ఎన్టీఆర్ విశ్వరూపం(పార్ట్ 1)



సాహసం చేయరా డిభంకా…అన్నది ఎవరైనా – తూ.చ తప్పకుండా పాటించినవాడు  మాత్రం ఎన్టీఆర్. అటు సినీ జీవితంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ అనేక సాహసాలు  చేసి యావత్‌ ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఎగిసిన తారాజువ్వ ఎన్టీఆర్  జయంతి సందర్భంగా  5amnews.com అందిస్తున్న నీరాజనం…




విజయావారి మాయాబజార్‌ తీస్తున్న రోజులవి. ఎన్టీఆర్‌ సినీజగత్తులో అంచెలంచెలుగా  ఎదుగుతున్న కాలమది. అప్పట్లోనే ఎన్టీఆర్‌ అత్యధిక పారితోషికం తీసుకునే  కథానాయకుడయ్యారు. సినీరంగంలో ఎన్టీఆర్‌ విశ్వరూపాన్ని కనులారా వీక్షిద్దామా….
ఎన్టీఆర్‌ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపుగా 302 చిత్రాల్లో నటించారు. తన ప్రతిభను  కేవలం నటనకే పరిమితం చేయకుండా ఎన్టీఆర్  అనేక చిత్రాలు నిర్మించారు. మరెన్నో  చిత్రాలకు దర్శకత్వం వహించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్  తెలుగువారి హృదయాల్లో  మాత్రం శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడంలో  ఆయనకుఆయనేసాటి. రామునిగా అవతారమెత్తినా, శ్రీకృష్ణునిగా లీలావినోదం అందించినా,  విశ్వామిత్రునిగా సరికొత్త సృష్టి చేసినా ఎన్టీఆర్‌కే చెల్లింది.
ఎల్వీ ప్రసాద్‌ దగ్గర ఉన్న ఎన్టీఆర్‌ ఫోటోను చూసిన ప్రముఖ నిర్మాత బి.ఎ. సుబ్బారావు  వెంటనే ఎన్టీఆర్‌ను మద్రాసుకు పిలిపించారు. పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకునిగా  ఎంపికచేశారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలుకాలేదు. ఈలోగా మనదేశం  సినిమాలో నటించారు. దీంతో మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా `మనదేశం’  అయింది. 1949లో రిలీజ్‌ అయిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా నటించారు.
1950లో `పల్లెటూరి పిల్ల’ విడుదలైంది. అదే సంవత్సరంలోనే `షావుకారు’ కూడా రిలీజైంది.   సినీరంగంలో నిలదొక్కుకోగానే మద్రాసుకు మకాం మార్చేశారు. THOUSAND LIGHTS  ప్రాంతంలో ఓ చిన్న రూమ్ అద్దెకు తీసుకుని ఉండేవారు.
  • 1951లో పాతాళభైరవి, అదే సంవత్సరం బీఎన్‌రెడ్డి తీసిన మల్లీశ్వరి చిత్రాలు సూపర్‌హిట్‌.

  • 50దశకంలో రిలీజ్‌ అయిన  `పెళ్లిచేసిచూడు’ చిత్రం ప్రేక్షకాదరణపొందింది. విజయావారి  సినిమాల్లో నెలకు 500 రూపాయల జీతం, 500 రూపాయల పారితోషికంతో పనిచేశారు.  పాతాళభైరవి అప్పట్లో 34 కేంద్రాల్లో వందరోజులు ఆడి ఆడి విజయఢంకా మ్రోగించింది. ఆ  సినిమాలో ఉంగరాల జుట్టు… స్ఫూరధ్రూపి, అమాయక యువకునిగా అఖిలాంద్ర ప్రేక్షకుల  మన్ననలు ఎన్టీఆర్ అందుకున్నారు. `సాహసం చేయిరా డింభకా…’ అన్నట్టుగానే ఎన్టీఆర్‌ అప్పటి  నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనేక సాహసాలు చేస్తూ అంచెలంచెలుగా తన విరాట్‌  రూపాన్ని ఆవిష్కరించారు.

  • 1956లో మాయాబజార్‌ సినిమాకు ఆయన తీసుకున్న పారితోషికం ఏడువేల ఐదు వందల  రూపాయలు. ఇదే అప్పట్లో అత్యధిక పారితోషికంగా చెప్పుకునేవారు. 1959లో ఎవీఎంవారి  భూకైలాస్‌ చిత్రంలో రావణబ్రహ్మగా అత్యధ్బుతమైన నటనను ప్రదర్శించారు.

  • 1960లో శ్రీవెంకటేశ్వర మహత్మ్యం కూడా అంతేస్థాయిలో విజయం సాధించింది. 1963లో  విడుదలైన లవకుశ చిత్రంలో రామునిగా నటించారు. సినీరంగంలో తనకుతానేసాటిగా  సాగిపోతున్న ఎన్టీఆర్‌ దానవీర శూరకర్ణలో మూడు ప్రధాన పాత్రలు పోషించి , దర్శకత్వం  కూడా వహించి సినీజగత్తును విస్మయపరిచారు.

  • శ్రీమద్విరాటపర్వంలో ఐదు పాత్రలు పోషించి అబ్బురపరిచారు. ఎన్టీఆర్‌ నటించిన  అడవిరాముడు, యమగోల వంటి చిత్రాలు సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి.

- రచన: తుర్లపాటి నాగభూషణ రావు
email:nrturlapati@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!