య‌జుర్వేదం సంప‌ద‌పై పెద్ద‌ల క‌న్ను..



స‌త్య‌సాయి బాబా మందిరంలో ఆయ‌న బ్ర‌తికి ఉన్న‌ప్పుడు నివాసం ఉన్న య‌జుర్వేద మందిరంపై వివాదం ర‌గులుకుంటుంది. ఈ య‌జుర్వేద మందిరాన్ని స‌త్య‌సాయి బాబా మ‌ర‌ణానంతరం మూసి వేసారు. ఈ గ‌దిలో కోట్లాది రూపాయ‌ల విలువైన బంగారం, వ‌జ్రాలు, పెద్ద మొత్తంలో న‌గ‌దు త‌దిత‌ర‌వి నిలువ ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో ఇప్పుడు ఈ మందిరంపై కొంద‌రు పెద్ద‌ల క‌న్ను ప‌డింది. ఈ మందిరం ప్ర‌స్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. ఈ మందిరం ముందు పోలీసులు కాప‌లా కాస్తున్నారు. అయితే ఈ మందిరంలోకి పోలీసుల క‌న్నుగ‌ప్పి వెళ్ళాల‌ని ఓ సీనియ‌ర్ మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు, ఆయ‌న‌కి ట్ర‌స్టు స‌భ్యులు స‌హ‌కారం అందిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పోలీసుల‌కి తెలియ‌కుండా ఆ మందిరంలోకి ప్ర‌వేశించి కోట్లాది రూపాయ‌ల సంప‌ద‌ని దోచుకోవాల‌ని వారి వ్యూహం. అయితే స‌త్య‌సాయి మ‌ర‌ణానంతరం య‌జుర్వేద మందిరంపై మొద‌లైన వివాదాలు, అందులో కోట్లాది రూపాయ‌ల సంప‌ద ఉంద‌న్న ఊహ‌లు వెల్లువెత్తుతుండ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఆ మందిరాన్ని తెరిచి అస‌లు వాస్త‌వం ఏమిటో ప్ర‌జ‌ల‌కి తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంది. అంద‌రూ ఊహిస్తున్న‌ట్టుగా ఆ మందిరంలో కోట్లాది సంప‌ద ఉండి ఉంటే ఆ సంప‌ద స్వార్థ‌ప‌రుల చేతిలోకి వెళ్ళ‌నీయ‌కుండా ప్ర‌జల సేవ‌కి ఉప‌యోగ‌ప‌డేలా చూసే బాధ్య‌త అటు స‌త్య సాయి ట్ర‌స్టు స‌భ్యుల‌మీద‌, ఇటు ప్ర‌భుత్వం మీద ఉంది.. అయితే స్వ‌యంగా స‌త్య‌సాయి ట్ర‌స్టులోని కొంద‌రు స‌భ్యులే ఆ మందిరంలోని సంప‌ద‌ని కొల్ల‌గొట్టాల‌ని చూస్తున్నార‌న్న అనుమానం ఉండ‌డంతో ఈ విష‌యంలో ప్ర‌భుత్వ జోక్యం త‌ప్ప‌నిస‌రి. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి వెంట‌నే ఈ య‌జుర్వేద మందిరంకి సంభందించిన వివాదం ముగిసేలా చూడ‌డం మంచిది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!