌ర‌వ్వాల‌ని కోర‌గా, తాను షూటింగ్ లో బిజీగా ఉన్నాన‌ని, మ‌హానాడుకి రాలేన‌ని ఎన్టీఆర్ స్ప‌ష్టం చేశాడు. అయితే దీని వెన‌కాల అస‌లు ఉద్దేశ్యం మాత్రం చంద్ర‌బాబు మ‌హానాడు సాక్షిగా నంద‌మూరి కుటుంబాన్ని ప‌క్క‌న పెడుతుండ‌డం వ‌ల్లే అని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే టిడిపి ప‌గ్గాల‌ని త‌న కుమారుడు లోకేష్‌కి అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబు ప్లాన్ చేయ‌డం, కాదు త‌న కొడుకు జూ.ఎన్టీఆర్‌కే ఆ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పాల‌ని హ‌రికృష్ణ, ఇలా ఇద్ద‌రి మ‌ధ్య వార‌స‌త్వ పోరు జ‌రుగుతుండ‌డంతో చంద్ర‌బాబు, జూ. ఎన్టీఆర్ మ‌ధ్య ఆంత‌ర్యం పెరిగిపోతుంద‌ని తెలుస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!