బొత్సకు మోకాలడ్డిన కిరణ్

పిసిసి అధ్యక్షపదవికి సంబంధించి రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఎట్టి పరిస్థితులలోను కానివ్వరాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఆయన తెలంగాణ కు చెందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరును ప్రతిపాదిస్తున్నారు. బొత్స సత్యానారాయణ పేరును కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు ఖరారు చేసి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కిర్్ కుమార్ రెడ్డికి ఢిల్లీ పర్యటనలో తెలియచేస్తే , ఆయన బొత్స పేరుకు అడ్డం పడ్డారని కధనాలు వస్తున్నాయి. బొత్స కు కిరణ్ కు కొంతకాలంగా విబేధాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కిరణ్ ముఖ్యమంత్రి కాగానే శాఖల పేరుతో తిరుగుబాటు చేయడానికి బొత్స సత్యనారాయణ నాయకత్వం వహించారన్న కోపం సహజంగానే కిరణ్ కుఉంటుంది.అప్పటినుంచి వీరిద్దరి మధ్య పరోక్షంగా యుద్దంగా జరుగుతోంది. అలాంటి వ్యక్తిని పిసిసి అద్యక్ష పదవికి నియమిస్తే తనకు ఇబ్బంది అని ఆయన భావిస్తున్నారు. పైగా పైగా ఆంధ్ర నేతకే పిసిసి అద్యక్ష పదవి ఇస్తే వచ్చే తలనొప్పులు మరికొన్నిఉన్నాయి.వీటన్నిటికన్నా తనతో ఉన్న ఈక్వేషన్ రీత్యా బొత్స ను పిసిసి అధ్యక్షుడిగా కిరణ్ అడ్డుకుంటున్నారని బొత్స సన్నిహితవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.సహజంగానే పిసిసి అధ్యక్షుడు అయ్యే వ్యక్తి సి.ఎమ్. పదవి రేసులో కూడా ఉంటారు. అది సహజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి ఇష్టం ఉండదు. బొత్సను అడ్డుకునే ప్రక్రియలో భాగంగా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు ఆధ్వర్యంలో ఒక బృందాన్ని కూడా ఢిల్లీ పంపి బొత్స కు వ్యతిరేకంగా మాట్లాడించారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరు చెప్పిన కారణాలు కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. బొత్సకు ఇంగ్లీష్ భాష బాగా రాదని,అలాగే అన్ని వర్గాలు ఆయనతో కలిసి రావని ఇలా కొన్ని కారణాలను వారు చూపించారని చెబుతున్నారు.దీంతో బొత్స నియామకాన్ని పార్టీ హైకమాండ్ వాయిదా వేసిందని అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!