బాలీవుడ్ బిపాసాబసు అరెస్ట్

బాలీవుడ్ నటి బిపాసాబసు అరెస్ట్ అయ్యారు. లండన్‌ నుంచి తిరిగి ముంబై వస్తుండగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు చెక్ చేశారు. ఆమె వద్ద అనధికారికంగా డబ్బు, ఆభరణాలు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాక ఆమెను తిరిగి వదిలిపెట్టారు. అయితే ఇదే విధంగా పదిరోజులు క్రితం మనీష్‌లాంబా కూడా ముంబై పోలీసులకు దొరికిపోయారు. ఆమె కూడా పైన్ చెల్లించి వెళ్లిపోయారు. ఈ మధ్య బాలీవుడ్ నటీనటులు విదేశాల్లో షాపింగ్ చేసుకొని వచ్చేటప్పుడు ఉద్దేశపూర్వకంగా టాక్స్ ఎగ్గొడ్డానికి ప్రయత్నించి ఈ విధంగా దొరికిపోతున్నారు. వీరు కూడా మమ్మల్ని ఎవరూ చెక్ చేస్తారు..మేం సెలబ్రిటీస్‌మనే ధోరణిలో రావడం వల్ల జనంలో చులకనవుతున్నారు. అయితే వారికి అక్కడ ఎక్కువగా బహుమతులు రూపంలో వస్తుంటాయి కాబట్టి వాటికి చెల్లించాల్సినవసరం లేదనుకోవడం ఒకటైతే, వెళ్లిపోవచ్చులేనన్న భరోసా వీరిని ఇలాంటి ఘటనలకు ప్రోత్సహిస్తుందని కొంతమంది టాక్స్‌నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!