బెంగాలీ బాబులా..? మ‌రాఠా వీరులా..?

ఐపీఎల్‌లో ఇవాళ ఆసక్తికరమైన మ్యాచ్ జరగబోతోంది. తొలిసారిగా ప్రవేశపెట్టిన ప్లే ఆఫ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ , కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. దీనిలో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగా… ఓడిన జట్టు నేరుగా ఇంటి ముఖం పట్టాల్సి ఉంది. క్వార్టర్ ఫైనల్‌గా భావిస్తోన్న ఈ పోరులో నెగ్గిన జట్టు రెండో ప్లే ఆఫ్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. ఈ రెండు జట్ల మధ్యా ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబైదే పై చేయిగా నిలిచింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ సక్సెసయ్యారు. సచిన్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తుండగా… ఫ్రాంక్లిన్ తన సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అటు బౌలింగ్‌లో అత్యధిక వికెట్లతో దూసుకుపోతోన్న మలింగా మరోసారి కీలకం కానున్నాడు. ఈ  టోర్నీలో ఫాస్ట్‌ బౌలర్ బ్రెట్‌లీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం కోల్‌కత్తాను కలవరపెడుతోంది. అయితే కీలక మ్యాచ్‌లలో చెలరేగే లీ ముంబైపై రాణిస్తాడని ఆశిస్తోంది. అటు గత మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో బాలాజీ భారీగా పరుగులిచ్చినా… గంభీర్‌ మాత్రం అతనిపై నమ్మకముంచాడు. పార్ట్‌టైమ్ బౌలర్లు యూసఫ్ పఠాన్ , భాటియా రాణిస్తుండడం నైట్‌రైడర్స్‌కు ప్లస్‌పాయింట్‌. మొత్తం మీద ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమించాల్సిన నేపథ్యంలో విజయం కోసం ఇటు మ‌రాఠా వీరులు, అటు బెంగాళీ బాబులు త‌మ త‌మ బ్యాటుల‌కు, బాల్‌ల‌కి ప‌దును పెట్టాల్సి ఉంది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!