భౌ భౌ భౌ ! అయ్యా నాయకులారా ! (త‌మాషాకీ)


ఏం తిట్లు అండీ అవి..? మీరు మీరు కొట్లాడుకోండి, పోట్లాడుకోండి,మాట్లాడుకోండి ! తిట్టుకోండి, కొట్టుకోండి, కసి తీరకుంటే పోడుచుకోండి ! ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు మిమ్మల్ని ఆపరు! అంతే గానీ మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు ? మేము కుక్కలం అయినంత మాత్రానా మరీ అంత అలుసు అయిపోయామా ? మమ్మల్ని పట్టు కొని ఊర కుక్క, పిచ్చి కుక్క, రేబీఎస్ కుక్క అని అనరాని మాటలు అంటారా ?
భౌ భౌ భౌ !
మీరేమి మమ్మల్ని పెంచి పోషిస్తున్నారా ?
మా కోసం ఏవైనా పధకాలు పెట్టారా ??
మీలాగా మేము తిరుగు బాట్లు చేస్తున్నామా ?
వెన్ను పోట్లు పోడుస్తున్నామా?
ఎన్నికల్లో హామీ లిచ్చి విస్మరిస్తున్నామా ??
భూ కబ్జాలు చేస్తున్నామా ??
కోట్లు కోట్లు కూడబెడుతున్నామా??
అదిరించి, బెదిరించి వసూళ్లు చేస్తున్నామా ??
భౌ భౌ భౌ !
మీరు పై ప్రశ్నల్లో ఒక్క దానికైనా జవాబు చెప్పగలరా?
చెప్పలేరు
మీకంటే మేమే ఎంతో నయం
చిన్ని బిస్కట్టు ముక్క పడేస్తే తోక ఊపుకుంటూ తిరుగుతాం!
అయ్యలారా ! ఇదే ఆఖరి   హెచ్చరిక !
ఇకపై మమ్మల్ని ఎవరి తో పోల్చ వద్దు ,కించపరచ వద్దు
మేము మీలాగా జీవులమే
కాకపోతే మూగ జీవాలం!
అంత మాత్రాన చులకన గా చూడొద్దు !!
ఇట్లు
కుక్క
విశ్వాసానికి ప్రతీక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!