కిరణ్ కు సన్నిహితులు ఆ నలుగురేనా!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలోను, అదికారవర్గాలలోను ఎవరిని బాగా విశ్వాసంలోకి తీసుకుంటున్నారన్నదానిపై కాంగ్రెస్ వర్గాలలో ఆసక్తి కరమైన చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితులలో కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులనే నమ్మకస్తులుగా భావిస్తున్నారని చెబుతారు. వారిలో ఒకరు పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాగా, మరొకరు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అని చెబుతున్నారు. మొదట రాజనరసింహతో అంత పెద్ద సంబంధాలు లేకపోయినా, ఆ తర్వాత కాలంలో మెరుగుపడ్డాయని, విద్యార్ధి దశనుంచి వీరిద్దరికి ఉన్న స్నేహం కూడా కొంత ఉపయోగపడిందని అంటున్నారు. మిగిలిన మంత్రులలో మరికొంతమందితో మంచి సంబంధాలే ఉన్నప్పటికీ వీరిద్దరికి లభిస్తున్న ప్రాధాన్యత గణనీయమైనదని అంటున్నారు. కాగా అధికారులలో శ్రీధర్, (పి ఎస్ xగా పనిచేస్తున్న శ్రీధర్ కాకుండా)రావత్ అనే ఇద్దరు అదికారులకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రి కీలకమైన నిర్ణయాలను కూడా వీరిద్దరితోనే సమావేశమై తీసుకుంటు న్నారని చెబుతున్నారు. ఒక్కోసారి ఇతరుల అప్పాయింట్ మెంట్లను కూడా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఈ ఇద్దరు అదికారులతో సమావేశమవుతున్నారని, ఫలితంగా కనీసం గంటసేపు తాను వేచి ఉండవలసి వచ్చిందని సి.ఎమ్.కార్యాలయానికి వెళ్లిన ఒక ప్రముఖుడు చెప్పారు. ముఖ్యమంత్రులు తమకు నమ్మకమైన వారిని ఎంపిక చేసుకుంటారు.  వారిలో వీరు ఉన్నారన్నమాట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!