మమతా శారీస్ కు మహా డిమాండ్!

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాలా సింపుల్ గా కనబడుతుంటారు. చేనేత చీర, హవాయి చెప్పులు…చేతి సంచీతో ఎక్కడికైనా వెళ్తుంటారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కట్టుకునే కాటన్ చీరలకు ఇప్పుడు బోలెడంత డిమాండ్ వచ్చేసింది. ఆమె కట్టుకునే ప్రత్యేకమైన కాటన్ చీరలు హుగ్లీ జిల్లాలోని ధనియాకాళి అనే గ్రామంలో చేనేత కార్మికులు నేస్తుంటారు. 2009 లోక్ సభ ఎన్నికల్లోనే తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించినప్పుడు మమతా చీరలు పాపులర్ అయ్యాయి. ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో కూడా తృణమూల్ విజయఢంకా మ్రోగించడంతో మమతా చీరల గిరాకీ తారాస్థాయికి చేరింది. హోల్ సేల్ మార్కెట్ లోనే కాదు, కోల్ కత రిటైల్ మార్కెట్ లో కూడా మమతా చీరలు కొనడానికి మహిళలు క్యూకడుతున్నారు.

మమతా చీర ప్రత్యేకతలు :

  • -  100 పర్సెంట్ కాటన్ చీర

  • -  1.5 నుంచి 2.00 అంగుళాల అంచు

  • -  అంచు రంగులు: ఆకుపచ్చ, నీలం, నలుపు (ఎరువు రంగు అంచు మాత్రం వాడరు…ఎందుకో మీరు అర్థం చేసుకోగలరు)

  • - పొడవు ఆరు మీటర్లు (మామూలుగా 5.5 మీటర్లు ఉంటాయి)

  • - ఖరీదు: 350 నుంచి 365 రూపాయలు.

  • - లాభం: రూ. 30- 60

మమతా బెనర్జీ తన ప్రచారంలో తరచూ `మా-మట్టీ-మనుష్’ అన్న నినాదం వాడుతుంటారు. ఇప్పుడు కొన్ని రకాల చీరల అంచులపై ఈ నినాదం కనిపిస్తోంది. మొత్తానికి పశ్చిమబెంగాల్ అంతటా ఇప్పుడు మమతా శారీస్ హవా నడుస్తోంది.
- భూషణ్ (న్యూఢిల్లీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!