మహానాడులో చేసిన‌తీర్మానాలు ఇవే..



మూడోరోజు మహానాడు ముగింపు సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ ప‌లు తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్టింది. అవేమిటంటే..
భూదోపిడీపై..
* పైవేటు భూములను బలవంతంగా సేక రించడం ఆపాలి.
* భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలి.
* అన్యాక్రాంతమైన భూములను పేదలకు పంచాలి.
* అటవీ హక్కుల చట్టం కింద గిరిజనుల అధీనంలోని భూములకు పట్టాలివ్వాలి.
* సెజ్‌లు, పారిశ్రామిక సంస్థల పేరుతో బలవంతంగా సేకరించి, నిరుపయోగంగా ఉన్న భూములను వెనక్కి తిరిగి ఇచ్చేయాలి.
ధరల నియంత్రణలో వైఫల్యంపై..
* పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే త గ్గించాలి.
* రైతు బజార్లను సమర్థంగా నిర్వహించి, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి.
షెడ్యూల్డు కులాలపై..
* జస్టిస్ పున్నయ్య సిఫారసులను యథాతథంగా అమలు చేయాలి.
* దళిత మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల నివారణకు చర్యలు చేపట్టాలి.
* దళితుల అభ్యున్నతికి కేంద్రం అందిస్తున్న నిధులను పూర్తిగా ఖర్చు చేయాలి.
ఎస్టీల సంక్షేమంపై…
* గిరిజన ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలను నిలిపేయాలి.
* అటవీ హక్కుల ర క్షణ చట్టాన్ని, ఎస్టీలపై అత్యాచారాలను నిరోధించే చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.
మైనార్టీల సంక్షేమంపై…
*జస్టిస్ సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి.
* ప్రతి బడ్జెట్‌లో ముస్లింలకు 5 శాతం నిధులు కేటాయించాలి.
* ముస్లింల పిల్లలకు ఉచిత విద్య, మసీదులు, షాదీఖానాల నిర్మాణానికి రూ.5 లక్షల వరకూ ప్రభుత్వ సాయం అందించాలి.
* స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనార్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించాలి.
* ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను, ఆస్తులను తిరిగి రాబట్టి, ముస్లింల ప్రయోజనాలకు ఉపయోగించాలి.
* ఖాళీగా ఉన్న వేలాది ఉర్దూ టీచర్ పోస్టులను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి.
* మత సామరస్యానికి విఘాతం కలిగించే శక్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టడి చేయాలి.
వికలాంగుల సంక్షేమంపౖౖె…
* ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల పోస్టులు భర్తీ చేయాలి.
* అర్హులైన వికలాంగులందరికీ ప్రతి నెలా వెయ్యి రూపాయల పింఛన్ ఇవ్వాలి.
కార్మికుల సంక్షేమంపై…
* భవన నిర్మాణ కార్మికులందరినీ కన్‌స్ట్రక్షన్ బోర్డులో సభ్యులుగా చేర్చాలి.
* క్యాజువల్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.
* కేంద్రం పార్టమెంట్ లో ప్రవేశపెట్టిన కార్మిక చట్టాల సవరణ బిల్లును వ్యతిరేకించాలి.
* జీవో నెంబర్. 177ను రద్దు చేయాలి.
* బీడీ కార్మికుల కనీస వేతనాల హామీని నిలబెట్టుకోవాలి.
* అసంఘటిత రంగ మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు కల్పించాలి.
వెనుకబడిన తరగతులపై..
*బీసీ సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
* చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి.
* చేతి వృత్తులు, కుల వృత్తులకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండాలి.
* మత్స్యకారులు, కురుమలు, గీత కార్మికుల ప్రమాద పరిహారాన్ని పెంచాలి.
* జంట నగరాలలో ఉన్న కల్లు దుకాణాలను పునరుద్ధరించాలి.
* యంత్ర పరికరాలు, పనిముట్లపై సబ్సిడీ ఇవ్వాలి.
* ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
మొత్తం మీద నంద‌మూరి హ‌రికృష్ణ ఈ మ‌హానాడు ప్రాంగ‌ణంలో నారా లోకేష్ క‌టౌట్లు పెట్ట‌డంపై మండిప‌డ‌టం, ఆ వెంట‌నే చంద్ర‌బాబు నాయుడు లోకేష్ క‌టౌట్ల‌ని తొల‌గించ‌మ‌ని కార్య‌క‌ర్త‌ల‌కి పిలుపునివ్వ‌డం మిన‌హా మూడు రోజుల మ‌హానాడు స‌భ టిడిపి కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపింద‌ని టిడిపి నాయ‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!