కనిమొళి మరో వారం జైల్లోనే…

తీహార్ జైల్లో ఉన్న కనిమొళిని బెయిల్ పై బయటకు రప్పించాలని కరుణానిధి కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నిస్తున్నా, కనిమొళి కనీసం మరో వారమైనా తీహార్ జైల్లోనే ఉండకతప్పదు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటీషన్ కేసు విచారణ ఈనెల 30న చేపడతుంది. ఈలోగా ఎలాంటి చర్యలు తీసుకునే వీలేలేదు. కనిమొళి వయస్సు 43 సంవత్సరాలు. ప్రస్తుతం రాజభోగాలన్నింటినీ వదులుకోవాల్సివచ్చింది. తీహార్ జైల్లో కటిక నేలపై పడుకోవాల్సివచ్చింది. ఇది ఇలా ఉంటే, కనిమొళి  జైల్లో ఉండాల్సి రావడం పట్ల తోటి మహిళగా సోనియా గాంధీ కూడా బాధపడ్డారట. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందనీ, దోషులు ఎంతటివారైనా శిక్ష అనుభవించకతప్పదని మరోవైపు చెబుతున్నారు. కనిమొళి అరెస్టు కారణంగా కాంగ్రెస్ తో డీఎంకె స్నేహసంబంధాలు వీగిపోతాయన్న భయం తమకు లేదని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 2జి స్ప్రెక్టమ్ కేసులో డిఎంకె నేతల అరెస్టులు తప్పవని కరుణానిధికి చాలాకాలం నుంచీ తెలుసనీ,  అవి ఇప్పుడు కార్యచరణలోకి వచ్చాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
- భూషణ్ (న్యూఢిల్లీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!