అపోలో,కేర్,యశోదాలపై సిబిఐ కేసు


కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నాయన్న అభియోగం పై ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులపై సిబిఐ కేసు నమోదు చేసింది. కొద్దిరోజుల క్రీతం ఈ ఆస్పత్రులపై సిబిఐ దాడులు చేసింది. సుమారు అరవై కోట్ల కుంభకోణం
జరిగినట్లు సిబిఐ అంచనా వేసింది.ఈ అవకతవకలకు గాను ప్రముఖ వైద్య సంస్థలైన కేర్, యశోద, అపోలో ఆస్పత్రులపై కేసులు నమోదయ్యాయి.అధిక బిల్లులు వేయడం ద్వారా ప్రభుత్వ నిధులను ఈ అస్పత్రులు కైంకర్యం చేశాయని సిబిఐ గుర్తించింది. ఉదాహరణకు కేర్ ఆస్పత్రి సిజిహెచ్ ఎస్ కింద నమోదైన ఒక రోగికి రూ.85 వేలకు గాను లక్షనలభై వేల రూపాయల బిల్లు వేశారు.ఆంజియోగ్రఫీకి గాను 4950 రూపాయలకు గాను 13500 రూపాయలు వసూలు చేశారు.ఒక్క కేర్ ఆస్పత్రిలో అధిక బిల్లుల వల్ల ప్రభుత్వానికి పదిహేడు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది.ఈ మూడు ఆస్పత్రులే కాక మరికొన్ని ఆస్పత్రులపై కూడా కేసులు నమోదయ్యాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!