సానియా మీర్జాను తిట్టిన సానియా మీర్జా !


ఇదేమిటీ, సానియా మీర్జాను సానియామీర్జానే ఎందుకు తిట్టుకుంటుంది. `కార్తీక్ కాలింగ్ కార్తీక్’ సినిమా స్టోరీలాంటిది ఏమైనా ఉన్నదా అని అనుకోనూ వచ్చు..అసలు, ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్య పోతున్నారా… అయితే, మీరు పూర్తిగా ఇది చదవాల్సిందేమరి…  పాకిస్తాన్ లోని న్యూస్ వీక్ మ్యాగజైన్ వందమంది సంచలనం సృష్టించిన పాకిస్తాన్ మగువుల జాబితాను రిలీజ్ చేసింది. ఈ వందమంది పేర్లలో భారత టెన్నిస్ స్టార్ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భార్య అయిన సానియా మీర్జా పేరు కూడా ఉంది. ఈ జాబితాలో సానియా మీర్జా పేరు చేర్చడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైపోయింది. పాకిస్తాన్ లో సంచలనం సృష్టించిన వంద మంది మగువుల పేర్లలో మానవ హక్కుల కోసం పోరాడుతున్న షెర్రీ రెహమాన్, మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తున్న ముఖతరన్ మాయి , ఉమ్ ఈ హసన్ వంటి వారు ఉన్నారు. వీరందరి పేర్ల గురించి సంచలనం లేకపోయినా సానియా మీర్జా పేరు ఎలా చేర్చారన్న విషయంపై మాత్రం పెద్ద సంచలనం రేకెత్తుతోంది.  ఇది ఇలా ఉంటే… పాకిస్తాన్ లోని ఒక గృహిణి తన వెబ్ సైట్ లో సానియా మీర్జా పేరును ఈ జాబితాలో చేర్చడంపట్ల తీవ్ర విముఖత వ్యక్తం చేస్తూ, సానియామీర్జాను దుమ్మెత్తిపోసింది. ఇంతకీ అలా తిట్టిన ఆ మహిళ పేరు ఏమిటో తెలుసా…ఆమె పేరు కూడా సానియా మీర్జానే.
- రాజ్ (హైదరాబాద్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!