మీడియా తగలబడింది.. నిజం..! (తమాషాకీ)


మీడియా ఉత్సాహం పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఎలాక్ట్రానిక్ మీడియా ప్రవేశంతో పరిస్థితులు మరింత దిగజారినట్టున్నాయి. ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందు తామే ఇవ్వాలన్న పోటీతో.. ఏ విజువల్ చూపించాలో, ఏది ఆపేయాలో వాటికి అర్థం కానట్టుంది. 31-05-11 మంగళవారం నాడు వరంగల్ జిల్లాలో ఓ యువతిపై.. ఓ యువకుడు అత్యాచారం చేయబోయాడు. అడ్డుకున్న యువతిపై సుత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన గ్రామస్థులు… ఆ యువకుడిని సజీవదహనం చేశారు. ఇది ఎంతవరకూ కరెక్ట్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం న్యాయమేనా..?
ఇది ఒక కోణం. మరో కోణం..
అన్యాయాన్ని టీవీఛానెళ్లు పనిగట్టుకుని మరీ ఎక్కువగా చూపాయన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే వ్యక్తి సజీవదహనాన్ని ఎంత బ్లాక్ అండ్ వైట్ లో చూపినా… దాని ప్రభావం వీక్షకులపై కచ్చితంగా ఉంటుంది. అదీ క్లోజప్ లో చూపేసరికీ చాలామందికి వెన్ను జలదరిస్తుంది. టీవీ అనేది మాస్ మీడియా. పిల్లల నుంచి వృద్దుల వరకూ అందరూ చూసే ప్రసారమాధ్యమమిది. అలాంటి ఘనత వహించిన మీడియా ఎంత జాగురకతతో వ్యవహరించాలి. ఎంత బాధ్యతగా మెసులుకోవాలి. సమాజంలో తప్పొప్పులు ఎత్తిచూపే ఛానెళ్లు.. తమ తప్పులను ఎందుకు ఎరుగవు.
పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలన్న తపనతో ఎంతకైనా తెగిస్తాయా. .?
ఆ ఘటనకు సంబందించిన విజువల్స్ ను ప్రసారం చేస్తున్న సమయంలో పిల్లలు ఎవరైనా దాన్ని చూసినట్లయితే ఇంకేమన్నా ఉందా..?  ఆ పసిహృదయాలపై అది ఎంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుందో ఇంకా చెప్పాలా..? మానసికంగా ఎంత భయభ్రాంతులకు గురిచేస్తుందో వేరే ఉదాహరణలు ఇవ్వాలా..? పిల్లల లాంటి మనస్తత్వమే మహిళలది కూడా.. ఇంటిల్లిపాదీ చూసే టీవీలో ఇలాంటివి చూపడం ఎంతమాత్రం తగదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇకమీదటైనా.. ఇలాంటి వార్తలు ప్రసారం చేసే ముందు.. సమాజంపై దాని ప్రభావాన్ని ఒక్కసారి అంచనా వేస్తే మంచిది. వార్తను వార్తగా చెప్పడం తప్పుకాదు. కానీ సంచలనం కోసం.. ఇలాంటి ఎక్స్ ట్రాలు మాత్రం మానుకుంటే మంచిదేమో. మీడియా తగలబడుతున్న వ్యక్తి దృశ్యాలను పదేపదే చూపిస్తూ మన తెలుగు మీడియా `ఎలా తగలడిందో’ ప్రేక్షకులకు లైవ్ లో చెప్పేసింది. మీడియా ధైర్యం తగలబడ..
- `గన్’ షాట్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!